ఆరోగ్యం

త్రిఫల చూర్ణం


త్రిఫల చూర్ణం అనగా ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమము. దీన్ని ఆయుర్వేద వైద్యంలో వివిధ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. మన శరీరాన్ని శుభ్రం చేయడంతో మనకు ఎంతగానో ఉపకరించే ఆయుర్వేద ఔషధం త్రిఫల చూర్ణం. త్రిఫలా చూర్ణాన్ని త్రిదోష రసాయనంగా చెబుతారు. మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను ఈ చూర్ణం సరిచేస్తుంది

ఉసిరి గుణాలు:
ఉసిరి: ఉసిరిలో సి విటమిను అత్యధికంగా ఉంటుంది. ఉసిరిలో టానిక్‌ ఆమ్లం, గ్లోకోజ్‌, ప్రొటీన్‌, కాల్షియం లు ఉన్నాయి. ఉసిరి పిత్తదోషాన్ని సరిచేస్తుంది. శరీరాన్ని చల్లబరుస్తుంది. సాఫీ విరోచనానికి దోహదపడుతుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్వరాన్ని తగ్గిస్తుంది. కడుపులో వాపు, పేగుగోడల వాపు, కడుపులో మంటలు, పుండ్లకు ఉసిరి విరుగుడు. మలబద్ధమును తగ్గిస్తుంది. విరోచనాలు, కాలేయ లోపం, కడుపులో మంటలను నిరోధిస్తుంది.

బత్తాయితో పోలిస్తే 20 రెట్లు అధికంగా సి విటమిను ఉసిరిలో ఉంది.

తానికాయ గుణాలు:
తానికాయ: తానికాయ వగరు, ఘాటు రుచి కలిగి ఉంటుంది. దీనిలో విటమిను ఎ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎలర్జీలను నివారిస్తుంది. ప్రేగుల్లో చేరిన పరాన్న జీవులను సంహరిస్తుంది. గొంతులో ఏర్పడిన ఇబ్బందులను తొలగిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. కఫదోషాలను నివారిస్తుంది. శరీరంలో అదనంగా చేరిన శ్లేష్మాన్ని తొలగిస్తుంది. ఉబ్బస వ్యాధులను నివారిస్తుంది. శ్వాసకోశ సమస్యలు, ఎడతెగని దగ్గులను నివారిస్తుంది.

కరక్కాయ గుణాలు:
కరక్కాయ: త్రిఫలచూర్ణంలోని ముఖ్యమైన ఫలాల్లో కరక్కాయ ఒకటి. విరోచనాలను కట్టిస్తుంది. ఛాతీలో మంటను తగ్గిస్తుంది. కాలేయం సరిగా పనిచేసేటట్లు చేస్తుంది. వాత దోషాలను అరికడుతుంది. కండరాలు తీవ్రంగా కొట్టుకోవటాన్ని తగ్గిస్తుంది. నాడీ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది. మలబద్ధాన్ని తొలగించి, నాడీ స్థిరత్వాన్ని ఇస్తుంది. శారీరక బలహీనతను, అనవసరపు ఆదుర్దాలను తొలగిస్తుంది. జీర్ణాశయపు గోడలను బలోపేతం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలోని పోషకాలను గ్రహించేశక్తిని మెరుగుపరుస్తుంది.

వాడే విధానం, ఉపయోగాలు
త్రిఫలను నీటిలో కలిపిన కషాయంగా, రాత్రి పూట పాలు లేదా తేనెతో తీసుకోవాలి. వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఈ మూడు ఫలాల పొడులను సమపాళ్ళలో కలపడం వలన ఇది శక్తివంతమౌతుంది. సమపాళ్ళలో కాక మూడుపాళ్ళు ఉసిరి, రెండు పాళ్ళు తానికాయ, ఒకపాలు కరక్కాయ కలిపిన త్రిఫల చూర్ణం, త్రిఫల మాత్రల రూపంలో కూడా తీసుకోవచ్చు.

·         త్రిఫల తయారీకోసం వాడే మూడు ఫలాలను విడివిడిగా, నిర్ణీత మోతాదులో వాడాలి. ఈ మూడు ఫలాలకు జీర్ణవ్యవస్థను మెరుగురిచే శక్తి వుంది.
·         కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయానికి చెరుపు చేసే విషపూరిత పదార్థాలను త్రిఫల తొలగిస్తుంది.
·      అజీర్ణం, విరేచనాలు వంటి ఇబ్బందులు ఉన్నప్పుడు రెండు స్పూన్ల నీటిలో ఒక స్పూన్‌ త్రిఫల చూర్ణం వేసి మరిగించి వడగట్టి ఆ కషాయానికి కొద్దిగా నీరు కలిపి తీసుకోవాలి.
·         మలబద్ధము బాధిస్తున్నప్పుడు అయిదు గ్రాముల త్రిఫలచూర్ణాన్ని కొద్దిగా తేనెతో కలిపి ఒక ముద్దగా చేసి అరకప్పు పాలతో పాటుగా పడుకునేముందు తాగితే ఇబ్బంది తొలగిపోతుంది.
·     ఒక చెంచా త్రిఫలచూర్ణం రెండు చెంచాల కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే శిరోజాలకు మంచిటానిక్‌లా పనిచేస్తుంది. తలస్నానం తరువాత త్రిఫల చూర్ణం కషాయంతో చివరిగా తలమీద పోసుకుంటే శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి.
·  చర్మరక్షణలో త్రిఫల రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తశుద్ధితో చర్మవ్యాధులు తొలగిపోతాయి. ఎటువంటి చర్మతత్వం కలిగినవారికైనా త్రిఫల మేలు చేస్తుంది. చర్మం కోమలంగా ఉండేలా చేస్తుంది. చర్మానికి మెరుగునిస్తుంది. శరీరంలో పేరుకున్న విషపదార్థాలను తొలగిస్తుంది. చర్మంలోని రక్తనాళాల్లో రక్తప్రసరణను పెంచి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. చర్మానికి పోషణనిస్తుంది. చర్మానికి సహజంగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కొందరి చర్మం సున్నితంగా ఉండి ఎలర్జీలకు గురి అవుతుంది. ఈ లోపాన్ని త్రిఫల సరిచేస్తుంది. సూర్యరశ్మి వలన కలిగే దుష్ప్రభావాలను కూడా త్రిఫల నిరోధిస్తుంది.
·         త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రుతుచక్ర సమస్యలను కూడా అరికట్టవచ్చు. రుతుచక్రం సరిగ్గా లేనివారు వైద్యుని సలహామేరకు త్రిఫల చూర్ణాన్ని వాడవచ్చు.

 

మరిన్ని ఉపయోగాలు
·         కళ్లకు, చర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది.
·         జుట్టును త్వరగా తెల్లగా అవనీయదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుంది.
·         ముసలితనం త్వరగా రానీయదు.
·         జ్ఞాపకశక్తిని బాగా వృద్ధి చేస్తుంది.
·         ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది.
·         రోగనిరోధక వ్యవస్థ ను బాగా శక్తివంతం చేస్తుంది.
·         ఆహారం బాగా సక్రమంగా జీర్ణం అయేలా చేస్తుంది.
·         ఆమ్లత(అసిడిటీ) ను తగ్గిస్తుంది.
·         ఆకలిని బాగా పెంచుతుంది.
·         యురినరి ట్రాక్ట్ సమస్యల నుంచి బాగా కాపాడుతుంది.
·         సంతాన సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది.
·         శ్వాస కోశ సంబంధమైన సమస్యలు రావు. ఒక వేళ ఉన్నాకూడా అదుపు లో ఉంటాయి.
·         కాలేయమును చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది.
·         శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.
·         పెద్ద ప్రేవు లను శుభ్రం గా ఉంచి, పెద్ద ప్రేవు లకుఏమీ వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
·         రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
·         జీర్ణశక్తి ని పెంచుతుంది.
·         అధిక బరువును అరికడుతుంది.
·         శరీరం లోని లోని చెడు పదార్ధాలను బయటకు పంపిస్తుంది.
·         శరీరం లో బాక్టీరియా ను వృద్ధి కాకుండా ఆపుతుంది.
·         కాన్సరు ను కూడా నిరోధిస్తుంది.
·         కాన్సరు కణములు పెరగకుండా కాపాడుతుంది.
·         రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
·         ఎలర్జీ ని అదుపులో ఉంచుతుంది.
·         సీరుం కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తుంది.
·         చక్కగా విరోచనం అయేలా చేస్తుంది.
·         హెచ్ ఐ వీ ని కూడా నిరోధించ గల శక్తి త్రిఫల చూర్ణమునకు ఉంది.
·         నేత్రవ్యాధు లను నిరోధించే శక్తి త్రిఫలకు ఉంది.
ఆది వైద్యులు
 మన భారత సంస్కృతి ప్రకృతిలో మమేకమైన, ప్రకృతిలోని ప్రతి జీవిని, వస్తువును, దైవంగా భావించి జీవనగమనంలో ముందుకు సాగమని చెబుతుంటుంది. అందుకే నాడు రోగాలు, రుగ్మతలు కూడా తక్కువే ఉండేవి. ఏమైనా రోగాలు దాపురిస్తే, అందుకు తగిన, ప్రకృతి సహజంగా లభ్యమయ్యే మూలికలతో వైద్యం చేయబడేది.
ఘనమైన మన చరిత్రలో ఎంతో మంది వైద్య ఘనాపాఠీలు ఉన్నపటికీ, ధన్వంతరీ, సుశ్రుతుడు, చరకుడు, వాగ్భటుడు, కశ్యపుడు, జీవకుడు, నాగార్జునుడు వంటి వారు ప్రముఖంగా కనిపిస్తుంటారు.

ధన్వంతరీ
    ‘ వైద్యో నారాయణో హరిః అని అన్నారు. వైద్యుడు సాక్షాత్తు నారాయణ స్వరూపమని, అనుభవజ్ఞుడైన వైద్యుని అపర ధన్వంతరి అని మన వాళ్ళు పోగడుతుంటారు.
    శ్రీమద్భాగవతం ధన్వంతరిని దృఢమైన శరీరంతో, పొడవైన చేతులతో, నలుపురంగు శరీరంతో, ఎర్రని కళ్ళతో, పసుపువర్ణదుస్తులను ధరించి, వివిధ రకాల ఆభరణాలను అలంకరించుకొని దర్శనమిస్తూంటారుఅని వర్ణించింది. ఇలా పలు పురాణాలు ఆయన అవతారగాథను వివరించాయి. భాగవతపురాణం ప్రకారము, క్షీరసాగరమధనం ద్వార ధన్వంతరి ఆవిర్భావం జరిగింది.
      రాక్షసులు  పెట్టే  బాధలను భరించలేకపోయిన దేవతలు బ్రహ్మ దేవునితో మొరపెట్టుకోగా, ఆయన శ్రీహరిని ప్రార్థించమన్నాడు. అందరూ శ్రీమన్నారాయణుని ప్రార్థించగా క్షీరసాగరమథనము చేస్తే ఫలితము ఉంటుందని చెబుతాడు. అలా వారు విష్ణుదేవుని సలహాననుసరించి గడ్డి, తీగలు, ఓషధులను పాలసముద్రములో వేసి, మందరపర్వతం కవ్వముగా, వాసుకి తాడుగా, కవ్వం కిందుగా కూర్మావతార విష్ణువు ఆధారంగా ఉండగా, ముందుగా హాలాహలం పుట్టగా, దానిని పరమశివుడు కంఠములో ధరించాడు. అనంతరం కామధేనువు, ఉచ్చైశ్శ్రవం, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు, లక్ష్మీదేవి, వారుణి కన్య ఉద్భవించారు.
   ఆ తర్వాత పొడవైన చేతులతో, శంఖం వంటి కంఠంతో నడుముకు పట్టుపుట్టం, కంఠాన పూదండలు, ఎర్రటి కన్నులు, నీలమేఘ శరీరం, చెవులకు రత్నకుండలాలు, కాళ్ళకు రత్న మంజీరాలలో ఓ దివ్యపురుషుడు ఉద్భవించాడు. సకల విద్యా శాస్త్రాలలో నిపుణుడైన అతని చేతిలో అమృతకలశం ధగధగలాదుతోంది.
ఈ విధంగా భాగవత పురాణం ధన్వంతరి ఆవిర్భావాన్ని వర్ణించింది.
   ఇక, విష్ణుధర్మోత్తరపురణం, ఒక చేతిలో అమృతకలశం, మరొక చేత వనమూలికలు పట్టుకొని ధన్వంతరి దర్శనమిచ్చినట్లు చెప్పబడింది. కొన్ని పురాణాలు ఆయన వనములికలకు బదులుగా జలగలను పట్టుకుని ఉంటాడని పేర్కొన్నాయి. రామాయణంలో కమండలం, దండం నుంచి ధన్వంతరి ఉద్భావించాడని చెప్పబడింది. ఆయన నాలుగు చేతులతో దర్శనమిస్తూ, పై రెండు రెండు చేతులలో,శంఖు, చక్రాలను ధరించి, క్రింది రెండు చేతులలో జలగన్ఉ అమృతకలశాన్ని పట్టుకుని ఉంటాడని కొన్ని పురాణాల కథనం.
    దేవవైద్యుడైన ధన్వంతరి భూలోకానికి వచ్చిన ఉదంతాన్ని గురించి హరివంశంలో వివరించబడింది. కాశీ రాజైన దీర్ఘతమునికి చాలా కాలంపాటూ సంతానభాగ్యం లేక పోవడంతో విష్ణుమూర్తిని వేడుకుంటూ ఘోరమైన తపస్సును చేసాడు. అప్పుడు స్వామి దీర్ఘతమునికి ధన్వంతరి కొడుకుగా పుట్టేవరాన్ని అనుగ్రహించాడు. అలా దీర్ఘతముని ఇంట మానవరూపములో జన్మించిన ధన్వంతరి దేవ లోకంలోని వైద్యవిధానాలను మానవలోకానికి అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.
     బ్రహ్మవైవర్తపురాణం, ధన్వంతరి భూలోకానికి వచ్చిన తదనంతరం జరిగిన సంఘటనలను వివరిస్తోంది. ఒకానోకసారి ధన్వంతరి, తన శిష్యులతో కలసి కైలాసపర్వత దర్శనానికి బయలుదేరాడు. దారిలో వారిని అడ్డగించిన దక్ష అనే పాము, తన పడగలను విప్పి బెదిరించింది. ధన్వంతరి శిష్యులలో ఒకడు దూకుడుగా ముందుకు వెళ్ళి దక్ష పామును పట్టుకుని ఓ మంత్రమును పఠించడంతో, ఆ మంత్రప్రభావానికి దక్ష పాము మూర్ఛ పోయింది. ఈ విషయాన్ని గురించి విన్న పాములరాజు వాసుకి, ద్రోణ, పుండరీక అనే క్రూర పాముల నాయకత్వంలో కొన్ని వేల పాములను ధన్వంతరి శిష్యులపైకి పంపాడు. ఆ పాముల సైన్యం తమ విషంతో ధన్వంతరి శిష్యులంతా మూర్చపోయేట్లు చేసాయి. అయితే ధన్వంతరి ఆయుర్వేద మూలికలతో తన సిష్యులనంతా మూర్ఛ నుండి తెరుకునేట్లు చేసాడు. ఈ సంఘటన వాసుకిని మరింత ఆవేశానికి లోను చేయగా, ధన్వంతరితో పాటు అతని శిష్యులను నాశనం చేసేందుకు మానసాదేవి అనే పాములరాణిని పంపాడు. మానసాదేవి తన విషాన్ని ఎగజిమ్ముతుండగా, ధనవంతరావిషానికి విరుగుడు చేసాడు. తదనంతరం మానసాదేవికి, ధన్వంతరి మధ్య భయంకరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధజ్వాలలకు సకల లోకాలు కంపించిపోసాగాయి. సరిగ్గా అప్పుడు వారి మధ్య శివుడు ప్రత్యక్షం కాగా, తన తప్పును గ్రహించిన వాసుకి పరుగుపరుగున వచ్చి శివుని పాదాలపై వాలిపోయాడు.
ఇలా ధన్వంతరి గురించి అనేక పురాణకథలను వింటూంటాం. శస్త్ర చికిత్సలో (ఆపరేషన్స్) ఉద్దండుడైన దివోదాసు ధన్వంతరి వంశావళిలో నాలుగవ తరానికి చెందినవాడు.

శ్రీధన్వంతరి మూలమంత్రం
ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ
ధన్వాతరయే అమృత కలశ హస్తాయ సర్వభయ వినాశకాయ
సర్వరోగ నివారనాయ త్రైలోక్య పతయే త్రైలోక్యవిధయే
శ్రీమహావిష్ణుస్వరూపాయ శ్రీ ధన్వంతరీ స్వరూప
శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా

సుశ్రుతుడు
     శస్త్రచికిత్స అనేతప్పటికీ మనకు ముందుగా గుర్తుకొచ్చేది సుశ్రుతుడే. సుశ్రుతుడు ఓ గొప్ప శస్త్రచికిత్సా నిపుణుడు. గొప్ప గురువు, సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జరీకి ఆద్యుడనిపేర్కొనబడుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, సుశ్రుతుడు హిపోక్రెట్స్కు ఓ వంద సంవత్సరాలు ముందుగా, సెల్సియన్ మరియాగాలన్ ల కంటే రెండు సంవత్సరాల ముందుగా ఈ భూమిపై ఆపరేషన్లు చేశాడనేది యదార్థం. సుశ్రుతుడు ఓ గొప్ప వైద్యపరంపర నుంచి వైద్యాన్ని నేర్చుకుంటే, దివోదాసుడు నుంచి సుశ్రుతుడు వైద్యవిద్యను నేర్చుకున్నాడు. సుశ్రుతుని కీర్తి దేశదేశాలకు పాకింది. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ముందుగా అరబిక్ భాషలోకి అనువదించబడి, అరబిక్ భాష నుండి పర్షియన్ భాషలోకి, ఆ తదనంతరం మిగతా భాషలకు విస్తరించాయి. సుశ్రుతసంహిత రెండు భాగాలను కలిగి ఉంది. మొదటి భాగం పూర్వసంహితగా, రెండవభాగం ఉత్తర సంహితగా విభజింపబడ్డాయి. 184 అధ్యాయాలుగా విభజింపబడిన ఈ గ్రంథంలో 1,120 రుగ్మతలను గురించి ప్రస్తావించబడటమే కాక, వాటికి సంబంధించిన చికిత్సాపద్ధతులు కూడ వివరించబడ్డాయి. అయితే, ఆయన ఇన్ని విధాలైన వైద్యవిధానాలను సూచించినప్పటికీ, ఆయన మధుమేహ, ఊబకాయాలను తగ్గించే వైద్యునిగానే చాలా మంది గుర్తుపెట్టుకుంటున్నారు. ఆయన కాశీలో నివసించినందువల్ల ప్రస్తుతం బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయంలో సుశ్రుతుని విగ్రహం ప్రతిష్టించబడింది.

చరకుడు
    సుశ్రుతుడు శస్త్రచికిత్స  నిపుణుడైతే చరకుడు  ఆయుర్వేద వైద్యుడు. ఏ రోగికి ఏ మూలిక తగినదన్న విషయాన్ని నిర్ణయించడంలో నిష్ణాతుడు. ఆయన శాస్త్ర చికిత్సావిధానాల్లో అనేక అద్భుతాలు చేశాడు.
    ఈయన గర్బస్థశిశువు పెరుగుదల గురించి, మానవ శరీర నిర్మాణము గురించి స్పష్టమైన వివరాలు అందించాడు. వాత, పిత్త, కఫములను అనుసరించి చరకుడు శరీరంలోని ఆరోగ్యస్థితిని అంచనా వేసేవాడు. అదేవిధంగా రోగాలను నిర్థారించడమే కాదు, వాటికి తగిన చికిత్సా పద్ధతులను సూచించడంలో కూడా ఘటికుడు చరకుడు. ఈయన వృద్ధాప్యాన్ని వెన్నక్కి మళ్లించే మూలికలను కూడా అందుబాటులోకి తెచ్చాడని ప్రతీతి.
     ఆయనచే విరచితమైన చరక సంహితిలో పలు విధాలైన మూలికల వివరాలను, చికిత్సా విధానాలను చూడొచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో చరకుడు వైద్యం చేసేందుకు లోహథాతువులను, జంతు సంబంధ పదార్థాలను కూడా ఉపయోగించేవాడట. మందులు ఉపయోగించే పద్ధతిని అనుసరించి చరకుడు ఆయా మందులను 50 రకాలుగా విభజించాడు. మందులను పొడిరూపంలో, జిగురుగా, ద్రవరూపంలో తాయారు చేసిన చరకుడు ఆ మందులను ఉపయోగించాల్సిన విధానాన్ని గురించి చాల వివరంగా పేర్కొన్నాడు.

వాగ్భటుడు
     పూర్వకాలంలో వృద్ధత్రయీ అని పేర్కొనబడినవారిలో వాగ్భటుడు ఒకరు. మిగతా ఇద్దరు ఆత్రేయుడు, సుశ్రుతుడు. ఈయనచే విరచించబడిన ప్రఖ్యాత వైద్యగ్రంథాలు అష్టాంగ సంగ్రహం, అష్టాంగ హృదయం. సింహగుప్తుని కుమారుడైన వాగ్భటుడు సింధునదీ పరివాహక ప్రాంతములో జన్మించాడు. అవలోకితుడు అనే బౌద్ధగురువు దగ్గర వాగ్భటుడు వైద్యవిద్యను అభ్యసించాడు. అయితే వాగ్భటుడు పుట్టుకతో హిందువే అయినప్పటికీ, జీవన ప్రస్థానంలో హిందూ ధర్మాన్నే అనుసరిస్తున్నప్పటికీ, తనయొక్క గ్రంథాలకు ముడు మాటగా చెబుతున్నప్పుడు బుద్ధుని స్మరించుకుంటాడు.
     ఈయన అష్టాంగ సంగ్రహం భారతదేశ పర్యంతం చదువబడింది. ఈయన తన కాలంలో లభ్యమైన వైద్యగ్రంథాలన్నింటిని పరిష్కరించి అందరికీ అందుబాటులో ఉండేట్లుగా చేసాడు. చరకుడు, సుశ్రుతుడు చెప్పినవాటిని చక్కగా పరిష్కరించాడు. ఈయన ఋతువులను అనుసరించి చేయాల్సిన దినచర్యల గురించి, ఋతుచర్యల గురించి వివరించాడు. వీటిని పాటించడంవల్ల ఆయుర్ వృద్ధి జరుగుతుందని ప్రయోగాత్మకంగా తెలిపేవాడయాన.
     ఈయన రాసిన అష్టాంగ సంగ్రహంలో 6 అధ్యాయాలు, 150 విభాగాలున్నాయి. మొదటి అధ్యాయంలో శరీర నిర్మాణము, గర్భము ధరించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రసవ సమయములో పాటించవలసిన పద్ధతులు, మూడవ అధ్యాయంలో మధుమేహం, చర్మ వ్యాధుల నివారణలను గురించి, నాలుగవ అధ్యాయములో ఆయా వ్యాధులకు తగిన చికిత్సా పద్ధతులు, ఐదవ అధ్యాయంలో చిన్నపిల్లలకు వచ్చే రోగాలు, మూర్ఛలు, పిచ్చి గురించి, వాటి నివారణ పద్ధతులను గురించి వివరించబడింది.

కశ్యపుడు
కశ్యపుడు పిల్లలకు సంబంధించిన విద్యావిధానంలో, ప్రసూతి వైద్య విధానామలో నిష్ణాతుడు. ఈయనచే విరచిత్రమైన గ్రంథం కశ్యప సంహితప్రశ్నోత్తరాల రూపంలో ఉంటుంది. ప్రసూతి వైద్యంలో కశ్యపుని కృషి గణనీయమైనది. ఆయుర్వేదానికి సంబందించిన ఎనిమిది విభాగాలలో కశ్యపుని కృషి అనితరసాధ్యం.
1.     కాయ చికిత్స
2.     శల్య చికిత్స
3.     శాలక్య తంత్ర
4.     అగాధ తంత్రం
5.     భూత విద్య 
6.     కౌమార భృత్య
7.     రసాయన తంత్రం
8.     వాజీకరణ తంత్రం అంటూ ఆయుర్వేదానికి సంబంధించిన అన్ని విభాగాలలో కశ్యపప్రభావం ఉంది.
అదే విధంగా కశ్యపుని వైద్య విధానంలో ఏడు విధాలుగా మందులను తయారు చేసేవారట.
1.     చూర్ణం
2.     శీతకషాయం
3.     స్వరస
4.     అభిసవ
5.     ఫంట
6.     కలక
7.     క్వత
కశ్యపుడు పిల్లల పెరుగుదలకు సంబధించిన ఎన్నో సూచనలను తన గ్రంథంలో అందించాడు.
జీవకుడు
   జీవకుడు మెదడు, నరాలకు సంబంధించిన వైద్యనిపుణుడు. బౌద్ధ గ్రంథాలలో ఈయన వైద్య విధానాన్ని గురించిన ప్రశంసలను చూడగలం. బింబిసారుని కాలానికి చెందిన జీవకుడు ఒక కుప్పతోట్టిలో కనిపించాడని, రాజుకు ఈ విషయం తెలిసి, ఆ పసికందును ఆస్థానానికి రప్పించి జీవకుడు అనే పేరు పెట్టాడని చారిత్రిక కథనం. పెరిగి పెద్దయిన జీవకుడు తక్షశిలలో వైద్యవిద్యను అభ్యసించాడు. ఏడేళ్ళ పాటు సాగిన ఆ విద్య ముగిసిన అనంతరం, అతనిని గురువు పిలిచి, తక్షశిలకు వలయాకారంలో ఎనిమిది మైళ్ళ పర్యంతంలో వైద్యానికి పనికిరాని మొలకను  తీసుకురమ్మానాడు. జీవకుడు గురువు చెప్పిన ప్రకారం, ఒక యోజన పర్యంతము తిరిగి, అటువంటి మొక్క కోసం వెదకి, వైద్యానికి పనికిరాని మొక్కను కనిపెట్టడం తన వల్ల కాదన్నాడు. అప్పుడు అతని అర్హత పట్ల సంతృప్తి చెందిన గురువు, అతనిని ఆయుర్వేద వైద్యం చేయడానికి అనుమతిని ఇచ్చాడు.
   అనంతరం జీవకుడు నరాలకు సంబంధించిన వైద్యాన్ని చేసేందుకు సాకేతపురానికి చేరుకున్నాడు. వైద్యవృత్తి ద్వారా జీవకుడు బాగా ధనవంతుడయ్యాడు. అనంతరం ఒకానొక సమయంలో జీవకుడు బుద్ధునికి కూడా వైద్యాన్ని అందించాడు. ఒకప్పుడు బుద్ధుని కాలికి రాయితగలగా  గాయమైంది. అప్పుడు జీవకుడు కొన్ని మూలికలను గాయముపై పూసి, కట్టు కట్టాడట. ఆ కట్టు ఓ కాలపరిమితి తర్వాత విప్పి వేయాలి. కానీ, ఆ సమయంలో జీవకుడు వేరేపనిపై పొరుగూరుకెళ్ళాడు. అప్పుడు జీవకుడు బుద్ధునితో మానసిక తరంగాల ద్వారా సంప్రదించి, అక్కడనుంచే బుద్ధుని కాలికి కట్టివున్న కట్టును ఎలా విప్పదీయాలో చెప్పి, అలాగే చేయించాడని ప్రతీతి. అప్పట్నుంచి బుద్ధుడు, జీవకుని తన ప్రధాన శిష్యులలో ఒకరినిగా నియమించాడు. జీవకుడు కూడ బుద్ధునికి ఆరోగ్యపరమైన సలహాలను ఇస్తూ ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుతుండేవాడు.

నాగార్జునుడు
   నాగార్జునుడు మందుల తయారిలో అగ్రగణ్యునిగా పేరుగాంచాడు. ఏ వస్తువైనా సరే, బంగారంగా మార్చగలిగే పరసవేదివిద్యలో కూడ నాగార్జునుడు సిద్ధహస్తుడని చెబుతుంటారు. ఈయన ఆధ్వర్యంలో రసశాస్రం (కెమిస్ట్రీ) బాగా అభివృద్ధి చెందింది. ఇక, ఆ రోజుల్లో వైద్యశాలలను (ఆసుపత్రులు) గురించి పాహియాన్, హుయాన్ సాంగ్ వంటి విదేశీ యాత్రీకులు గ్రంథంస్తం చేసిన విషయాల ద్వారా అనేక విషయాలను తెలుసుకునేందుకు వీలవుతోంది. తెలుసుకోగలం. చంద్రగుప్తమౌర్యుని కాలంలో పాతలీపుత్రాన్ని దర్శించిన చైనా యాత్రీకుడు పాహియాన్ అప్పటి భారతంలోని ఉచిత వైద్యశాలల గురించిన వివరాలను తన యాత్రా గ్రంథంలో లిఖించాడు. తమ ఇళ్ళనే వైద్యశాలలుగా మార్చిన వైద్యులు పేదలకు ఎటువంటి ఖర్చు లేకుండా వైద్యసేవలను అందించేవారట. ఇక, హుయాన్ సాంగ్ అయితే భారతదేశంలో ఉచిత వైద్యశాలలకు కోడవేలేదనటమే కాక, వాటిని పవిత్ర దేవాలయాలని పేర్కొన్నాడు. ఇలా మనది ఘనమయిన చరిత్ర

   ప్రకృతిలో పరమాత్మను దర్శించే మన సంస్కృతిలో, వైద్యవిధానాలు కూడ ప్రకృతికి అనుగుణంగానే అభివృద్ధి చెందాయి. ఎక్కడా కృతిమ తత్త్వానికి చోటేలేదు. అప్పటి సమాజం అన్ని విధాలుగా ముందంజ వేసిందంటే, అందుకు కారణం, ‘ఆరోగ్యమే మహాభాగ్యంఅన్న విషయాన్ని మనసా వాచా కర్మణా నమ్మి, ఆచరించటమే!

-------------------------------------------------------
ఆరోగ్యము అంటే ?
ఒక వ్యక్తి శరీరములో ఏదైనా జబ్బు (disease) లేనంత మాత్రాన ... వ్యక్తీ ఆరోగ్యవంతుడని అనలేము.
ఒక వ్యక్తి ...
"
శారీరకంగాను ,
మానసికంగాను ,
శరీరకవిధులనిర్వహణలోను ,
ఆర్ధికంగాను ,
సామాజికంగాను ...
తను ఉన్న ప్రదేశం లో సమర్ధవంతం గా నివసించ గలిగితే ... ఆరోగ్య వంతుడనబడును ".
(Mere absence of a disease in a person is not healthy. A person is said to be healthy " when is physically, mentally, physiologically, socially, financially " fit to live in his own circumstances.. Then ... he / she is healthy)
 ఆరోగ్యము మనిషి ప్రాధమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి , ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి , మంచి ఆరోగ్యకర పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యముగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి . 'ఆరోగ్యకరమైన జీవనశైలి'ని అలవర్చుకోవడం తప్పనిసరి .
జీవనశైలి అంటే ?
ఆరోగ్యకరమైన జీనశైలి అనేది ఒక నైపుణ్యం. శాస్త్రీయంగా నేర్చుకోవాల్సిన విషయం. 'ఆరోగ్యమంటే... జబ్బులేకపోవడం మాత్రమే కాదు. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా 'ఒక మంచి పద్ధతి'గా ఉండడమే ఆరోగ్యం అని ప్రప్రంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) చెప్పింది. మనిషి శరీరంలో జరిగే లక్షలాది రసాయనిక చర్యలు, అనువంశికత, మనిషి చుట్టూ ఉండే పర్యావరణం, స్థానిక సంస్కృతులూ- ఇవన్నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే 'ఆరోగ్యకరమైన జీవనశైలి' వైద్య శాస్త్రం, సామాజిక శాస్త్రాలు కలిస్తే వచ్చే దృక్పథం ఇది.
'ఆరోగ్యకరమైన జీవనశైలి'లో నాలుగు అంశాలుంటాయి.
*
సమతుల ఆహారం,
*
శారీరక వ్యాయామం,
*
వ్యక్తిగత జీవితంలో ఆశావహత-వాస్తవిక దృష్టి
*
సామాజికంగా సానుకూల దృక్పథం-సమిష్టితత్వం.

పై నాలుగు అంశాలను పాటిస్తున్న వారు 'ఆరోగ్యకరమైన జీవనశైలి'తో ఉన్నట్టు లెక్క.
ఆరోగ్యవంతుడి శారీరక లక్షణాలు
బరువు (వయస్సు ప్రకారం) : ఎత్తు సెంటి మీటర్లలో -(minus) 100 = బరువు కిలో గ్రాముల్లో (సుమారు గా)
(Range : Height - 100 = Wight +- 5 Kgs)
శారీరక ఉష్ణోగ్రత : 98 డిగ్రీలు ఫారెన్హీట్ +- 1 డిగ్రీ (నార్మల్ రేంజ్).
గుండె లయ (హార్ట్ బీట్) :72 +- 8 (నార్మల్ రేంజ్)
నాడీ లయ (పల్స్ రేట్) : 72 +- 8 (నార్మల్ రేంజ్)
రక్తపోటు (బ్లడ్ ప్రెషర్) : 120/80 మీ.మీ.అఫ్ మెర్కురి (mercury) (140 /90 వరకు నార్మల్)
మూల జీవక్రియ రేటు (బేసల్ మెటబాలిక్ రేటు) :
English BMR Formula
Women: BMR = 65 + ( 4.35 x weight in pounds ) + ( 4.7 x height in inches ) - ( 4.7 x age in years )
Men: BMR = 66 + ( 6.23 x weight in pounds ) + ( 12.7 x height in inches ) - ( 6.8 x age in year )

Metric BMR Formula
Women: BMR = 65 + ( 9.6 x weight in kilos ) + ( 1.8 x height in cm ) - ( 4.7 x age in years )
Men: BMR = 66 + ( 13.7 x weight in kilos ) + ( 5 x height in cm ) - ( 6.8 x age in years )

ఇక్కడ క్లిక్ చేయండి -
1. BMI లెక్క కట్టుటకు
2. BMR లెక్క కట్టుటకు

ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలు :
పౌష్టికాహారం : పుస్ఠి కరమైన ఆహారము - ఒక్కొక్క రికి ఒకలా ఉంటుంది - శాఖార్లులు , మాంసాహారులు: పాలు ,పండ్లు , పప్పులు ఆకుకూరలు , కాయకురాలు మున్నగు వాటితో కూడుకున్నది సమతుల్యాహారం : సరియైన , సరిపడు , అన్నీ (పిండి పదార్దములు , మాంస కత్తులు , క్రొవ్వులు , విటమిన్లు , మినరల్స్, తగినంత నీరు ) ఉన్న ఆహారము .

శారీరక వ్యాయామం : మనుషులము తిండి ఎంత అవసరమో .. వ్యాయామము అంతే అవసరము .. దీని వలన శరీరము లోని మాలిన పదార్దములు( free radicals ) విసర్జించబడుతాయి . ప్రతి రోజు ఒక గంట నడవాలి .... ఇది రెగ్యులర్ గా ఉండాలి .
మానసిక వ్యాయామం : చిన్న చిన్న విషయాలకు స్పందించకుండా ఎప్పుడు మనషు ప్రశాంతం గా ఉండేటట్లు చూసుకోవాలి . నవ్వుతు బ్రతకాలి ... నవ్విస్తూ బ్రతకాలి .
ధ్యానం :.. మనషు స్థిరం గా , నిలకడ గా ఒకే విషయం పై , దేవుడైనా , దెయ్యేమైనా ... లగ్నంయ్యేతట్లు ప్రతిరోజూ సుమారు ఒక గంట ధ్యానం లో ఉండాలి 
-----------------------------------------------
ఎండిన పండ్లు , Dry Fruits
నిజానికి డ్రైప్రూట్స్ అంటే మనకు తెలిసినవి ఎండు ద్రాక్ష, ఖర్జూరాలే. కాని ఇప్పుడు అన్ని రకాల పండ్లు డ్రైప్రూట్స్‌గా దొరుకుతున్నాయి. జీడిపప్పు, బాదం, పిస్తా వంటివి పోషకాల పరంగా ఎండిన పండ్లను పోలి ఉండటంతో ఇవీ డ్రైప్రూట్స్ డబ్బాలో చేరిపోయాయి.
  • నీరసంతో తోటకూర కాడలా వడిలిపోయిన మొహాలు సైతం -గుప్పెడు నమిలితే తేజోవంతంగా వెలగిపోతుంటాయ. అందుకే ఇవి తాజా పండ్లకన్నా శక్తివంతం. ఉదాహరణకు ఆఫ్రికాట్లనే తీసుకుందాం. ఎండబెట్టడం వల్ల నీరంతా పోవడంతో చిక్కబడుతుంది. ఫలితంగా ఓ కప్పు తాజా ఆఫ్రికాట్లు తింటే వచ్చేది 75 క్యాలరీలు మాత్రమే. అదే కప్పు ఎండిన ఆఫ్రికాట్లు అందించేది 313 క్యాలరీలు. అదీగాక ఈ చెక్కరలు వెంటనే రక్తంలో కలిసిపోతాయి. ఇన్‌స్టెంట్ ఎనర్జీ అన్నమాట. మిగిలిన విటమిన్లూ, పీచూ వంటివన్నీ కాస్త తగ్గినా మొత్తంగా అయితే పోవు. తాజా పండ్లలో మాదిరిగానే ఎబి1, బి2, బి3, బి6, పాంథోనిక్, ఆమ్లం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పోటాషియం, సోడియం, కాపర్, మాంగనీసు వంటివన్నీ వీటిల్లోనూ ఉంటాయి. అయితే వాణిజ్య పరంగా చేసే వాటిల్లో రంగు పోకుండా ఉండేందుకు సల్పర్ వాడతారు. ఇది కొందరికి ఆస్తమా కలిగించొచ్చు. అదే ఆర్గానిక్ పద్ధతిలోచేసే వాటిల్లో సల్ఫర్ వాడరు కనుక, ముదురు రంగులో ఉంటాయి.
సుమారు నాలుగైదు కిలోల ద్రాక్ష ఎండబెడితే ఒక కిలో ఎండు ద్రాక్ష అవుతుంది. నేరుగా ఎండలో లేదా ఓవెన్ లేదా డీ హైడ్రైటర్ల ద్వారా పండ్లను ఎండబెడతారు. సి విటమిన్ తగ్గిపోకుండా నిమ్మ, నారింజ, ఫైనాపిల్ రసాలు, లేదా ఆస్కార్బిక్ ఆమ్లంలో ముంచి తీస్తారు. దీనివల్ల రంగు మారదు. ఆపై ఎండబెట్టి పాస్టరైజ్ చేసి నిల్వ చేస్తారు. అయతే, సంప్రదాయ పద్ధతుల్లో ఎండబెట్టినవే మంచివి. ఎండు ఖర్జురాలయితే నీళ్లలో నానబెట్టుకుని త్రాగుతారు. ఎండిన పండ్లలో ఔషధ గుణాలు మెండు. సహజమైన ఔషధాలు, శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు, ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది. జీర్ణశక్తిని పెంచడంతో బాటు రక్తాన్నీ శుద్ధి చేస్తాయి. అందుకే -ఏ డ్రైప్రూట్స్‌నీ వదలొద్దు కొంచెం కొంచెంగా రోజు వారీగా తింటుండండి.
·         మనకు తెలిసిన డ్రైప్రూట్స్, నట్స్‌లో ప్రదానంగా ఎండు ద్రాక్ష, ఖర్జూరం, జీడిపప్పు, బాదంపప్పుల వాడకమే ఎక్కువ. చూడడానికి ఎంతో చిన్నవిగా ఉండే ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో. వీటిల్లో చెక్కర శాతం ఎక్కువ. అనారోగ్యంతో నీరసించిన వాళ్ళు ఇవి కాసిని తింటే వెంటనే కోలుకుంటారు. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవాళ్ళు -రెండు టేబుల్ స్పూన్లు ఎండు ద్రాక్షను గ్లాసు నీళ్లలో రోజంతా నానబెట్టి ఉదయాన్నే తాగి, పండ్లను తినేస్తే సరి. చిన్న పిల్లలకి ఈ నీళ్లు మరీ మంచిది. వయస్సును బట్టి ఆరునుంచి పది ఎండు ద్రాక్షను నానబెట్టి పట్టించాలి. ఇందులో ఐరన్‌కూడా ఎక్కువ. బరువు తక్కువుగా ఉన్నవాళ్లకీ, రక్తహీనతతో బాధపడే వాళ్లకీ మంచిది. జీడిపప్పు లో మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువుగా ఉండటంతో ఇవి గుండెకు మేలుచేస్తాయ. పోటాషియం, మెగ్నీషియం, ఫాస్పర్, సెలీనియం, కాపర్, విటమిన్‌లు ఇందులో అధికం. ఖర్జురాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజోలు ఎక్కువ. నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గింజల్ని తీసేసి కనీసం వారానికి రెండుసార్లు తింటే గుండె పదిలమే. ఇందులో కొద్ది పాళ్లలో ఉన్న నికోటిన్ పేగుల్లోని ఇబ్బందుల్ని తొలగిస్తుంది. బాదం బోలెడు పోషకాలకు నిలయం.
శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్‌:
ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలువిటమిన్లుఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం జీర్ణశక్తిని అధికం చేసిరక్తాన్ని శుద్ది చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి.

బాదం పప్పు...
బాదం పాలు ఎంతో శ్రేష్ఠమైనవి బాదం పప్పు మంచి పోషకాహారం. మామూలుగా మనం తీసుకునే పాలతో పోలిస్తే ఇవి ఎంతో ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. ఆవుపాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు పట్టవచ్చు. బాదం పప్పులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులువిటమిన్‌బి’ లు ఆల్మండ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. వీటి రసాయనిక చర్యల వల్ల అధిక శక్తి లభిస్తుంది. రక్తకణాలుహీమోగ్లోబిన్‌ సృష్టికిగుండెమెదడు,నాడులుఎముకలుకాలేయం సక్రమంగా పనిచేయడానికి ఆల్మండ్‌లు ఎంతగానో తోడ్పడుతాయి. అవి కండరాలు బహుకాలం దృఢంగాఎక్కువ కాలం పనిచేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. బాదం పప్పును రోజూ కొద్దిగా నెత్తికి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రువెంట్రుకలు ఊడటం వంటి వాటికి చక్కటి పరిష్కారం చూపుతుంది. ఎగ్జిమా వంటి చర్మం వ్యాధులకు అడవి బాదంపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం బాదంఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసినీటిలో పేస్ట్‌లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది. బాదం పేస్ట్‌తోపాలనుకలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.

జీడిపప్పు...
శరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి. వీటిలో పొటాసియంవిటమిన్‌ బికూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండే అసంతృప్త కొవ్వు పదార్ధం గుండె జబ్బులను నివారించే సామర్ధ్యాన్ని కలిగిఉంది. మెగ్నీషియంఫాస్ఫరస్‌సెలీనియంరాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి.

ఎండు ద్రాక్ష...
ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడుఎండు ద్రాక్ష తయారవుతుంది. మంచి పోషకాహర విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి. అదేవిధంగా ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి. వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.

ఖర్జూరపు పండ్లు...
ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలనుతొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి.

అంజీర్‌ పండు....

ఎండిన అంజీర్‌ పండులో పీచురాగిమంగనీస్‌మెగ్నీషియంపొటాసియంకాల్షియంవిటమిన్‌-కెవంటికి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి. రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే‚, ప్లాస్మాలోయాంటీ ఆక్సిడెంట్‌ సామ ర్థ్యం గణనీయంగా పెరుగుతు ంది.ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే.

వ్యాఖ్యలు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివుడు చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ భూలోకానికి ఎలా తెలిసిందంటే

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శ్రీ మహాగణపతి విశేషాలు