పండుగలు - నోములు - వ్రతాలు

వైకుంఠ ఏకాదశి



ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గఴి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

పండగ ఆచరించు విధానం:
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతం నియమాలు : 1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.

పండుగ ప్రాశస్త్యం:
ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి

వైఖానసుడి కథ:
పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరక బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ:
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి, రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! వెంటనే మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

తాత్త్విక సందేశం:
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

పుత్రద ఏకాదశి కథ:
వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. దీని గొప్పతనాన్ని వివరించే కథ : పూర్వం మహారాజు "సుకేతుడు" 'భద్రావతి' రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతని భార్య 'చంపక'; మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది. వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ, ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకొని, వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి, మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ, నేడు 'పుత్రద ఏకాదశి' గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకొని, వారికి మనఃపూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు. వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య 'చంపక'కు చెప్తాడు. ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' చేస్తారు. అనంతరం కొద్దికాలానికి కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లితండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు.ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు.

ముక్కోటి ఏకాదశి
ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం| 
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం|| 

అట్టి సుమధుర మూర్తిని ఈ 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి ఏకాదశి" గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది.

ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే, ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. ఈ "ముక్కోటి ఏకాదశి" రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. ఆ రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు, స్నానసంధ్యాదులు ముగించుకొని అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రదక్షిణ క్రమాన్నే "ముక్కోటి ప్రదక్షిణ" అని పిలుస్తూ ఉంటారు.

ఈ వైకుంఠ ఏకాదశినే "పుత్రద" ఏకాదశి అని కూడా అంటారు. దీని విశిష్ఠతను తెలిపే ఒక కథ ఉన్నది. పూర్వం "సుకేతుడు" అను మహారాజు 'భద్రావతి' అను రాజ్యాన్ని ప్రజాభీష్టాలను తరచు గమనిస్తూ వాని పరిపాలన ఎల్లప్పుడు జ్ఞప్తికి ఉండేలా ప్రజలకు సర్వసౌఖ్యాలను కలిగిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉండేవాడుట! అట్టి మహారాజు భార్య పేరు 'చంపక' ఆమె అంతటి మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని స్వయంగా చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, అటువంటి ఉత్తమమైన భర్త తనకు లభ్యమవటం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. తదనుగుణంగా మహారాజు కూడా ఆమెను ప్రోత్సహించేవాడు. అట్టి అన్యోన్య పుణ్యదంపతులకు మాత్రం, 'పుత్రసౌభాగ్యం' కరువై, అది వారి జీవితంలో తీరని లోటుగా మారింది.

ఆ మహారాజు కూడా పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ ఉండగా! ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకుంటాడు. ఆ దివ్యమూర్తులను సందర్శించి వారిని సేవించి తనకు పుత్ర భిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి రాజా! మేము 'విశ్వదేవులము' మీకు పుత్రసంతాన భాగ్యము తప్పకలుగుతుందని ఆ దివ్యతేజోమూర్తులు దీవిస్తూ, నేడు సరిగా 'పుత్రద ఏకాదశి' నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, ఆ వ్రత విధానాన్ని ఆ మహర్షుల ద్వారా ఉపదేశము పొంది, ఆ పుణ్యమూర్తులకు మరోమారు కృతజ్ఞతా పూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు.

వెను వెంటనే అమితోత్సాహముతో నగరానికి చేరుకుని నదీ తీరాన జరిగిన వృతాంతమంతా 'చంపక' దేవితో చెప్తాడు. ఆమె కడు సంతోషించి ఆ దంపతులు యిరువురు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి, ఉపవాస, జాగరణలతో, భగవన్నామసంకీర్తనలతో మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' పూర్తిచేస్తారు.

అనంతరం కొద్దికాలానికి హరి హరాదుల కృపాకటాక్షముతో కులవర్ధనుడైన కుమారుడు కలుగుతాడు. ఆ పిల్లవాడు శుక్ల పక్షచంద్రునిలా దినదిన ప్రవర్ధమాన మగుచూ, సత్‌శీలముతో విద్యాబుద్ధులు నేర్చుకుని యౌవ్వనము రాగానే, తల్లితండ్రుల అభీష్టముపై యువరాజై! ప్రజారంజకముగా పాలిస్తూ ఏకాదశ వ్రత విశిష్టతను రాజ్యమంతటా వివరిస్తూ! ప్రజల అందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు. అది ఈ 'పుత్రద ఏకాదశి' లోని మహత్యం.
------------------------------------------------------

ఉగాది
ఉగస్య ఆది:ఉగాది: - "ఉగ" అనగా న్క్షత్ర గమనం.నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది".'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము.ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది.యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ: - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

ఉగాది పుట్టుపూర్వోత్తరాలు
వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి.చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను.కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచునందని కూడా చెప్పబడుచున్నది.శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం.ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.
"ఉగాది" ఆచరణ విధానం
ఉగాది పర్వాచరణ విధానాన్ని 'ధర్మసింధు' కారుడు 'పంచవిధుల సమన్వితం'గా ఇలా సూచించియున్నాడు.

తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం...
ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం...

ఉగాదిరోజు

  1. తైలాభ్యంగనం
  2. నూతన సంవత్సరాది స్తోత్రం
  3. నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
  4. ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
  5. పంచాంగ శ్రవణం
మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి.ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను,గంగాదేవి నీటిలోను,ఆవహించి వుండునని ఆర్యోక్తి.కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి,గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు."అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్టినం" (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్త్యా అభ్యంగనం ఆరోగ్యం కూడా.ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

అభ్యంగ స్నానానంతరం సుర్యునికి,ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో,పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి,అందు నూతన సంవత్సర పంచాంగాన్ని,సంవత్సరాది దేవతను,ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది రసాయనాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

ఉగదినాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది.వేపపూత,కొత్త చింతపండు,బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు,నేయి,ఉప్పు,మిరియాలు,షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌
భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్


అని ధర్మ సింధుగ్రంధం చెబుతున్నది.ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను.ఉగాడినాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం,పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాడు ప్రభోదాత్మకం కూడా! "తీపి వెనుక చేదు,పులుపూ ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు,తదితర అనుభూతులు,ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు,దు:ఖానికి క్రుంగకు,సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు" అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి.అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పాఅరిహరించబడి,రోగశాంతి,ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

ఉగాదినాడు ఇంద్రధ్వజ,బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది .ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి,ఆ కర్రకు మామిడి ఆకులు,నింబ పత్రాలు,పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం.ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన,పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది.


ఏష ధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక:

అస్య ప్రదవాత్సకలం మమ: సంతు మనోరధా:

యధాశక్తి రాగి,వెండి,పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి,అశోక,నేరేడు,మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి,పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం,పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని,గురుతుల్యులకుగానీ,పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పుడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

"తిధిర్వారంచనక్షత్రం యోగ: కరణమేవచ పంచాంగమ్‌"

తిధి,వార,నక్షత్ర,యోగ,కరణఅములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం.ఉగాది నాడు దేవాలయంలోగాని,గ్రామకూడలి ప్రదేశాల్లోగాని,పండితుల,సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది.
"పంచాంగస్యఫలం శృణ్వన్‌ గంగాస్నానఫలంఖిలేత్"

ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

"సూర్యశ్శౌర్య మధేందురింద్రపదవీం" అనెడి పంచాంగ శ్రవణ ఫలశృతి శ్లోకంలో ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని,చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని,కుజుడు శుభాన్ని,శని ఐశ్వర్యాన్ని,రాహువు బాహుబలాన్ని,కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.


శ్లోకం
" శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ 

సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం "


ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి.

'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు.ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా,ప్రారంభసమయమును "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు.అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభ మవడం వల్ల ఆరోజునుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి,లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.

లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

తృట్యైనమః,నిమేషాయనమః,కాలాయనమః అంటూ ప్రకృతిని,ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము.ఉగాదినాటి పంచాంగం పూజ,పంచాంగం పూజ,పంచాంగం శ్రవణం కాలస్వరూపనామార్చనకు ప్రతీకం.పంచాంగ పూజ,దేవి పూజ సదృశమైంది.అంతం,ముసలితనం,మరణం లేనిది కాలస్వరూపం.అదే దేవి స్వరూపం.అందుకే పంచాంగం పూజ,పంచాంగ శ్రవణం,దేవి పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది.విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్రశుద్ధపాడ్యమి.ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది.

శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి,యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు,శత్రువులను తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచిచెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు.ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం.

ఈ పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి' ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది.బెల్లం,కొత్త చింతపండు పులుసు,మామిడి ముక్కలు,కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు.తీపి,ఉప్పు,పులుపు,చేదు,వగరు,కారం అనే షడ్రుచుల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు.ఆరోగ్యానికి ఇది మంచిది.అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది.

మామిడాకుల తోరణాలు కట్టడం,తలస్నానం చెయ్యడం,కొత్తబట్టలు ధరించడం,పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం.ఆదాయ వ్యయాలు,రాజ పూజ్య అవమానాలు,కందాయ ఫలాలు,రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి.పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి,పురోహితుడిని రప్పించి,తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.

మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో,రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు,అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

పంచాంగ శ్రవణం
నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా...శుభకార్యాలు,పూజా పునస్కారాలు,పితృదేవతారాధన,వంటి విషయాలకు వచ్చేటప్పటికి

"పంచాంగము" ను ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం.ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి,మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది.అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి.ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము.కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.ఇలా పూర్వం లభించేవికాదు.తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి.కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.

ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం.తిధి,వారం,నక్షత్రం,యోగం,కరణం అనేవి ఆ అయిదు అంగాలు.పాడ్యమి మొదలుకొని 15 తిధులు,7వారాలు ,అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు,విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు,బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు,11 కరణములు వున్నాయి.వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం".పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం.పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు.సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు.ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు.వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

నవనాయకులు
1.రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.

2.మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.

3.సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.

4.సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.

------------------------------------------------------

తెలుగు మాసములలో తిధి, వార, నక్షత్రమును బట్టి వచ్చే పండుగలు.


చైత్రమాసం

- చైత్ర శుద్ధ పాడ్యమి చిత్త నక్షత్రం, సంవత్సరాది లేక ఉగాది (యుగాది) పండుగ జరుపుకొంటారు. ఈ రోజుతో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. 

- చైత్ర శుద్ధ విదియ ఉత్తమ మన్వంతరం (సౌభాగ్య గౌరీ వ్రతం) 

- చైత్ర శుద్ధ పంచమి వరాహ జయంతి (శ్వేతవరాహ కల్పం, ఆరంభం) 

- చైత్ర శుద్ధ నవమి శ్రీ రామ నవమి. 

- చైత్ర శుద్ధ ఏకాదసి రుక్మిణీ పూజ 

- చైత్ర శుద్ధ పూర్ణిమ చిత్తా నక్షత్రములో రౌచ్యక మన్వంతరం. 

- చైత్ర బహుళ పంచమి మత్స్యావతార జయంతి. 

- చైత్ర అమావాస్య 'కూర్మ కల్పాదీ (కూర్మ కల్పము ఆరంభం అయిన రోజు) చైత్రమాసం అంతము.



వైశాఖ మాసం

- వైశాఖ శుద్ధ తదియ విశాఖ నక్షత్రము బలరామ జయంతి(త్రేతాయుగాది), అక్షయ తృతీయ 

- వైశాఖ నవమి ద్వాపరయుగాంతము (వృషభ సంక్రమణ పుణ్యకాలము) 

- వైశాఖ చతుర్దశి నరసిమ్హావతార జయంతి. 

- వైశాఖ పూర్ణిమ బుద్ధావతార జయంతి. 

- వైశాఖ బహుళ తదియ పార్ధవ కల్పాది.

- వైసఖ బహుళ దశమి నాడు మనము 'హనుమజ్జయంతి 'జరుపుకొంటాము.


జ్యేష్ఠమాసం

- జ్యేష్ఠ పూర్ణిమ నక్షత్రము భౌచ్యక మన్వంతరం. 

- జ్యేష్ఠ బహుళ ద్వాదసి కూర్మావతార జయంతి.



ఆషాఢ మాసం

- ఆషాడ శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణిమ(మూడు రోజుల పండుగ) 

- ఆషాఢ శుద్ధ దసమి పూర్వాషాఢా నక్షత్రం చాక్షుష మన్వంతరం.


శ్రావణ మాసం

శ్రావణ మాసం 

- శ్రావణ శుద్ధ విదియ మంగళగౌరీ వ్రతము 

- శ్రావణ పూర్ణిమ శ్రవణా నక్షత్రం హయగ్రీవ జయంతి, కృతయుగాంతము జంద్యాల పూర్ణిమ లేఖ 'రాఖీపౌర్ణమి ' 

- శ్రావణబహుళ అష్టమి శ్రీ కృష్ణ జన్మాష్టమి లేక కృష్ణాష్టమి. 

- శ్రావణ అమావాస్య రుద్రసావర్ణిక మన్వంతరం.


భాద్రపద మాసం

- భాద్రపద శుద్ధ తదియ పూర్వాభాద్రా నక్షత్రం తామస (తాపస) మన్వంతరం. 

- భాద్రపద శుద్ధ చతుర్థీ వినాయక చవితి. 

- భాద్రపద శుద్ధ ద్వాదశ వామన జయంతి 

- భాద్రపద, బహుళ అమావాస్య మహాలయ అమావాస్య


ఆశ్వీజ మాసం

- ఆశ్వీజ శుద్ధ పాడ్యమి దేవీ నవరాత్రులు ప్రారంభం 

- ఆశ్వీజ పంచమి ఉపాంగ లలితా వ్రతము 

- ఆశ్వీజ సప్తమి సరస్వతీ పూజ 

- ఆశ్వీజ అష్టమి దుర్గాష్టమి 

- ఆశ్వీజ నవమి స్వ్రోచిష మన్వంతరం, మహార్నవమి 

- ఆశ్వీజ దశమి విజయ దశమి (దసరా) అపరాజితా పూజ శమీ పూజ, దుర్గాదేవి ఉద్వాసనము. 

- ఆశ్వీజ బహుళ చతుర్ధశి నరక చతుర్దశి; లక్ష్మీ ఉద్వాసనము 

- ఆశ్వీజ బహుళ అమావాస్య అశ్వినీ నక్షత్రం దీపావళి


కార్తీక మాసము

కార్తీక మాసము 

- కార్తీక శుద్ధ నవమి కృతయుగాది (అక్షయ నవమి) 

- కార్తీక శుద్ధ ద్వాశమి స్వాయంభువ మన్వంతరము క్షీరాబ్ది ద్వాదశి 

- కార్తీక శుద్ధ పూర్ణిమ కృత్తికా నక్షత్రం కుమార స్వామి దర్శనం; కార్తీక దీపం; దక్షసావర్ణిక మన్వంతరం (తులసీ పూజ - ధాత్రీపూజ) 

- కార్తీక బహుళ తదియ త్రేతాయుగాంతము.



మార్గశిర మాసం

- మార్గశిరశుద్ధ - షష్ఠి మృగశిరా నక్షత్రం స్కంద - షష్ఠి (సుబ్రమణ్య షష్టి) 

- మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతము 

- పుష్య మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి 
- మార్గశిర పూర్ణిమ దత్త జయంతి 

- మార్గశిర బహుళ విదియ పరశురామ జయంతి 

- మార్గశిరం లేక పుష్యమాసంలో సంక్రాంతి



మాఘ మాసం

- మాఘశుద్ధ అష్టమి మఘా నక్షత్రం భీష్మాష్టమి 
- మాఘ మాసం సప్తమి సూర్య సప్తమి (రధసప్తమి) 
- మాఘ బహుళ చతుర్ధశి శివరాత్రి 
- మాఘ బహుళ అమావాస్య, మాఘమాసాంతము ద్వాపరయుగాది



ఫాల్గుణమాసం

- ఫాల్గుణశుద్ధ పూర్ణిమ పూర్వఫాల్గుణీ నక్షత్రం బ్రహ్మిసావర్ణిక మన్వంతరము, హోళీ పండుగ(హోళికా పూర్ణిమ) 

- కుంభ అసంక్రమణము కల్కి జయంతి 



===================================================

నోములు - వ్రతాలు

శ్రావణ మాసం వ్రతాలు

శ్రీ వరలక్ష్మీ వ్రతం





"దాసీభూత సమస్త దేవ వనితాం1 లోకైక దీపాంకురాం1
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః 1 బ్రహ్మేంద్ర గంగాధం 1 
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్" 2

అంటూ శ్రీ వరలక్ష్మీ వ్రతం నాడు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మహిమాన్వితమైన "శ్రీ వరలక్ష్మీ" వ్రత పుణ్యదినాన సూర్యోదయానికి ముందే లేచి (ఐదుగంటలకు), అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి. 


వరలక్ష్మీ వ్రత కధా ప్రారంభము

సూత పౌరాణి కుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి యిట్లనియె : ముని వర్యులారా స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రత రాజంబును పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పెను. దానిని చెప్పెదను వినుడు.
ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్రములు, వైడూర్యములు, మణులు, మొదలగు వాటితో కూడిన సింహాసన మందు పరమేశ్వరుడు కూర్చుండి యుండగా పార్వతీ దేవి పరమేశ్వరునకు నమస్కరించి ‘దేవా ! లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినచో సర్వ సౌభాగ్యములు ,పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతము నాకు చెప్పు మనిన ఆ పరమేశ్వరుడు ఈ విధంగా పలికెను. ‘ఓ మనోహరీ ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలుగ చేసెడి వరలక్ష్మీ వ్రతము అను ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్ర పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము నాడు చేయవలయు ‘ ననిన పార్వతీ దేవి యిట్లనియె . ‘ఓ లోకారాధ్యా ! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయ వలయును? ఆ వ్రతమునకు విధియేమి? ఏ దేవతను పూజింప వలయును? పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింప బడినది? వీని నెల్ల వివరముగా చెప్ప వలయు ‘ నని ప్రార్ధింపగా పరమేశ్వరుండు పార్వతీ దేవిని చూచి యిట్లనియె – ‘ఓ కాత్యాయినీ ! వరలక్ష్మీ వ్రతము వివరముగా చెప్పెదను వినుము. మగధ దేశమున కుండినము అను నొక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబుల తోడను ,బంగారు గోడలు గల ఇండ్ల తోడను గూడి యుండెను.అట్టి పట్టణము నందు చారుమతి యను నొక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితా మణి పెనిమిటిని (భర్తని ) దేవునితో సమానముగా తలచి ప్రతి దినమును ఉదయమున మేల్కొని స్నానము చేసి పుష్పములచే పెనిమిటిని (భర్తను ) పూజ చేసిన పిదప అత్త మామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసికొని ,గయ్యాళి గాక మితముగాను ,ప్రియముగాను భాషించుచు నుండెను.
ఇట్లుండగా ఆ మహా పతివ్రత యందు మహాలక్ష్మీ దేవికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయై ‘ ఓ చారుమతీ ! నేను వరలక్ష్మీ దేవిని ,నీయందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్ష మైతిని .శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్ర వారము నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములిచ్చెద ‘ నని వచించెను. చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షణ నమస్కారములు చేసి -

శ్లో || నమస్తే సర్వ లోకానాం జనన్యై పుణ్య మూర్తయే ,
శరణ్యే త్రిజగ ద్వంద్వే విష్ణు వక్ష స్థలా లయే||


అని అనేక విధముల స్తోత్రము చేసి ‘ఓ జగజ్జననీ ! నీ కటాక్షంబు గలిగె నేని జనులు ధన్యులగును, విధ్వాంసులుగను , సకల సంపన్నులుగను, నయ్యెదరు. నేను నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషము వలన మీ పాడ దర్శనము నాకు కలిగెనని నమస్కరించెను. మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్దానంబు (అదృశ్య మయ్యెను ) నొందెను. చారుమతి తక్షణంబున (వెంటనే ) నిదుర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ‘ ఓహొ ! మనము కలగంటి ‘మని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి (భర్త ) – మామగారు మొదలైన వారితో చెప్పగా , వారు ‘ ఈ స్వప్నము చాలా ఉత్తమ మైనదని ,శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతమును తప్పక చేయవలసిన ‘దని , చెప్పిరి.
పిమ్మట చారుమతీ దేవియును ,స్వప్నంబును విన్న స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునా యని ఎదురు చూచు చుండిరి . ఇట్లుండగా వీరి భాగ్యో దయంబున (అదృష్టము వలన ) శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరును ఈ దినమే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినమని ఉదయంబునే మేల్కాంచి స్నానము చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకుని చారుమతీ దేవి గృహమున ఒక ప్రదేశము నందు గో మయంబుచే (ఆవు పేడచే) అలికి మంటపమును ఏర్పరిచి అందు ఒక ఆసనము వైచి దానిపై బియ్యము పోసి కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీ దేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తి యుక్తులై సాయంకాలమున -

శ్లో || పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియై దేవీ సుప్రీతా భవ సర్వదా ||


అను శ్లోకముచే ధ్యానా వాహనాది షోడశోపచార పూజలను చేసి తొమ్మిది సూత్రములు గల తోరములను దక్షిణ హస్తమున (కుడి చేతి యందు ) కట్టుకుని వరలక్ష్మీ దేవికి నానా విధ భక్ష్య భోజ్యంబులను (అన్ని రకముల పిండి వంటలను ) నైవేద్యము చేసి , ప్రదక్షిణము చేసిరి .
ఇట్లొక ప్రదక్షిణము చేయగా నా స్త్రీలకందరికి కాళ్ళ యందు ఘల్లు ఘల్లు మను నొక శబ్దము కలిగెను .అంత కాళ్ళను జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగి యుండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ‘ఓహొ ! ఇవి వరలక్ష్మీ దేవి కటాక్షము వలన కలిగినవి ‘ అని పరమానందము పొంది మరియొక ప్రదక్షణము చేసిన హస్తములందు ధగ ధగ మెరయు చుండు నవరత్న ఖచితములైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండుట చూచిరి.

ఇంక చెప్పనేల ! మూడవ ప్రదక్షణము చేసిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వ భూషణ అలంకార భూషిత లయి చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహముల నెల్ల స్వర్ణ మయము లయి (బంగారముతో నిండి ) రధ గజ తురగ (రధములు, ఏనుగులు ,గుర్రములతో ) వాహనముల తోడ నిండి యుండెను.

అంత ఆ స్త్రీలను తీసికొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ,ఏనుగులు, రధములు ,బండ్లను వరలక్ష్మీ దేవిని పూజించు చుండు స్థలమునకు వచ్చి నిలిచి యుండెను .పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు ,పాయస దానంబిచ్చి దక్షిణ తాంబూలముల నొసంగి నమస్కారము చేసి బ్రాహ్మణో త్తమునిచే ఆశీర్వాదంబు నొంది వరలక్ష్మీ దేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బందువుల తోడ ఎల్లరును భుజించి , తమ కొరకు వచ్చి కాచుకొని యున్న గుర్రములు ,ఏనుగులు, మొదలగు వాహనముల నెక్కి తమ తమ ఇళ్ళకు పోయిరి. అపుడు వారు ఒకరితో నొకరు ‘ ఆహా ! చారుమతీ దేవి భాగ్యంబే మని చెప్ప వచ్చును. వరలక్ష్మీ దేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్ష మయ్యెను. ఆ చారుమతీ దేవి వలననే గదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు గలిగేనని చారుమతీ దేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయి చేరిరి . నాటి నుండి యు చారుమతి మొదలగు స్త్రీ లందరును ప్రతి సంవత్సరము ఈ వ్రతంబు చేయుచూ పుత్ర పౌత్రాభి వృద్ది కలిగి ధన కనక వస్తు వాహనముల తోడ గూడుకుని సుఖంబుగ నుండిరి.

కావున ఓ పార్వతీ ! యీ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతులవారును చేయవచ్చును .అటు లొనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగ నుందురు .ఈ కథను విను వారలకు ,చదువు వారలకు వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్దించును.
ఆ చారుమతీ దేవి చేసిన వ్రతమును లోకమంతా చేశారు .లోకమంతా చేసిన వ్రతమును మనమూ చేశాము .వ్రత లోపమైనా కధ లోపం కారాదు. భక్తి  తప్పినా ఫలం తప్పరాదు.సర్వే జనాః సుఖినో భవంతు అని నమస్కారము చేయవలెను.

ఇది భవిష్యోత్తర పురాణము నందు పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మీ వ్రత కల్ప కధా సంపూర్ణము.



మంగళ గౌరీ వ్రతం మరియు కథ

భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ‘శ్రావణ మాసం’ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇళ్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కళ కళలాడుతూ ఉంటాయి. ఈ మాసంలోముఖ్యమయినవి  శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రవణ మాసం లో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి
పార్వతి దేవి కి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి “అన్నా!మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప” మని అడగ్గా, శ్రీ కృష్ణుడు వెంటనే “మంగళగౌరీదేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధిచెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్నిఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు – అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.

మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?

శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక, దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.

మంగళగౌరీ వ్రత నియమాలు

తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు.  వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.


  • వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
  • వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
  • వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును)
  • ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.
  • ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.
  • పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.

మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు :

పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి.

మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం :

వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి.
మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి.
పైన చెప్పినటువంటివే ప్రస్తుతం “మంగళగౌరీ” విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి లేక గౌరీ దేవి ఫొటో ని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి.

మంగళగౌరీ వ్రత విధానం :

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)

విష్ణవే నమః     మధుసూదనాయ నమః    త్రివిక్రమాయ నమః    వామనాయ నమః     శ్రీధరాయ నమః
ఋషీకేశాయ నమః     పద్మనాభాయ నమః   దామోదరాయ నమః     సంకర్షణాయ నమః   వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః   అనిరుద్దాయ నమః    పురుషోత్తమాయ నమః   అధోక్షజాయ నమః    నారసింహాయ నమః
అచ్యుతాయ నమః    జనార్ధనాయ నమః    ఉపేంద్రాయ నమః      హరయే నమః     శ్రీ కృష్ణాయ నమః




ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే ||

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)



శుక్లాంబరధరం విష్ణుం  శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే



ఓం లక్ష్మినారాయణభ్యయం నమః     శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః
శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః     శ్రీ శచిపురంధరాభ్యం నమః
శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః    శ్రీ  సీతారామాభ్యం నమః
సర్వేభ్యో దేవేభ్యో నమః   మాతృభ్యో నమః,  పితృభ్యో నమః

ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మంగళ గౌరీ ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే ,  శుభ తిథౌ, శుక్రవాసరే,  శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే. అద్య శ్రీ మంగళగౌరీ దేవతా ముద్దిశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం, సంభవద్భిర్త్రవై: సంభవితానియమేన ధ్యానవాహనాది షాడోశోపచార పూజాం కరిష్యే.
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)

తదంగత్వేన కలశారాధనం కరిష్యే


శ్లో :  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః


(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)


శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య


(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)



మం :  ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్


శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.


(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).

శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.
శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.


అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా
సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!

వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.

తోర పూజ :

తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.


ఓం శ్రీ మంగళ గౌరీ ఆవాహయామి
ఓం శ్రీ  గౌరీ రత్నసింహాసనం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ  అర్జ్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పాద్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ ఆచమనీయం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పంచామృతస్నానం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ శుద్ధోదకస్నానం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ వస్త్రయుగ్నం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ ఆభరణానే సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ మాంగల్యం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ గంధం సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ అక్షాతన్ సమర్పయామి
ఓం శ్రీ మంగళ గౌరీ పుష్పాణి సమర్పయామి
అంటూ వరుసగా చదువుకోవాలి. ఆయా ద్రవ్యాల పేరులు చెప్పేటప్పుడు దేవికి అని సమర్పించాలి.
రత్నసింహాసనాలు, బంగారు మాంగల్యం లాంటివి సమర్పించడం మనకు సాధ్యం కాదు కాబట్టి వీటికి బదులుగా అక్షింతలు లేదా పువ్వులు సమర్పించవచ్చు.
తరువాత శ్రీ మంగళ గౌరీ అష్టోత్తర నామములు ( శ్రీ గౌరీ అస్తోతరములు) చదవండి ..
ఆ తరువాత ఈ విధంగా చేయాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ ధూపం ఆఘ్రాపయామి – అగరువత్తులు వెలిగించి చూపించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ దీపం దర్శయామి. కుందులలో నూనెపోసి వత్తులు వేసి దీపారాధన చేసి చూపించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నైవేద్యం సమర్పయామి నైవేద్యం సమర్పించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ తాంబూలం సమర్పయామి తమలపాకులు వక్కలతో తాంబూలం సమర్పించాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ మంత్రపుష్పం సమర్పయామి పువ్వులు వేయాలి.
ఓం శ్రీ మంగళ గౌరీమీ ప్రదక్షిణ నమస్కాన్ సమర్పయామి ప్రదక్షిణలు చేయాలి.
ఓం శ్రీ మంగళ గౌరీ నమస్కారన్ సమర్పయామి. నమస్కరించాలి.

శ్రీ మంగళ గౌరీ  వ్రతకథ :

పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. కాబట్టిన శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.

మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.

ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది.
ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.
మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.


------------ x ------------


వటసావిత్రీ వ్రతం

Information about hinduism facts soubhagya pradayini vata savithri vratham, vat savitri puja, vat savitri pooja, savitri puja vrat katha

శ్రావణమాసం తరువాత మహిళలు చేసే అనేక వ్రతాలను స్వంతం చేసుకున్న విశిష్టమైన మాసం 'జ్యేష్టమాసం'. చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్టమాసం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్టా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి జ్యేష్టమాసం అనే పేరు వచ్చింది.ఈ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు. వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకు, కార్తీకమాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనవో అలాగే జ్యేష్టమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవనుగానీ, నీటితో నింపిన బిందెనుగానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమరోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశినాడుగానీ దానంగా ఇవ్వాలి. అంతే కాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది.

శ్రావణమాసం తరువాత మహిళలు చేసే అనేక వ్రతాలను స్వంతం చేసుకున్న విశిష్టమైన మాసం 'జ్యేష్టమాసం'. చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్టమాసం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్టా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి జ్యేష్టమాసం అనే పేరు వచ్చింది.ఈ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు. వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకు, కార్తీకమాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనవో అలాగే జ్యేష్టమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవనుగానీ, నీటితో నింపిన బిందెనుగానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమరోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశినాడుగానీ దానంగా ఇవ్వాలి. అంతే కాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది. జ్యేష్టమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని దశమి వరకు అంటే మొదటి పదిరోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశ పాపాలు నాశనం అవుతాయని చెప్పబడుతోంది.ఈ పదిరోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానము చేసి గంగానదిని పూజించాలి. అలా వీలు కానివారు ఇంటి దగ్గరే గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్టమాసంలో ఉన్నాయి. రంభా వ్రతము : దీనినే 'రంభా తృతీయ ' అని కూడా పిలుస్తారు. దీనిని జ్యేష్ట శుద్ధ తదియనాడు ఆచరించాలి. ఈ వ్రతం పెళ్ళికానివారు అంటే కన్నెపిల్లలు ఆచరించడంవల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది. వట సావిత్రీ వ్రతం : జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించాలి వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి. జ్యేష్ట శుద్ధ దశమి : దీనిని దశపాపహర దశమి అని కూడా అంటారు. దశమినాడు చేస్తారు. పాపాలు పోగొట్టే దశమి కనుక దీనికి దశపాపహర దశమి అని పేరు వచ్చింది. జ్యేష్ట శుద్ధ పూర్ణిమ : దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ రోజు భూదేవిని పూజించడం మంచిది. వట సావిత్రీ వ్రతము : హైందవ సంస్కృతి లో, ఆధ్యాత్మిక జీవన విధానములో పురుషులతో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ క్షేమము కోసము, కట్టుకున్న భర్త, బిడ్డలకోసం ... పురుషులకంటే స్త్ర్త్రీలే ఎక్కువగా ధైవారాధన లో నిమగ్నులైవుంటారు. ధర్మార్ధ, కామ, మోక్షాల కొరకు నడిచే బాటలో దారితప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషివర్యులు ఏర్పరచినవే ఈ పండుగలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు మొదలైనవి. విధిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు దైవాన్ని ప్రసన్నము చేసుకొని కుటుంబ క్షేమం కోసము స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో "వట సావిత్రీ వ్రతము" ఒకటి ముఖ్యమైనది. తన పాతివ్రత మహిమతో యమధరమరాజు నుంచి తన భర్త ప్రాణాలను మెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రిచెట్టును భక్తిప్రపత్తులతో పూజించింది సావిత్రీదేవి. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామ, దాన భేద, దండోపాయాలను అవలంబించాలని యమధరమరాజు ప్రయత్నించినా ప్రతివ్రతామతల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు. సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను నేటి స్త్రీలలో చాలామంది నిర్వహిస్తున్నారు. పెళ్ళైన యువతులంతా వటసావిత్రీ వ్రతం నాడు కొత్త దుస్తులు ధరంచి, చుట్టుప్రక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రిచెట్టును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సిందూరంతో వటవృక్షాన్ని అలంకరించి, నూలుదారం పోగుల్ని చెట్టుమొదలు చుట్టూకట్టి, చెట్టుచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వటవృక్షము అంటే మర్రిచెట్టు ... ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భవిస్తారు. మర్రిచెట్టు వ్రేళ్ళు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలములు. పూర్వము ఉద్యోగాలు, వ్యాపారాలు, క్లబ్బులు, పబ్బులు అంటూ తెలియని మహిళలంతా రకరకాలైన ఈ వ్రతాచరణలో నిమగ్నులై ఉండేవారు. వారికి వ్రతాలు, నోములు, ఉపవాసదీక్షలంటే ప్రాణం లేచివచ్చినట్లుండేది. మర్రివృక్షం లా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రీ వ్రతములో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు. పూలు, గాజులు, పసుపు కుంకుమలు వంటి అలంకరణ సామగ్రితో అలంకరిస్తారు.  పసువు కుంకుమలతో పూజిస్తారు, ధూపదీప నైవేధ్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన, విస్తారమైన ఈ వృక్షం కొమ్మకింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలా తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీదేవిని ప్రార్ధిస్తారు. కొత్తగా పెళ్ళి అయిన స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు. తీపి వస్తువులను, తీపి పదార్దాలను నైవేద్యముగా పెడతారు. బందు మిత్రులందరినీ ఈ వ్రతానికి రావలసిందిగా ఆహ్వానిస్తారు. భాహ్మణ పురోహితులచే శాస్త్రోక్తముగా పూజలు జరిపిస్తారు. వ్రతము రోజు ఉదయాన్నే స్నానము చేసి, నూతన వస్త్రాలను ధరించి, శుచిగా ఇంట్లోని పూజా మందిరంలో పూజను నిర్వహిస్తారు. తోటి స్త్రీలతో మర్రిచెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజంతా ఉపవాసము చేస్తారు. కొందరు చంద్రున్ని చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు . . . కొందరు ఒక పూట భోజనం చేస్తారు ... మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఈ వటసావిత్రీ వ్రతము ఎప్పటి నుండి ఆరంభమైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు లేవు.  నేపాల్ లోను, మనదేశంలొని బీహార్లో ఈ వటసావిత్రీ వ్రతాన్ని 500 ఏళ్ళుగా ఆచరిస్తున్నట్లు తెలుస్తొంది. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన "మిథిల"లో ఈ వ్రతాన్ని ఆచరించినట్లు అధారాలు ఉన్నాయట. వ్రత విధానం... వట సావిత్రీ వత్రం చేసేవారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్ల వారుఝామున నిద్రలేచి తల స్నానం చేసి, దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి, మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి, సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి. వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపు తో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మను వైధవ్యాధి సకల దోష పరిహారార్ధం. ‘‘బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ వట సావిత్రీ వ్రతం కరిష్యే’’ అనే శ్లోకాన్ని పఠించాలి.

జ్యేష్టమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని దశమి వరకు అంటే మొదటి పదిరోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశ పాపాలు నాశనం అవుతాయని చెప్పబడుతోంది.ఈ పదిరోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానము చేసి గంగానదిని పూజించాలి. అలా వీలు కానివారు ఇంటి దగ్గరే గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్టమాసంలో ఉన్నాయి.
రంభా వ్రతము : దీనినే 'రంభా తృతీయ ' అని కూడా పిలుస్తారు. దీనిని జ్యేష్ట శుద్ధ తదియనాడు ఆచరించాలి. ఈ వ్రతం పెళ్ళికానివారు అంటే కన్నెపిల్లలు ఆచరించడంవల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది.
వట సావిత్రీ వ్రతం : జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించాలి వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి.
జ్యేష్ట శుద్ధ దశమి : దీనిని దశపాపహర దశమి అని కూడా అంటారు. దశమినాడు చేస్తారు. పాపాలు పోగొట్టే దశమి కనుక దీనికి దశపాపహర దశమి అని పేరు వచ్చింది.

శ్రావణమాసం తరువాత మహిళలు చేసే అనేక వ్రతాలను స్వంతం చేసుకున్న విశిష్టమైన మాసం 'జ్యేష్టమాసం'. చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్టమాసం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్టా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి జ్యేష్టమాసం అనే పేరు వచ్చింది.ఈ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. ఎన్నో శుభాలను ప్రసాదించే పుణ్యప్రదమైన ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వల్ల అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు. వైశాఖ మాసం శ్రీమహావిష్ణువుకు, కార్తీకమాసం పరమశివుడికి ఏ విధంగా ప్రియమైనవో అలాగే జ్యేష్టమాసం త్రిమూర్తులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ నెలలో బ్రహ్మదేవుడిని పూజించడంవల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంతే కాకుండా, ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు దక్కుతాయి. నీటి కడవనుగానీ, నీటితో నింపిన బిందెనుగానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమరోజు లేదా నెలలోని శుక్లపక్షంలో ఏ రోజు అయినా లేదంటే శుక్లపక్ష ఏకాదశినాడుగానీ దానంగా ఇవ్వాలి. అంతే కాకుండా దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడంవల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది. జ్యేష్టమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలుకుని దశమి వరకు అంటే మొదటి పదిరోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశ పాపాలు నాశనం అవుతాయని చెప్పబడుతోంది.ఈ పదిరోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానము చేసి గంగానదిని పూజించాలి. అలా వీలు కానివారు ఇంటి దగ్గరే గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి. మహిళలకు మేలు చేసే సౌభాగ్యాన్ని ప్రసాదించే వ్రతాలు ఎన్నో జ్యేష్టమాసంలో ఉన్నాయి. రంభా వ్రతము : దీనినే 'రంభా తృతీయ ' అని కూడా పిలుస్తారు. దీనిని జ్యేష్ట శుద్ధ తదియనాడు ఆచరించాలి. ఈ వ్రతం పెళ్ళికానివారు అంటే కన్నెపిల్లలు ఆచరించడంవల్ల మంచి భర్త లభిస్తాడని చెప్పబడింది. వట సావిత్రీ వ్రతం : జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు దీనిని ఆచరించాలి వటవృక్షం దేవతా వృక్షం. తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని పూజాద్రవ్యాలు తీసుకొని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి. జ్యేష్ట శుద్ధ దశమి : దీనిని దశపాపహర దశమి అని కూడా అంటారు. దశమినాడు చేస్తారు. పాపాలు పోగొట్టే దశమి కనుక దీనికి దశపాపహర దశమి అని పేరు వచ్చింది. జ్యేష్ట శుద్ధ పూర్ణిమ : దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ రోజు భూదేవిని పూజించడం మంచిది. వట సావిత్రీ వ్రతము : హైందవ సంస్కృతి లో, ఆధ్యాత్మిక జీవన విధానములో పురుషులతో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ క్షేమము కోసము, కట్టుకున్న భర్త, బిడ్డలకోసం ... పురుషులకంటే స్త్ర్త్రీలే ఎక్కువగా ధైవారాధన లో నిమగ్నులైవుంటారు. ధర్మార్ధ, కామ, మోక్షాల కొరకు నడిచే బాటలో దారితప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషివర్యులు ఏర్పరచినవే ఈ పండుగలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు మొదలైనవి. విధిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు దైవాన్ని ప్రసన్నము చేసుకొని కుటుంబ క్షేమం కోసము స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో "వట సావిత్రీ వ్రతము" ఒకటి ముఖ్యమైనది. తన పాతివ్రత మహిమతో యమధరమరాజు నుంచి తన భర్త ప్రాణాలను మెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రిచెట్టును భక్తిప్రపత్తులతో పూజించింది సావిత్రీదేవి. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామ, దాన భేద, దండోపాయాలను అవలంబించాలని యమధరమరాజు ప్రయత్నించినా ప్రతివ్రతామతల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు. సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను నేటి స్త్రీలలో చాలామంది నిర్వహిస్తున్నారు. పెళ్ళైన యువతులంతా వటసావిత్రీ వ్రతం నాడు కొత్త దుస్తులు ధరంచి, చుట్టుప్రక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రిచెట్టును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సిందూరంతో వటవృక్షాన్ని అలంకరించి, నూలుదారం పోగుల్ని చెట్టుమొదలు చుట్టూకట్టి, చెట్టుచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వటవృక్షము అంటే మర్రిచెట్టు ... ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భవిస్తారు. మర్రిచెట్టు వ్రేళ్ళు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలములు. పూర్వము ఉద్యోగాలు, వ్యాపారాలు, క్లబ్బులు, పబ్బులు అంటూ తెలియని మహిళలంతా రకరకాలైన ఈ వ్రతాచరణలో నిమగ్నులై ఉండేవారు. వారికి వ్రతాలు, నోములు, ఉపవాసదీక్షలంటే ప్రాణం లేచివచ్చినట్లుండేది. మర్రివృక్షం లా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రీ వ్రతములో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు. పూలు, గాజులు, పసుపు కుంకుమలు వంటి అలంకరణ సామగ్రితో అలంకరిస్తారు.  పసువు కుంకుమలతో పూజిస్తారు, ధూపదీప నైవేధ్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన, విస్తారమైన ఈ వృక్షం కొమ్మకింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలా తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీదేవిని ప్రార్ధిస్తారు. కొత్తగా పెళ్ళి అయిన స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు. తీపి వస్తువులను, తీపి పదార్దాలను నైవేద్యముగా పెడతారు. బందు మిత్రులందరినీ ఈ వ్రతానికి రావలసిందిగా ఆహ్వానిస్తారు. భాహ్మణ పురోహితులచే శాస్త్రోక్తముగా పూజలు జరిపిస్తారు. వ్రతము రోజు ఉదయాన్నే స్నానము చేసి, నూతన వస్త్రాలను ధరించి, శుచిగా ఇంట్లోని పూజా మందిరంలో పూజను నిర్వహిస్తారు. తోటి స్త్రీలతో మర్రిచెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజంతా ఉపవాసము చేస్తారు. కొందరు చంద్రున్ని చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు . . . కొందరు ఒక పూట భోజనం చేస్తారు ... మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఈ వటసావిత్రీ వ్రతము ఎప్పటి నుండి ఆరంభమైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు లేవు.  నేపాల్ లోను, మనదేశంలొని బీహార్లో ఈ వటసావిత్రీ వ్రతాన్ని 500 ఏళ్ళుగా ఆచరిస్తున్నట్లు తెలుస్తొంది. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన "మిథిల"లో ఈ వ్రతాన్ని ఆచరించినట్లు అధారాలు ఉన్నాయట. వ్రత విధానం... వట సావిత్రీ వత్రం చేసేవారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్ల వారుఝామున నిద్రలేచి తల స్నానం చేసి, దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి, మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి, సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి. వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపు తో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మను వైధవ్యాధి సకల దోష పరిహారార్ధం. ‘‘బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ వట సావిత్రీ వ్రతం కరిష్యే’’ అనే శ్లోకాన్ని పఠించాలి.
 జ్యేష్ట శుద్ధ పూర్ణిమ : దీనిని ఏరువాక పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు రైతులు నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు, భూమిని పూజించి భూమిని దున్నడం ప్రారంభిస్తారు. దీనికే ఏరువాక అని పేరు. ఈ రోజు భూదేవిని పూజించడం మంచిది.
వట సావిత్రీ వ్రతము :

Information about hinduism facts soubhagya pradayini vata savithri vratham, vat savitri puja, vat savitri pooja, savitri puja vrat katha

హైందవ సంస్కృతి లో, ఆధ్యాత్మిక జీవన విధానములో పురుషులతో సరిసమాన ప్రాధాన్యత స్త్రీలకు ఉన్నది. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, కుటుంబ క్షేమము కోసము, కట్టుకున్న భర్త, బిడ్డలకోసం ... పురుషులకంటే స్త్ర్త్రీలే ఎక్కువగా ధైవారాధన లో నిమగ్నులైవుంటారు. ధర్మార్ధ, కామ, మోక్షాల కొరకు నడిచే బాటలో దారితప్పకుండా ఆ జ్ఞానజ్యోతిని ధరించి చీకట్లను తొలగించేందుకు మన ఋషివర్యులు ఏర్పరచినవే ఈ పండుగలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు మొదలైనవి. విధిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు దైవాన్ని ప్రసన్నము చేసుకొని కుటుంబ క్షేమం కోసము స్త్రీలు చేసే ఉపవాస దీక్షలలో "వట సావిత్రీ వ్రతము" ఒకటి ముఖ్యమైనది.

Information about hinduism facts soubhagya pradayini vata savithri vratham, vat savitri puja, vat savitri pooja, savitri puja vrat katha

తన పాతివ్రత మహిమతో యమధరమరాజు నుంచి తన భర్త ప్రాణాలను మెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రిచెట్టును భక్తిప్రపత్తులతో పూజించింది సావిత్రీదేవి. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామ, దాన భేద, దండోపాయాలను అవలంబించాలని యమధరమరాజు ప్రయత్నించినా ప్రతివ్రతామతల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు.

Information about hinduism facts soubhagya pradayini vata savithri vratham, vat savitri puja, vat savitri pooja, savitri puja vrat katha

సావిత్రీదేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను నేటి స్త్రీలలో చాలామంది నిర్వహిస్తున్నారు. పెళ్ళైన యువతులంతా వటసావిత్రీ వ్రతం నాడు కొత్త దుస్తులు ధరంచి, చుట్టుప్రక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు. మర్రిచెట్టును భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. సిందూరంతో వటవృక్షాన్ని అలంకరించి, నూలుదారం పోగుల్ని చెట్టుమొదలు చుట్టూకట్టి, చెట్టుచుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వటవృక్షము అంటే మర్రిచెట్టు ... ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భవిస్తారు. మర్రిచెట్టు వ్రేళ్ళు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలములు. పూర్వము ఉద్యోగాలు, వ్యాపారాలు, క్లబ్బులు, పబ్బులు అంటూ తెలియని మహిళలంతా రకరకాలైన ఈ వ్రతాచరణలో నిమగ్నులై ఉండేవారు. వారికి వ్రతాలు, నోములు, ఉపవాసదీక్షలంటే ప్రాణం లేచివచ్చినట్లుండేది. మర్రివృక్షం లా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రీ వ్రతములో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు. పూలు, గాజులు, పసుపు కుంకుమలు వంటి అలంకరణ సామగ్రితో అలంకరిస్తారు.

Information about hinduism facts soubhagya pradayini vata savithri vratham, vat savitri puja, vat savitri pooja, savitri puja vrat katha

పసువు కుంకుమలతో పూజిస్తారు, ధూపదీప నైవేధ్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన, విస్తారమైన ఈ వృక్షం కొమ్మకింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలా తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీదేవిని ప్రార్ధిస్తారు. కొత్తగా పెళ్ళి అయిన స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు. తీపి వస్తువులను, తీపి పదార్దాలను నైవేద్యముగా పెడతారు. బందు మిత్రులందరినీ ఈ వ్రతానికి రావలసిందిగా ఆహ్వానిస్తారు. భాహ్మణ పురోహితులచే శాస్త్రోక్తముగా పూజలు జరిపిస్తారు. వ్రతము రోజు ఉదయాన్నే స్నానము చేసి, నూతన వస్త్రాలను ధరించి, శుచిగా ఇంట్లోని పూజా మందిరంలో పూజను నిర్వహిస్తారు. తోటి స్త్రీలతో మర్రిచెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ రోజంతా ఉపవాసము చేస్తారు. కొందరు చంద్రున్ని చూసేదాకా మంచినీరు కూడా తీసుకోరు . . . కొందరు ఒక పూట భోజనం చేస్తారు ... మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఈ వటసావిత్రీ వ్రతము ఎప్పటి నుండి ఆరంభమైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు లేవు.  నేపాల్ లోను, మనదేశంలొని బీహార్లో ఈ వటసావిత్రీ వ్రతాన్ని 500 ఏళ్ళుగా ఆచరిస్తున్నట్లు తెలుస్తొంది. ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన "మిథిల"లో ఈ వ్రతాన్ని ఆచరించినట్లు అధారాలు ఉన్నాయట.

Information about hinduism facts soubhagya pradayini vata savithri vratham, vat savitri puja, vat savitri pooja, savitri puja vrat katha

వ్రత విధానం...
వట సావిత్రీ వత్రం చేసేవారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు తెల్ల వారుఝామున నిద్రలేచి తల స్నానం చేసి, దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి, మర్రి చెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి, సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి. వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపు తో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మను వైధవ్యాధి సకల దోష పరిహారార్ధం.
‘‘బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ
వట సావిత్రీ వ్రతం కరిష్యే’’
అనే శ్లోకాన్ని పఠించాలి.

---------------------------------------------
మాఘమాసం విశిష్టత

చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. 'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.

మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.

మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.

మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో 'ప్రయాగ'ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.
మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.


మాఘమాసం మహిమ 
అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.
మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.

తిథులు:- 
1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది.  2. శుద్ధ విదియ 3. శుద్ధ చవితి  4. శుద్ధ పంచమి  5. శుద్ధ షష్టి  6. శుద్ధ సప్తమి  7. అష్టమి  8. నవమి 9. ఏకాదశి  10. ద్వాదశి 11. త్రయోదశి  12. మాఘ పూర్ణిమ  13. కృష్ణపాడ్యమి  14. కృష్ణ సప్తమి 15. కృష్ణ ఏకాదశి 16. కృష్ణద్వాదశి  17. కృష్ణ చతుర్దశి 18. కృష్ణ అమావాస్య  
ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.

మాఘస్నానానికి సంబంధించిన కథ :-  
మాఘమాసంలో ప్రతిరోజూ అంటే ముఫ్పై రోజులపాటు నియమ నిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయటం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతి రోజూ స్నానం, పూజ, మాఘ పురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు ఆయన ఓ రోజున వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాలలో ఓ సరస్సు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు. ఆయన ఆ రాజును చూసి ఈ రోజే మాఘమాసం ప్రారంభమైంది. నీవు మాఘస్నానం చేసినట్టు లేదు త్వరగా చెయ్యి అని చెప్పాడు. మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్టుడిని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ట మహర్షిని మాఘస్నాన ఫలితం వివరించమని వేడుకొన్నాడు.

అప్పుడు వశిష్టుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసం అంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతాకాదు. పూర్వం ఓ గంధర్వుడు ఒక్కసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయింది. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగుమహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొన్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటంలేదని అన్నాడు. గంధర్వుడి వ్యథను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని.. పాపాలు, వాటి వల్ల సంక్రమించే వ్యథలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీసమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారయింది.

మాఘస్నానం ప్రాశ్చత్యాన్ని తెలియజేసే కథ :- 
పరస్త్రీ వ్యామోహం పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణగా ఉన్న ఈ కథ మాఘ పురాణం తొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తోంది. మాఘస్నాన పుణ్యఫలం వివరించటం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్య ఫలాన్ని పొందటంతో పాటు తెలిసీ తెలియక కూడా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరూ ఎప్పుడూ పొందకూడదని హెచ్చరిక చేస్తోంది ఈ కథ. పూర్వం మిత్రవిందుడు అనే ఒక ముని శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్రా నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా 
గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను, శూరులైన దేవతలను వెంట పెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు. రాక్షస సంహారం చేసి ధర్మ రక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికి అవకాశం లేక దేవతలు, దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు.
కాని ఆ ఇంద్రుడి మనసు ముని పత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఓ రోజున తెల్లవారే వేళ మిత్రవిందుడి ఆశ్రమం దగ్గరకొచ్చాడు. ఆ సమయానికి మిత్రవిందుడొచ్చి ఎవరు నీవు? ఏం కావాలి? అని గట్టిగా ప్రశ్నించటంతో తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వేళ ఏం కోరుకొని ఇక్కడకు వచ్చావు? అని ముని మళ్ళీ అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవటం తప్ప మరేమీ చేయలేక పోయాడు. ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు. వచ్చింది సాక్షాత్తూ దేవేంద్రుడే అయినా, దేవతలకు ప్రభువే అయినా ఉపేక్షించ దలచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని, స్వర్గానికి వెళ్ళే దివ్య శక్తులు కూడా నశిస్తాయని ముని తీవ్రంగా శపించాడు. కొద్ది సమయంలోనే ఆ శాపం ఫలవంతమైంది. ఇంద్రుడికి మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గు పడ్డాడు. దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధ పడ్డాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి, ఆకులు తినటం మీదకు మనసు మళ్ళింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉన్న కొండ గుహలోకి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గుహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. ఇంద్రుడు స్వర్గంలో లేడని ఎటో వెళ్ళిపోయాడని దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులు అంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యారు.

కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహా విష్ణువును గురించి తపస్సు చేసి తమ కొచ్చిన బాధనంతా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దాని వల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు. ఒక్కడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరికో కష్టాలను అనుభవించాల్సి రావటం అంటే ఇదేనని దేవతలకు విడమరచి చెప్పాడు. ఇంద్రుడికి ఈ శాపం పోయి దేవతలంతా సుఖం పొందాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘ మాసస్నాన వ్రత మహాత్మ్యాన్ని వారికి వివరించాడు. మాఘమాసంలో ఒక్కరోజున నియమంగా నదీ స్నానం చేసినా ఎంతో పుణ్య ఫలమని, సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశారు. ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఈ శచీపతిని తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణువు అదృశ్యమయ్యాడు. కాకతాళీయంగా అది మాఘమాసం కావటంతో వెనువెంటనే దేవతలంతా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు. ఆ పుణ్య ఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది.

మాఘస్నాన పుణ్య ఫలితాలను వివిరించే కథ :
పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే ఓ వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంత అధర్మపరుడు. అడ్డదారుల్లో ధనం సంపాదించటమే తప్ప ఏనాడూ దానధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించిందంతా లోభ గుణంతో దాచి పెడుతూ ఉండేవాడు. ఓ రోజున సుమంతుడు ఏదో పనిమీద గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజున బాగా మబ్బులు పట్టి వర్షం కురవటం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయసు మళ్ళిన ఓ సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటి ముందుకు వచ్చాడు. ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కటే ఉంది. ఆ సాధువు ఆమెను బతిమాలుకొని ఆ రాత్రికి ఆ ఇంటిలోనే ఉంటానన్నాడు. కుముద పెద్దలను, వృద్ధులను గౌరవించటం, అతిథి మర్యాదలు చెయ్యటం తెలిసిన ఉత్తమురాలు. కనుక ఆ సాధువును లోపలికి ఆహ్వానించి పరిచర్యలు చేసింది. సాధువు వాన, చలి బాధలను పోగొట్టుకొని హాయిగా నిద్రించాడు. కుముద కూడా వేరొక గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజాము సమయానికి సాధువు మేల్కొని హరినామ సంకీర్తనం చెయ్యటం ప్రారంభించాడు. ఈ సంకీర్తనలు విన్న కుముద కూడా నిద్ర లేచింది. అనంతరం ఆ వృద్ధుడు బయటకు వెళ్ళే ప్రయత్నం చెయ్యసాగాడు. కుముద సాధువును అంత పొద్దున్నే ఎక్కడకు వెళుతున్నావు? అని అడిగింది.
తాను మాఘమాస స్నాన వ్రతం చేస్తున్నానని సమీపంలోని నదికి స్నానం కోసం వెళుతున్నానని అన్నాడు సాధువు. మాఘస్నాన వ్రతం మీద ఆ ఇల్లాలికి ఆసక్తి కలిగి వ్రతానికి సంబంధించిన విషయాలన్నింటినీ అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాన్ని తానూ పొందాలనుకుంది. సాధువుతో తాను కూడా మాఘస్నాన వ్రతం ప్రారంభించింది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఉదయాన్నే అతడిని కూడా నిద్ర లేపి మాఘ స్నానానికి రమ్మనమని కోరింది కుముద. దైవ ద్వేషి ఆయిన సుమంతుడు భార్య మాటలను హేళన చేసి అవమానించి తాను స్నానానికి వెళ్ళకుండా ఉండటమే కాక భార్యను కూడా వెళ్లవద్దని అదుపు చేశాడు. కానీ కుముద సద్భక్తి నిండిన మనస్సుతో మెల్లగా నదీ స్నానానికి వెళ్ళింది. అందుకు కోపగించిన భర్త ఒక కర్రను తీసుకుని ఆమె వెంటపడ్డాడు. అప్పటికే ఆమె నదిలో హరినామ స్మరణతో మునుగుతూ స్నానం చేయసాగింది.
సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఆ కర్రను పట్టుకొని గుంజుతూ తప్పించుకోనే ప్రయత్నం చేస్తున్నపుడు ఆ భర్త కూడా నది నీళ్ళల్లో మునుగుతూ లేస్తూ ఉండటంతో అతడు కూడా స్నానం చేసినట్టయింది. చివరకు ఎలాగోలాగా భార్యను గట్టిగా పట్టుకొని ఇంటికి లాక్కు వచ్చాడు సుమంతుడు. ఆ తర్వాత చాలాకాలం గడిచింది. అంత్యకాలంలో దైవికంగా ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి మరణించారు. మాఘస్నాన పుణ్యఫలం, దానధర్మాల ఫలితంగా కుముదను తీసుకు వెళ్ళటానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు. దైవదూషణ, అధర్మ వర్తనులతో కాలం గడిపిన నేరానికి సుమంతుడిని యమదూతలొచ్చి యమలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోర నరక శిక్షను విధించాడు. అయితే తన భార్యను మాఘస్నానం నుంచి విరమింప చేసే ప్రయత్నం చేస్తూ ఆమెతో కొట్లాడుతూ పెనుగులాడుతున్న వేళ అనుకోకుండానైనా సుమంతుడు నదిలో మునిగి లేచాడు. అలా చేసిన మాఘస్నాన పుణ్య ఫలితమే అతడికి దక్కింది. ఆ ఒక్క పుణ్యం ఫలితంగా అతడిని నరక శిక్ష నుంచి తప్పించి వైకుంఠానికే పంపమని చిత్రగుప్తుడు ఆదేశించాడు.

మాఘమాస గౌరీవ్రత మహాత్మ్యం :-
మాఘమాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేయటం, ఆ తర్వాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, 
మాఘపురాణ పఠన శ్రవణాలనేవి ముప్ఫై రోజులపాటు జరిపే వ్రతంలో భాగాలు. ఈ వ్రత విశేషమేమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, తప్పులు చేసినందువల్ల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియచెప్పటమేకాక ఆ పాపం నుంచి ఎలా విముక్తి పొందాలో వివరించటం కనిపిస్తుంది. తెలిసో తెలియకో పాపాలు చేయటం మానవ నైజం. పాపం చేశావు కనుక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందేనంటే ఇక మనిషి జీవితాంతం కుంగి కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైన జీవితం అలా వృథా అవుతుంది. తప్పు చేశావు, పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషైనా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది.

ఇలా మాఘస్నాన వ్రతం అనే సులభ సాధనంతో మానవాళికి సన్మార్గాన్ని చూపించటమే మన సనాతన సంప్రదాయంలోని రుషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘపురాణంలోని రెండు, మూడు అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. రెండో అధ్యాయంలో చెయ్యకూడని పాపాలేమిటో, వాటివల్ల జన్మజన్మలకు కలిగే నష్టమేమిటో వివరంగా ఉంది. రెండో అధ్యాయం చివర, మూడో అధ్యాయంలో మాఘస్నాన ఫలితంతో ఆ పాపాలను పోగొట్టుకోవచ్చన్న సూచన కనిపిస్తుంది. ఈ సూచనను సమర్ధిస్తూ సుదేవుడు అనే ఒక వేదపండితుడి కుమార్తె కథను సాక్షాత్తూ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్లుగా ఉంది.
పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఓ గ్రామం ఉండేది. అక్కడున్న వేదవేదాంగ పండితుడైన సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్య నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు గొప్ప సౌందర్యవతి అయిన ఓ కుమార్తె ఉండేది. ఆమెను తగిన వరుడుకిచ్చి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడుండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది. సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదు అని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తర్వాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాలమరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంత కాలం గడిచింది. ఓ రోజున దృఢ వ్రతుడు అనే ఓ యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు. సుదేవుడు ఆ యోగికి అతిథి పూజా సత్కారాలు చేసి తన కుమార్తెకొచ్చిన కష్టాన్ని వివరించాడు.
తాను ఏనాడూ పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకొచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించటం, కూడని పనులు చేయటంలాంటి పాపాలు చేసిందని, అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీతీరంలో గౌరీ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతాన్ని చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో ఉత్తముడైన సుదేవుడి ఇంట జన్మించటం జరిగిందన్నాడు. అయితే పూర్వ జన్మ పాపం ఇంకా వదలకుండా వెన్నాడుతూ ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడునే శిష్యుడి సాంగత్యం పొందిందన్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట ఆ పాపం అంతా పోయి తన కుమార్తె పుణ్యం పొందటానికి మార్గం ఏదైనా చెప్పమని యోగిని కోరాడు సుదేవుడు. అప్పుడు ఆ యోగి మాఘశుద్ధ తదియనాడు గౌరీవ్రతం, సుహాసినీ పూజ చేస్తే ఇక మీదట పాపం అంతా నశిస్తుందని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీవ్రతం (కాత్యాయనీ వ్రతం) చేయించాడు. మాఘశుద్ధ తదియనాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతరకాలంలో ఆమె పుణ్యఫలితంగా సుఖాలను పొందింది.

శ్రావణ మంగళవార వ్రతం 
(Shravana Mangalavara Vratam)

శ్రావణ మంగళవార వ్రతం పూనిన మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువులనీ, రెండవ సంవత్సరం పదిమందినీ, మూడో యేడు పదిహేను మందినీ, నాలుగో ఏట ఇరవై మందినీ, అయిదవ సంవత్సరం ఇరవై అయిదు మంది ముత్తయిదువులనూ పిలిచి, పసుపు రాసి, బొట్టు పెట్టి, కాటుకిచ్చి, శనగలూ కొబ్బరీ వగైరా వాయనాలివ్వాలి.
అయిదేళ్ళ తర్వాత ఉద్యాపన చేయాలి.
ఉద్యాపన
అయిదేళ్ళయ్యాక ముప్ఫయి మూడు జతల అరిసెలను ఒక కొత్త కుండలో పెట్టి, ఆ పైన కొత్త రవికెల గుడ్డతో వాసెన గట్టి మట్టేలూ మంగళసూత్రాలూ వగైరా మంగళాభరణాలతో పెళ్ళి కూతురుకు వాయనమియ్యాలి. పద్దతి లోపించినా ఫలితం లోపించదు.
కథ
అనగనగా బ్రాహ్మణ దంపతులు. పెళ్ళయి చాలా కాలమయినా సంతతి కలగని కారణంగా, ఈశ్వరుడి గురించి తపస్సు చేశారు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై " అల్పాయుష్కుడైన కొడుకు కావాలా? అయిదవతనం లేనికూతురు కావాలా?” అని అడిగాడు.
అల్పాయుష్కుడైనప్పటికీ కొడుకునే యిమ్మ" ని ప్రార్థించారు వారు. “తథాస్తు" అని వరమిచ్చి శివుడు తరలిపోయాడు. శివుడిచ్చిన వర ప్రభావం వలన అచిరకాలంలోనే, ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి, సకాలానికి చక్కటి మగబిడ్డను ప్రసవించింది.
తక్షణమే యమభటులు వచ్చి, ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు. బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలపించింది. లేక లేక కలిగిన బిడ్డ వీడు. పురుడు తీరేదాక ఆగి, తదుపరి తీసుకువెళ్ళ" మని కోరింది. ఆ తల్లి కోరికను మన్నించి యమదూతలు వెళ్ళిపోయి, పురుడు తీరగానే వచ్చారు.
అప్పుడామె "తండ్రులారా! మాటలు రానిదే. మానవుడు కాలేడు గనుక, మా శిశువు నోరార ''అమ్మా, నాన్నా'' అని పిలిచే వరకూ ఆగి, ఆ ముచ్చటయినాక గైకొమ్మంది. “సరే" అని వెళ్ళిపోయారు కింకరులు.
ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది. ఒక రోజున తల్లి - బిడ్డకు తలంటుతూ త్వరలో మరల రాబోయే యమభటులను తలచుకుని దుఃఖించసాగింది.
తల్లి విచారిస్తున్నందని తెలుసుకున్న బిడ్డ "ఎందుకమ్మా ఏడుస్తున్నావు?” అని అడగగా, ఆమె జరిగినదంతయు వివరించింది.
విషయం తెలుసుకున్న ఆ బాలుడు " అమ్మా! ఎలాగూ అల్పాయుష్కుడి నయ్యాను. పది కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్లి రావాలని వుంది. కనుక, నన్ను వెంటనే పంపించు. ఈ లోపల యమదూతలు వస్తే, నేను వచ్చేదాకా ఆగమను ” అని చెప్పి బయలుదేరాడు. బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లితండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు. వారిద్దరూ కాశీ వెడుతూ వెడుతూ మార్గమధ్యంలో ఒక పూలతోటలో బస చేశారు.
అదే వేళకు ఆ పూలతోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన, ఆ ఊరి రాజు కూతురూ, ఆమె చెలుల మధ్య తగవు వచ్చి...ఒకరినొకరు తిట్టుకోసాగారు. అందుకు కోపగించిన రాజు కూతురు "నాకీ రాత్రి పెండ్లి కాబోతూ వుంది. అదీగాక, మా అమ్మ శ్రావణ మంగళవారము నోము నోచుకుని నాకు వాయనమిస్తుంది. ఆ వ్రత మహిమ వల్ల నీ శాపనార్థాలు, తిట్లు ఫలించవు ” అంటూ చేతిలో పూలను నేలమీద పారబోయగా,ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కుని పోయాయి. అది చూసిన బ్రహ్మణ బాలుడు "ఆ పిల్ల తన భార్యయైతే బాగుండును" అనుకున్నాడు. ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెండ్లి కుమార్తెను చేయించాడు. రాణీ ఆమెకు శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది.అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పెండ్లి కుమారునికి సుస్తీగా వున్నందున, పెళ్లి మరొక ముహుర్తానికి వాయిదా వేయవలసినదిగా మగ పెండ్లివారి నుండి కబురు అందుతుంది.
వివాహాన్ని వాయిదా వేయడం రాజుకి ఇష్టము లేదు. తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం పరువు తక్కువగా భావించి, పొరుగూరికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో మేనమామ మేనల్లుళ్ళలను ఒప్పించి, ఆ మేనల్లుడికి తన కూతురునిచ్చి పెళ్లి జరిపించాడు. ఆ రాత్రి కలలో మంగళ గౌరీ కనిపించి "అమ్మాయీ! ఈ రాత్రే నీ భర్తకు పాము గండము వుంది. జాగ్రత్తగా వుండి, ఆ పామును... నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలోనికి పట్టి గట్టిగా మూత నుంచమని ఆజ్ఞాపించింది.
ఆ పిల్ల ఉలిక్కిపడి లేచి చూసేసరికి, అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ, పెండ్లి కొడుకు మంచం దగ్గరకు పాకుతూ కనిపించింది. వెంటనే రాజకుమార్తె అటకమీద వున్న నోము కుండను తీయబోయింది. అది అందని కారణంగా, వరుని తొడపై నిలిచి, ఆ కుండను దింపి, పాము నందులోనికి పట్టి, ఒక రవికెల గుడ్డతో దాని మీద గట్టి వాసెనకట్టు కట్టి, మరలా అటకపై భద్రపరిచి, తాను నిశ్చింతగా నిద్రపోయింది. తెలతెలవారే వేళ, మేనమామ వచ్చి, పెండ్లి కుమారుడిని నిద్రలేపి, తనతో కాశీ తీసుకు వెళ్ళిపోయాడు.
కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు. రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా, రాకుమార్తె మాత్రం ఆ వివాహానికి ఇష్టపడలేదు. మొదటి ముహూర్తమున తాళి గట్టినవాడే తన భర్త అని ప్రకటించింది. ఎవరెంత చెప్పినా మారు మనువుకు అంగీకరించలేదు. “ అసలా కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు" అని పెద్దలు అడిగారు.
అందుకా చిన్నది "తండ్రీ ! నువ్వొక సంవత్సరం అన్నదానం చెయ్యి. నేనా సంవత్సరమంతా తాంబూలం దానం చేస్తాను. అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను" అంది. అందుకు రాజు అంగీకరించాడు. తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు. ఆ భోక్తలందరికీ రాకుమార్తె తాంబూలదాన మీయసాగింది.
ఇంకొన్నాళ్ళలో సంవత్సరం పూర్తవుతుందనగా, కాశీకి వెళ్ళిన మేనమామా మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెడుతూ మధ్య మార్గంలోని పూర్వపు పూలతోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చశారు. అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తు పట్టి అతని చేతిని పట్టుకొని "ఇతడే నా పెనిమిటి'' అని యెలుగెత్తి పలికింది. పెద్దలందుకు ఋజువు కోరగా, పెళ్ళినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలికి తొడిగింది. అది సరిగ్గా సరిపోయింది. పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరీ చెప్పిన పాము విషయం చెప్పి, అటు తరువాత పామును దాచి వుంచిన కుండను తీసి చూపించగా, అందులో పాము బంగారు పామై కనిపించింది. అన్ని ఋజువులూ సరిపోవడం వలన, పెద్దలామె వాదనను అంగీకరించారు. రాజు యథావిధిగా వివాహం చేశాడు. అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుక నొక భరిణిలోభద్రపరిచి ఇచ్చింది.
అక్కడి బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి కార్చి, ఆ కారణంగా అంధులై సేవలు చేసేవారు గానీ క్షేమమడిగేవారు లేక నిత్య దుఃఖితులై వున్నారు. అటువంటి సందర్భంలో పెండ్లి కూతురుతో సహా పెండ్లి కుమారుడి లాంఛనాలతో వూరిలోనికి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి, గ్రామస్థులందరూ విప్రదంపతుల వద్దకు వెళ్లి "మీ కష్టాలు తీరాయి. మీ కుమారుడు, రాజవైభవాలతో మీకు కోడలిని తీసుకు వస్తున్నాడు ” అని చెప్పారు.
ఆ మాటతో వారికి ఆనందం కలిగినా నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు.
అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభినందనం చేశాడు. జరిగింది తెలుసుకుని వాళ్ళు ఆనందించారు. కాని, కొడుకునీ కోడలినీ చూసుకునే అదృష్టం లేనందుకు దిగులుపడగా, రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తమామల కళ్ళకు పూసింది.అదే తడువుగా వాళ్లకు చూపు వచ్చి, కొడుకునూ, కోడల్నీ చూసుకుని సంబరపడిపోయారు. ఈ మహత్మ్యానికి ఆశ్చర్యపడిన యిగురుపొరుగు వారంతా "ఇంత మహిమ కలగడానికి ఏం నోము నోచేవమ్మా" అని అడగగా "శ్రావణ మంగళవారపు నోము"అని చెప్పిందామె.
అది మొదలా వూరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకుని తరగని సిరులతో, చెరగని సౌభాగ్యలతో చెప్పలేనంత కాలం సుఖసౌభాగ్యలు అనుభవిస్తూ జీవించారు. ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరికి సంప్రదాయం. ఆ నోము మంగళ గౌరీ వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణమాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు.

మూలం: శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం 

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)