స్తోత్రమ్


శ్రీ శివ అష్టోత్తర శతనామావళి
1ఓం శివాయ నమః31ఓం భీమాయ నమః61ఓం గిరిశాయ నమః
2ఓం మహేశ్వరాయ నమః32ఓం పరశుహస్తాయ నమః62ఓం గిరీశాయ నమః
3ఓం శంభవే నమః33ఓం మ్రుగపానిణే నమః63ఓం అనఘాయ నమః
4ఓం పినాకినే నమః34ఓం జటాధరాయ నమః64ఓం భుజంగ భూషనాయ నమః
5ఓం శశిశేఖరాయ నమః35ఓం కైలాసవాసినే నమః65ఓం భర్గాయ నమః
6ఓం వామదేవాయ నమః36ఓం కవచినే నమః66ఓం గిరిద్వనినే నమః
7ఓం విరూపాక్షాయ నమః37ఓం కఠోరాయ నమః    67ఓం గిరిప్రియాయ నమః
8ఓం కపర్దినే నమః38ఓం త్రిపురాంతకాయ నమః68ఓం కృత్తి వాసాయ నమః
9ఓం నీలలోహితాయ నమః39ఓం వృషాంకాయ నమః69ఓం పురారాతయే నమః
10ఓం శంకరాయ నమః     40ఓం వృషభారూడాయ నమః      70ఓం భగవతే నమః
11ఓం శూలపానిణే  నమః41ఓం భస్మొద్ధూళిత విగ్రహాయ నమః71ఓం ప్రమధాదిపాయ నమః 
12ఓం ఖట్వాంగినే నమః42ఓం సామప్రియాయ నమః72ఓం మృత్యుంజయాయ నమః
13ఓం విష్ణువల్లభాయ నమః43ఓం సర్వమయాయ నమః73ఓం సుక్ష్మతనవే నమః
14ఓం శిపివిష్టాయ నమః44ఓం త్రయీమూర్తయే నమః74ఓం జగద్వ్యాపినే నమః
15ఓం అంభికానాథాయ నమః45ఓం అనీశ్వరాయ నమః75ఓం జగద్గురవే నమః
16ఓం శ్రీకంఠాయ నమః46ఓం సర్వజ్ఞాయ నమః76ఓం వ్యోమవేశాయ నమః
17ఓం భాక్తవత్సలాయ నమః47ఓం పరమాత్మాయ నమః77ఓం మహాసేన జనకాయ నమః
18ఓం భవాయ నమః48ఓం సోమ సుర్యాగ్నిలోచనాయ నమః78ఓం చారువిక్రమాయ నమః
19ఓం శర్వాయ నమః49ఓం హావిషే నమః79ఓం రుద్రాయ నమః
20ఓం త్రిలోకేశాయ నమః     50ఓం యజ్ఞామయాయ నమః    80ఓం భూతపతయే నమః
21ఓం శితికంఠాయ నమః51ఓం సోమాయ నమః81ఓం స్థాణవే నమః  
22ఓం శివాప్రియాయ నమః52ఓం పంచవక్త్రాయ నమః82ఓం అహిర్భుద్నాయ నమః
23ఓం ఉగ్రాయ నమః53ఓం సదాశివాయ నమః83ఓం దిగంబరాయ నమః
24ఓం కపాలినే నమః54ఓం విశ్వేశ్వరాయ నమః84ఓం అష్టమూర్తయే నమః
25ఓం కామారినే నమః55ఓం వీరభద్రాయ నమః85ఓం అనేకాత్మాయ నమః
26ఓం అంధకాసుర సూదనాయ నమః56ఓం గణనాథాయ నమః86ఓం సాత్త్వికాయ నమః
27ఓం గంగాధరాయ నమః57ఓం ప్రజాపతయే నమః87ఓం శుద్ధవిగ్రహాయ నమః
28ఓం లలాటాక్షాయ నమః58ఓం హిరణ్య రేతాయ నమః88ఓం శాశ్వతాయ నమః
29ఓం కాలకాలాయ నమః      59ఓం దుర్దర్షాయ నమః        89ఓం ఖండపరశవే నమః
30ఓం కృపానిధయే నమః60ఓం పాశ విమోచకాయ నమః   90ఓం అజాయ నమః
91ఓం మృడాయ నమః101ఓం భగనేత్రభిదే నమః
92ఓం పశుపతయే నమః102ఓం అవ్యక్తాయ నమః
93ఓం దేవాయ నమః103ఓం సహస్రాక్షాయ నమః
94ఓం మహాదేవాయ నమః104ఓం సహస్రపాదవే నమః
95ఓం అవ్యయాయ నమః105ఓం అపవర్గ ప్రదాయ నమః
96ఓం హరియే నమః106ఓం అనంతాయ నమః
97ఓం పూషదంతభేత్రే  నమః107ఓం తారకాయ నమః
98ఓం అవ్య గ్రాయ నమః108ఓం పరమేశ్వరాయ నమః  
99ఓం దక్షాధ్వర హరాయ నమః
100ఓం హరాయ నమః అథ శివాష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.
  
------*-------

శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర సుప్రభాత స్తోత్రమ్

శ్రీ మద్దక్ష పురీవాస ! భీమేశ్వర ! మహాప్రభో !
భవచ్చరణ సాన్నిద్ద్యే - సుప్రభాతం మయార్పితమ్.

ఉత్తిష్టోత్తిష్ఠ భీమేశ ! ఉత్తిష్ఠ వృషవాహన !
ఉత్తిష్ఠ శివ ! గౌరీశ ! త్రైలోక్యం మజ్గళంకురు.

జయ దక్ష పురాధశ ! జయ శ్రీ వృషభ ధ్వజ !
జయ మాణిక్య దేవీశ ! త్రైలోక్యం మజ్గళంకురు.

మాత స్సమస్త జగతాం సుఖదానదక్షే !
భీమేశవామనిలయే ! శ్రిత పారిజాతే !
శర్వాణి ! దక్ష పుర నిత్య నివాసదీక్షే !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

తవ సుప్రభాత మర విన్దలోచనే !
భవతు ప్రసన్నముఖచన్ద్ర శోభితే !
విధవాసు దేవదయితే! తవ సుప్రభాతమ్ .
 

శర్వాణి ! సస్మితల సన్ముఖ చన్ద్ర బిమ్బే!
బిమ్బాధ రోష్టి ! పరి పూర్ణ కృపావలమ్బే !
  
కాదమ్బికావన నివాసిని ! లోకమాన్యే !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.
  

శమ్పాలతాజ్గ ! శుభ కారిణి ! శాతకుమ్భ -
శమ్భత్ప్రభాజయ విరాజదురో జయుగ్మే !
శర్మ ప్రదాయిని శశాజ్కకళావతంసే !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.
 
 

దేవేన్ద్ర మౌళిమణి రజ్జత పాద పద్మ -
సర్వాప్సరాభి నయశోభిత చత్వరాన్త -
భక్తార్తి పర్వత సువజ్రశివేళ ! శమ్భో !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

శ్రీ భీమనాధ ! కరుణాకర ! దీనబంధో !
శ్రీశాది దేవగణపాలిత ! లోకబంధో !
శ్రీ పార్వతీ వదన పజ్కజ పద్మబన్దో !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

బ్రహ్మాది దేవనుత ! దేవగణాధ నాధ !
దేవేన్ద్ర వన్ద్య మృదు పజ్కజపాద యుగ్మ !
దేవర్ష నారద మునీంద్ర సుగీత కీర్తే !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

హీరాది దివ్యమణి యుక్త కిరీటహార -
కేయూర కుండలల సత్కవ చాభిరామ !
భక్తార్చిత ! ప్రణవవాచ్య నిజస్వరూప !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

శ్రీదక్ష వాటపుర సంస్థిత దివ్యలిజ్గ !
త్రైలిజ్గ లింగ! త్రిగుణాత్మక ! శక్తి యుక్త !
వన్దారు బృందనుత ! వేదవనీ విహార !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.
      

పంచాక్షరాది మనుయంత్రిత గాంగతోయైః |
పంచామృతైః ప్రముదితేంద్రయు తైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త ! హరియుక్త ! శివాశనాధ !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.
    

కైలాసనాధ ! కలిదోషమహాంధ్య సూర్య !
కంజాసనాది సురవన్దిత పాద పద్మ !
వేశ్యాప్రనృత్య పరితుష్ట మనోమ్బుజాత !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.
 

అగ్రే వసంతితవ పాదతలే సుభక్త్యా !
దిక్పాలకా వినయనమ్ర శిరః ప్రయుక్తాః |
శమ్భో ! మహేశ ! ఇతి దేవ ! వదంతియేత్వాం !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

లింగాకృతే ! నిఖిలజీవ గణాత్మలిజ్గ !
గంగాధర ! ప్రమధ సేవిత దివ్య పాద !
భోగీన్ద్రహార ! పరిరక్షిత సాధులోక !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

శమ్భో ! శశాజ్కధర ! శజ్కర ! శూలపాణే !
స్వామిన్ ! త్రిశూలధర ! మోక్షద ! భోగదాయిన్ !
సర్వావతార ధర ! పాలిత జీవలోక !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

శ్రీ భీమనాధ ! హర ! దివ్యతలాధ వాస !
శ్రీ పార్వతీ హృదయ పజ్కజభ్రజ్గ రూప !
శ్రీ నీలకంట ! పర ! శర్వ ! ఉమేశ ! శమ్భో !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

కందర్పదర్ప హర ! కంజభవాది వన్ద్య !
గౌరీకుచామ్బురుహకుట్మలలోలదృష్టే !
భద్ర ప్రదాత్రభవ భక్తి సులభ్య ! దేవ !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

భస్మ ప్రలిప్త శుభదాయక దివ్యమూర్తే !
భస్మాసురాది ఖలమర్దనకమ్ర రూప !
గౌరీ వినిర్మిత సుభక్ష్య సుభోజ్యభోజిన్ !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

నన్దీ శవాహ ! నరకార్ణ వకర్ణ ధార !
నారాయణాది సుర సంస్తు తదివ్యనామ !
శ్రీదక్ష వాటపుర నిర్మిత దివ్య సౌధ !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

శ్రీ మజ్కణాది మునిభావిత దివ్య దేహ !
త్రయ్యంత వేద్య ! త్రిపురాన్తక ! శ్రీ త్రినేత్ర !
జ్ఞానార్ధ దాన పరినిష్టి తదివ్య చిత్త !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

వ్యాసాది పండిత వరస్తుత ! దివ్యచిత్త !
భక్తాళి దివ్య పద ప్రద ! భాసు రాజ్గ !
సంసార సార ! శివ ! శాన్త ! సురూప ! శమ్భో !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

ఉన్మీల్య నేత్ర యుగళం ద్విజబృంద మాశు |
పంచాక్షరీ జపసునిష్టి తదివ్య చిత్తమ్ |
ఆయాతితే పద సరోజ తలన్తు నిత్యం |
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

తన్త్రీ నిబద్ద స్వరయుక్త వర్ణా |
గాయన్తి తేదివ్యచరిత్ర మారాత్ |
భక్త్యా నితాన్తం భవ నార దాద్యా |
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

శ్రితాళి సత్కామ్య సుపారి  జాత |
శ్రీ విష్ణు చక్ర ప్రద భవ్య తీర్ధ |
శ్రీ సూర్య హస్తార్యితది దివ్య పాద !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

శ్రీబిల్వ పత్రార్చిత పాద పద్మ !
శ్రీ విష్ణు హృత్తామర సాభి రమ్య !
నాగేన్ద్ర భూషాప్రియ ! నాక వన్ద్య !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

శ్రీసప్త గోదావర హేమ పద్మై: |
సమ్పూజితుం త్వాంతు నితాన్త భక్త్యా |
ఆయాన్తి భక్తాశ్చ సుదూర దేశాత్ |
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

శ్రీ సప్త గోదావర పూతనీరైః |
మూర్దాభి షిక్తేశ్వర ! మజ్గళాజ్గ !
శమ్భో మహాదేవ ! జగన్నివాస !
భీమేశ దేవదయితే ! తవ సుప్రభాతమ్.

ఇత్ధంవృష ధ్వజ విభోరిహ సుప్రభాతమ్.
యే సజ్జనాః ప్రతిదినం పటితుం ప్రవృత్తాః |
తేషాం ప్రభాత సమయే శివ భక్తి మాద్యాం |
ప్రజ్ఞాం సుముక్తి పదవీం శ్రియ మాశు దద్యాత్.
 
   
ఇతి ద్రాక్షారామ భీమేశ్వర సుప్రభాతమ్

 ------*-------

హనుమాన్ చాలీసా (తెలుగు)


రచన: తులసీ దాస్
దోహా
శ్రీ గురు చరన సరోజ రజ నిజమను ముకురు సుధారి |
బరనఊ రఘుబర బిమల జసు జో దాయకు ఫల చారి ||
బుద్ధిహీన నను జానికే సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేస బికార్ ||
ధ్యానమ్
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ |
రామాయణ మహామాలా రత్నం వన్దే అనిలాత్మజమ్ ||
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాఞ్జలిమ్ |
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాన్తకమ్ ||
చౌపాఈ
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || ౧ ||
రామదూత అతులిత బలధామా |
అఞ్జని పుత్ర పవనసుత నామా || ౨ ||
మహావీర విక్రమ బజరఙ్గీ |
కుమతి నివార సుమతి కే సఙ్గీ ||౩ ||
కఞ్చన వరణ విరాజ సువేశా |
కానన కుణ్డల కుఞ్చిత కేశా || ౪ ||
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై |
కాన్థే మూఞ్జ జనేఊ సాజై || ౫||
శఙ్కర సువన కేసరీ నన్దన |
తేజ ప్రతాప మహాజగ వన్దన || ౬ ||
విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || ౭ ||
ప్రభు చరిత్ర సునివే కో రసియా |
రామలఖన సీతా మన బసియా || ౮||
సూక్ష్మ రూపధరి సియహిం దిఖావా |
వికట రూపధరి లఙ్క జరావా || ౯ ||
భీమ రూపధరి అసుర సంహారే |
రామచన్ద్ర కే కాజ సంవారే || ౧౦ ||
లాయ సఞ్జీవన లఖన జియాయే |
శ్రీ రఘువీర హరషి ఉర లాయే || ౧౧ ||
రఘుపతి కీన్హీ బహుత బడాఈ |
తుమ మమ ప్రియ భరతహి సమ భాఈ || ౧౨ ||
సహస వదన తుమ్హరో జాస గావై |
అస కహి శ్రీపతి కణ్ఠ లగావై || ౧౩ ||
సనకాదిక బ్రహ్మాది మునీశా |
నారద శారద సహిత అహీశా || ౧౪ ||
జమ(యమ) కుబేర దిగపాల జహాం తే |
కవి కోవిద కహి సకే కహాం తే || ౧౫ ||
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజపద దీన్హా || ౧౬ ||
తుమ్హరో మన్త్ర విభీషణ మానా |
లఙ్కేశ్వర భఏ సబ జగ జానా || ౧౭ ||
యుగ సహస్ర యోజన పర భానూ |
లీల్యో తాహి మధుర ఫల జానూ || ౧౮ ||
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ |
జలధి లాఙ్ఘి గయే అచరజ నాహీ || ౧౯ ||
దుర్గమ కాజ జగత కే జేతే |
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే || ౨౦ ||
రామ దుఆరే తుమ రఖవారే |
హోత న ఆఙ్ఞా బిను పైసారే || ౨౧ ||
సబ సుఖ లహై తుమ్హారీ శరణా |
తుమ రక్షక కాహూ కో డర నా || ౨౨ ||
ఆపన తేజ తుమ్హారో ఆపై |
తీనోం లోక హాఙ్క తే కామ్పై || ౨౩ ||
భూత పిశాచ నికట నహి ఆవై |
మహవీర జబ నామ సునావై || ౨౪ ||
నాసై రోగ హరై సబ పీరా |
జపత నిరన్తర హనుమత వీరా || ౨౫ ||
సఙ్కట తేం(సేం) హనుమాన ఛుడావై |
మన క్రమ వచన ధ్యాన జో లావై || ౨౬ ||
సబ పర రామ తపస్వీ రాజా |
తినకే కాజ సకల తుమ సాజా || ౨౭ ||
ఔర మనోరధ జో కోఇ లావై |
సోఈ అమిత జీవన ఫల పావై || ౨౮ ||
చారో యుగ పరితాప తుమ్హారా |
హై పరసిద్ధ జగత ఉజియారా || ౨౯ ||
సాధు సన్త కే తుమ రఖవారే |
అసుర నికన్దన రామ దులారే || ౩౦ ||
అష్ఠసిద్ధి నౌ(నవ) నిధి కే దాతా |
అస వర దీన్హ జానకీ మాతా || ౩౧ ||
రామ రసాయన తుమ్హారే పాసా |
సాద రహో రఘుపతి కే దాసా || ౩౨ ||
తుమ్హరే భజన రామకో పావై |
జనమ జనమ కే దుఖ బిసరావై || ౩౩ ||
అన్త కాల రఘువర పురజాఈ |
జహాం జన్మ హరిభక్త కహాఈ || ౩౪ ||
ఔర దేవతా చిత్త న ధరఈ |
హనుమత సేఇ సర్వ సుఖ కరఈ || ౩౫ ||
సఙ్కట కటై మిటై సబ పీరా |
జో సుమిరై హనుమత బల వీరా || ౩౬ ||
జై జై జై హనుమాన గోసాఈ |
కృపా కరో గురుదేవ కీ నాఈ || ౩౭ ||
జో శత వార పాఠ కర కోఈ |
ఛూటహి బన్ది మహా సుఖ హోఈ || ౩౮ ||
జో యహ పడై హనుమాన చాలీసా |
హోయ సిద్ధి సాఖీ గౌరీశా || ౩౯ ||
తులసీదాస సదా హరి చేరా |
కీజై నాథ హృదయ మహ డేరా || ౪౦ ||
దోహా
పవన తనయ సఙ్కట హరణ – మఙ్గళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||
సియావర రామచన్ద్రకీ జయ | పవనసుత హనుమానకీ జయ | బోలో భాఈ సబ సన్తనకీ జయ |
----------


------------------------------

భీమేశ శతకము

1. కం. శ్రీకర! యోసద్భక్త వ
శీకర! రిపుభీకర! సురశేఖర! హర! మో
క్షాకర! రజనీకరధర!
శ్రీకఱకంఠా! తలంతు శ్రీభీమేశా.

2. కం. అందములగు కందములను
మందార సుమంబులేరి, మాలగ నత్యా
నందంబునఁ గూర్చితినో
యిందుధరా! దీనిఁదాల్పుమిక భీమేశా

3. కం. దొసఁగులనేకములిందు
బొసఁగిన భవదీయనామమున్బొగడుటచే
వెసనూహింపరుగద బుధు
లిసుమంతయుఁ గూడదీనినిల భీమేశా.

4. కం. భక్తులఁగాచెదవంచు
న్శక్తివిహీనులనుఁగాచు శక్తుఁడవని స
ద్భక్తిని నినుఁగొలిచెదనిఁక
ముక్తిని దయసేయుమో ప్రభూ భీమేశా

5. ఈశా! గౌరీశా! వి
శ్వేశా! రిపునాశ! యో మహేశా! పోషా!
యాశా పాశవినాశా!
నాశరహిత! దయనుగనుమునను భీమేశా

6. కం. బసవన్న నెక్కుదంచుం
దిసమొలవాఁడంచునిన్నుఁ దిట్టేడివాడీ
వసుధనుఁ గసవును మెసవెడు
పసరముతో సాటియౌను ప్రభు! భీమేశా

7. కం. ధరణిరధము దానికి దిన
కర, శశి చక్రములు, మిన్కుగమితురంగంబు,
ల్థరణీధరమే ధనువును,
హరి నీశర, మజుఁడుసూతుఁడట భీమేశా

8. కం. హర! శశిధర! హరిశర! భూ
ధరధర! గౌరీవర! వరదా! పరమేశా!
సురపర! స్మరహర! సుగుణా
కర! గంగాధర! గురు శుభకర! భీమేశా

9. శివ! మాధవ! సరసీరుహ
భవ! యననొక్కటియకాదె? భవభయనాశా
భువనావళిపోషా! త్రిపు
రవినాశా! యీశా! యొహరా! భీమేశా

10.నందీశుఁడు, భృంగీశుఁడు
బృందారకు, లజుఁడు, హరియు, ఋషివరులిలనీ
సుందరపద పద్మంబుల
నందముగాఁగొల్వఁ జెలఁగుహర! భీమేశా

11. కం. ఒక్కడఁవటఁ, రక్కసులనుఁ
జెక్కుదువఁట; భక్తతతికిఁ జిక్కుదువఁట, నీ
దిక్కునుఁ గోరినవారికి
దక్కుదువఁట, నిక్కమేకదా భీమేశా

12. మృత్యుంజయ! జితదానవ!
నిత్యుండవు నీవయనుచు నిర్మలమతితో
సత్యస్వరూప! తలతును
నిత్యంబును నిన్నుమదిని, నే భీమేశా

13. కం. ఒకభక్తుఁడు నీకైతన
సుకుమార కుమారుఁజంపెఁజోద్యమకదె! వే
ఱొకఁడాలిని నీకొసఁగడె
యకలంకా! యోయుమాంక! హర! భీమేశా

14. విలు, కాంచనమేకద? భీ
షలఁగూర్పఁగ విశ్వకర్మ సన్నిధిలేఁడే?
యిలఁబాపనగలఁదాల్చఁగఁ
గలరూపునువేగఁదెల్పఁ గదె? భీమేశా

15. కం. ఎందునుఁగలవని జనులను
చుందురుగద, నీదుజాడఁ జూచితిగానీ
సుందరరూపముఁ గనలే
దిందుధర! కతముఁదెల్పవే? భీమేశా

16. కం. శంకర! యందునొ? భక్త వ
శంకర! యనిపిలితునో? హర! శశిధర! గౌరీ
శంకర! మృత్యుభయంకర!
యోంకారాకార! యందునో? భీమేశా

17. కం. పిలచినఁ పలుకవడేమకొ?
యలుకానాపై ననర్హుఁడన? ధూర్తుడనా?
కలుషాత్ముడఁనా? జగతి చ
పలమతినా? దెల్పి కావవా భీమేశా

18. కం. జయమున్బొందిన నాప్రతి
, యటంచుందలతులేని పట్టుననీదౌ
దయలేదందును జడుఁడను
దయతో మన్నించికావు ధర భీమేశా

19. కం. పాపాత్ముఁడనేయైనం
దాపసమందార! నన్నుదయఁజూడకిటుల్
కోపింపనగున? తగునా?
నీపుత్రుఁడఁగాననటయ్య నే భీమేశా

20. కం. పలికెడిది నీదునామము
పలికించెడివాఁడవీవు పలుకఁగ పాపం
బులు దొలఁగునంత హర! నీ
పలుకులు సుధలొలుకునఁటయ భవ! భీమేశా

21. సీ. ఒకటినేఁ దలఁచిన నీ
వొక్కటిఁజేయంగఁబోదు వుచితమ? నీకో
ముక్కంటీ! తెలుపుమయా
నిక్కముగను వేడికొందునిను భీమేశా

22. కం. ఒకనిముసంబానందం
బొకనిముసము దుఃఖమౌచునుండునిలను గా
డొకొ? నీమాయనుఁ గాననౌ
నొకొ? భువినాబోఁటి వానికో భీమేశా

23. కం. మామావారాశి ననుం
ద్రోయఁగలెస్సంచు నీకు దోచెనే? యికనే
జేయునదెయ్యదు? యెందుం
బోయెద, వెరవెద్ది? యోప్రభూ! భీమేశా

24. కం. నీ పరమభక్తులకు భువి
నాపదలేరావు, గాని యటువచ్చినచో
నో పశుపతి! భక్తినిఁగన
నీపన్నాగమనియెంతు నే భీమేశా

25. కం. వినలేదకొ? నామొఱలను
వినియును రక్షింపకుండ విడిచితివొక్కో
మనసెట్టులొప్పె? యిటుఁ జే
యను నీకోదీనబంధు! యజ! భీమేశా

26. కం. విశ్వేశ! విశ్వకర్మా!
విశ్వంబర! విశ్వనాథ! విశ్వవ్యాపీ!
విశ్వవినాశా! యీశా!
విశ్వకరా! కరుణఁబ్రోవవే భీమేశా

27. కం. నీభక్తుల సహవాసము,
నీభజనము, నీదుభక్తి, నీసేవయు, నా
కీభువి దయసేయఁగదే
యోభవనాశా! యమేశ! యోభీమేశా

28. కం. కాలుని భతూలకుఁజిక్కెడు
కాలంబున నిన్నుఁదల్పఁగలనో లేనో
కాలాంతక! కాన నిపుడె
నీలీలలఁబొగడుచుందు నే భీమేశా

29. కం. సుగుణుల కాపదలిడుదువు
సుగుణరహితులన్నఁ గరుణ జూతువు ధర్మం
బగునకొ? నీకిది శివ! యో
జగతీవర! భక్తపర! యజా! భీమేశా

30. కం. ఎట్టులుకాలముఁ గడుపు ద
దెట్టులు సంసారవార్ధినీదుదు నినుఁ జూ
పట్టెడు మంత్రంబెట్టిది?
గట్టిగనినుఁగొల్తుఁదెల్పఁగదె భీమేశా

31. కం. ఎవ్వాఁడు లోకపాలకుఁ
డెవ్వాఁడీశ్వరుఁడు, నభవుఁడెవ్వఁడు శర్వుం
డెవ్వఁడు, భవ్యచరితుం
డెవ్వండౌ? నీవయేకదే భీమేశా

32. కం. జడమతి, నిడుములఁ దడబడి
కడుపడి, సెడి, నీయడుగులకడఁ, బడ నీవీ
యెడఁజేవిడ, నోమృడ! యే
యెడకేగుదు మగుడఁ? దెల్పుమిక భీమేశా

33. కం. కనికరపుంగనీవేయగు
దని, కరములమోడ్చివేఁడ నారసిమొఱలన్
విని, కరముగాచెదని విబు
ధనికరము, నినుంబొగడుఁగదా భీమేశా

34. కం. పరమ మునీశ్వరులెవ్వని
చరణంబులఁగొలుచుచుంద్రు సతతముభక్తిన్
పరమేశ్వరుఁడెవ్వండగు
కరుణాళూనీవయౌదుగా భీమేశా

35. కం. కలియుగమున నూనామముఁ
దలచినమోక్షంబునిచ్చి తనుపుదు, హాలా
హలధర! గౌరీవర! యో
కలుషవిదూరా! హర! శుభకర! భీమేశా

36. కం. ఎవఁడీభవసాగరమును
శివనామంబనెడి నావచే దరిఁజేరన్
భువినాశించునొ వాఁడే
భవనాశా! పొందుముక్తి వరభీమేశా

37. కం. శివ! శివ! యని మదిఁదలచిన
భవభందములెల్లవేగఁ బాయునుగాదే
భవనాశా! యో యీశా!
ధవళేశా! దాసపోష! ధర భీమేశా

38. కం. ధన, పుత్ర, మిత్ర, బంధులఁ
గని, నిత్యమిదేయటంచుఁ గాసంత నినుం
గనలేక, పాపకూపము
ననుఁబడి, ప్రజమ్రగ్గఁ గూడునా భీమేశా

39. అంతకునడచితివని, యా
ద్యంతములిల లేనివాఁడవని, నిచ్చలు నే
నెంతయు వేడంగ, దయ ర
వంతైననుఁ జూపవేమయా? భీమేశా

40. కం. చదువులువేయిలఁ జదివిన
మదనహరా! యెందుఁబనికిమాలినవేయౌఁ
గదనినుఁ దెలిసికొననియా
చదువులువృధకావె? యోయచల! భీమేశా

41. కం. శిరమునఁ జందురుఁ, డురమునఁ
గరమొప్పఁగ విషధరములుఁ, గటిగజచర్మాం
బరమునుఁ, గేలఁద్రిశూలము
ధరించిన నిన్నుఁదలతు ధరభీమేశా

42. కం. పంచాక్షరి జపియించిన
సంచితముగఁ గాలుని భయమదియెటుకల్గున్
పంచశరగర్వ హర! హర!
పంచానన! వరద! భక్త పర! భీమేశా

43. కం. ధనమును నాకిమ్మని యో
ధనదసఖా! వేడలేదు, ధరమోక్షాపే
క్షను, నీ సుచరణపద్మము
లనవరతముఁ గొల్చుచుంటినయ భీమేశా

44. కం. ఈ భువి భస్మముఁ దాల్చిన
నోభవహర! దోషరాజి యుండునే? పరమే
శా! భువనపోష! యీశా!
యోభక్త జనాళితోష! యోభీమేశా

45. కం. చీమలుబ్రాఁకెడు రొదవిను
దీమహియన నామొఱ, నది యేలనువినవో
కామితజన కల్పద్రుమ!
మామకదురితాలవిత్రమా! భీమేశా

46. కం. ధనదుఁడు సఖుఁడై యుండం
గను, యాచనఁజేయనేలఁ గరుణాశరధీ!
మనమున సందేహమ? మి
త్రునియడుగంగా, సుజనహితుఁడ! భీమేశా

47. కం. ధవళము గృహమును, భూషలు,
ధవళము నీ జడనుగల సుధాకరుఁడరయన్
ధవళము నీదుశరీరము,
ధవళేశా! యెట్లుకాంతు? ధర భీమేశా

48. కం. హరుఁడొక్కఁడె దైవంబని
ధరవాక్భేరిం, డండాడ డాండ నినాదముల్
పురిఁగొన, హర! హర! శంభో!
వరదా! యని చాటెదనుశివా! భీమేశా

49. కం. నీవేయంతయు, నంతయు
నీవే, భువివేరులేరు, నిక్కముశివ! యో
భావాతీతా! పొగఁడగ
నావశమా, భువనపోషణా భీమేశా

50. దుర్గాధినాథ! యరిష
డ్వర్గమునంజిక్కికొంటి, వాసిగనన్నే
మార్గమునఁగాచెదో యో
భర్గ! స్వర్గీయవినుత! వరభీమేశా

51. కం. రమ్మా! క్రమ్మర నేల ను
రమ్మా నఁగ మ్రొక్కుచుంటి, రావేలను, నే
రమ్మా! యిదినాగ్రహ చా
రమ్మా! గజచర్మధర! హరా! భీమేశా

పద్యం 52 నుండి 59 వరకు దొరకలేదు

60. కం. నీవేమాతవు, జనకుఁడ
వీవే నాబంధుజనుఁడ వీవే, సర్వం
బీవే, లోకేశుండవు
గావే, యో దీనరక్షకా భీమేశా

61. కం. హరి హరిలననొక్కటియే
ధరమిమ్ముల భేదబుద్ధిఁదలచినవాఁడో
కరుణామయ కాలునికడ
కరుగుట తధ్యంబయౌనుగదె? భీమేశా

63. కం. కరివరదుండాహరికద,
కరివరమును దీర్పవల్వఁగాఁగట్టితివీ
వరయఁగ గజచర్మంబిక
హరిహరులనవేఱదెట్టులగు భీమేశా

64. కం. బలిగీముఁ గాచెనాహరి
యిల, నోహర! నీవుబాణునిలుఁగాచితిగా
తలపగ భేదంబేలను
కలుగును, మీయిరువురకునుఁగదె భీమేశా

65. కం. నరసఖుఁడా శ్రీహరి, దయ
నరునకుఁ బాశుపతమిచ్చినావీవును, మీ
కరయఁగ భేదమదేఁటికి
ధరఁగల్గును శంకర! వరదా! భీమేశా

66. కం. పన్నగములు నీభూషలు
పన్నగ పల్పుండు హరియుఁ బాపవినాశా!
యెన్నఁగహరియన్నను హరుఁ
డన్నను భేదంబు లేదయా భీమేశా

67. కం. మురహరుఁడాతఁడు, నీవో
పురహరుఁడవు సర్వలోకపూజ్య! భువిపై
హరియన, హరుఁడన నొకటియ
శరణాగతరక్షణ! గిరీశా! భీమేశా

68. కం. శ్రీగళుఁడవీవు హరియును
శ్రీగలవాఁడెన్నమీకు శివ! భేదంబే
లాగుంగల్గును? భవహర!
వాగీశాద్యమరవినుత! వర భీమేశా

69. కం. లీలావినోదుఁడవు, హరి
లీలామానుషుఁడు గాదె? లేశంబును మీ
కాలోచింపఁగ భేదం
బేలాగల్గున్మహేశ హే భీమేశా

70. కం. హరిమనికిపట్టు తిరుపతి
గిరి, నీదగుయుంకి రజితగిరి, యిర్వురికిన్
గిరులేనెలవులు, భేదం
బరయము మీకెందు జూడనయ భీమేశా

71. కం. దుష్టులశిక్షించును హరి
దుష్టులయుక్కడతువీవు దురమున, మీరో
శిష్టచరిత! యొక్కటికడే
కష్టహర! అభిష్టదాయకా! భీమేశా

72. కం. సారంగపుటెంగిలగుట
సారసమును బూజఁజేయఁజాల నిలనునీ
కారయ మధృదయమనెడు
సారసమిదె పూజఁగొనుమచల భీమేశా

73. కం. గట్టులరాయని ముద్దుల
పట్టినిఁజేపట్టినట్టి మరమేశు, ధరం
బుట్టుటఁ గిట్టుట లెరుఁగని
జెట్టిని, నినుఁదలతునెపుడు శ్రీభీమేశా

74. కం. లింగా! యాగవిభంగా!
యంగజహర! సాంబశివ! శుభాంగ! మహేశా!
మంగళకర! గంగాధర!
సంగర భీమా! రమేశశర! భీమేశా

75. కం. దినకర శశి శిఖనేత్ర!
ఘనకలుషలతాలవిత్ర! కామితగాత్ర!
మునిజననుత చారిత్ర!
యనుపమ ధీనాళిమిత్ర! హర! భీమేశా

76. కం. ఒకరాజు కళంకుఁడు, వే
రొకఁడిల వేకన్నులాఁడు, యోజింపఁగ నిం
కొకరాజోగ్రహ బాధితుఁ
డిఁకరాజననీవకాదె యిల భీమేశా

77. కం. శివుఁడవు సర్వభువన ధవుఁ
డవు కమలభవాది సేవ్యుఁడవు నిటలాక్షుం
డవు శంభుండవు, జితమరుఁ
డవు హరుఁడవు, భక్తపోషుఁడవు భీమేశా

78. కం. ఆమార్కండేయుడు నీ
కేమిచ్చెను జమునిఁగూల్చి యిలఁగాచితి, నే
నేమపచారముసేసితిఁ
గామితమందార! దెల్పఁగదె? భీమేశా

79. కం. చిత్తాశ్వమిచ్చవచ్చిన
చిత్తంబుననేగుచుండెఁ జిత్తజహర! నీ
విత్తఱి నధిరోహింపవె
యుత్తమమార్గంబుఁజూప నో భీమేశా

80. కం. రారా! రాకేందుధరా!
రారా! రుద్రాక్షహార! రజితాకారా!
రారా! రణభీమా! హర!
రారా! దుర్గామనోహరా! భీమేశా

81. కం. నతిఁగొనుమా నుతనామా!
యతిపరకామా! సుధామ! యగణితనామా!
గతినీవే రిపుభీమ!
పతితోద్ధార! విరామ వర భీమేశా

82. కం. నీనామ సుధాపానము
మానను, దిరుగాడుమనుపమానం బగునా
మానస సరోవరంబున
మానకనో రాజహంసమా భీమేశా

83. కం. తండ్రివి లోకములకు నా
యుండృఆల్దిండీనికనుచు నోపరమేశా
యండ్రు జనంబులుగద, నా
తంద్రీ! హర! యొత్రిపుండ్రధర! భీమేశా!

84. కం. రుద్రా! గయాసముద్రా!
సద్రూపా! దక్షశిఖ! సజ్జనపక్షా!
రుద్రాక్షధర! హర! యో
భద్రచరిత! కావఁగదవె వర భీమేశా

85. కం. ఒంటరివో? లేరొకొ యే
రింట, న్నీయున్కిఁజెప్పు మేయదియో, ము
క్కంటీ! యేమనిపిలచిన
వెంతనె పల్కిదెవు దెల్పవే భీమేశా

86. కం. మానసకాంతారంబేఁ
దానకముఁగఁగ్రోద్గమాది దారుణమృగముల్
కానఁనగును, నాదికిరా
తానీవిల వానిదునుము దయ భీమేశా

87. కం. కాలాంతకా! మహేశా!
ఫాలాక్షా! భక్తవాస! పాపవినాశా!
లీలామానుష వేషా!
కైలాసవాస! పోషకా! భీమేశా

88. కం. ఘనతాపస వినుతా! విష
మును ద్రావితివంత సురలు మునుబ్రార్ధింపం
గను, తావకమహిమలు బొగ
డనుతరమా! దీనబంధుడా! భీమేశా

89. రావా! ననుఁగాపాడఁగ
దేవా! నామొఱలవినఁగదే, యీశుండౌ
గావా! యింతటికఠినమ
బ్రోవా! శ్రీకంఠయోప్రభూ! భీమేశా

90. నీదయవే భవసాగర
మీదఁగఁదగుఁ గొండఁబిండియేఁ జేయనగుం
గాదొకొ నృత్యవినీదా!
యోదీనజనాప్తమిత్ర! యో భీమేశా

91. కం. పుట్టుటఁ గిట్టుటఁ గనియును
జుట్టల నెచ్చెలులఁ జూచుచునుఁ బొంగుదు నీ
కట్టెయ శాశ్వతమని,
నెట్టుల రక్షించెదవో యిల భీమేశా

92. కం. నీలీలలఁగనుఁగొనగా
నీలగళా! నరుఁడఁగాను, నేతిన్నఁడఁగా
నేలీలనేలెదో నను
ఫాలాక్షా! హర! సుభక్తపర! భీమేశా

93. కం. శ్రీకరములు సుగునాళికి
భీకరములు దైత్యతతికి, వీనులవిన మో
క్షాకరములు, భక్తులకు వ
శీకరములు, నీచరితలు శ్రీభీమేశా

94. కం. శూలివి, గిరిజాసతికను
కూలివి, శశిమౌళి, వసురకుంజతతి ని
ర్మూలివి, కడుబలశాలివి
పాలితలోకాళి, వరయ ప్రభు! భీమేశా

95. కం. మారవిదారివి! దైత్య ప్ర
హారివి! శిపురారి! వురగహారి! వలసురా
ధారివి! కాకోలవిషా
హారివి! జడధారి! విలను హర! భీమేశా

96. కం. తోలునుదాల్చితివీవా
కూళజలంధరునినేలఁ గూల్చితి త్రుటిలో
కాలునిగెల్చితివాసిరి
యాళుని దయఁగాచితివయా భీమేశా

97. కం. మాటికిఁ బిల్వంగఁ బలుక
వేటికి, నాపైనికిన్కఁవదేటికి, చోటి
ప్పాటికి నీయనిచో, సుర
కోటినిఁగాచినది కల్ల, గురు! భీమేశా

98. కం. రక్షింప, కటాక్షింపను
శిక్షింపను నీవయౌట శ్రితమందారా!
దక్ష విపక్షా! యాప
ద్రక్షా! యీ కృతినిఁ గొనుహర! భీమేశా

99. కం. శ్రీవిశ్వకర్మకులజుఁడ
దేవరకొండాన్వయుఁడను ధీనుతచరితా!
శ్రీవిశ్వభద్ర గోత్రుఁడఁ
బ్రోవుమనంతాఖ్యునన్ను భువి భీమేశా

100. మంగళమిదెఁ గొనుమోశివ
మంగళకర! యో! శుభాంగ! మాధవహిత! నా
మంగళమిదెఁ గైకొనుమో
యంగజహర! భృంగివినుత! హర! భీమేశా

భీమేశ శతకము
సంపూర్ణం
----

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)