మట్టికుండ

మట్టికుండ

యోగా

యోగా
యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.

ప్రస్తావన

హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భాగమైన యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించిన ఆద్యుడు పతంజలి. క్రీస్తు పూర్వము 100వ శకము 500వ శకము మధ్య కాలములో ఈ రచన జరిగినట్లు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఉపనిషత్తులు, భగవద్గీతలో యోగా ప్రస్తావన ఉంది. పతంజలి వీటిని పతంజలి యోగసూత్రాలు గా క్రోడీకరించాడు. సూత్రము అంటే దారము. దారములో మణులను చేర్చినట్లు యోగశాస్త్రాన్ని పతంజలి ఒకచోట చేర్చాడు. హఠయోగ ప్రదీపిక, శివ సంహిత దానిలో ప్రధాన భాగాలు. అంతర్భాగాలైన కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తియోగము మొదలైనవి హిందూతత్వంలో భాగాలు. వ్యాసముని విరచితమైన భగద్గీతలో యోగాసనాలు పదినెనిమిది భాగాలుగా విభజించి చెప్పబడినవి.

యోగము అంటే ఏమిటి?

"యుజ్" అనగా "కలయిక" అనే సంస్కృత ధాతువు నుండి "యోగ" లేదా "యోగము" అనే పదం ఉత్పన్నమైంది. "యుజ్యతేఏతదితి యోగః", "యుజ్యతే అనేన ఇతి యోగః" వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము - యోగమనగా ఇంద్రియములను వశపరచుకొని, చిత్తమును ఈశ్వరుబియందు లయం చేయుట. మానవిని మానసిక శక్తులన్నింటిని ఏకమొనర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్మయమొనరించుట. ఇలా ఏకాగ్రత సాధించడం వలన జీవావధులను భగ్నం చేసి, పరమార్ధ తత్వమునకు త్రోవచేసుకొని పోవచ్చును. అలా ఆత్మ తనలో నిగూఢంగా ఉన్న నిజ శక్తిని సాధిస్తుంది. ఇలా ఆంతరంగికమైన శిక్షణకు భిన్న మార్గాలున్నాయి. వాటిని వివిధయోగ విధానాలుగా సూత్రకారులు విభజించారు.
"యోగము" అంటే సాధన అనీ, అదృష్టమనీ కూడా అర్థాలున్నాయి. భగవద్గీతలో అధ్యాయాలకు యోగములని పేర్లు.
భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో "యోగ" లేదా "యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం". స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుంది. ఇలా సాధించే ప్రక్రియను "పతంజలి అష్టాంగ యోగం' అంటారు. దీనినే రాజయోగం అంటారు (పతంజలి మాత్రం "రాజయోగం" అనే పదాన్ని వాడలేదు

యోగాలో విధానాలు


పతంజలి యోగసూత్రాలు

పతంజలి యోగసూత్రాలు నాలుగు అధ్యాయాల సంకలనము. సమాధి పద, సాధన పద, విభూతి పద, కైవల్య పద అనే నాలుగు అధ్యాయాలు. ఇవి మానసిక శుద్ధికి కావలసిన యోగాలు. శరీర ధారుఢ్యానికి, ఆరోగ్య సంరక్షణకి, రోగనిరోధకానికి సహాయపడే శారీరక ఆసనాలను అష్టాంగయోగము వివరిస్తుంది.
1.    సమాధిపద ఏకాగ్రతతో చిత్తవృత్తులను నిరోధించి ప్రమానంద స్తితిని సాధించడము దీనిలో వివరించబడింది.
2.    సాధనపద కర్మయోగాన్ని, రాజయోగాన్నిసాధన చెయ్యడము ఎలాగో దీనిలో వివరించబడినది. ఎనిమిది అవయవాలను స్వాధీనపరచుకోవడం ఎలా అని రాజయోగములో వివరించబడింది.
3.    విభూతియోగము జాగరూకత, యోగ సాధనలో నిపుణత సాధించడమెలాగో దీనిలో వివరించబడినది.
4.    కైవల్యపద మోక్షసాధన ఎలా పొందాలో దీనిలో వివరించబడింది. ఇది యోగశాస్త్రము యొక్క ఆఖరి గమ్యము.

 

అష్టాంగపదయోగము

·         1.యమ
·         అహింస హింసను విడనాడటము.
·         సత్యము సత్యము మాత్రమే పలకటము.
·         అస్తేయ దొంగ బుద్ది లేకుండా ఉండటము
·         బ్రహ్మచర్యము స్త్రీ సాంగత్యానికి దూరముగా ఉండటము.
·         అపరిగ్రహ వేటినీ స్వీకరించకుండా ఉండటము.
·         2.నియమ
·         శౌచ శుభ్రము.
·         సంతోష ఆనందంగా ఉండటము.
·         తపస్య తపస్సు.
·         స్వధ్యాయన అంతర్దృష్ఠి.
·         ఈశ్వరప్రాణిదాన ఈశ్వర శరణాగతి.
·         3.ఆసన
·         4.ప్రాణాయామ
·         5.ప్రత్యాహార
·         6.ధారణ
·         7.ధ్యానము
·         8.సమాధి
ఇవి అష్టాంగపదయోగములోని భాగములు.

సంప్రదాయంలో యోగా

ఈశ్వరుడు తపస్సు చేస్తున్నప్పుడు పద్మాసనంలో ధ్యానయోగంలో ఉన్నట్లు పురాణాలలో వర్ణించబడి ఉంది. లక్ష్మీదేవి ఎప్పుడు పద్మాసినియే, మహా విష్ణువు నిద్రను యోగనిద్రగా వర్ణించబడినది. తాపసులు తమ తపసును పద్మాసనంలో అనేకంగా చేసినట్లు పురాణ వర్ణన. ఇంకా లెక్కకు మిక్కిలి ఉదాహరణలు హిందూ సంప్రదాయంలో చోటు చేసుకున్నాయి. బుద్ధ సంప్రదాయంలో, జైన సంప్రదాయంలోను, సన్యాస శిక్షణలోను యోగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సింధు నాగరికత కుడ్య చిత్రాల ఆధారంగా యోగా వారి నాగరికతలో భాగంగా విశ్వసిస్తున్నారు.

భగవద్గీతలో యోగములు

భగవద్గీతలో ఒక్కొక్క అధ్యాయానికి "యోగము" అనే పేరు ఉంది. ఇక్కడ "యోగం" అనే పదం సామాన్య యోగాభ్యాసం కంటే విస్తృతమైన అర్ధంలో, జ్ఞాన బోధ లేదా మార్గం అనే సూచకంగా వాడబడింది.
·         అర్జునవిషాద యోగము: యుద్ధ భూమిలో తాతలు తండ్రులు, సోదరులు, గురువులు,మేనమామలు మొదలైన ఆప్తులను శత్రు సేనలో చూసిన అర్జునుడు వారిని వధించవలసి వచ్చినందుకు అర్జుని కమ్ముకున్న విషాదము గురించిన వర్ణన.
·         సాంఖ్య యోగము:- ఆత్మ స్వరూపము గుణగణాల వర్ణన.
·         కర్మ యోగము:- కర్మ చేయడంలో నేర్పు,దానిని యోగములా మార్చుకోవడం ఎలా అని చెప్పే యోగము.
·         జ్ఞాన యోగము:- నర,నారాయణూల జన్మలు,భగవంతుని జన్మలోని శ్రేష్టమైన గుణాలు.జ్ఞాన సముపార్జన మార్గాల వివరణ.
·         కర్మసన్యాస యోగము:- కర్మలను ఫలితాలను సన్యసించి భగవంతునికి అర్పించి ఆయన ఇచ్చిన దానిని ప్రసాదంగా స్వీకరించడం ఎలా అన్న వివరణ.
·         ఆత్మసంయమ యోగము:- ధ్యానము,ఏకాగ్రతల ద్వారా మనోనిగ్రహము సాధించడము, ఆహారనియమాలు,సాధనా ప్రదేశము ఏర్పాటు వర్ణన.యోగి గుణగాణాల వర్ణన,భగవంతుని సర్వవ్యాఇత్వము,యోగభ్రష్టత ఫలితాల వర్ణన.
·         జ్ఞానవిజ్ఞాన యోగము:- భగవంతుని,ఉనికి,గుణగనాలు,ప్రకృతి,మాయని జయించడము.మోక్షగామి గుణగణాల వర్ణన.
·         అక్షరపరబ్రహ్మ యోగము:- బ్రహ్మతత్వము,ఆధ్యాతకత,కర్మతత్వము,ఆది దైవతము,ఆది భూతముల వర్ణన.జీవుని జన్మలు,జీవ ఆవిర్భావము,అంతము,పుణ్యలోక ప్రాప్తి,అత్యకాలములో భగవన్నామస్మరణ ఫలం.
·         రాజవిద్యారాజగుహ్య యోగము:- మోక్ష ప్రాప్తి వివరణ.భగవతత్వము,స్వర్గలోకప్రాప్తి,దేవతారాధనా వాటిఫలము,భక్తుల గుణగణాల వర్ణన.
·         విభూతి యోగము:-భగవంతుని చేరే మార్గము.భగవంతుని విశ్వ వ్యాపికత్వము వర్ణన.
·         విశ్వరూపసందర్శన యోగము:- విశ్వరూపము గురించిన విస్తారమైన వర్ణన.
·         భక్తి యోగము:- భక్తి యోగ వర్ణన.భగవంతుని ప్రియము పొందలిగిన భక్తుని గుణగణాల వర్ణన.
·         క్షేత్రక్షేత్రజ్ఞవిభాగ యోగము:- ప్రకృతి పురుషులు,క్షేత్రము క్షేత్రజ్ఞుల గురించిన జ్ఞానము తెలిపేది.
·         గుణత్రయవిభాగ యోగము:- సత్వగుణము,రజోగుణము,తామసగుణము వివరణ,వారి ఆహారవ్యవహారాల వర్ణన.
·         పురుషోత్తమప్రాప్తి యోగము:- భగవంతుని స్వరూపము తత్వము పురుషోత్తముని చేరే మార్గము వివరణ.
·         దైవాసురసంపద్విభాగ యోగము:- దైవీగుణసంపద,అసురీగుణసంపద కవారి ప్రవృత్తి,ప్రవర్తన ఆలోచనాదుల వర్ణన.
·         శ్రద్దాత్రయవిభాగ యోగము:- సత్వ,రాజసిక,తామసికములనబడే మూడు విధములుగా గుర్తించిన శ్రద్ధలను గురించిన వివరణ.
·         మోక్షసన్యాస యోగము:- మోక్ష ప్రాప్తికి కావలసిన జ్ఞానము,సన్యాసము గురించిన వర్ణన.

వ్యాప్తి ఆదరణ ప్రయోజనము

ఇతర వ్యాయామాకంటే భిన్నమైన యోగాభ్యాసము దానిలో నిబిడీకృతంగా ఉన్నఆద్ధ్యాత్మిక భావం కారణంగా దేశవిదేశాలలో విశేషప్రాచుర్యాన్ని సంతరించుకున్నది. ముఖ్యముగా పాశ్చాత్యదేశాల యోగా ప్రాచుర్యము, ఆదరణ అమోఘమైనది. పాశ్చాత్య దేశీయులకు యోగా మీద ఉన్న విశేషమైన మక్కువ, ఆకర్షణ లోక విదితం. బుద్ధ ఆరామలాలో ఇచ్చేశిక్షణలో యోగా కూడా ఒక భాగమే. వారి వేషధారణ క్రమశిక్షణ ప్రపంచ ప్రాముఖ్యత ఆకర్షణ సంతరించుకున్నది. భారతీయ సంప్రదాయిక యోగశిక్షణా తరగతులను అనేక దేశాలలో నిర్వహిస్తున్నారు. ఇతర వ్యాయాయములు శరీరదారుఢ్యాన్ని మాత్రమే మెరుగు పరచడములోదృష్టిని సారిస్తాయి. యోగాభ్యాసము ధ్యానం, ప్రాణాయామం లాంటి ప్రక్రియలు మానసిక ఏకాగ్రత వలన మానసిక ప్రశాంతతను కలిగించి మానసిక ఆరోగ్యానికి కూడా దోహద పడుతుంది. మానసిక వత్తిడులు, హృద్రోగము, రక్తపోటు లాంటి వ్యాధుల తీవ్రత తగ్గించటానికి తోడ్పడుతుందని పలువురి విశ్వాసం. సనాతన సంప్రదాయమైన యోగా అధునిక కాలంలో కూడా అనేకమంది అధునికుల అభిమానాన్ని చూరగొన్నది.

 

కొన్ని విశేషాలు

బౌద్ధ సంప్రదాయంలో యోగా
4వ 5వ శతాబ్దంలో బుద్ధ సంప్రదాయిక పాఠశాల యోగాచార తత్వము,భౌతికము భోదించబడినవి. జెన్(చెన్)మహాయాన బుద్ధిజమ్ పాఠశాలలలో చెన్ అంటే సంస్కృత ధ్యాన రూపాంతరమని భావిస్తున్నారు. ఈ పాఠశాలలను యోగా పాఠశాలలుగానే పాశ్చాత్యులు గుర్తిస్తున్నారు.

టిబెటన్ బౌద్ధం
టిబెట్ బుద్ధిజమ్ యోగాను కేంద్రీకృతము చేసుకొని ఉంది.నిగమ సంప్రదాయంలో సాధకులు మహాయోగముతో ప్రారంభించి,అను యోగము నుండి అతి యోగము వరకు యోగశాస్త్ర లోతులను చూడటనికి ప్రయత్నిస్తారు. షర్మ సంప్రదాయాంలో అనుత్తర యోగము తప్పనిసరి.తాంత్రిక సాధకులు త్రుల్ కోల్ లేక ప్రజ్ఞోపాసన సుర్య,చంద్రులను ఉపాసించినట్లు దలైలామా వేసవి దేవాలయ కుడ్య చిత్రాలు చెప్తున్నాయి.
తాంత్రిక శాస్త్రంలో యోగము
తాంత్రికులు మాయను ఛేదించి భగవంతునిలో ఐక్యము(మోక్షము) కావడానికి షట్చక్రోపాసన చేస్తారు.దీనికి ధ్యానయోగము అధారము.దీనిని కుండలినీ ఉపాసన అంటారు.మార్గము ఏదైనా యోగశాస్త్ర లక్ష్యము మోక్షము.

ముస్లిములలో యోగం
మలేసియాలో ముస్లిములు మంత్రాలతోకూడిన యోగా ఇస్లాం సిద్ధాంతాలకు వ్యతిరేకమన్న ఉద్దేశంతో ఫత్వా కౌన్సిల్‌ నిషేధించింది.ప్రధాని అబ్దుల్లా బడావీ మంత్రాలు పఠించకుండా యోగాభ్యాసం చేసుకోవచ్చని అక్కడి ముస్లింలకు కొన్నిమినహాయింపులు ప్రకటించారు.ప్రార్థనలు లేకుండా శారీరక ప్రక్రియ మాత్రమే చేసేటట్లయితే ఇబ్బంది లేదు. ముస్లింలు బహుదేవతారాధనకు అంత సులభంగా మొగ్గుచూపరని నాకు తెలుసు అని ఆయన అన్నారు.

క్రైస్తవులలో యోగం
హిందూమంత్రాలకు బదులు క్రైస్తవులు జీసస్ మేరీ ల స్తోత్రపాఠాలతో కూడిన ధ్యానంతో యోగసాధన చేస్తున్నారు.


హఠయోగ ప్రదీపిక

స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగప్రదీపిక, హఠయోగములో ప్రాచీన పుస్తకముగా చెప్పబడుతున్నది. 15వ శతాబ్దములో వ్రాయబడిన ఈ గ్రంధము పురాతన సంస్కృత గ్రంధములతో పాటు స్వత్మరామ ప్రతిపాదించిన యోగ ముద్రలు కూడా ఉన్నవి. వీటిలో ఆసనాలు, ప్రాణాయామము, చక్రములు,కుండలిని,బంధములు, క్రియలు, శక్తి,నాడి, ముద్ర ఇంకా ఇతర విషయములు కలవు.

రెండు స్రవంతులైన ఇద (మానసిక) మరియు పింగళ (భౌతిక) శక్తులను ఉపయోగించి, షుషుమ నాడి (స్వీయ శక్తి)ని ఉద్గారించడానికి, శరీరంలోని వివిధ ప్రదేశాలలో వెన్నెముక ప్రాధమిక స్థానం నుండి తల పైభాగంవరకూ గల, కాస్మిక్ శక్తి కేంద్రాలను, సమాధి పొందేంత వరకు, వివిధ చక్రముల ద్వారా ప్రేరేపించవలెను.

అతి లోతైన ఏకాగ్రతలద్వారా, శారీరక మానసికాలపై పట్టు సాధించి, మేధోజలాల స్తంభనలవరకూ సాధనలు చేసి, స్వీయబ్రాహ్మణాన్ని పొందడమే హఠయోగం. అకుంఠిత దీక్షతో సాధన చేసే హఠయోగము, సాధకున్ని రాజ యోగ శిఖరాలకు చేర్చుతుందని భావిస్తారు.

పాశ్చాత్య దేశాలలో, హఠయోగము వ్యాయామ శిక్షణా పద్ధతిగా ప్రాచుర్యము పొందినది. హఠయోగ అసలు మానసిక ఉద్దేశ్యాలను అర్థం చేసుకొనక, కేవలం భౌతిక సాధనలు మాత్రమే జరుగుతున్నవి. ప్రస్తుతము, 3 కోట్ల అమెరికా ప్రజలు హఠయోగాన్ని సాధన చేస్తున్నారని అంచనా. అయితే భారత ఉపఖండములో మాత్రం నేటికీ హఠయోగము సంప్రాదాయ పద్ధతిలోనే అనుసరించబడుతున్నది. 20వ శతాబ్దములో అంతర్జాతీయ చైతన్య స్రవంతిలోకి ప్రవేశించిన అనేక గొప్ప యోగులను అందించిన, వ్యవస్థీకృత సంస్థల అజమాయిషీలేని సాంప్రదాయ గురు-శిష్య సంబంధము భారత, నేపాలీ మరియు కొన్ని టిబెట్ వర్గాలలో నేటికీ సజీవంగా ఉన్నది.
యోగాసనాలు
యోగాసనాలు : యోగా విధానములో శరీర వ్యాయామ విధానాలనే యోగాసనాలు అని వ్యవహరిస్తాము. యోగాసనాలు అంటే శారీరక వ్యాయామ విధాన క్రియలు. ఈ ఆసనాల ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాల్లో మనిషి శుద్ధి అవుతాడు.
సంస్కృతం తెలుగు ఇంగ్లీషు
अधोमुख स्वानासन అధోముఖ స్వానాసనం Downward-Facing Dog Pose
अधोमुख वृक्षासन అధోముఖ వృక్షాసనం Handstand (Downward-Facing Tree)
अंजलि मुद्रा అంజలి ముద్ర Salutation Seal
अर्ध चन्द्रासन అర్ధ చంద్రాసనం Half Moon Pose
अर्ध मत्स्येन्द्रासन అర్థ మత్సేంద్రాసనం Half Spinal Twist
बद्ध कोणसन బద్ధ కోణాసనం Bound Angle
बकासन బకాసనం Crane Pose
बालासन బాలాసనం Child's Pose (relaxation)
भरद्वाजसन భరద్వాజాసనం Bharadvaja's Twist
भुजङ्गासन భుజంగాసనం Cobra Pose
चक्रासन చక్రాసనం Wheel Pose
चतुरङ्ग दण्डासन చతురంగ దండాసనం Four-Limbed Staff
दण्डासन దండాసనం Staff pose
धनुरासन ధనురాసనం Bow
एक पाद रजकपोतासन ఏకపాద రాజకపోతాసనం One-Legged King Pigeon
गरुडासन గరుడాసనం Eagle Pose
गोमुखासन గోముఖాసనం Cow Face
हलासन హలాసనం Plough Pose
हनुमनासन హనుమానాసనం Hanuman Pose
जानु शिरासन జాను శిరాసనం Head-to-Knee Forward Bend
काकासन కాకాసనం Crow Pose
क्रौन्चासन క్రౌంచాసనం Heron
कुक्कुटासन కుక్కుటాసనం Cock Posel
कूर्मासन కూర్మాసనం Tortoise Pose
मकरासन మకరాసనం Crocodile Pose(relaxation)
मत्स्यासन మత్స్యాసనం Fish Pose
मत्स्येन्द्रासन మత్స్యేంద్రాసనం Lord of the Fishes (named after Matsyendra)
मयूरासन మయూరాసనం Peacock Pose
नटराजासन నటరాజాసనం Lord of the Dance
पाद हस्थासन పాద హస్తాసనం Standing Forward Bend
पद्मासन పద్మాసనం Lotus Pose
परिपूर्ण नवासन పరిపూర్ణ నావాసనం Full Boat Pose
परिवृत्त पार्श्वकोणासन పరివృత్త పార్శ్వకోణాసనం Revolved Side Angle
परिवृत्त त्रिकोणासन పరివృత్త త్రికోణాసనం Revolved Triangle
पाशासन పాశాసనం Noose
पश्चिमोत्तानासन పశ్చిమోత్తానాసనం Posterior Stretch in Forward Bend
प्रसरित पादोत्तानसन ప్రసరిత పాదోత్తానాసనం Intense Spread Leg Stretch
शलभासन శలభాసనం Locust Pose
सर्वाङ्गासन సర్వాంగాసనం Shoulder Stand
शवासन శవాసనం Corpse Pose (relaxation)
सेतु बन्ध सर्वाङ्गासन సేతుబంధ సర్వాంగాసనం Bridge, Half Wheel
सिद्धासन సిద్ధాసనం Perfect Pose
सिंहासन సింహాసనం Lion
शीर्षासन శీర్షాసనం Head Stand
सुखासन సుఖాసనం Auspicious Pose
सुप्त बद्ध कोणासन సుప్తబద్ధ కోణాసనం Reclining num) Bound Angle
सुप्त पादाङ्गुष्टासन సుప్త పాదాంగుష్టాసనం Reclining numb Big Toe
सुप्त वीरासन సుప్త వీరాసనం Reclining Hero
स्वस्तिकासन స్వస్తికాసనం Prosperous Pose
ताडासन తాడాసనం Mountain Pose
त्रिकोणासन త్రికోణాసనం Triangle Pose
उपविष्ट कोणासन ఉపవిష్ట కోణాసనం Open Angle
ऊर्ध्व धनुरासन ఊర్ధ్వ ధనురాసనం Upward Bow, Backbend, or Wheel
ऊर्ध्व मुख स्वानासन ఊర్ధ్వముఖస్వానాసనం Upward-Facing Dog
उष्ट्रासन ఉష్ట్రాసనం Camel
उत्तान कूर्मासन ఉత్తాన కూర్మాసనం Upside-Down Tortoise
उत्कटासन ఉత్కటాసనం Chair
उत्तानसन ఉత్తానాసనం Standing Forward Bend
उत्थित हस्त पादाङ्गुष्टासन ఉత్థితహస్త పాదంగుష్టాసనం Raised Hand to Big Toe
उत्थित पार्श्वकोणासन ఉత్థిత పార్శ్వకోణాసనం Extended Side Angle
उत्थित त्रिकोणासन ఉత్థిత త్రికోణాసనం Extended Triangle
वसिष्टासन వశిష్టాసనం Side Plank
विपरित करणी విపరీత కరణి Legs-up-the-Wall
वज्रासन వజ్రాసనం Thunderbolt
वीरासन వీరాసనం Hero
वृक्षासन వృక్షాసనం Tree Pose

ప్రాణాయామము
ప్రాణాయామము : ప్రాణము అనగా జీవనము , ఆయామము అనగా పొడిగించుట. ( పెంచుట ).
స్వామీ ఘోరకనాథ్ శిష్యుడు యోగి స్వత్మరామ సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక నందు మరియు పాతంజలి యొగశాస్త్రం నందు కూడ ప్రాణాయామం చెప్పబడెను.
8 రకముల ప్రాణాయామ పద్ధతులుకలవు :
·         సూర్య భేదనం ఉజ్జాయి శీతలి శీత్కారి భస్తిరిక భ్రామరి ప్లావని మూర్ఛ ఇతి అష్త కుమ్భకాని -
·         సూర్య భేదనం అనగా సూర్య నాడిని ఉద్ద్దీపన చేయుట. యడం ముక్కును మూసి కుడి ముక్కుతొ పదెపదె గాలిని పీల్చుట ( సూర్య భెదనము మరియు భస్త్రిక ప్రాణాయామాల వలన శరీరమందలి శీతల సంబంధిత రోగములు తొలగును. లొ.బి.పి. కి మంచిది.)
·         ఉజ్జాయి అనగ ఛిన్నపిల్లల గురక ద్వణి లాగ గాలిని ముక్కుద్వారా తీసుకొనువలెను.ఆసమయములొ గొంతుక వద్ద ద్వని నెమ్మదిగ చేయవలెను. ( స్వరమునకు మంచిది.కపము తగ్గును.)
·         శీతలి అనగా చల్లదనము. నాలికను కాకి ముక్కు వలెనె చేసి గాలిని నాలిక ద్వారా పీల్ఛుకొనవలెను. పిదప ముక్కుతో వదలవలెను.
·         శీత్కారి అనగా చల్లదనము . గాలిని నొటిలొని పల్లమధ్యనుండి లొనికి పీలుచుకొనవలెను. ( శీతలి మరియు శీత్కారీ ప్రాణాయామాల వలన హ్హె.బి.పి. తగ్గును.చక్కగ నిద్రపట్టును.)
·         భస్త్రిక అనగ తొలుతిత్తి. గాలిని వెగముగ ముక్కుద్వారా తీసి వదులుట కమ్మరి వాని తొలుతిత్తి వలెనె చెయవలెను.
·         భ్రామరి అనగా తుమ్మెద . తుమ్మెద ద్వనివలెనె నాసాగృము ద్వారా గాలిని బయిటకు వదలవలెను. (బ్రామరి ప్రాణాయామ సాదన వలన మనస్సుకు శాంతి కలుగును.నిదుర పట్టును.)
·         ప్లావని అనగా తేలుట . పెదవులను కాకిముక్కు వలెనె చేసి గాలిని లోనికి పూర్తిగా పొట్ట నిండు వరకు పీలుచుకొనవలెను. (ఈ ప్రాణాయామము వలన వాయువులలొని త్రిదొషములు తొలగును.)
·         మూర్ఛ అనగా మతిభ్రమించుట. గాలిని ముక్కుద్వారా లొనికి తీసుకొని వదులునపుడు-
·         ఆగాలి మెదడుకు దిగువన గల పిట్య్టటరి గృందికి తకునట్లుగ ఉన్డవలెను.( దీనివలన మెదడుకు శాంతి కలుగును.)
·         పాతంజలి యొగములొ - శ్వాస ప్రశ్వాసొగతివిఛెదా ప్రాణ్ణాయామ అని చెప్పబడినది.
·         అనులొమ విలొమ ప్రాణాయామము ముఖ్యమగు ప్రాణాయామము.
·         ఎడమ నాసగ్రము ద్వారా గాలిని లొనికి తీసుకొని కుడి నాసాగ్రము ద్వారా గాలిని వదల వలెను.
·         పిదప గాలిని అదె కుడి నాసగ్రము ద్వారా తీసుకొని ఎడమ నాసాగ్రము నుండి వదల వలెను.ఈ ప్రకారముగా పలుమారులు సాదన చేయ వలెను. ( జీవించినంత కాలము ఈప్రాణాయామ సాదన చాల ఉపకరించును.సకల రొగములు తొలగును.)
·         ద్యానము చేయుసమయములొ నాసాగ్రమునందు ద్రుష్తిని నిలిపి గాలి గమనాగమనములను గమనించుటచె మనసు కుదుటపడి ఎకాగ్రత కలుగును.
·         దీనినె విపాసనాద్యానం అని కూడ అందురు.
·         ఈప్రాణ్ణాయామం గురించి స్వరశాస్త్రమంజరిలొ వివరముగ వివరించబడినది. స్వరమె పరమాత్మ అని కూడ పెద్దలు చెప్పెదరు.

 

కుండలిని

కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. మూలాధారం లో దాగివున్న ఈ కుండలినీ శక్తిని సుషుమ్నా నాడి ద్వారా పైకిసహస్రారం వరకు తీసుకొనివెళ్లే పద్ధతిని వివరించేది కుండలినీ యోగ. కుండలినీ యోగ లో కుండలినిని జాగృతం చేయడానికి ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. కుండలినీ శక్తి సహస్రారం చేరినప్పుడు యోగసాధకుడు ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.
శక్తి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి స్థితి శక్తి (Potential Energy), రెండవది గతి శక్తి(Dynamic or Kinetic Energy). శరీరంలోని ప్రాణశక్తి గతి శక్తి రూపంలో ఉంటుంది. మానవ దేహంలోని స్థితి శక్తి పాము వలే చుట్ట చుట్టుకొని మూలాధారం వద్ద నిద్రాణంగా ఉంటుంది. యోగ సాధన ద్వారా నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేయవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కుండలినీ శక్తిని జాగృతం చేయడానికి ముందు దేహ శుద్ధి (purification of body), నాడీ శుద్ధి (purification of nadis/nervous system), మనో శుద్ధి (purification of mind), బుద్ధి శుద్ధి (purification of intellect) జరగాలి. నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తిని యోగ క్రియల ద్వారా జాగృతం చేసినప్పుడు అది ఊర్ధ్వ ముఖంగా పయనించి, షట్చక్రాల్లోని ఒక్కొక్క చక్రాన్నీ దాటుతూ తల మాడు భాగాన ఉండే సహస్రార చక్రాన్ని చేరుతుంది. ఈ స్థితినే అష్టాంగ యోగలోని అత్యున్నత దశ అయిన "సమాధి స్థితి"గా కూడా పేర్కొంటారు. ఈ స్థితిలో సాధకునికి ఒక అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. అన్ని రకాల క్లేశాలూ తొలగిపోతాయి. శరీరం, మనస్సుల నుండి పూర్తిగా విడిపోతాడు.

 

చక్రాలు

సప్తచక్రాలు
షడ్చక్రాలు లేదా సప్తచక్రాలు మన శరీరంలోని వెన్నుపూస లోనున్న ప్రదేశాలు.
·         మూలాధార చక్రము (Mooladhara) : గుద స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును. దీని బీజ మంత్రం "లం". మూలాధార చక్రమున గల కమలకర్ణికయందు దివ్య సుందరమైన త్రికోణము, దాని మధ్య తటిత్కోటి సమప్రభమగు స్వయంభూలింగము కలదనియు, ఆ లింగము చుట్టును తామరతూడులోని దారము వంటి ఆకారము గల కుండలినీ శక్తి మూడున్నర చుట్లు చుట్టుకొనియున్నదనియు, వివిధ తంత్రములు వర్ణించుచున్నవి.
·         స్వాధిష్ఠాన చక్రము (Swadhisthana) : లింగమూలమున గలదు. ఆరు దళములతో సిందూరవర్ణము గల జలతత్వ కమలము గలది. దీని బీజ మంత్రం "వం".
·         మణిపూరక చక్రము (Manipura) : నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి, నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము. దీని బీజ మంత్రం "రం".
·         అనాహత చక్రము (Anahatha) : హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి, హేమవర్ణము గల వాయుతత్వ కమలము. దీని బీజ మంత్రం "యం".
·         విశుద్ధి చక్రము (Vishuddha) : కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి, శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము. దీని బీజ మంత్రం "హం".
·         ఆజ్ఞా చక్రము (Ajna) : భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము. దీని బీజ మంత్రం "ఓం".
·         సహస్రార చక్రము (Sahasrara) : బ్రహ్మ రంధ్రమునకు అధోముఖముగ సహస్ర దళములతో వికసించియున్న పద్మము. సహస్రార కమల కర్ణిక యందు ప్రకృతి పురుషుల సమైక్య స్థితి యగు పరబిందువు చుట్టును మాయ గలదు. ఆత్మజ్ఞానమును సాధించిన పరమ హంసలు మాత్రమే పొందగలిగిన స్థానమిది. దీనిని శైవులు శివస్థానమనియు, వైష్ణవులు పరమ పురుష స్థానమనియు, ఇతరులు హరిహర స్థానమనియు, దేవీభక్తులు దేవీస్థానమనియు చెప్పుదురు. ఈ స్థానమునెరిగిన నరునకు పునర్జన్మ లేదు.

 

నాడి (యోగా)

సుషుమ్న నాడి :
మానవ శరీరమునందు 7200 నాడులు కలవని అనేక శాస్త్రములు (స్వరశాస్త్రమంజరి) వివరిస్తున్నవి.ఉపనిషత్త్ లలొ కుండలిని ఉపనిషద్ , యోగోపనిషద్ ,దర్శనొపనిషద్ వంటి అనేక యొగ గ్రంధములలొ కూడ వివరణ కలదు.
యోగ సాధనలొని ఆసనముల-ప్రాణాయామ పద్ధతుల ద్వారాను-ధారణ ధ్యానాదుల సాధనచేతను శరీరమందలి నాడులను శుభ్రపరచి,మూలాధారమునందు నిదురించుచున్న శక్తిని ఉత్తేజపరచ వచ్చును. ఇడ(ఎడమ నాసగ్రము నందు)నాడి-పింగళ నాడి(కుడి నాసాగ్రమున)సుషుమ్న(నాసాగ్రము మధ్యన)కలదు. ఇడా నాడిని చంద్ర నాడి అని, పింగళనాడిని సూర్య నాడి అని కూడ చెప్పెదరు. ఈ నాడుల ఉద్దీపనను కుండలిని ఉద్దీపనము అని కూడ అనవచ్చును.
ప్రాశ్ఛాత్యుల శాస్త్రము ప్రకారము మెదడు నందు గల భాగములలొ ఎడమ భాగమునకు కుడి నాసాగ్రముతొను - మెదడు లొని కుడిభాగము నకు ఎడమ నాసాగ్రముతొను సంబంధము కలదు .అనగా సింపతటిక్ , పరాసింపతటిక్ అన్ద్ సెంట్రల్ నెర్వస్ సిస్ట్మ్. మెదడులొని ప్రతీ కణమునకు నాడులు కలుపబడి ఉన్నవి. ఆనాడులు మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణశక్తిని అందించుచున్నవి.


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి