ముక్కంటికి కన్ను

శ్రీకాళహస్తి సమీపంలోని అడవిలో తిన్నయ్య అనే కోయవాడు ఉండేవాడు. రోజూ వేటకు అడవికి వచ్చే వాడు. రోజు వేట సమయంలో భారీ వర్షం కురవడంతో తిన్నడు శ్రీకాళహస్తి ఆలయంలోకి వెళ్లి తలదాచుకుంటాడు. తెల్లవారి ఆలయ అర్చకుడు వచ్చి తిన్నయ్యను గుళ్లో నుంచి తరిమేస్తాడు. శివాలయంలో అపచారం చేయకూడదని దూషిస్తాడు. దీంతో ఆగ్రహించిన తిన్నడు తనను కష్టాలపాలు చేసిన శివుడు దేవులు ఎలా అవుతాడంటూ అర్చకుడ్ని తిడతాడు. అప్పుడు అర్చకుడు తిన్నయ్యకుశివపంచాక్షరీమంత్రాన్ని ఉపదేశిస్తాడు. త్రికరణ శుద్ధిగా మంత్రాన్ని పఠిస్తాడు తిన్నడు. అతడికి పరమేశ్వరుడి సాక్ష్యాత్కారం అవుతుంది.

కొందరు తిన్నడి భక్తిని అనుమానిస్తారు. వారికి బుద్ధి చెప్పాలని పరమేశ్వరుడు తిన్నడి భక్తికి పరీక్ష పెడతాడు. ఆలయంలోని వాయులింగం కంటి నుంచి రక్తం వచ్చేలా చేస్తాడు. అది చూసిన తిన్నడు మారు ఆలోచన లేకుండా బాణంతో తన కంటిని తీసి.. లింగానికి అమర్చుతాడు. లింగానికి ఉన్న మరో కంటి నుంచి ధారగా రక్తప్రవాహం మొదలవుతుంది. తిన్నడు తన రెండో కంటిని స్వామికి ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై.. తిన్నడి భక్తిని ప్రశంసిస్తాడు. లోకులంతా అతడి నిజమైన భక్తిని అర్థం చేసుకుంటారు. శ్రీకాళహస్తీశ్వరుడికి తన కళ్లను సమర్పించిన తిన్నయ్య తర్వాతి కాలంలో భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)