అన్ని ప్రాణుల్లో దేవుడు

మనందరమూ దేవుడి కన్నా వేరుగా లేము అనే విషయాన్ని ఒక స్వామీజీ ఆసక్తికరంగా వివరించాడుదేవుడు అంటే ఎవరో ఆకాశంలో ఉన్న వ్యక్తి అని కాకుండా ఒక అనంతమైన తత్వం అని మనం ఒప్పుకుంటే అలాంటి అనంతానికి మొదలంటూ ఏదీ లేదుఅంచులు లేవుమధ్యభాగం లేదుఅలాంటి అనంతానికన్నా వేరుగా మరొక పదార్థం ఉండటానికి లేదుమరో పదార్థం ఉంది లేదా మనం ఉన్నామని చెబితే దేవుడికి మనం ఇచ్చిన నిర్వచనం దెబ్బతింటుందిదేవుడికి పరిమితుల్ని చెప్పినట్లవుతుందిఅలాకాక దేవుడు అనంతమే అయినా నేను వేరు అన్నామంటే నేను అనేది జీరో అవుతుందిఎందుకంటే అనంతం కంటే వేరుగా ఏదీ ఉండలేదు కాబట్టి

పై విశ్లేషణ గణితంలోని ఒక సమీకరణం (ఈక్వేషన్‌) రూపంలో ఉందిఅయినా ఒప్పుకోవడానికి మనసు అంగీకరించదుభగవంతుడు అంటూ ఒకాయన మనల్ని పరిశీలిస్తూరక్షిస్తూ ఉన్నాడు అన్నప్పుడే మనకు సంతృప్తిఊరటఅయినా వేదాంతం పై రీతిలోనే చెబుతుందిఅందువల్ల పై సమీకరణాన్ని కొంత పరిశీలించాలి.
భగవంతుడు సృష్టి చేశాడు అన్నప్పుడు ఆయనకు కొంత ముడిసరుకు అవసరం ముడిసరుకు అతనికన్నా వేరుగా ఉందా లేదా అతనిలో భాగమా అనే ప్రశ్న వస్తుందిఅతనికన్నా వేరుగా ఉంది అంటే అతనొక వ్యక్తిలా కూర్చొని ఉంటాడనీకొంత పదార్థం ఆయనకెదురుగా ఉంటుందనీ భావించాల్సి వస్తుందికుమ్మరి కుండను చేయాలంటే మట్టి అవసరంమట్టిని ఉపాదాన కారణం అంటారుఉపాదానం అంటే ముడిసరుకుకుమ్మరి అతను తెలివి ఉన్నవాడుతయారీకి నిమిత్తమైనవాడు కాబట్టి నిమిత్త కారణం అన్నారుఅలాగే దేవుడు కూడా సృష్టికి కారణం అన్నామంటే దేవుడు అనంతమైన తత్వం అనే నిర్వచనాన్ని దెబ్బతీస్తుందిఅలాకాదుభగవంతుడు తనలోనే ఒక భాగాన్ని బయటకు తీసి సృష్టించాడు అంటే ఆయన కూడా అవయవాలున్న ఒక వ్యక్తి అని తేలుతుందిఅవయవాలున్న వ్యక్తి అనంతమైన తత్వం కావడానికి వీలులేదుమరికొందరు భగవంతుడే ప్రపంచ రూపంలో మారాడు లేదా పరిణామం చెందాడు అన్నారుదీన్ని పాంథిజమ్‌ అన్నారుఅంటే మనం సృష్టిలో చూసే ప్రాణులురాయిరప్ప ఇదంతా భగవంతుడే అనడంపరిణామం చెందే వస్తువు ఒక జడపదార్థమే అవుతుంది కానీ చైతన్యస్వరూపం కాదుకాబట్టి దీన్నీ అంగీకరించలేం.

దీన్ని వివరించడానికి వేదాంతులు కొందరు చైతన్యంలోనే ఒకానొక శక్తి ఉందనీ శక్తియే పదార్థ రూపంలో కనిపిస్తుందనీ చెప్పారుమనం విష్ణువనీశివుడనీపరాశక్తి అనీ మిగతా  పేరుతో పిలిచినా  శక్తినే పిలుస్తుంటాంస్థూలంగా చెప్పాలంటే చైతన్యమే సృష్టిగా కనిపిస్తుంది అని వీరి వాదనచైతన్యాన్ని గూర్చిసృష్టిని గూర్చి అనేక వాదనలు మనకు ఉపనిషత్తుల కాలం నుంచి కనిపిస్తాయి.


మనిషికీఅన్ని ప్రాణులకూ తెలివి అనే అంశముందిచైతన్యమంటే ఇదే దృష్టికోణం నుంచి చూస్తే కొన్ని ప్రశ్నలు వస్తాయి తెలివి అన్నది శరీరంలో పుట్టిందా లేదా శరీరానికి బయటి నుంచి వచ్చిందా అని ప్రశ్నభౌతికవాదులు శరీరంలోని వివిధ అవయవాల కలయిక వల్ల చైతన్యం ఏర్పడిందని చెబుతారుప్రయోగశాలలో కొన్ని పదార్థాలు కలిసినప్పుడు ఒక కొత్త పదార్థం ఏర్పడినట్లులేదా మద్యం తాగినప్పుడు మత్తు కలిగినట్లు చైతన్యం ఏర్పడుతుందని వీరి వాదనభౌతికవాదులు కాక మిగతావారంతా చైతన్యం వేరుగా ఉందని ఒప్పుకున్నవారేచైతన్యమనేది కొత్తగా పుట్టేది కాదుఎల్లప్పుడూ ఉండేది అని వీరి వాదన.

వేదమంత్రాలు  చైతన్యమే మనిషి (ప్రతి ప్రాణి యొక్కబుద్ధి అనే గుహలో ఉందని చెబుతాయిబుద్ధిని గుహ అనడం కూడా ఒక ఆసక్తికరమైన ప్రయోగంశరీరాన్ని స్థూలంగా చూస్తే రక్తమాంసాలతో కూడిన ఒక అంశం మొట్టమొదటగా కనిపిస్తుందిదీనిలో ప్రాణం అనేది తరవాతదాని తర్వాత ఇంద్రియాలుమనసు ద్వారా ఒక ప్రాణి ఆలోచించడం కనిపిస్తాయిఇవన్నీ ఒకదాని లోపల ఒకటి సొరుగుల్లాగా భావించవచ్చుఉపనిషత్తులు  సొరుగుల్నే కోశాలు అన్నాయి కోశాలన్నింటికన్నా లోపల ఉన్నట్లుగా తెలిసేది బుద్ధిఅందువల్ల దీన్ని గుహ అన్నారు గుహ గురించిన వేదమంత్రాలను ప్రతిరోజూ మనం దేవాలయాల్లో వింటూంటాంపరమాత్మ చైతన్యమే  బుద్ధి అనే గుహలో కనిపిస్తుందని  మంత్రాల భావన బ్రహ్మ శివః హరిఃసేంద్రః అంటూ ఇదే బ్రహ్మఇదే శివుడుఇదే హరిమనం చెప్పుకునే దేవుడి రూపాలన్నీ  చైతన్యమేఇదే నీ స్వరూపం అని వీటి అర్థంఅర్చకులు పూజ తర్వాత చిట్టచివర చెప్పే మంత్రపుష్పంలో కూడా త్వం బ్రహ్మత్వం రుద్రఃత్వం ప్రజాపతిః మొదలైన మంత్రాల్లో ఇదే భావాన్నే చెబుతుంటారుకానీ మనకు వాటి అర్థం తెలియదు కాబట్టి వాటిలోని తత్వచింతన బోధపడదు.

మనిషికి మతంలో ఉన్న కట్టుబాట్లుమతం చెప్పే పూజా విధానాలూ మొదలైన వాటితోనే సంతృప్తి కలుగుతుందితనకున్న కోర్కెల్ని సఫలం చేసుకోవడానికి యజ్ఞాలువ్రతాలు సులభంగా చేయగలడుతత్వాన్ని గురించి ఆలోచించమంటే కష్టమైన విషయందీన్ని గమనించిన వేద ఋషులు పనిలోపనిగా  వ్రతాలకు సంబంధించిన మంత్రాల్లోనే తత్వాన్ని గురించిన విషయాలన్నీ చెప్పారుమనిషి తన స్వభావం కొద్దీ కర్మలు చేస్తూ ఉంటేఎప్పుడో ఒకప్పుడు తత్వంపైకి మనసు మళ్లుతుందని వారి ఆశ.

పరమాత్మ చైతన్యం కన్నా మనం వేరు కాదు అని చెప్పడానికి వేదాంతులు మరొక ఉదాహరణ చెబుతుంటారుసముద్రంలో అలలు ఏర్పడుతుంటాయి అలల స్వరూపం కూడా నీరేఅయినా అల అంటూ ఒక ఆకారంపేరు ఉన్నాయిఅలాగే బంగారం ముద్ద నుంచి తయారయ్యే పలురకాల ఆభరణాలకు ఆకారాలుపేర్లు ఉన్నాయికానీ వాటి అసలు స్వరూపం బంగారమేఅలాగే భగవంతుడు ఒక సముద్రం లేదా ఆకాశం లాంటి చైతన్య స్వరూపం ఒకే చైతన్యమే అనేక రూపాల్లో కనిపిస్తుందని వీరి వాదనచైతన్యానికీమనిషికీ ఉన్న  సంబంధాన్ని ప్రస్తుతం భౌతిక శాస్త్రంమనస్తత్వ శాస్త్రంజీవశాస్త్రం ఇవన్నీ కలిసి వాటివాటి పరిధిలో పరిశీలిస్తున్నాయిశాస్త్రవేత్తలు appearance and reality అనే విషయంపై మన వేదాంతులు చెప్పిన అనేక విషయాలతో ఏకీభవించడం కూడా గమనించాల్సిన విషయం

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)