మట్టికుండ

మట్టికుండ

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)

by 5:05:00 AM 0 comments
శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్‌ (క్లుప్తంగా) 
ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉన్నాయి. అవి చూడడానికి చిన్నవిగా ఉన్నా వాటికుండే శక్తి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు వీటిల్లో అధికం జీర్ణశక్తిని అధికం చేసి, రక్తాన్ని శుద్ది చేస్తాయి. అంతే కాకుండా సహజంగా తీసుకున్నా ఆహారం ద్వారా సంభవించే అనారోగ్యాలకు కూడా ఈ పండ్లు మంచి మందులా ఉపయోగపడతాయి.

బాదం పప్పు...
ü  బాదం పాలు ఎంతో శ్రేష్ఠమైనవి బాదం పప్పు మంచి పోషకాహారం. మామూలుగా మనం తీసుకునే పాలతో పోలిస్తే ఇవి ఎంతో ఉత్తమమైనవి అని చెప్పవచ్చు. ఆవుపాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు బాదం పాలు పట్టవచ్చు. బాదం పప్పులో ఇనుము రాగి ఫాస్పరస్‌ వంటి ధాతువులు, విటమిన్‌ ‘బి’ లు ఆల్మండ్స్‌లో ఎక్కువగా ఉంటాయి. వీటి రసాయనిక చర్యల వల్ల అధిక శక్తి లభిస్తుంది.
ü  రక్తకణాలు, హీమోగ్లోబిన్‌ సృష్టికి, గుండె, మెదడు, నాడులు, ఎముకలు, కాలేయం సక్రమంగా పనిచేయడానికి ఆల్మండ్‌లు ఎంతగానో తోడ్పడుతాయి. అవి కండరాలు బహుకాలం దృఢంగా, ఎక్కువ కాలం పనిచేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడుతాయి.
ü  బాదం పప్పును రోజూ కొద్దిగా నెత్తికి రాసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. చుండ్రు, వెంట్రుకలు ఊడటం వంటి వాటికి చక్కటి పరిష్కారం చూపుతుంది.
ü  ఎగ్జిమా వంటి చర్మం వ్యాధులకు అడవి బాదంపప్పు చాలా బాగా పనిచేస్తుంది. ఇందుకోసం బాదం ఆకులను తీసుకొని వాటిని చూర్ణం చేసి, నీటిలో పేస్ట్‌లాగా కలిపి ఎగ్జిమా ఉన్న ప్రాంతాల్లో రాస్తే సత్వర ఫలితం కనబడుతుంది.
ü  బాదం పేస్ట్‌తో, పాలను కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే ముఖం కాంతి వంతంగా ఉంటుంది.

జీడిపప్పు...
ü  శరీరానికి కావలసిన ప్రొటీన్లు ఇందులో అధికంగా ఉంటాయి.
ü  వీటిలో పొటాసియం, విటమిన్‌ బి, కూడా పుష్కలంగా ఉంటాయి.
ü  అంతేకాకుండా వీటిలో ఉండే అసంతృప్త కొవ్వు పదార్ధం గుండె జబ్బులను నివారించే సామర్ధ్యాన్ని కలిగిఉంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, సెలీనియం, రాగి వంటివి తగిన పరిమాణంలో లభిస్తాయి.
ఎండు ద్రాక్ష...
ü  ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు, ఎండు ద్రాక్ష తయారవుతుంది. మంచి పోషకాహర విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగ పడుతాయి.
ü  అదేవిధంగా ఎండు ద్రాక్షను బాగా వేడి చేసిన నీళ్ళలో నానబెట్టి తర్వాత పిల్లలకు ఇస్తే వారిలో జీర్ణశక్తి బాగా వృద్ధి అవుతుంది. కాకపోతే నానబెట్టే ముందు వీటిని పొడిగా చేయాల్సి ఉంటుంది. దీనివల్ల పండ్లలోని రసం నీటిలో బాగా కలిసి పోయి పిల్లలకు పోషకాలు అందుతాయి.
ü  వీటిల్లో ఇనుము అధికంగా ఉండటం వల్ల రక్తంలోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా చేరుతుంది. ఇవి రక్త హీనతకు మంచి మందుగా ఉపయోగపడతాయి.
ఖర్జూరపు పండ్లు...
ü  ప్రకృతి సిద్ధంగా లభించే గ్లూకోజ్‌ ఫ్రక్టోజ్‌లు వీటిలో ఉంటాయి. ఖర్జూరాలను మెత్తగా రుబ్బి నీళ్ళలో రాత్రంతా నానబెట్టిన తర్వాత వీటిల్లోని విత్తనాలను తొలగించి కనీసం వారానికి రెండు సార్లు తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది.
ü  చిన్న ప్రేవుల్లో చోటు చేసుకోనే సమస్యలకు వీటివల్ల మంచి పరిష్కారం లభిస్తుంది.ఇందులో మంచి పోషకాహార విలువను కలిగిఉంటాయి.

వాల్స్ నట్స్:
ü  వాల్ నట్స్ లోని ఫోలిఫినాల్స్ న్యూరాన్స్ మరియు బ్రెయిన్స్ మద్య కమ్యూనికేషన్ అభివృద్ధి చేస్తుంది . ఒక గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల, మీరు 19శాతం మెమరీని పవర్ ను మెరుగుపరచుకొనే అవకాశం ఉంది.
ü  వాల్ నట్స్‌ను రోజూ నీటిలో రెండేసి నానబెట్టి ప్రతిరోజూ ఉదయం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. వాల్ నట్స్ ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతే కాదు ఆరోగ్య నిపుణుల ప్రకారం వాల్ నట్స్‌ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతుంది. ఇంకా ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి 
ü  వాల్ నట్స్ బరువు తగ్గించడంలో చాలా గ్రేట్‌గా సహాయపడుతుంది. ఇందులో ప్రోటీనులు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. వాల్ నట్స్‌లో మెలటోనిన్ అనే కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ కాంపౌండ్స్ మన శరీరంలో అవసరం అయిన అవయవాలకు అవసరం అయిన సిగ్నెల్స్‌ను అందించడం ద్వారు గాఢంగా నిద్రపోగలుగుతారు. 
ü  ప్రతి రోజూ వాల్ నట్ తినడం ద్వారా గుండెను పదిలం చేసుకోవచ్చు. వాల్ నట్స్‌లో ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండె సంబంధిత రోగాలను దూరం చేస్తాయి. వాల్ నట్‌లో విటమిన్ ఇ, ఫ్లెవనాయిడ్స్ జ్ఞాపకశక్తిలోపానికి గురిచేసే, హానికరమైన ఫ్రీరాడికల్స్, కెమికల్స్‌ను నాశనం చేస్తుంది. ఇంకా వాల్ నట్స్ ఒత్తిడిని తగ్గిస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు. 

అంజీర్‌ పండు....
ü  ఎండిన అంజీర్‌ పండులో పీచు, రాగి, మంగనీస్‌, మెగ్నీషియం, పొటాసియం, కాల్షియం, విటమిన్‌-కె, వంటికి పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను కూడా వీటిల్లో ఉంటాయి.
ü  రోజు 35 గ్రాముల ఎండిన అంజీరు పండు పౌడ రును తీసుకుంటే ప్లాస్మాలో, యాంటీ ఆక్సిడెంట్‌ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
ü  ఇందులోకాల్షియం పీచు రూపంలో కలిగి ఉండేది అంజీర్‌ పండులో మాత్రమే.
పిస్తా
ü  పిస్తా లో పోశాకపదర్దము ఎక్కువ. పొటాషియం అత్యధికం గా లబిస్తుంది. శరీరము లో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది.
ü  దీనిలో ఉండే బి ప్రోటీన్ల తయారీ, శోషణము లో ఉపయోగపాడుతుంది.
ü  మిగిలిన ఎండు పండ్ల తో పోలిస్తే పిస్తా లో కేలరీలు ఎక్కువ .
ü  Anti-oxidants ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి . కాన్సర్ రాకుండా కాపాడతాయని తేలినది .
 బాదాం
ఆరోగ్యానికి బాదాం ఎలా సహాయపడుతుంది ?
మనలో చాలామంది.. ప్లాంట్స్ ద్వారా ఆహారం పొందడానికి ప్రయత్నిస్తాం. మొక్కలు, చెట్ల ద్వారా వచ్చే ఆహారం ద్వారా రకరకాల పోషకాలు పొందవచ్చు. అనేక మొక్కల ఉత్పత్తులు, ఆకులు, పండ్లు, కూరగాయల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తాయి.

బాదాంలో కూడా చాలా గొప్ప పోషక విలువలు ఉంటాయి. ఆల్మండ్స్ గ్రేట్ బెన్ఫిట్స్ ఉంటాయని సైన్స్ నిరూపించింది. బ్రెయిన్ గ్రోత్ కి ఇవి చాలా సహాయపడతాయని.. అధ్యయనాలు నిరూపించాయి. కాబట్టి బాదాం గింజలు తినడం వల్ల.. మెదడు గ్రోత్ కి, ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.

చిన్నపిల్లల డైట్ లో కంపల్సరీ బాదాం చేర్చడం వల్ల వాళ్లలో ఏకాగ్రత బాగా పెరుగుతుంది. అలాగే.. బాదాం తినడం వల్ల బ్రెయిన్ కి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
లీన్ ప్రొటీన్స్
బాదాంలో లీన్ ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడుకి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఎనర్జీ అందించడంతో పాటు, బ్రెయిన్ సెల్స్ ని రిపేర్ చేస్తాయి. అలాగే ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెమరీని పెంచుతాయి.

జింక్
జింక్ మినరల్ తో పొందే ప్రయోజనాలు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది ముఖ్యంగా బ్రెయిన్ కి చాలా అవసరం. ఇమ్యున్ సిస్టమ్ ని బలంగా మార్చడమే కాకుండా.. బలమైన యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేసి.. బ్లడ్ లోని ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ఫ్రీరాడికల్స్ ని తగ్గించడం వల్ల.. బ్రెయిన్ హెల్త్ మెరుగుపడుతుంది. బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవడానికి ఇదొక ముఖ్యకారణం. కాబట్టి రెగ్యులర్ డైట్ లో బాదాం చేర్చుకుంటే.. వీటిని అరికట్టవచ్చు.

విటమిన్స్
బాదాంలో ఎక్కువ మొత్తంలో విటమిన్స్ ఉంటాయి. ఇవి బ్రెయిన్ ఆరోగ్యకరంగా పనిచేయడానికి ముఖ్యమైన పదార్థాలు. విటమిన్ బి6 బాదాంలో లభిస్తుంది. ఇది.. మనుషుల డైట్ లో చాలా ముఖ్యమైనది. ఇది బ్రెయిన్ హెల్త్ ని మెరుగుపరుస్తుంది. బాదాం తినడం వల్ల విటమిన్ ఈ కూడా అందుతుంది. మెదడు ఏజింగ్ ప్రాసెస్ ని తగ్గిస్తుంది. దీనివల్ల మనుషి ఏజ్ తోపాటు.. బ్రెయిన్ ఏజ్ పెరగకుండా ఉంటుంది. మెమరీ కెపాసిటీ పెంచుతుంది.

ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తెలివితేటలను పెంచుతాయి. హెల్త్ డ్రింక్స్ లో ఒక మోతాదులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బాదాం ద్వారా న్యాచురల్ గా పోషకాలు పొందవచ్చు.

ఇలాంటి బలమైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగా.. బాదాం.. మెదడుకు పోషణ అందిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మీరు తినడంతో పాటు, పిల్లలకు ఖచ్చితంగా రెగ్యులర్ గా బాదాం ఇవ్వాలి.

బాదం పప్పులు శరీరానికి సంజీవనిలాంటిది. శిరోజాలు, ఎముకలు, మెదడు ఇలా శరీరంలోని వివిధ భాగాలను ఇవి ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. రాత్రంతా నానబెట్టి పొద్దున్నే బాదం పప్పులు తింటే మంచిదని డైట్‌ నిపుణులు తరచూ చెబుతుంటారు.ఇలా చేస్తే రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉంటారట. ఎంతో ఆరోగ్యదాయిని అయిన బాదం పప్పులను రకరకాలైన వంటకాలలో కూడా వాడొచ్చు. ఇలా చేయడం వల్ల రుచికి రుచి, పోషకాలకు పోషకాలు రెండూ పొందుతాము. 

శరీరానికి కావలసిన పోషకాలు కూడా బాదం నుంచి అందుతాయి. సలాడ్స్‌, డెజర్టుల్లోనే కాకుండా బాదంను ప్రధాన వంటకాల్లో కూడా కలుపుకోవచ్చు. గ్రేవీ టైపులో చికెన్‌నువండేటప్పుడు అందులో మెత్తగా చేసిన బాదం, జీలకర్ర మిశ్రమాన్ని జోడిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. 

ఇంకా చేపల కూరలో కూడా బాదంపప్పు పేస్టును వాడొచ్చు. ఇక బాదం పప్పులు లేని సలాడ్‌ వేస్ట్‌ అని చెప్పవచ్చు. సూప్స్‌ రుచి మరింత పెరిగేందుకు కూడా వాటిల్లో బాదంను వాడతారు. కూరల్లోని గ్రేవీ చిక్కగా ఉండేందుకు బాదం పేస్టు జోడిస్తారు. ఇలా బాదమ్‌ను జోడించడం ద్వారా రుచితో పాటు శరీరానికి పోషకాలు లభిస్తాయి

బాదం పప్పు యొక్క పోషక విలువలు
143 గ్రాముల బాదం పప్పులో ఉండే పదార్థాల పోషక విలువలు 
తేమ                        6.31గ్రాం
ప్రోటిను                    30.24గ్రాం
పిండిపదార్థాలు            30.82గ్రాం
చక్కెర                      6.01గ్రాం
పీచుపదార్థం     17.9
శక్తి                828Kcal
మొత్తం ఫ్యాట్    71.4గ్రాం
బాదం పప్పులో ఐరన్(ఇనుము),కాల్షియం,మెగ్నిసియం,జింకు,ఫాస్పరసు మరియు సోడియం ఖనిజాలు విరివిగా ఉన్నాయి.
 జీడిపప్పు
మితాహారం ఆరోగ్యానికి అందమైన సూత్రం. జిహ్వ చాపల్యం పక్కన పెడితే.. ప్రకృతి ప్రసాదించిన ప్రతి పదార్థం ఆరోగ్య ప్రదాతే. జీడిపప్పు కూడా అదే కోవలోకి వస్తుంది. చాలా మంది అధిక కేలరీలు ఉండే కాజూ తింటే ఒళ్లు వచ్చేస్తుందని భయపెడుతుంటారు. కానీ, జీడిపప్పు చేసే మేలు గురించి చెబితే ఆ మాటను వెనక్కి తీసుకోవాల్సిందే.

మానవ శరీరానికి అన్ని రకాల పోషక విలువలు కావాలి. జీడిపప్పులో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వు పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. తరుచూ వీటిని తీసుకోవడం వల్ల గుండె కూడా పదిలంగా ఉంటుంది. 

మానవ శరీరానికి రోజుకు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నిషియం అవసరం అవుతుంది. జీడిపప్పులో 29 శాతం మెగ్నిషియం ఉంటుంది. ఇది ఎముకలకు, కండరాలకు పటుత్వం కలిగించడంతో పాటు కీళ్ల నొప్పులను అరికడుతుంది.

జీడిపప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాజు ద్వారా ఒంట్లోకి చేరిన పొటాషియం రక్తప్రసరణపై అనుకూలమైన ప్రభావం చూపుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

క్యాన్సర్‌ను ఎదిరించే స్వభావం కూడా జీడిపప్పులో ఉంది. వీటిలో ఉండే సిలీనియమ్‌, విటమిన్‌-ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు రాడికల్‌ ఆక్సిడేషన్‌కు విరుగుడుగా పనిచేస్తాయి. క్యాన్సర్‌ రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. జీడిపప్పులో లభించే జింక్‌.. ఇన్‌ఫెక్షన్లపై పోరాడుతుంది.

జీడిపప్పులో కాపర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది ఎంజైమ్‌ల పనితీరులో కీలకంగా వ్యవహరిస్తుంది. మెదడు చురుకుగా ఉండటంలోనూ సాయపడుతుంది. హార్మోన్ల ఉత్పత్తిని బ్యాలెన్స్‌ చేయటంతోపాటు.. అనీమియా వ్యాధి రాకుండా ప్రివెన్షన్‌ మెడిసిన్‌గా పని చేస్తుంది.

జీడిపప్పు మేలు చేస్తుందని అదేపనిగా తినేయకండి. రోజులో 4 నుంచి 8 కాజులు, అదీ ఒకేసారిగా కాకుండా నాలుగైదుసార్లు తినడం వల్ల మీ శరీరానికి కొత్త శక్తి వస్తుంది. స్వీట్ల రూపంలో కూడా కాజూను తీసుకోవచ్చు. అయితే అది కూడా మితంగానే.

జీడిపప్పు లో క్రొవ్వు, నూనె పదార్థాలు 54% మోనో అన్ సేచ్యురేటెడ్ కొవ్వు (18:1),18% పోలి అన్ సేచ్యురేటెడ్ కొవ్వు(18:2),మరియు 16% సేచ్యురేటెడ్ కొవ్వు(9% పల్మిటిక్ ఆమ్లం(16:0)మరియు 7 % స్టేరిక్ ఆమ్లము(18:O)) ఉంటాయి
జీడిపప్పులో పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి 550 kcal   2310 kJ
పిండిపదార్థాలు                                30.19 g
చక్కెరలు                                      5.91 g
పీచుపదార్థాలు                                3.3 g 
కొవ్వు పదార్థాలు                              43.85 g
మాంసకృత్తులు                                18.22 g
థయామిన్ (విట. బి1)                        0.42 mg        32%
రైబోఫ్లేవిన్ (విట. బి2)                         0.06 mg        4%
నియాసిన్ (విట. బి3)                         1.06 mg        7%
పాంటోథీనిక్ ఆమ్లం (B5)                    0.86 mg        17%
విటమిన్ బి6                                  0.42 mg        32%
ఫోలేట్ (Vit. B9)                             25 μg           6%
విటమిన్ సి                                    0.5 mg          1%
కాల్షియమ్                                    37 mg          4%
ఇనుము                                       6.68 mg        53%
మెగ్నీషియమ్                                 292 mg         79%
భాస్వరం                                      593 mg         85%
పొటాషియం                                 660 mg         14%
జింకు                                          5.78 mg        58%

 ఎండుద్రాక్ష
ఆరోగ్యకర ఉపయోగాలు
ü  దంత రక్షణ : ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బాక్టీరియా ను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది
ü  కళ్ళకు మంచిది: ఎండు ద్రాక్షలో ఉన్న పాలీఫినాలిక్ ఫైటో నూట్రియంట్శ్ మూలాన యాంటీఅక్షిడెంట్ గా పనిచేస్తుంది . బీటాకెరొటీన్‌ , కెరొటనోయిడ్స్ కళ్ళకు మంచిది.
ü  ఎముకులకు రక్షణ: కాల్సియం, బోరాన్‌ ఎముకలు తయారీకి , గట్టిపడడానికి ఉపయోగ పడుతుంది .
ü  సెక్షువల్ వీక్నెస్: లిబిడో ను ఎక్కువ చేసే అమినో యాసిడ్ ఆర్జినిన్‌ ఇందులో ఉన్నది. దాంపత్య జీవితం లోని నిరాస నప్రుహలను తొలగించును
ü  జ్యరము: ఫినోలిక్ ఫైటోన్యూట్రియంట్స్ జెర్మిసైడల్ గా పనిచేయును . మంచి యాంటీఅక్షిడెంట్ గా పనిచేయుటవల ఫీవర్ తగ్గే అవకాశము ఉంది
ü  రక్తహీనత: ఒక మోతాదులో ఐరన్‌ & బీకాంప్లెక్ష్, కాపర్ కిస్మిస్ లో ఉన్నందున రక్తహీనతను సరిచేయును
ü  ఎసిడోసిస్: ఇందులో ఉన్న పొటాసియం , మెగ్నీషియం పుష్కలముగా లబించును కావున ఎసిడోసిస్ రాకుండా నియంత్రించును
ü  శరీర బరువు: కిస్మిస్ లో ఉన్న ఫ్రక్టోజ్, గ్లూకోజ్ అధిక శక్తిని ఇచ్చి బరువును పెంచే దిశగా శక్తి మూలకముగా పనిచేయును . తక్కువ బరువు గల వ్యక్తులు డ్రై ఫ్రూట్స్ గా ఎండుద్రాక్షను తింటే మంచిది
ü  మలబద్దకం: ఎండు ద్రాక్షలో ఫిబర్ పుష్కలముగా ఉన్నందున విరోచనము సాఫీగా జరుగును . మలబద్ద్కం ఉన్నవారు కిస్మిస్ తింటే సరిపోతుంది .

రోజూ ఉదయాన్నే గుప్పెడు ఎండుద్రాక్ష తింటే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!
ఎండుద్రాక్ష చూడ్డానికి సన్నగా ఉన్నా.. అందులోని పోషకాలు అమోఘం. ఎండుద్రాక్షలో విటమిన్ బి, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ ఎండు ద్రాక్ష టేస్టీగానే కాదు, తేలికగా తినవచ్చు. అలాగే కార్బోహైడ్రేట్స్ కావాల్సిన మోతాదులో పొందవచ్చు. దీనివల్ల రోజంతటికీ కావాల్సిన ఎనర్జీ అందుతుంది.

ప్రతిరోజూ ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఒబేసిటీ, గుండె సంబంధిత సమస్యలు, డయాబెటిస్ వంటివి అడ్డుకోవచ్చు. సాధారణంగా బాదాం ప్రతిరోజూ తినాలని సూచిస్తుంటారు. ఎప్పుడూ అవే అంటే..బోర్ అనిపిస్తుంది. కాబట్టి ఎండుద్రాక్షని.. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తో పాటు తీసుకోవడం లేదా.. సాయంత్రం స్నాక్స్ గా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

 రాత్రంతా నానబెట్టిన ఎండుద్రాక్ష
ఎండు ద్రాక్షలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి అనీమియా నివారించడంలో గ్రేట్ గా సహాయపడతాయి. కాబట్టి అనీమియాతో బాధపడేవాళ్లు.. రాత్రంతా గుప్పెడు ఎండుద్రాక్షను నానబెట్టి.. ఉదయాన్నే తీసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

ఎండుద్రాక్షతోపాటు, వెల్లుల్లి
ఎండుద్రాక్ష ద్వారా పొటాషియం ఎక్కువగా పొందవచ్చు. ఇది.. బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బీపీతో బాధపడేవాళ్లు.. ఒక టీస్పూన్ ఎండుద్రాక్ష, ఒక వెల్లుల్లి రెబ్బను రెగ్యులర్ గా తీసుకుంటే.. మెరుగైన ఫలితాలు చూస్తారు.

ఓట్స్ లో ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలో ఎక్కువ మోతాదులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల క్యాన్సర్ తో పోరాడతాయి. కాబట్టి ఉదయం బ్రేక్ ఫాస్ట్ రూపంలో ఒక కప్పు ఓట్ మీల్ లో.. గుప్పెడు ఎండుద్రాక్ష మిక్స్ చేసి తీసుకోవడం మంచిది.

పాలు, ఎండుద్రాక్ష
ఎండుద్రాక్ష జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కాన్ట్సిపేషన్ ని నివారిస్తాయి. ఈ సమస్య నివారించడానికి గుప్పెడు ఎండుద్రాక్షను ఒక కప్పు పాలలో ఉడికించి.. రాత్రి పడుకోవడానికి గంట ముందు తినాలి.

సాయంత్రం స్నాక్స్
ఎండుద్రాక్షలో స్ట్రాంగ్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి.. జ్వరం తగ్గించడంలో సహాయపడతాయి. గుప్పెడు ఎండుద్రాక్షను సాయంత్రం స్నాక్స్ రూపంలో తీసుకోవడం వల్ల.. ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ అయినా తగ్గిపోతుంది.
సలాడ్ తో పాటు
ఎండుద్రాక్షలో బోరాన్ ఉంటుంది. ఇది.. కీళ్ల నొప్పులను నివారిస్తాయి. ఒక ప్లేట్ సలాడ్ పై ఎండుద్రాక్షను మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల పోషకాలు అందుతాయి. కీళ్ల నొప్పులు నివారించవచ్చు.

డిజర్ట్ లో ఎండుద్రాక్ష
ఎండుద్రాక్షలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది.. కంటిచూపు స్ట్రాంగ్ గా ఉండటానికి సహాయపడుతుంది. డిజర్ట్ లో గుప్పెడు ఎండుద్రాక్ష మిక్స్ చేసి తీసుకుంటే.. అద్భుతమైన రుచితో పాటు, పోషకాలు అందుతాయి.


కర్జూరం
ప్రతి రోజూ 10 కర్జూరాలు తింటే పొందే 16 అమేజింగ్ బెన్ఫిట్స్..!!
రోజంతా యాక్టివ్ గా, హెల్తీగా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే.. కర్జూరాలు సరైన ఎంపిక అని నిపుణులు సూచిస్తారు. విటమిన్స్, ఎమినో యాసిడ్స్, క్యాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు.. రోజంతా ఎనర్జీటిక్ గా ఉండటానికి సహాయపడతాయి. డేట్స్ టేస్టీగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా అమోఘమైన ప్రయోజనాలు అందిస్తాయి. డేట్స్ ని ఎలా తినాలి, ఎంత పరిమాణంలో తినాలి అనేదానిపై చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే.. రోజుకి కనీసం 8 నుంచి 10 డేట్స్ ని ఉదయాన్నే తినడం వల్ల శరీరానికి మిరాకిలస్ బెన్ఫిట్స్ అందుతాయని తాజా అధ్యయనాలు చెబతున్నాయి. ఇవి చర్మం సౌందర్యానికి నుంచి ఇమ్యునిటీ మెరుగుపరచడానికి, కంటిచూపుని మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంతేకాదు.. రోజుకి 10 డేట్స్ తినడం వల్ల పొందే 16 అమోఘమైన ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..
·        గాయాలకు: గాయాలు అయినప్పుడు.. కొన్ని డేట్స్ ని క్రష్ చేసి.. పెరుగులో బాగా కలిపి తీసుకోవడం వల్ల.. వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
·        ఎనర్జీ: రోజు 5 కర్జూరాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల.. రోజంతా ఎనర్జీని అందిస్తాయి.
·        నిద్రకు: రాత్రి నిద్రపోవడానికి ముందు డేట్స్ తిని ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. అలాగే ఉదయాన్నే ఎనర్జిటిక్ గా ఉంటారు.
·        ఇమ్యునిటీకి: కర్జూరాలతో పాటు.. పాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందించి, ఇమ్యునిటీని మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే జింక్ ఇమ్యునిటీని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
·        సలాడ్స్ లో డేట్స్: కర్జూరాలను ఫ్రూట్ సలాడ్ తోపాటు మిక్స్ చేసి తీసుకోవడం వల్ల న్యూట్రిషియంట్ వ్యాల్యూ పెరుగుతుంది.
·        బరువు తగ్గడానికి: కర్జూరాల్లో షుగర్, ప్రొటీన్ ఉంటుంది. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి.
·        తక్షణ శక్తిని: కర్జూరాల్లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సక్రోజ్ ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
·        హార్ట్ ప్రాబ్లమ్స్: డేట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ని దూరం చేస్తాయి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి.. ఇవి గుండెకు మంచిది.
·        కీళ్లు, కండరాల నొప్పులకు: కర్జూరాల్లో క్యాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి ఇవి జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కండరాలకు శక్తిని అందిస్తాయి.
·        కాన్ట్సిపేషన్: డేట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాన్ట్సిపేషన్ నివారించడానికి సహాయపడుతుంది. అలాగే.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహకరిస్తుంది.
·        అనీమియా డేట్స్: అనీమియా నివారించడానికి ఎఫెక్టివ్ గా సహాయపడతాయి. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య దరిచేరదు.
·        కంటిచూపుని: విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ డేట్స్ లో ఉండటం వల్ల.. కంటిచూపుని మెరుగుపరుస్తాయి.
·        బీపీ: డేట్స్ లో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల.. బీపీని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా డేట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది.
·        చర్మానికి: కర్జూరాలు చర్మానికి కూడా మంచిది. ఎందుకంటే.. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
·        ఇన్ఫెర్టిలిటీ: కర్జూరాల్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి.. ఇవి ఇన్ఫెర్టిట్స్ ని నివారించడానికి సహాయపడతాయి.
·        పింపుల్స్: డేట్స్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల యాక్నె, పింపుల్స్ ను నివారిస్తాయి.

ఖర్జూరం +పాలలో దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!!
మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అంధించే సర్ ప్రైజింగ్ డ్రై ఫ్రూట్ ఖర్జూరం. డేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఈజిప్ట్ ప్రదేశాల్లో చాలా ఫేమస్. ఇందులో ఉండే అద్భుతమైన న్యూట్రీషియన్ విలువల వల్ల ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. డ్రైఫ్రూట్స్ లో బాగా ఫేమస్ అయినటువంటి ఈ ఫ్రూట్ లో నేచురల్ స్వీట్నెస్ కలిగి ఉంటుంది. అద్భుత పోషక విలువలుండటం చేత వీటిని వివిధ రకాల స్వీట్ డిష్ లలో జోడిస్తుంటారు.

డేట్స్ లో లో నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల డయాబెటిక్ పేషంట్స్ కు ఇది ప్రకృతి ప్రసాధించిన ఒక వరం అని చెప్పవచ్చు. డయాబెటిక్ పేషంట్స్ డేట్స్ తినడం వల్ల షుగర్ లెవల్స్ లో ఎలాంటి మార్పులు ఉండవు. షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వారిలో స్వీట్స్ తినాలన్న కోరికను తగ్గిస్తుంది. అయితే ఇందులో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. మితంగా తీసుకోవడం మంచిది.

ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. కర్జూరాలను స్టోర్ చేయడం చాలా సులభం. కర్జూరాలు మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ధర చాలా తక్కువ. ఈ కర్జూరాల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ తో పోల్చితే కర్జూరంలో అధిక ఎనర్జీ కలిగించే పోషకాలు, క్యాలరీలు మెండుగా ఉన్నాయి. 100 గ్రాముల కర్జూరంలో 280క్యాలరీలు అందుతాయి. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. ఖర్జూరంలో మెడిసినల్ విలువలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి. మరి డేట్స్ జ్యూస్ ను ఎలా తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల పొందే అమేజింగ్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉండి సన్నగా ఉండే వారికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి. అలాగే కర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసి తాగడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రిషియన్స్ అధికంగా అందుతాయి. దాంతో రోజంతా పనిచేయడానికి కావల్సిన శక్తి అందుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు..మూడ్ సరిగా లేనప్పుడు చాక్లెట్స్ కు బదులు కర్జూరాలను తినడం వల్ల మంచి మూడ్ తో ఉత్సాహంగా పనిచేయగలరు.ఒక గ్లాసు డేట్ జ్యూస్ లో ఆరోగ్యనికి అందానికి సంబంధించిన ప్రయోజనాలు ఎన్నో దాగున్నాయి. మరి అవేంటో ఒక సారి తెలుసుకుందాం...
·        స్కిన్ కు మంచి గ్లో వస్తుంది: డేట్ జ్యూస్ ను రెగ్యురల్ గా తాగడం వల్ల చర్మానికి పోషణ బాగా అందుతుంది. దాంతో చర్మానికి మంచి గ్లో వస్తుంది.
·        చర్మంకు పోషణ అందుతుంది: డేట్ జ్యూస్ రెగ్యులర్ గా తాడం వల్ల రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది. కాబట్టి, డేట్ జ్యూస్ ను బయట కొనడం కంటే ఇంట్లో స్వయంగా తయారుచేసుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఫ్రెష్ జ్యూస్ వల్ల పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి.
·         హెయిర్ స్ట్రక్చర్ స్మూత్ గా మరియు థిక్ గా మారుతుంది: రోజూ కొన్ని డేట్స్ తినడం లేదా డేట్స్ తో తయారుచేసిన జ్యూస్ తాగడం వల్ల జుట్టుకు అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఎలాంటి సందేహం లేకుండా ఇది జుట్టును ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. అలాగే జుట్టు స్మూత్ గా తయారవుతుంది.
·         జుట్టు హెల్తీగా ఉంటుంది: డేట్స్ జ్యూస్ జుట్టు హెల్తీగా పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది . జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే విటమిన్స్ ఎక్కువ అందిస్తుంది. ముఖ్యంగా విటమిన్ బిను ఎక్కువ అందిస్తుంది.
·         నేచురల్ లేబర్ : గర్భధారణ సమయంలోనే కాదు, గర్భం పొందక ముందు నుండే రెగ్యులర్ డైట్ లో డేట్స్ చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందుతారు . అలాగే గర్భణికి గర్భాధారణ కాలంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ప్రసవం నేచురల్ గా జరగుతుంది. డేట్స్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మహిళల్లో హార్మోన్ ఆక్సిటోసిన్ ను క్రమబద్దం చేస్తుంది.
·         క్యాన్సర్ నివారిస్తుంది: డేట్ ఫ్రూట్స్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. కాబట్టి, యవ్వనంలో ఉన్నవారు మాత్రమే కాదు అడల్ట్స్ తాగడం వల్ల కూడా క్యాన్సర్ ను నివారించుకోవచ్చు .
·         బరువు పెరగడానికి సహాయపడుతాయి: మరీ సన్నగా ఉన్నవారు. బరువు పెరగాలని కోరుకునే వారు, డేట్స్ జ్యూస్ లోని షుగర్స్ మరియు కార్బోహైడ్రేట్స్ బరువు పెరగడానికి సహాయపడుతాయి.
·         గ్రేట్ లాక్సేటివ్ : పురాతన కాలం నుండి, మలబద్దక నివారణకు డేట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకునే వారు. డేట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటం వల్ల ఇది గ్రేట్ లాక్సేటివ్ గా పనిచేస్తుంది.
·         యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి: డేట్స్ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది శరీంరలో ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. ఇది యాంటీ క్యాన్సర్ లక్షణాలను మరియు యాంటీ ఏజింగ్ సామర్థ్యంను అందిస్తుంది.
·         బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: డేట్స్ లో ఉండే డైటరీ ఫైబర్ శరీరంలో ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ (బ్యాడ్ కొలెస్ట్రాల్ )లెవల్స్ ను తగ్గిస్తుంది.
·         దంతాలు మరియు బోన్ హెల్త్ ను మెయింటైన్ చేస్తుంది: డేట్స్ జ్యూస్ లో క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్ మరియు కాపర్ ఎక్కువ. కాబట్టి, దంతాలు మరియు బోన్ హెల్త్ ను ప్రోత్సహించడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ఏర్పడుటకు సహాయపడుతుంది.

ఎండు ఖర్జూరం, పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
శక్తి                     280 kca (1180 kJ)
పిండిపదార్థాలు        75 g
చక్కెరలు              63 g
పీచుపదార్థాలు        8 g 
కొవ్వు పదార్థాలు      0.4 g
మాంసకృత్తులు        2.5 g
నీరు                   21 g
విటమిన్ సి            0.4 mg 1%

 వాల్ నట్స్‌
వాల్ నట్స్(అక్రోట్లు)లో ఉండే సకల సౌందర్య రహస్యాలు
వాల్ నట్స్(అక్రోట్లు)పై పొట్టు తొలగించినప్పుడు, లోపలి ఉన్న విత్తనం చూస్తే అచ్చం బ్రెయిన్ ఆకారంను కలిగి ఉండటం చూస్తే, ఆశ్చర్యం కలగకమానదు. అనుకోకుండా ఇలా ఉండం చాలా ఆశ్చర్యం కలిగించడం మాత్రమే కాదు, బ్రెయిన్ ఆకారంలో ఉండే ఈ గింజలు, డ్రైఫ్రూట్స్ బ్రెయిన్ పవర్ ను పెంచుతాయి. బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. walnut ని తెలుగు లో అక్రూట్ కాయ గింజలు అంటాము . వాల్ నట్ శాస్త్రీయ నామము " జుగ్లాన్స్ రెజియా (jugulans Regia) అంటారు . ఇందులో ఎన్నో రకాల జాతులు (species) ఉన్నాయి. వయసు తో పాటు కొన్నీ శారీరక రుగ్మతలు ఏర్పడి ఇబ్బంది పెడుతుంటాయి . వాటిని ముందుగానే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే అదపులో ఉండి జీవితతం సాఫీగా సాగిపోతుంది. పౌష్టికాహారపదార్ధములలో వాల్ నట్స్ (అక్రోట్ కాయల గింజలు) వలన ఎన్నో ప్రయోజనాలు కలవని నిర్ధారణ అయినది. ఆరోగ్యానికి మాత్రమే కాదు సౌందర్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మరి ఇలా ఫ్రూట్, డ్రైనట్ లోని ప్రయోజనాలను మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ బ్యూటీ మీద ఏవిధంగా ప్రభావితం చేస్తుందో ఈ క్రింది విధంగా తెలుసుకోండి....
ü  వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది; వాల్ నట్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇదిచర్మం యొక్క పునరుత్పత్తిని మరియు స్థితిస్తాపకతను ప్రోత్సహిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ ఫ్రూట్ చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది మరియు సెల్ డ్యామేజ్ ను రిపేర్ చేస్తుంది, ఇంకా, స్కిన్ టోన్ మెరుగుపరచి, వృద్ధాప్య ఛాయలు కనబడనివ్వకుండా, చర్మం ప్రకాశంతంగా కనబడేలా చేస్తుంది. ముఖంలో చారలు, ముడుతలు లేదా స్పాట్స్ వంటి వాటిని నివారించుకోవడానికి వాల్ నట్స్(అక్రోట్స్)ను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొని ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందాలి.  
ü  స్వచ్చమైన మరియు ప్రకాశించే చర్మం: వాల్ నట్స్ లో కెమికల్ లక్షణాలున్నాయి, ఇవి శరీరంలో బ్లడ్ సర్కులేషన్ ను పెంచుతాయి, అందువల్ల శరీరంలో ప్రతి ఒక్క కణానికి, కణజాలనిక ఆక్సిజెన్ మరియు న్యూట్రీషియన్ ను సరఫరా చేస్తుంది. ఇది రక్తప్రసరణకు బాగా సహాయపడుతుంది. దాంతో చర్మం ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మెరుస్తుండాటానికి సహాయపడుతుంది. ఒక రోజులో స్నాక్స్ సమయంలో మూడు, నాలుగు వాల్ నట్స్ తింటే, మీ చర్మం హెల్తీగా, కాంతివంతంగా ఉండేందుకు సహాయపడుతుంది.  
ü  స్కిన్ ఇన్ఫెక్షన్ నివారించే వాల్ నట్ ఆయిల్: చర్మం అందంగా మరియు ప్రకాశవంతంగా మార్చడంలో వాల్ నట్ డ్రై ఫ్రూట్ చాలా సహాయపడుతుంది. వాల్ నట్ లో ఉండే ఆయిల్ లక్షణాలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి. వాల్ నట్ ఆయిల్లో, యాంటీ ఫంగాల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అథ్లెటిస్ వారి పాదు, పోరియాసిస్ మరియు కాండిడ వంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను చాలా గ్రేట్ గా నివారిస్తాయి. వెల్లుల్లి వంటి యాంటీ ఫంగల్ పదార్థాలతో మిక్స్ చేసి, అప్లై చేయడం వల్ల గాయాలను త్వరగా నయం చేస్తాయి.  
ü  మంచి స్కిన్ స్ట్రక్చర్: వృద్ధాప్యంతో పోరాడటం మాత్రమే కాదు, మీ చర్మంను కాంతివంతగా మార్చడంలో వాల్ నట్స్ మొత్తం చర్మం ఆరోగ్యానికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, స్కిన్ డ్యామేజ్ ను ఎదుర్కొంటాయి. వీటితో పాటు, వాల్ నట్ లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్ సెల్స్ ను బలోపేతం చేస్తాయి, చర్మానికి తగినంత తేమను అందిస్తాయి. మరియుచర్మంలోని మలినాలను తొలగిస్తాయి. మరియు ఈ నట్స్ లో ఉండే ప్రోటీనులు ఎముకలను బలోపేతం చేస్తాయి . కొలెజాన్ ఉత్పత్తికి సపోర్ట్ చేస్తాయి.  
ü  అందమైన మరియు స్ట్రాంగ్ హెయిర్: వాల్ నట్ ఆయిల్ ను ఒక సుగంధ భరిత నూనెవలే అనేక హెయిర్ ప్రొడక్ట్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్ జుట్టును బ్లాక్ గా మరియు ప్రకాశవంతంగా మార్చుతాయి . ఎందుకంటే వాల్ నట్ లో ఉండే బయోటిన్, న్యూట్రీషియన్స్ హెయిర్ ను స్ట్రాంగ్ గా మరియు వాల్యూమినస్ గా చేస్తాయి . వాల్ నట్ లో ఇంకా ప్రోటీనులు హెయిర్ రూట్స్ ను బలోపేతం చేస్తాయి . వాల్ నట్ ఆయిల్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా మరియు బ్యూటిఫుల్ గా మారుతాయి.  
ü  ప్రశాంతమైన నిద్ర పట్టేలా చేస్తాయి: అవును, వాల్ నట్ మూడ్ ను పెంచుతుంది. ఎందుకంటే, ఇందులో విటమిన్ బి, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి మూడ్ ను పెంచుతుంది. డిప్రెషన్ ను నివారిస్తుంది. అలసట, ఆందోళన మరయు నిద్రలేమి సమస్యలను కూడా నివారిస్తుంది. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో వాల్ నట్స్ ను చేర్చుకోవాలి, టెన్షన్ లేకుండా మంచి నిద్రను పొందవచ్చు. ఎందుకంటే నిద్రలేమి వల్ల కళ్ళక్రింది ఉబ్బు, ముడుతలు మరియు బరువు పెరగడం వంటి సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.  
ü  గర్భధారణ సమయంలో మంచిది:  వాల్ నట్స్ లో విటమిన్ బి కాంప్లెక్స్ మూలాలు ఉండటం వల్ల ఇవి మన శరీరానికి అవసరం అయ్యే ఫొల్లెట్, రిబోఫ్లెవిన్, థయమిన్ మరియు ఇతర అంశాలను కూడా అందిస్తుంది. వాల్ నట్స్ లో మెగ్నీషియం, ప్రోటీనులు, హెల్తీ ఫైబర్, మరియు ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉండటం వల్ల గర్భిణీ మహిళలకు చాలా మేలు చేస్తుంది. అలాగే కడుపులో బిడ్డకు కూడా మేలు చేస్తుంది . ఇంకా వాల్ నట్ ఆయిల్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల ఆరోగ్యానికి మరియు అందానికి మంచిది.  
ü  బరువు తగ్గిస్తుంది: అన్ని రకాలుగాను ఉపయోగపడే వాల్ నట్, చర్మానికి ఒక రూపును, వ్యాధినిరోధకతను పెంచడం మాత్రమేకాదు, ఇది బరువు తగ్గించుటలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ఎక్కువ కంటెంట్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్స్ వల్ల ఇది బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఇది శరీరంలో కొవ్వు చేరకుండా నిరోధిస్తుంది.  
ü  బ్రెయిన్ హెల్త్: మెదడు సామర్థ్యాన్ని,జ్ఝాపక శక్తిని పెంచి మెదడు చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుంది . మతిమరపును నివారిస్తుంది . మరి బ్రెయిన్ పవర్ పెంచుకోవాలంటే, ప్రతి రోజూ కొన్ని వాల్ నట్స్ ను తీసుకోవడం ఉత్తమం . వాల్ నట్స్ ఆక్సిజన్ మరియు న్యూట్రీషియన్స్ ను రక్తంకు సరఫరా చేయడంతో శరీరం అంతా ప్రసరణ జరుగుతుంది.  
ü  వ్యాధినిరోధకత పెంచుతుంది: వాల్ నట్స్ లో మంచి ఫ్యాట్, విటమిన్స్, ప్రోటీనులు మరియు ఇతర న్యూట్రీషియన్స్ కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . మీలో వ్యాధినిరోధకతను పెంచడంలో, మొత్త శరీరం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. వాల్ నట్స్ హార్ట్ డిసీజ్, కొన్ని రకాల క్యాన్సర్లను ఎదుర్కొంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, జీవక్రియలు పనిచేసే సామర్థ్యాన్ని పెంచతుంది . వాల్ నట్ చర్మం క్లియర్ గా మార్చుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.
ఆకుకూరలు, వాల్ నట్స్‌తో మతిమరుపుకు చెక్!
మతిమరుపుకు విటమన్స్, ప్రోటీన్స్ లోపం కారణం కావొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉండే తాజాగా, గ్రీన్ ఆకుకూరలు, కూరగాయలతో పాటు బెర్రీ ఫ్రూట్స్ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. 

బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం.. మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్‌లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. తద్వారా మతిమరుపు దూరమవుతుంది. ఇవి డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఎంతో మేలు చేస్తాయి. 

అలాగే బాదం, వాల్ నట్స్‌ ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యంగా పనిచేసేందుకు తోడ్పడుతుంది. వాల్ నట్స్, బాదం ఎక్కువగా తీసుకొనే వారిలో మెమరీ సామర్థ్యం సమర్థవంతంగా ఉంటుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. 

కూరగాయలు, ఆకుకూరలు, ఆకుకూరలు, బ్రొకోలీ, కాలీఫ్లవర్, మొలకెత్తిన విత్తనాలు వంటివి మెదడుకు కావల్సిన శక్తి ఇవ్వడమే కాకుండా అందుకు ఉపయోగపడే విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉండి మొత్తం శరీర వ్యవస్థకు సహాయపడుతాయి. ఇవి మెమరీ పవర్‌ను పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
వాల్ నట్స్, సోయాబీన్ తో డయాబెటీస్ దూరం!
ఇటివల వయసుతో సంబంధం లేకుండా డయాబెటీస్ సమస్య అందరినీ వేధిస్తోంది. ప్రస్తుతం మధుమేహం బారిన పడిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం డయాబెటీస్ కు దారి తీస్తోంది. అయితే తాజాగా అమెరికాకు చెందిన టఫ్ట్స్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో వాల్ నట్స్, సోయాబీన్స్ తరచూ తీసుకుంటే డయాబెటీస్ దూరమవుతోందని తేలింది. ఈ విషయాన్ని ఆ యూనివర్సిటీ పీఎల్ఓఎస్ మెడికల్ జర్నల్ లో తెలిపారు. 

వాల్ నట్స్ పోషక విలువలు ప్రతి 100 గ్రాములకి
శక్తి                                2,738 kJ (654 kcal)
కార్బోహైడ్రెట్స్               13.71
పిండి పదార్థం              0.06
చక్కెర                       2.61
పీచు పదార్థం              6.7
కోవ్వు                                 65.21
Saturated                          6.126
Monounsaturated                8.933
Polyunsaturated                 47.174
ప్రోటిన్                      15.23
విటమిన్స్
విటమిన్ A equiv                   (0%) 1 μg
బీటా- కెరోటిన్                       (0%) 12 μg
lutein zeaxanthin                 9 μg
విటమిన్ A                           20 IU
థియామిన్ (B1) (30%)             0.341 mg
రైబోఫ్లెవిన్ (B2) (13%)             0.15 mg
నియాసిన్ (B3) (8%)               1.125 mg
పాంతోతెనిక్ యాసిడ్ (B5) (11%) 0.570 mg
విటమిన్ B6 (41%)                 0.537 mg
ఫోలెట్ (B9) (25%)                98 μg
విటమిన్ B12 (0%)                 0 μg
విటమిన్ C (2%)                    1.3 mg
విటమిన్ E (5%)                     0.7 mg
విటమిన్ (3%)                        2.7 μg
మినరల్స్
కాల్షియం (10%)                   98 mg
ఇనుము (22%)                     2.91 mg
మెగ్నిషియమ్ (45%)                158 mg
మాంగనీస్ (163%)                 3.414 mg
పాస్ఫరస్(49%)                     346 mg
పోటాషియమ్(9%)                  441 mg
సోడియం (0%)                     2 mg
జింక్ (33%)                          3.09 mg
ఇతరములు
నీరు                                   4.07 g
అంజూర
అంజూరలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
అంజూర ఒక సెన్షేషనల్ ఫ్రూట్. దీన్ని ఇండియాలో ఎక్కువగా తింటుంటారు. అంజూరను ఇంగ్లీష్ లో ఫిగ్ అని పిలుస్తారు. తెలుగులో అత్తిపండ్లు అని పిలుస్తారు.
 అత్తి పండు అడుగు భాగం వెడల్పుగా,చదునుగా, పై భాగం సన్నగా గంట ఆకారంలో ఉంటాయి. పండు పండినప్పుడు పై భాగం "గ్రీవము" వంటి ఏర్పాటుతో వంగి ఉంటుంది. అంజీర్ పండ్లు గోధుమ,ఊదా, పసుపు లేదా నలుపు, ఆకుపచ్చ వంటి రంగులతోను మరియు పరిమాణంలో విభిన్నంగా ఉంటాయి. చర్మం కొద్దిగా ముడతలు పడినట్లు మరియు తోలు వలె ఉంటుంది. వాటిని ఎక్కువగా నిల్వ కోసం ఎండిన దశలోనే ఉంచుతారు. ఎందుకంటే తాజా పండ్లు తొందరగా పాడవటానికి ఆస్కారం ఉన్నది. ప్రకృతి సహజంగా అత్తి పండ్లలో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు,యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఎండిన అత్తి పండ్లలో ఖనిజాలు మరియు విటమిన్లుకు ఖజాన వంటింది. అందుకే దీన్ని ఎక్కువగా మిల్క్ షేక్స్ మరియు లస్సీలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
 అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ దీన్ని ఔషధ ఫలంగా వాడతారు. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్లయినా అత్తి పండును డ్రైఫ్రూట్ గానీ, ఫ్రెష్ ఫ్రూట్ గానీ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తుంది. అయితే వీటిని ఎక్సెస్ గా తింటే మాత్రం మోషన్స్, దంతక్షయానికి గురిచేస్తుంది. అంజూరను మితంగా తీసుకుంటే మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి.
  అంజూరలో క్లోరిన్, పొటాషియం, సోడియం, మ్యాంగనీస్, ఫాస్పరస్, ఐరన్, క్యాల్షియం, విటమిన్ బి12, విటమిన్ బి1 మరియు విటమిన్ ఎ' లు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇటువంటి అద్భుతమైన పండులో ఉన్న అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

v జీర్ణక్రియ: అత్తి పండ్లలో ఉండే ఫైబర్ పదార్దాలు క్యాన్సర్ ను తగ్గిస్తాయని నమ్మకం. ఆ విధంగా అనేక రకాల కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా పెద్దప్రేగు కాన్సర్ నివారించడంలో అత్తి పండ్లు బాగా సహాయపడతాయి. ఇర్రెటెబల్ బౌల్ సిండ్రోమ్ నివారిస్తుంది.
v హైబ్లడ్ ప్రెజర్: శరీరంలో పొటాషియం మరియు సోడియం లెవల్స్ ను హెల్తీగా మెయింటైన్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో హైబ్లడ్ ప్రెజర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు.
v క్యాన్సర్: అత్తి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ రొమ్ము క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ కు కారణమయ్యే టాక్సిన్స్ ను శరీరం నుండి బయటకు నెట్టేస్తుంది.
v అనీమియా: అంజూర పండ్లు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల, శరీరానికి ఐరన్ సప్లై అవుతుంది. దాంతో బాడీలో హీమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. రక్తహీనత సమస్య ఉండదు.
v బరువు తగ్గిస్తుంది : అంజూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బరువు తగ్గించుకోవడంలో సమర్థవంతమైన ఆహారంగా తీసుకోవచ్చు. అంజూర తినడం వల్ల పొట్ట నిండిని అనుభూతి కలిగిస్తుంది. ఓవర్ వెయిట్ పెరగకుండా నివారిస్తుంది.
v గుండె సంబంధిత వ్యాధులు: అత్తి పండ్లలో ఫినాల్ మరియు ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అంజూరలో ఉండే పెక్టిన్ టాక్సిన్స్ ను బాడీ నుండి బయటకు పంపిస్తుంది . ఇంకా శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను హెల్తీగా మెయింటైన్ చేస్తుంది.
v లైంగిక సమస్యలను నివారిస్తుంది: అంజూరలో మెగ్నీషియం, జింక్ మరియు మెగ్నీషియం వంటి అనేక న్యూట్రీషియన్ విలువలు, క్యాల్షియం సెక్స్ సామర్థ్యంను మరియు ఫెర్టిలిటి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
v  బోన్ హెల్త్ : అంజూరలో ఉండే క్యాల్షియం కంటెంట్ బోన్ హెల్త్ కు సహాయపడుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది.
 వంద గ్రాముల అంజురు పండ్లలల్లో పోషకాలు
·        పిండి వదార్థం - 19 గ్రా,
·        పీచు వదార్థాలు - 3 గ్రాములు,
·        చక్కెర - 16 గ్రాములు,
·        కొవ్వు - 0.3 గ్రాములు,
·        ప్రొటీన్లు - 0.8 గ్రా,
·        విటమిన్‌ 'బి6' - 110 గ్రా,
·        శక్తి - 70 కిలో.కె.
వందగ్రాముల ఎండిన అంజురు పండ్లలో పోషకాలు
·        పిండివదార్థాలు - 84 గ్రాములు,
·        చక్కెర - 48గ్రాములు,
·        వీచువదార్థం - 10 గ్రాములు,
·        కొవ్వు -0.3 గ్రాము,
·        ప్రొటీన్లు - 3 గ్రాములు.

 పిస్తా
గుప్పెడు పిస్తా తింటే అందం-ఆరోగ్యానికి చాలా లాభం
పిస్తా పశ్చిమ ఆసియా నుండి దిగుమతి అయ్యే పండు. పశ్చిమసియా ఉత్పత్తి అయినా కూడా ఇది మధ్యధరాప్రాంతంలో అందుబాటులో ఉంది. పోషక విలువలు అధికంగా ఉండే ఈ పిస్తా పండు యొక్క , పైన మందపాటు డొల్ల(పొట్టు లేదా బాహ్యకవచం)ఉంటుంది. దీన్ని తొలగిస్తే, లోపల ఉండే పిస్తా పప్పు, పసుపువచ్చ వర్ణంలో ఉంటుంది. దీన్ని సాధారణంగా తినేటువంటి ఒక డ్రైఫ్రూట్.

పిస్తా లో పోశాకపదర్దము ఎక్కువ. పొటాషియం అత్యధికం గా లబిస్తుంది-శరీరము లో ద్రవాల నియంత్రణకు పొటాషియం పనికొస్తుంది . దీనిలో ఉండే బి ప్రోటీన్ల తయారీ, శోషణము లో ఉపయోగపాడుతుంది. మిగిలిన ఎండు పండ్ల తో పోలిస్తే పిస్తా లో కేలరీలు ఎక్కువ . anti-oxidants ఉన్నందున ఇవి గుండె జబ్బులను తగ్గించే గుణం కలిగి ఉన్నాయి . కాన్సర్ రాకుండా కాపాడతాయని తేలినది. పిస్తా లో మోనో శాచ్యురేతేడ్ క్రొవ్వులు అధికం గా ఉన్నందున ఎక్కువగా తినకూడదు ... వారం లో 15 - 20 గ్రాములు మించి తీసుకోకూడదు . రక్తం లో కొలెస్టిరాల్ ను తగ్గిస్తాయి , అతి తక్కువ తిన్నా కడుపు నిండినట్లు గా ఉంటుంది . అందువల్ల ఆహారము తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. సో పిస్తాపప్పు యొక్క ఇతర ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలంటే లోతుగా పరిశీలించాల్సిందే...

పిస్తాలు-'ఆరోగ్య ప్రయోజనాలు:
ü  ఆరోగ్యకరమైన గుండె కోసం:  స్తాపప్పులను ప్రతిరోజూ తీసుకుంటే గుండెను ఒత్తిడి నుంచి కాపాడవచ్చునని సైంటిస్టులు అంటున్నారు. పిస్తా చెడు కొలెస్ట్రాల్, ఎడిఎల్ తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. గుండె జబ్బులు నిరోధించడంలో మంచి కొలెస్ట్రాల్, HDL బాగా సహాయపడుతుంది. నరాలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది . దాంతో గుండె స్ట్రాంగ్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

ü  యాంటీఇన్ఫ్లమేటరి లక్షణాలు: పిస్తాలో ఆరోగ్యకరప్రయోజనాలు కలిగించే విటమిన్ ఎ, విటమిన్ E మరియు యాంటీఇన్ఫ్లమేటరీ (శరీరంలో బాధను తగ్గించడం)శోథ నిరోధక లక్షణాలు ఉనికిని కలిగి ఉంది. మధుమేహం నిరోధిస్తుంది:  టైప్ 2 డయాబెటిస్ నిరిధించడానికి అవసరం అయ్యే ఒక కప్పు పిస్తాలో రోజువారి అవసరంఅయ్యే ఫాస్పరస్ 60% ఉంటుంది. కూడా పిస్తాపప్పులో ఉండే ఫాస్పరస్ గ్లూకోస్ టాలరెన్స్ గా రూపొందడానికి ప్రోటీనులు అమైనో ఆమ్లాలుగా మార్చబడుతుంది.

ü  హీమోగ్లోబిన్ మరియు రక్తం:  పిస్తాపప్పులో నిల్వ ఉండే విటమిన్ B6 అనే ప్రోటీన్ రక్తంలో ఆక్సిజన్ సరఫరా చేయడానికిగాను సహాయపడుతుంది. పిస్తాపప్పులో అధిక పరిమాణంలో బి6 ఉన్నందున, వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల రక్తంలోని ఆక్సిజన్ పరిమాణం పెంచడానికి మరియు హీమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుంది.
ü  నాడీ వ్యవస్థ:  పిస్తాపప్పులో విటమిన్ B6 అధిక సాంద్రత ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నాడీవ్యవస్థలో అమైన్లు మోలిక్యులస్ మసాజ్ కోసం ఉపయోగపడుతుంది. వాటిని అభివృద్ధి చేయడానికి, అమైనో యాసిడ్స్ , విటమిన్ బి6 మీద ఆధరపేడేవి శరీరంలో ఉంటుంది. ఈ విటమిన్ నరాల ఫైబర్లు చుట్టూ మైలిన్ అని ఒక తొడుగు రూపొందించబడి ఉంటుంది.

ü  మక్యులర్ డీజనరేషన్(మచ్చల క్షీణత):  మక్యులర్ డీజనరేషన్ అనేది వయస్సుసంబంధిత దృష్టి తగ్గించే ఒక కంటి వ్యాధి. వయస్సు పెరిగే కొద్ది, దృష్టి తగ్గడంతో చదవడం లేదా వ్రాయడం, పనిచేయడంలో కంటి చూపు మందగిస్తుంది. ఫ్రీరాడికల్స్ కణాల మీద దాడి మరియు మాక్యులర్ డీజనరేషన్ ఫలితంగా నష్టం జరుగుతుంది. పిస్తాలో లుటీన్ మరియు జియాక్సిథిన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్స్ ను పిస్తాపప్పులో కనుగొనబడింది. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి, సెల్స్ డ్యామేజ్ కాకుండా నష్టాన్నినివారిస్తుంది. దాంతో మస్కులర్డీజనరేషణ్ క్షీణత తగ్గిస్తుంది.

ü  రోగనిరోధక శక్తి:  పిస్తాలో ఉండే విటమిన్ B6 ఒక ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ కోసం చాలా ముఖ్యం.ఇది రక్త వ్రుద్ది చెందడానికి మరియు శరీరం అంతటా సరైన రక్త సరఫరా చేయడానికి సహాయపడుతుంది.

ü  ఆరోగ్యకరమైన మెదడు:  పిస్తాలు అధిక పరిమాణంలో ఉండే విటమిన్ B6, రక్తంలో హిమోగ్లోబిన్ మొత్తం పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ ఆక్సిజన్ అధికంగా ఉన్న పిస్తాపప్పు ద్వారా రక్తం ద్వారా ఆక్సిజన్ మెదడుకు సరఫరా చేయబడి, మెదడు మరింత చురుకుగా ఉండేందుకు సహాయపడుతుంది.


ü  ఆరోగ్యకరమైన గ్రంధులు:  ప్లీహము వంటి గ్రంథులు, మెడ కింద గల వినాళ గ్రంథి, etc ఆరోగ్యకరమైనది ఉండి మరియు సరిగా పనిచేసే విధంగా చేయడానికి అవసరం అయ్యే ఎక్కువ తెల్లరక్తకణాలు (wbc)కలిగి ఉంది. ఇవి అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరం అవుతుంది.

ü  ఆరోగ్యకరమైన చర్మం:  చర్మ ఆరోగ్యానికి పిస్తాలో ఉన్న విటమిన్ E మరియు యాంటీఆక్సిడెంట్స్ చాలా అవసరం. ఇది చర్మం పొర యొక్క శ్లేష్మ పొర యొక్క కణ పొరలలో అనుసంధానించి ఉంటుంది. ఇది హానికరమైన UV కిరణాలు నుండి చర్మం రక్షిస్తుంది, చర్మం వ్యాధులు నుండి నిరోధిస్తుంది మరియు చర్మం ఆరోగ్యంగా మరియు మరింత అందమైనదిగా చేస్తుంది.

ü  యాంటీఏజింగ్: పిస్తాలలో ఉన్న విటమిన్ E, చర్మంలో వృద్ధాప్య ఛాయలు రాకుండా అపేప్రక్రియలో సహాయపడుతుంది మరియు మిమ్మల్ని యవ్వనస్తులుగా కనబడేలా చేస్తుంది. పిస్తా పప్పును ఎండ బెట్టి, వాటి నుండి తయారు చేసే నూనెలో ఎమోలియంట్ లక్షణాలు చర్మానికి మాయిశ్చరైజ్ గా ఉపయోగపడుతుంది మరియు చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. దీన్ని ఆరోమా ఆయిల్ గా, మెడిసినల్ మసాజ్ ఆయిల్ మొదలైన ఆయిల్స్ గా ఉపయోగిస్తారు.

ü  క్యాన్సర్లు మరియు అంటురోగాలు నిరోధిస్తుంది:  పిస్తాపప్పులో నిల్వ ఉండే విటమిన్ B6 బ్లడ్ కౌంట్ పెరుగుదలకు సహాయపడుతుంది. WBC లేదా తెల్ల రక్త కణాలు అంటువ్యాధులు మరియు వివిధ క్యాన్సర్లు నిరోధించడంలో సహాయం చేస్తుంది.

పిస్తాలోని 'చర్మ లేదా బ్యూటీ ప్రయోజనాలు:  
ü  పిస్తాచో ఆయిల్ ఒక అద్భుతమైన నేచురల్ మసాజ్ ఆయిల్:   ఇందులో డిమస్క్యులర్ లక్షణాలు ఎక్కువగా ఉండి చర్మాన్ని ఎల్లప్పుడు తేమగా మరియు smoothening కలిగి ఉండటానికి సహాయపడుతుంది. ఇటువంటి ఆయిల్ ను రెగ్యులర్ మాయిశ్చరైజర్ గా చర్మానికి అప్లై చేయడం వల్ల మీరు ఎల్లప్పుడు చర్మంను తేమగా ఉంచుకోవడంతో పాటు నునుపైన మరియు సిల్కీ చర్మం పొందగలుగుతారు .

ü  వృద్ధాప్యం: వృద్ధాప్యం విషయానికి వస్తే పిస్తా అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని మీకు తెలుసా? ఇందులో వివిధ రకాలైన పోటెంట్ యాంటీఆక్సిడెంట్స్ తటస్తంగా ఉండి, వృద్ధాప్యం రాకుండా నిరోధిస్తుంది మరియు సుదీర్ఘకాలంపాటు మృదువైన & సిల్కీ చర్మం పొందడంలో సహాయపడుతుంది.

ü  పిస్తాపప్పులో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి: ఇవి చర్మం మెరుస్తూ, ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతాయి. మీ డైట్ లో గ్రీన్ ఆపిల్ చేర్చుకోవడం వల్ల కూడా మీకు అన్ని వేళలో రేడియంట్ స్కిన్ పొందవచ్చు.

ü  విటమిన్ E: విటమిన్ E పుష్కలంగా ఉండటం వల్ల, ఒక కొవ్వు కరిగించే యాంటీయాక్సిడెంట్ గా ఒక గొప్ప పాత్రపోషిస్తుంది. పిస్తాలు ఆరోగ్యమైన మరియు హృదయపూర్వక చర్మం నిలబెట్టడానికి ఒక కీలక పాత్ర పోషిస్తుంది. మరియు ఇవి సన్ డ్యామేజ్ నుండి చర్మానికి రక్షణ కల్పించబడుతుంది. అందువల్లే చర్మ క్యాన్సర్ మరియు సన్ బర్న్ నుండి రక్షణ కల్పించబడుతుంది.

ü  దృష్టి సంబంధిత సమస్యలు: పిస్తాలు ఆరోగ్యకరమైన దృష్టి ప్రచారంకు సహాయపడుతుంది మరియు ఏదైనా దృష్టి సంబంధిత సమస్యలతో పోరాడుతున్న వారికి ఇది మంచిది.
ü  జుట్టుకు ప్రయోజనాలు: చర్మం మాదిరిగానే, పిస్తాలు జుట్టు సంరక్షణ కోసం అందించే గుణగణాలు చాలా ఉన్నాయి: పిస్తా పిస్తా వల్ల ప్యాటీ యాసిడ్స్ పొందవచ్చు. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యకరమైన తంతువులు పెరుగుదల ఉద్దీపనకు సహాయపడుతాయి. జుట్టు ఇది కూడా జుట్టు మూలాలు బలోపేతం చేయడం కోసం ఒక అద్భుతమైన చికిత్సగా సహాయపడుతుంది. పిస్తాలు ఉపయోగించి జుట్టు మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టుకు తగినంత పోషకాలను మరియు తేమను అందించడం వల్ల, జుట్టు ఫైబర్ వల్ల జుట్టు ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. అదనంగా, ఇదిజుట్టు కొసలు చిట్లడాన్ని నిరోధించి జుట్టుకు తగినంత తేమను అందిస్తుంది మరియు రంగు పాడైపోయిన జుట్టు చికిత్స కోసం ఒక గొప్ప పరిష్కారం. బోయోటిన్ లోపం వల్ల జుట్టు రాలిపోవడం జరుగుతుంది. పిస్తాపప్పులు మీకు అవసరం అయ్యే బయోటిన్ లభ్యం అవుతుంది. కాబట్టి వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరకట్టవచ్చు. సాధారణ వినియోగం మీరు సమర్థవంతంగా జుట్టు-నష్టం ఎదుర్కోవడానికి సహాయపడవచ్చు.

పోషకాలు ప్రతి 100 గ్రాములకు (3.5 oz)
శక్తి: 2,351 kJ (562 kcal)
కార్బోహైడ్రెట్స్                         27.51 g
చక్కెర                                 7.66 g
పీచు పదార్థాలు                      10.3 g
క్రోవ్వు పదార్థాలు                    45.39 g
Saturated                          5.556 g
Monounsaturated                23.820 g
Polyunsaturated                 13.744 g
ప్రోటిన్                               20.27 g
విటమిన్స్
విటమిన్ A equiv.
lutein zeaxanthin                 1205 μg
థియామిన్ (B1) (76%)           0.87 mg
రైబోఫ్లెవిన్ (B2) (13%)             0.160 mg
నియాసిన్ (B3) (9%)               1.300 mg
పాంతోతెనిక్ యాసిడ్ (B5) (10%) 0.52 mg
విటమిన్ B6 (131%)               1.700 mg
ఫోలెట్ (B9) (13%)                51 μg
విటమిన్ C (7%)                    5.6 mg
విటమిన్ E (15%)                   2.3 mg
విటమిన్ K (13%)                   13.2 μg
మినరల్స్
కాల్షియం (11%)                   105 mg
ఇనుము (30%)                     3.92 mg
మెగ్నిషియమ్ (34%)                121 mg
మాంగనీస్ (57%)                   1.2 mg
పాస్ఫరస్ (70%)                    490 mg
పోటాషియమ్ (22%)               1025 mg
జింక్ (23%)                          2.2 mg
---------------------------------------------------------------------------------------------------------------------------- 

తాజా పండ్ల కంటే ఎండిన పండ్లలో ఉండే విశేషం ఏమిటి...?
సాధారణంగా డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాల) లో ఉండే పోషకాల గురించి వినే ఉంటారు. అందుకే ఈ డ్రైఫ్రూట్స్ ను ప్రతి రోజూ తినమని చెబుతుంటారు. శరీరంలో ఒక బలమైన వ్యాధినిరోధక వ్యవస్థ పొందడానికి మీ రెగ్యులర్ డైయట్ లిస్ట్ లో ఈ డ్రైఫ్రూట్స్ ను చేర్చుకోవడం మంచి పద్దతి. అయితే మనలో చాలా మందికి ఈ ‘ఎండిన పండ్లు' గురించి మరియు వాటిలో ఉండే పోషక విలువలు శరీరానికి ఏవిధంగా పనిచేస్తాయో తెలియదు. తెలుసుకోరుకూడా.. అదే సమయంలో కొంతమంది స్వీట్స్ తినడానికి చాలా ఎక్కువగా ఇష్టంచూపుతుంటారు. బయట బేకరీల్లో, స్వీట్స్ స్టాల్స్ లో, మార్కెట్లో లభ్యమయ్యే కొన్ని రకాల స్వీట్స్ మీద ఈ డ్రైఫ్రూట్స్ తో గార్నిషింగ్ చేసి, క్యాండీలకు, చాక్లెట్లకు ప్రత్యామ్నాయాలుగా ఆకర్షిస్తుంటాయి.
కొన్ని సందర్భాల్లో ఎక్కువ పని ఒత్తిడి వల్ల భోజనం చేసే సమయం కూడా ఉండదు. అటువంటి సమయంలో ఎక్కువ సమయం వృథా కాకుండా ఈ డ్రైఫ్రూట్స్ (ఎండిన పండ్లు) ఉత్తమ ప్రత్యామ్నాయం. ఎండిన పండ్లును ఒక్కొక్కటే నోట్లో వేసుకొని నమలడం వల్ల రుచిగా అనిపించడమే కాకుండా మీ ఆకలిని తెలియనివ్వదు. ఈ డ్రైఫ్రూట్స్ లో రుచి మాత్రమే కాదు అనేక విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. సలాడ్స్ మీద వీటితో గార్నిష్ చేయడం కూడా చాలా ఆరోగ్యకరం. మరి డ్రై ఫ్రూట్స్(ఎండిన పండ్లు) యొక్క న్యూట్రీషినల్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం.... 
ఆప్రికాట్: ఇందులో అధిక శాతంలో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ మరికు సి, పొటాషియం, అదేవిధంగా యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఎండిన పండు తినడం వల్ల శరీరంలో బ్లడ్ కౌంట్ పెరుగుతుంది. ఇది అనీమియా(రక్తహీనత)తో బాధ పడేవారికి చాలా ఉత్తమం. అలాగే జీర్ణ సంబంధిత మరియు మలబద్దకం సమస్యలతో బాధపడేవారికి సహాయపడుతుంది. ప్రతి రోజూ ఈ తీసుకోవడం వల్ల శరీరం, అంటువ్యాధులు సోకకుండా పోరాడటానికి దెబ్బతిన్న కణజాలాల డ్యామేజ్ ను అరికట్టడానికి, బలమైన పళ్ళు, ఎముకలు నిర్మించడానికి సహాయం చేస్తుంది. మరియు కంటి చూపు మెరుగుపరుస్తుంది.
ఫిగ్: ఫిగ్ ఎండిన పండులో కూడా అధికంగా విటమిన్స్ (విటమిన్ కె, బి6, సి, ఇ)ఇతర పోషకాంశాలు మరియు ఫాస్పరస్ లు ఉంటాయి. ఇంకా దీనిలో కాపర్ ఎక్కువగా ఉండి రక్తనాళాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. అంతే కాదు క్యాన్సర్, డయాబెటిస్, జీర్ణసమస్యలు మరియు ఇతర ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. 
టమోటో: ఎండలో ఎండబెట్టిన టామోటోలు. ఇందులో జీరో ఫ్యాట్ మరియు లో కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. టమోటోలో అధికంగా యాంటిఆక్సిడెంట్స్ , విటమిన్ సి మరియు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఎండిన టమోటోలోని విటమిన్ సి క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ మరియు ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పకుండా నిరోధిస్తుంది.
ఓల్ఫ్ బెర్రీ: ఈ రెడ్ ఆరెంజ్ బెర్రీ టమోటో మరియు మిరప కుంటుంబంలో ఒక భాగం. మరియు ఇందులో ప్రసిద్ది చెందిన వైద్యపరమైన ప్రయోజనాలను కలిగి ఉంది. చైనాలో ఈ ఓల్ఫ్ బెర్రీని విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా రైస్ వంటలు, సూప్స్ మరియు టీ మాదిరి కాచుతారు.ఈ పండులో యాంటీఆక్సిడెంట్స్, క్యాల్షియం, ఐరన్, జింక్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కిడ్నీ మరియు కాలేయ సమస్య తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ ఓల్ఫ్ బెర్రీ పురుషుల్లో లైంగిక హార్మోన్ సమస్యల నివారణకు సహాయపడుతుంది.
క్రాన్ బెర్రీ: క్రాన్ బెర్రీ జ్యూస్ ను చాలా మంది ఇష్టపడుతారు. అయితే కొంత మందికి మాత్రమే వీటిలోని ఆరోగ్యప్రయోజనాలు తెలుసు. క్రాన్ బెర్రీస్ ను చాలా వరకూ మూత్రనాళాల సమస్యల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇంకా ఈ క్రాన్ బెర్రీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, హృదయ సంబంధమైన వ్యాధులు సోకకుండా పోరాడగలిగే వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మరియు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాదు దంత క్షయం సమస్యలను నివారించడానికి ఇది సహాయపడుతుంది.
సుల్తానా: చాలా వరకూ మనం వీటిని ఎండుద్రాక్షగా పిలుచుకుంటాం. ఈ ఎండు ద్రాక్షలో పోషకాంశాలు(క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఫ్లోరైడ్ మరియు జింక్ అధికంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యాంటీ ఇన్ప్లమేటరీ, క్యాన్సర్ వ్యతిరేక మరియు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మెలనోమా, పెద్దప్రేగు & ప్రోస్టేట్ మరియు కరోనరీ హార్ట్ డిసీజ్, నరాల వ్యాధి, అల్జీమర్స్ వ్యాధి మరియు వైరల్ లేదా ఫంగల్ అంటువ్యాధులు వంటి ఇతర వ్యాధుల వంటి క్యాన్సర్లు భారిన పడకుండా రక్షణ కల్పిస్తుంది.
లాన్గాన్: దీన్ని ఇలాచీ(యాలకుల)కు చిన్న సోదరుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాచీలో ఉండే సుగుణాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. కడుపు ఇబ్బందలకు, నిద్రలేమి మరియు స్మృతి బాధపడుతున్న వ్యక్తులు ఉత్తమ నివారణా లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ పండు నాడీ వ్యవస్థ మీద నిధానంగా ప్రభావం చూపుతుంది. మరియు రక్త పోషణకు సహాయపడుతుంది.Bheemesh Chowdary Kacharagadla

సంపాదకులు

భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) గారు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం మరియు కాచరగడ్ల మీడియా కార్పొరేషన్ వ్యవస్థాపకులు. వీటి ద్వారా మరుగును పడిపోతున్న దేవాలయాలు, తెలుగు కవుల చరిత్రను అధ్యయనం చేసి గ్రంధస్తం చేస్తున్నారు వీరు స్వతహాగా రచయిత కూడా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి