వినాయక నిమజ్జనం

వినాయకుడు దేవ, మానవ గణాలకు అధినాయకుడు. శివకుమారుడు కాబట్టి, ఆయన ప్రమథ గణ నాయకుడు. జనగణ మనస్సిద్ధి వినాయకుడూ ఆయనే! ఇతిహాసాలుగణానాం త్వ గణపతిం హవా మహేఅని పూజల్లో ఆయనకే అగ్రస్థానమిచ్చాయి. వేదంలోనూ వినాయక ప్రస్తావన ఉంది. ఆయనఅఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుఅనేందుకు పలు ఆధారాలు ఉన్నాయి. పురాణగాథల్లో అనేక వర్ణనలూ కనిపిస్తాయి.

గణనాయకుడే విశ్వ వ్యాపకుడు. నేటికీ ఉన్న గాణపత్యపు ఆధిపత్యమే దీనికి ప్రబల నిదర్శనం. పేరు వేరైనా- ఆయన ప్రతాపం, ప్రభావం ఒక్కలా కనిపించడం ఇందులో విశేషం. అష్టోత్తర, శత, సహస్ర నామార్చనలు గణేశుడి నిత్యకైంకర్యంలో భాగాలు. బౌద్ధులకు ఆయన నృత్య వినాయకుడు. టిబెట్వాసులకు మహాశక్తిరూప గణపతి. మహాకాళ వినాయకుడిగానూ భక్తుల కైవారాలు అందుకొంటున్నాడు.

జపాన్దేశీయులు ఆయననుగణబిచివంటి అనేక పేర్లతో ఆరాధిస్తున్నారు. మయన్మార్వాసులుసక్రపేరిట పూజిస్తున్నారు. థాయ్లాండ్ప్రజలు తమదైన శైలిలో గణపతిని కొలుస్తున్నారు. ఇండొనేసియాలో గణేశ నామాలనే స్మరిస్తారు. ఇరాన్లో జొరాస్ట్రియన్ల అధినాయకుడు అహురామజ్దా. మేధోశక్తికి ప్రతీక గణపతి. దానికి ఆయన పెట్టింది పేరు. సిద్ధి-బుద్ధి వినాయకత్వం స్వామిలో ప్రకాశిస్తుంది.

గణపతిఅంటూ అధినాయకుణ్ని అందరూ ఆహ్వానిస్తారు. అలా స్వాగతించనిదే, ఎవరూ శుభకార్యానికీ శ్రీకారం చుట్టరు. గాణపత్యం ఎల్లలు దాటి ఉందని, అదే మానవకోటిని ఏకతాటిపై నడిపించగలదని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.

గణపతితో భక్తులకు ఇంత సాన్నిహిత్యం ఏర్పడటానికి గణాలే కారణం. గణం అంటే, ఇంద్రియం. శరీరం, కర్మ, జ్ఞాన ఇంద్రియాలు; మనసు- మనుగడకు మూలస్తంభాలు. పంచభూతాల పంచీకరణం వల్ల శరీరం, వాటి తమో గుణాంశంతోనే స్థూల దేహం ఏర్పడింది. రజోగుణం వల్ల కర్మేంద్రియాలు, సత్వగుణం వల్ల జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయి. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, పృథ్వి- ఇవి, పంచభూతాలు. నోరు, చేతులు, కాళ్లు వంటివి కర్మేంద్రియాలు. అవి మాట, పని వంటివాటికి ఉపయోగపడతాయి. చెవులు, చర్మం, చక్షువులు, నాలుక, నాసిక అనేవి జ్ఞానేంద్రియాలు. మనిషి వినడానికి, తెలుసుకోవడానికి, చూడటానికి, రుచి తెలియడానికి, వాసన గ్రహించడానికి ఇవి అవసరమవుతాయి. జ్ఞానేంద్రియాలు సూక్ష్మమైనవి. అవి ప్రమాదకరమైనవి అనడానికి అయిదు ఉదాహరణలున్నాయి.

జింకకు వేటగాడి శబ్దం తరవాత వేటు పడుతుంది. ఏనుగు- ఆడ ఏనుగు పొందు (స్పర్శ) కోరి గోతిలో పడుతుంది. మిడత మంటను చూసి (రూపం) దాని లోపల పడి ఆహుతవుతుంది. తుమ్మెద సువాసన (గంధం) కోసం పువ్వులోకి దూరి మత్తులోనే మరణిస్తుంది. శరీరం రథం. ఇంద్రియాలు గుర్రాలు. మనసు సారథి. కోరికల కాణాచి అయిన మనసు విషయసుఖాల కోసమే జీవిత రథాన్ని పెడదోవ పట్టిస్తుంది. అప్పుడు రథికుడైన బుద్ధి చురుకుగా ఉండాలి. రథాన్ని రహదారిపైకి మళ్లించాలి. అష్టసిద్ధులూ కావాలని మనసు ఆరాటపడుతుంది. జ్ఞాన లబ్ధి కోసం బుద్ధి- ఆత్మసామీప్యాన్ని ఆశిస్తుంది.

భాద్రపద శుక్ల చవితి మొదలు పది రోజులపాటు గణనాయకుణ్ని సేవిస్తున్నాం. ఇంద్రియాలపై విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నాం. పదకొండో రోజు, గణపతి కరుణా కటాక్షం వల్ల మన మనసు శుద్ధమవుతుంది. బుద్ధిని ఆశ్రయిస్తుంది. బుద్ధిని ఆత్మలో విలీనం చేయదగిన ప్రక్రియనేనిమజ్జనంఅంటున్నాం. అంటే- అది నరతత్వ, నారా(నీరు)యణ తత్వాల మమేకత్వానికి ఒక సజీవ సంకేతం!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)