శ్రీ మహాగణపతి విశేషాలు

శుక్లాం బరధరం  విష్ణుం శశివర్ణం చతుర్భుజం !
అనేక దంతం భక్తానాం ఏకదంతంముపాస్మహే !
విఘ్నేశ్వరుడి పూజలో పత్రి యెక్క ప్రాముఖ్యత
 సమస్త విఘ్నాల్ని తొలగించి మనొభీష్టాల్ని నెరవేర్చేఆది దేవుడు శ్రీమహాగణపతి.  సకల గణాలకు నాయకుడుగా సమస్త ప్రాణికోటిచేతా పూజలందుకొంటున్న దైవం శ్రీ గణపతి. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ద చతుర్ధి(చవితి)  రోజు మనం వినాయకవ్రతం చేసుకొంటాం. వినాయకవ్రతం లో చాల ప్రాముఖ్యమైనదివినాయకుడికి అత్యంత ప్రీతిపాత్ర మైనది ఏకవింశతి పత్ర  పూజ (అంటే 21 రకాలైన ఆకులతో చేసే పూజ). 

శ్రావణభాద్రపద మాసాల్లో వర్షఋతువు వల్ల చెట్లన్నీ పచ్చగా ఉంటాయి. సమయంలో వచ్చే వినాయకచవితి రోజు వినాయకుడికి (21) రకాల పత్రితో ప్రత్యేకంగా పూజా విధానం రూపొందించారు మన పూర్వీకులు . దీనిలో పరమార్ధం 1) ప్రకృతి సంపదను మొదట పరమేశ్వరునికి సమర్పించటం.  2) వర్షఋతువులో నీటి మార్పువాతావరణం మార్పు వల్ల వచ్చే అనారోగ్యాల  నివారణకు ఆయుర్వేదం లో ప్రత్యేకతను సంతరించుకొన్న (21)పత్రులను తొమ్మిది రోజులు (గణేష్ నవరాత్రులుపూజించటం వల్ల  వాటిమీదుగా వచ్చే గాలులను పీల్చటం వల్ల కాలం లో వచ్చే అనారోగ్యాలని ఎదుర్కోగల శక్తి వస్తుంది అనే భావంతో పత్రితో పూజించే విధానం మన పెద్దలు ఏర్పరచారు. 

ఇక పత్రి యొక్క ప్రాముఖ్యతని తెలుసుకొందాం :
1. మాచీ పత్రం  : (మాచిపత్రం) : ఇది అన్ని ప్రాంతాలలోను లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారంఇది నులిపురుగులనుకుష్టుబొల్లిదప్పికను పోగొడుతుంది.   ఆకులు కళ్ళ పై  పెట్టుకొంటే నేత్రదోషాలు పోతాయి. శిరస్సు పై పెట్టుకొంటే తలనెప్పి తగ్గుతుంది. 
2. బృహతి పత్రం   : (నేల మునగాకు) : ఇందులో తెలుపునీలి రంగుపూలు పూసే రెండు రకాలు ఉంటాయి. ఇది కఫాన్ని,   వాతాన్ని తగ్గిస్తుంది.  జ్వరంమలబద్ధకంమూలవ్యాది,దగ్గులను తగ్గిస్తుంది. 
3. బిల్వ పత్రం  :  (మారేడు ఆకు ) : దీని గాలి సోకితే శరీరం లో బాహ్యఅంతర పదార్ధాలు చెడిపోకుండా ఉంటాయి .   ఆకులు వలన  గాలిసోకని గర్భాలయాలలో దుర్వాసనలు పుట్టకుండా ఉంటాయి.
4. దూర్వారయుగ్మం : (గరిక ) : ఇది శీతవీర్యన్ని వృద్ది చేస్తుందిరక్తపిత్తాన్ని శమింప చేస్తుంది. ముక్కు వెంట కారే రక్తానికి పనిచేస్తుంది. 

5. దుత్తూర పత్రం : ( ఉమ్మెత్త ఆకు ) : దీని ఆకులుకొమ్మలు కాయలుగింజలువేళ్ళు అన్నీ ఔషధ లక్షణాలు కలిగినవే.  ఉమ్మెత్త రసం మర్దన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు (బట్టతల )తిరిగి మొలిచే అవకాశం ఉంది. దీన్ని  ఎక్కువగా మానసిక రోగులకి ఉపయోగిస్తారు
6. బదరీ పత్రం  : (రేగు ఆకు) : ఇది శ్లేష్మం పుట్టిస్తుంది. ఎముకలకి బలం చెకూరుస్తుంది. ఎక్కువగా బాల రోగాలను నయం చేస్తుంది.  
7. అపామార్గ పత్రం : ( ఉత్తరేణి ఆకు) : ఇది చర్మ రోగాలకి పనికి వస్తుంది. 
8. తులసి పత్రం :   ఆకు శ్లేష్మాన్ని హరిస్తుంది. క్రిములను నాశనం చేస్తుంది. దగ్గును తగ్గిస్తుంది.  వాంతులను  అరికడుతుంది.  తులసి గాలి ఉల్లాసాన్నిస్తుంది.
9. చూత పత్రం   :  (మామిడి ఆకు)  :  దీని లేత ఆకులు నూరి పెరుగుతో తింటే అతిసార వ్యాధితగ్గుతుంది.  ఒరిసిన పాదాలకుపుండ్లకు  మామిడి జీడి రసం లో పసుపు కలిపి రాస్తే మానిపోతుంది.    చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చ చేసి కాళ్ళ పగుళ్ళకు రాస్తే చాల బాగా పనిచేస్తుంది. 

10. కరవీర పత్రం  :  (గన్నేరు ఆకు) :   ఆకులు జ్వరం పోగొట్టి నేత్రాలకు చలువ చేస్తాయి,దురదలను పోగొడతాయి.  దీని పప్పు తింటే మరణం సంభవిస్తుంది.  
11. విష్ణుక్రాంత పత్రం :  దీని ఆకులు కోలగా ఉంటాయి. గింజలు మిరియాలలా ఉంటాయి . కఫంవాతాలనుక్రిములనువ్రణాలను హరిస్తుంది.  
12. దాడిమి పత్రం :  ( దానిమ్మ ఆకు) : ఇది వాతాన్నికఫాన్నిపిత్తాన్నిహరిస్తుంది. హృదయానికి బలాన్ని ఇస్తుంది.
13. దేవదారు పత్రం :   వృక్షం లోని అన్ని అంగాలు సువాసన కలిగి ఉంటాయి.  దీని తైలం వాపులను హరిస్తుంది.  ఎక్కిళ్ళు తగ్గిస్తుందిచర్మ రోగాలను తగ్గిస్తుంది.  
14. మరువక పత్రం : (మరువం)  : ఇది సువాసన నిస్తుంది.  శ్వాస రోగాలను తగ్గిస్తుంది. దీనినిపసుపుతో కలిపి నూరి రాస్తే గజ్జిచిడుము లాంటి చర్మవ్యాధులు తగ్గుతాయి.  

15. సింధూర పత్రం : (వావిలాకు)  : దీని ఆకులతో పురిటి స్నానం చేయిస్తే బాలింతలకు వాతంచేయదు   ఆకుల కషాయం కడుపు నెప్పులనుక్రిములను తగ్గిస్తుంది.  నుదుటికి పట్టిలా వేస్తె తలపోటు తగ్గుతుంది.  
16.  జాజి పత్రం  : (జాజి ఆకు)  : దీనికి వేడి చేసే స్వభావం ఉంది . దీని లేత ఆకులు తరుచుగా తింటే శరీరానికి మంచి కాంతినితేజస్సు ను ఇస్తుంది.  ఆకలిని పెంచుతుంది.  కంటస్వరాన్ని బాగుచేస్తుంది. నోటి దుర్వాసనదగ్గు పోగొడుతుంది.  

17. గండలీ పత్రం : (అడవి మొల్ల) : దీని రసం అపస్మారక స్థితినిపైత్య వికారాలని,  మూర్చలని తగ్గిస్తుంది.  
18. శమీ పత్రం  : ( జమ్మి ఆకు)  :  ఇది మూల వ్యాధిని హరిస్తుంది.  అతిసారంరక్తస్రావాలనుతగ్గిస్తుంది.  దీని రసం వెంట్రుకలను నల్లపరుస్తుంది.  ఆకు రసాన్ని పిప్పిపన్నులో పెడితే నొప్పి తగ్గి పన్ను ఊడిపోతుంది. దీని పుల్లతో పళ్ళను శుభ్రం చేయరాదు. 
19. అశ్వత్థ  పత్రం :  ( రావి ఆకు)  :  దీని గాలి చాలా శ్రేష్టమైనదిగర్భస్థ దోషాలని హరిస్తుంది.   చెట్టు క్రింద కూర్చుని చదువుకొంటే జ్ఞానవృద్ది అవుతుంది. 

20.  అర్జున పత్రం : ( మద్ది ఆకు) :  ఇది వాతకఫ రోగాలని పోగొడుతుంది.  వ్రణాలను మాన్పుతుంది. 
21.  అర్క పత్రం  : ( జిల్లేడు ఆకు )  :  ఇది శరీరాన్ని కాంతివంతం చేస్తుంది.  ఆకులను తలపైఉంచుకొని స్నానం చేస్తే జలుబు తగ్గుతుంది.  శిరస్సుకు సంబంధిచిన వ్యాధులు పోతాయి. జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం నలుపు తగ్గుతుంది.

 పత్రి గురించి తెలుసు కొన్నారు కాబట్టి సంవత్సరం వినాయక చవితికి సాద్యమైనన్నిఆకులు మీ చుట్టుపక్కల ఉన్నవి ఎంచుకొని తెచుకొని పూజ చేసుకోండి. చాలా వరకు మన చుట్టుపక్కల దొరికేవేకాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టండికొండంత దేముడికి కొండంత పత్రి కాదు కోరిన పత్రి తో పూజించండి.    బయట అమ్మే పత్రిలో ఏమున్నాయో తెలుసుకోకుండా ఆకులు దేముడి మీద వేయటమే చాలు అనుకోకండి.
వినాయకుడి విశిష్టత
మనలో చాలామందికి వినాయకుడు అంటే ఒక దేవుడు అని శివపార్వతుల కొడుకని మాత్రమే తెలుసు కాని '' వినాయకుడు '' అనే పదానికి ఒక అర్థం ఉంది అర్థం ఏమిటంటే '' నాయకుడు లేనివాడు '' అని అర్థం. అంటే తనకు తనే నాయకుడు అని.

'
త్వమేవాహమ్', 'అహంబ్రహ్మోసి' అన్న భావమే అది. అందుకే మనం పూజ చేసుకున్నా ముందుగా గణపతినే పూజ చేస్తారు పూజారులు. గణానికైనా అతడే 'పతి' జగత్తు. ఎందుకంటే అంతా 'గణ' మయమే కాబట్టి ! వివిధ గణ సమాహారమే విశ్వమని మనకు ఎన్నో పురాణాలు చెబుతుంటాయి. '' అనే అక్షరం నుంచే జగత్తు జనించింది.

కరచరణాద్యనయన విన్యాసం మొదలుకుని, ఎలాంటి శబ్దమైన భాష, భాషాత్మకమైన జగత్తు. అంతా '' శబ్ద వాక్యం . దీన్ని సుగుణానికి సంకేతం అంటారు. '' కారం మనసుకు, మాటలకు అందని పరతత్త్వానికి గుర్తు. ఇది నిర్గుణ సంకేతమన్నమాట! సుగుణంగా, నిర్గుణంగా భాసించే ఈశుడే 'గణేశుడు'. అతడే 'గణపతి'. పదహారు రూపాలలో కొలువై ఉన్నాడని మనకు మన పెద్దలు చెబుతుంటారు.

పదహారు రూపాల గణపతులు.

1. 
బాలగణపతి
2.
తరుణగణపతి
3. 
భక్తగణపతి
4. 
వీరగణపతి
5. 
శక్తి గణపతి
6. 
ధ్వజ గణపతి
7. 
పింగళ గణపతి
8. 
ఉచ్ఛిష్ట గణపతి
9. 
విఘ్న గణపతి
10. 
క్షిప్ర గణపతి
11. 
హేరంబ గణపతి
12. 
లక్ష్మీగణపతి
13. 
మహాగణపతి
14. 
భువనేశ గణపతి
15. 
నృత్త గణపతి
16. 
ఊర్ధ్వగణపతి.
విశేషాలు సమూహం వినాయక స్వరూపం
పర్వం:‘దైవం గురించి సందేహంతో ప్రశ్నని వేయడమా?’ అనుకుంటూ లెంపలు వేసుకుని, సందేహాన్ని అలాగే లోపల నొక్కి ఉంచుకున్నంత కాలం మనకి దైవం గూర్చిన విశేషమూ అర్థం కాదుసంప్రదాయం తెలియదు. మన దైవాల విశిష్టత ఎంతటిదో చెప్పే శక్తీ మనకి రాదు. కాబట్టి ఎన్ని సందేహాలొస్తే అన్ని సమాధానాలని పొందుతూ ఉంటే, అంతగానూ మనం దైవానికి దగ్గరవుతూ పూజని చేస్తున్నట్లే. నేపథ్యంలో కొన్ని సందేహాల్నీ సమాధానాల్నీ చూద్దాం!

 
వినాయకుడి రూపం  కనపడగానే, ‘శుక్లాం బరధరం విష్ణుమ్మంటూ శ్లోకాన్ని చదివేసి, దణ్నం పెట్టేస్తాం కదా. నిజంగా శ్లోకం వినాయకునిదేనా?‘శుక్ల+అంబర+ధరమ్అంటే తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం. వినాయకుడెప్పుడూ ఎర్రని వస్త్రాలే కడతాడు. మరి ఇదేమిటి శ్లోకం ఇలా అంటోంది?
 ‘
విష్ణుమ్అనేది శ్లోకంలో కనిపించే రెండో మాట. దీన్నిబట్టే తెలుస్తోంది కదా! శ్లోకం విష్ణువుకి సంబంధించినదే అని! మరి వినాయకుని దగ్గరెందుకు చదవడం?

 ‘
శశి వర్ణమ్అనేది శ్లోకంలోని మూడో పదం. శశి అంటే చంద్రుడు కాబట్టిశశి వర్ణమ్అంటే చంద్రునితో సమానమైన శరీరచ్ఛాయతో ఉంటాడనేది అర్థం మరి. వినాయకుడు చంద్రునిలా తెల్లగా ఉండడు. ఆయన కు-జుడు (పృథివికి సంబంధించినవాడు) కాబట్టి, ఎరుపు రంగులో ఉంటాడుఇలా విష్ణువుకి సంబంధించిన శ్లోకాన్ని వినాయకుని దగ్గర చదువుతున్నాం కదాని, పోనీ విష్ణువుకి సంబంధించినదా! అనుకుంటూ ఆయన వైపు నుండి అర్థాన్ని చూస్తే? శుక్ల+అంబర+ధరమ్ - తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం. శ్రీహరి పసుపు పచ్చని పట్టు వస్త్రాలు ధరిస్తాడు కదా! (పీతాంబరః) మరి ఇదేమిటి? శశి వర్ణమ్ - తెల్లని శరీరచ్ఛాయ ఆయనకెక్కడిది? నీలమేఘశ్యాముడు కదా! ఇలా ఉండటమేమిటి? ఇలా ఆలోచన పరంపర సాగిపోతోంది. మరి ఎలా సందేహ నివృత్తి?

 
శుక్ల+అంబర+ధరమ్ అంటే తెల్లని ఆకాశాన్ని ధరించినవాడు అని. (అంబర శబ్దానికి వస్త్రం అని మాత్రమే కాదు అర్థం ఆకాశం నుండి కదా క్రమంగా ఒకదాని నుండి ఒకటి చొప్పున వాయువు, అగ్ని, నీరు, నేల, సస్యాలు (పంటలు) మనుష్యులనేవాళ్లు వచ్చారు. కారణంగా ఆకాశాన్ని ధరించాడంటే ఇంత జీవరాశికీ ఆధారభూతుడని అర్థం. ఇంతకీ వర్ణన.. విష్ణువు, వినాయకుడు.. ఇద్దరిలో ఎవరిదో చూద్దాం!

 
శశి వర్ణమ్ - శశి అంటే చంద్రుడనేది నిజమే కానీ, అర్థమెలా వచ్చింది? శశ (కుందేలు) వర్ణం (లక్షణం) ఆయనకి ఉండటం బట్టి వచ్చింది. కుందేలుది లక్షణంట? నేలమీద క్షణం - గాలిలో (ఆకాశంలో) క్షణం ఉండటం. అంటే పూర్తిగా నడవనూ నడవదు. పూర్తిగా ఎగరనూ ఎగరదు. ఇలా ద్వంద్వ విధానం దానిది. లక్షణమే కదా చంద్రునిది! ఓసారి పూర్ణిమ, ఓసారి అమావాస్య. ఓసారి ఎదుగుతూ పోవడం, మరోసారి తరుగుతూ రావడం. అలాంటి చంద్ర లక్షణం కలవాడు విష్ణువులో, వినాయకుడిలో ఎవరో చూద్దాం.

 
చతుః+భుజమ్ - చతుర్భుజమ్ - విష్ణువుకి నాలుగు చేతులు ఉండే మాట నిజమే. వినాయకుణ్ని కూడా అలా చూస్తాం కానీ, వినాయకునికి రెండు చేతులు కూడా ఉంటాయి. విష్ణువుకి మాత్రం అలా ఏనాడూ లేదు - ఉండదు.
 
ఇక ప్రసన్న వదనమ్ - చూడగానే ప్రసన్నంగా కనిపించే ముఖం ఇద్దరికీ ఉండచ్చుగా. అయితే ఇందులో పేచీ లేదనుకోకూడదు. ముఖంలోని భావాలని మనుష్య ముఖమైతే గమనించగలం. మరి అదే గజ ముఖం నుండి ఎలా తెలుసుకోగలం! ఆవు నవ్వుతోందనీ, లేడి వెక్కిరిస్తోందనీ అర్థం చేసుకో వీలౌతుందా? కాబట్టి విశేషణం కూడా విష్ణువుకి సంబంధించినదే అనిపిస్తుంది.

 
సర్వ విఘ్న ఉపశాంతయే - విఘ్నాలు తొలగించడం అనే మాటకొచ్చేసరికి, ఇది వినాయకుడిదే అనక తప్పదు. ఇంతకీ ఏదోలా తికమకగా ఉన్న శ్లోకం ఇద్దరిదీనా మరి?
 
ఔను. శ్లోకం ఇద్దరిదీను. రహస్యమేమంటే శ్రీహరే కాలాన్ని రక్షించే కార్యాన్ని చేపట్టిన వేళ (సర్వాధారః కాలః - కాలః కలయతా మహమ్) వినాయకుడని పిలిపించుకుంటాడు. అంతే!

 
ఇప్పుడు నేపథ్యంలో అర్థాన్ని చూద్దాం! కాలస్వరూపుడైన శ్రీహరి వినాయకునిగా మారిన వేళ అంటే సరైన అర్థమేమంటే - అన్నింటికీ ఆధారం ఆకాశమో ఆకాశాన్ని నిరంతరం తన అదుపులో పెట్టుకుని ఉన్నవాడు, శుద్ధ పక్ష కృష్ణ పక్షాలతో ఉంటూ ఎగుదల దిగుదల లక్షణాలు కలిగించేవాడు (జీవులకి ఆనందాన్నీ దుఃఖాలనీ కలిగిస్తూ ఉండేవాడు), ఒక చేయి రోజులకి ప్రతీకగా, మరో చేయి 15 రోజుల పక్షానికి (శుద్ధ + కృష్ణ) సంకేతంగా, మరో చేయి 2 పక్షాలు కలిసిన నెలలకి (చైత్రం, వైశాఖం...) ప్రతీకగా, మరో చేయి 12 నెలలకీ (ప్రభవ, విభవ....) ప్రతీకగాను కలిగి, మనకి కాలంలో ఏర్పడే అన్నిటికీ తానే కర్తగా ధర్తగా హర్తగా ఉన్నవాడు  ఆయన.

 
లక్ష్మీ గణపతి
 
శ్రీహరీ వినాయకుడూ ఒకే రూపమే కాబట్టి ఉద్యోగ బాధ్యతలని బట్టి పేరు మాత్రమే భేదం కాబట్టి, గణపతికి ఎడమ తొడమీద లక్ష్మీదేవి కనిపిస్తుంది, లక్ష్మీ గణపతి రూపంలో. స్త్రీ ఎప్పుడూ తన పురుషుని ఎడమ తొడ మీదే కూర్చోవాలి. సంతానం మాత్రం కుడి తొడమీద కూర్చోవాలి! అందుకే అక్షరాభ్యాసాది సర్వ శుభకార్యాల్లోనూ కుడి తొడమీదే కూచోబెట్టుకుని, చేయవలసిన ప్రక్రియని ముగించాక, గురువుగారికి  అందించి వారితో అక్షరాభ్యాసాన్ని చేయిస్తారు శిశువుకి. ప్రయాగలో త్రివేణీ సంగమ స్థలంలో వేణీదానం (స్త్రీల శిరోజాల చివరి భాగాన్ని తుంచడం) చేసే సందర్భంలో స్త్రీని పురుషుని ఎడమ తొడ మీదే కూర్చోబెడతారు. ఇదంతా లక్ష్మీగణపతి విగ్రహం మనకి నేర్పిన సంప్రదాయమే.

 
వి-ఘ్నం
 ‘
వి - విశేషంగా ప్రారంభించబడిన పని, ఘ్న - మరింక తీరుగాను కూడ బాగుచేయ వీల్లేని రీతిలో ధ్వంసం కావడమని విఘ్నమనే పదానికర్థం. తిరిగి ప్రారంభించగల విధానమున్న పద్ధతిలో కలిగేది తాత్కాలిక విఘ్నం. దీనివల్ల కొంత మనో వైకల్యమున్నా పెద్ద ఇబ్బంది లేదు. అదే శాశ్వత విఘ్నమైతే చెప్పేదేముంది?

 
పాల సముద్రాన్ని చిలికే వేళ మందరమనే పర్వతం సముద్రంలోకి దిగబడి, బురదలో కూరుకుపోవడం తాత్కాలిక విఘ్నం. దాన్నుండి ఉద్ధరించి విఘ్న నివారణాన్ని చేసింది (కూర్మావతారాన్నెత్తి) శ్రీహరే కదా!
 
ఇక విశ్వామిత్రుడు త్రిశంకుడనే పేరున్న రాజుని బొందితో స్వర్గానికి పంపించదలచి చేయవలసిన ప్రయత్నాలన్నింటినీ చేసి, స్వర్గ మర్త్య మధ్యభాగంలో విడిచి వేయడమనేది శాశ్వత విఘ్నానికి కలిగిన ఫలితం.
 
విఘ్నమనేది ఆహారాన్ని తినడం వల్లనో, ప్రదేశానికి వెళ్లడం వల్లనో వచ్చేది కాదు. కాలం గడుస్తూ ఉండగా కాలవశంగా వచ్చేది మాత్రమే. అందుకే శ్రీహరి తనని గురించి తాను భగవద్గీతలో - కాలః కలయతా మహమ్ - లెక్కింపబడే వాటిలో కాలాన్ని నేను (కాలో స్మి) అని స్పష్టంగా చెప్పుకున్నాడు.
 
ఇక వినాయకుడూ శ్రీహరీ ఒక్క రూపమే అయిన కారణంగానే వినాయకుడు కొన్ని ప్రదేశాల్లో ఊర్ధ్వ పుండ్రధారిగా కనిపిస్తాడు. విష్వక్సేనుడు ఈయనే. ఈయన పరివారమంతా కూడా రూపంతోనే ఉంటారంటుంది శ్రీ విష్ణు సహస్రనామం.

 
శ్రీహరి రక్షణ బాధ్యతని చేపట్టే దైవం కాబట్టే, ఆయన కాలస్వరూపాధి దేవతా రూపంగా - అంటే - వినాయకునిగా మారి మమ్మల్ని రక్షిస్తూ ఉండవలసిందని ప్రార్థిస్తూ పెట్టే విగ్రహమే మనకి వీధి శూల ఉన్న ఇళ్ల ముందు కనిపిస్తుంది. ‘ కాలస్వరూప వినాయకుడా! శ్రీహరి రూపమా! కాల గతిలో రావలసిన విఘ్నాలు రాకుండా నీవున్న ఇంటిలోని జనుల్ని రక్షిస్తూ ఉండవలసిందని ప్రార్థించడం దీని భావం. అయితే వట్టిగా విగ్రహాన్ని వీధిశూల ఉన్న ఇంటికి పెట్టేయడం కాకుండా, విగ్రహానికి శక్తి వచ్చేందుకై రోజూ అష్టోత్తర నామార్చననైనా చేయించాల్సిందే తప్ప లేని పక్షంలో అక్కడ వినాయక విగ్రహం పెట్టినా మరో బొమ్మని పెట్టినా ప్రయోజనం ఒకటే. కాల స్వరూపం గజం. అంటే ఏనుగుది ఎలా మందబుద్ధి విధానమో, అలాంటిదే కాలానిది కూడ. అలా కానినాడు మనం జీవితంలో పొందిన దుఃఖాలని, అవమానాలని, కష్టాలని ఏనాడూ మరిచిపోలేం. కాలంలో ఉత్తరాయణం, దక్షిణాయనం ఉన్నట్లు, కాలస్వరూపమైన వినాయకుని తొండం కుడిగా ఎడమవైపుగా విగ్రహాల్లో రెండు తీరులుగాను ఉంటుంది.

 
పంచాయతనం
 
ఆదిత్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, మహేశ్వరుడు అనే ఐదుగురినీ నాలుగు దిక్కులా నలుగురినీ ఉంచి, మధ్యలో ఎవరిని ప్రధాన దైవంగా భావించాలనుకుంటున్నామో అలా ఆరాధించడం పంచ+ఆయతన విధానం (ఐదుగురికి స్థానాన్ని ఏర్పాటుచేసి, ఐదుగురూ ఒకచోట ఉండగా అందరినీ పూజించే తీరు) అన్నారు పెద్దలు.

 
ప్రసిద్ధ అన్నవర క్షేత్రానికెళ్తే ఆగ్నేయంలో గణపతి, నైరుతిలో సూర్యుడు, వాయవ్యంలో అంబిక, ఈశాన్యంలో మహేశ్వరుడు, అందరికీ మధ్యలో విష్ణువు. స్తంభం పైభాగంలో పై అంతస్థు మీద శ్రీ వీర వేంకట సత్యనారాయణమూర్తి, ఇటు శంకరుడు అటు అమ్మవారు ఉండగా దర్శనమిస్తారు. అక్కడ అన్నిటి మధ్యా విష్ణువున్న కారణంగా అది విష్ణు పంచాయతనమన్నమాట. పంచాయతన విధానాన్ని నేర్పింది మనకి శ్రీహరే. అందుకే భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో మహేశ్వరుణ్ని, మార్గశిరంలో శ్రీహరిని, పుష్యమాసంలో సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉండవలసిందని కాలచక్రంలో స్థిర నిర్ణయాన్ని చేసేశాడు.

 
కారణంగా వినాయక చవితి పేరిట ఒక్కరోజునే గణపతి పూజని చేసేసుకుని ముగించుకోవడం కాకుండా, కాల పంచాయతనంలో మరో నలుగురు దైవాలు క్రమంగా నెలకొక్కరు రాబోతున్నారని గ్రహించి, వారిని కూడా ఆరాధించడాన్ని చేస్తే, అక్కడికి పంచాయతన పూజ ముగిసినట్లన్నమాట కారణంగా చేయబోయే పంచాయతన పూజకి విఘ్నమూ కలగకుండా చేయవలసిందంటూను, బుద్ధికి అధిష్ఠాత వినాయకుడే కాబట్టే విఘ్నమూ లేకున్నా కూడా పూజచేసే బుద్ధిని ప్రసాదించవలసిందిగాను ప్రార్థిద్దాం!

కాణిపాక వినాయకుడి విగ్రహం గురించి ఆసక్తి కల్గించే కొన్ని నిజాలు
నాటి కాణిపాకమే.. 
వరసిద్ధుడి ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. కాణిపాకం అప్పట్లో విహారపురిగా పిలువబడేది. గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకొని జీవనం సాగించేవారట. వీరిలో ఒకరు అంధుడు, మరొకడు చెవిటివాడు, ఇంకొకడు మూగవాడు. తమ పొలానికి నీరు పెట్టడానికి చిన్న యాతపు బావి నుంచి యాతం వేసి నీరు తోడుతుండగా బావిలోని రాయికి యాతపు బాణ తగిలి రక్తం స్రవించిందట. ఆనీరు తగిలిన అంధుడికి వెంటనే దృష్టి రాగా చెవిటివాడికి చెవులు వినిపించాయి. మూగవాడు మాట్లాడగలిగాడు. యాతపు బాణ తగిలిన స్వామి శిరస్సుపై ఇప్పటికీ కొప్పులా ఎత్తుగా కనిపిస్తుంది. మహిమ తెలిసిన పరిసరగ్రామాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి విగ్రహానికి పూజలు చేసి వేల కొబ్బకాయలను కొట్టారు. వారు కొట్టిన కొబ్బరి నీళ్లు కాణి(ఎకరా)పారకం అయింది. క్షేత్రాన్ని తొలుత కాణిపారకంగా పిలిచేవారు. కాలక్రమేణా అది కాణిపాకంగా మారింది.  
పెరుగుతున్న మూలవిరాట్టు

వరసిద్ధి వినాయకుడి విగ్రహం ప్రతి సంవత్సరం కొంత పరిమాణం పెరుగుతుండడం ఇక్కడి విచిత్రం. 1945లో తవణంపల్లె మండలం అరగొండ గొల్లపల్లెకు చెందిన సిద్ధయ్యనాయుడు, లక్ష్మమ్మ స్వామి అనేవారు విగ్రహాన్ని కొలతలు వేసి సరిపడా వెండి కవచాన్ని విరాళంగా ఇచ్చారు. తర్వాత మరికొందరు దాతలు కవచాలు సమర్పించారు. తొలుత చేయించిన కవచాలు ప్రస్తుతం స్వామికి సరిపడటం లేదు. వీటిని ప్రస్తుతం ఆలయ మూషిక మండపంలో భక్తుల సందర్శనార్థం ఉంచారు


వినోదం.. విజ్ఞానం చవితి పాశస్త్యం 
ప్రకృతికి ప్రతిరూపం.. కలిసిమెలిసి జీవించే తత్వానికి సంకేతం.. విద్య, విజ్ఞానం అందించే దేవతా స్వరూపం.. మెల్లని చూపుల మందహాసంతో... చల్లని దీవెనలందించే ఏకదంతుడి పూజలో ఎన్నో అంతరార్థాలు. అవి తలచుకుంటే సకల శుభాలు. పిల్లలకు వివరిస్తే వికాస పాఠాలు. ఇదే భావనను ఆధ్యాత్మిక వేత్త టి.కె.వి. రాఘవన్ఇలా వివరించారు.

అంతరార్థం గ్రహిస్తే ఆనందాలే.. 
వినాయకుడంటే ప్రకృతి. మహాగణాధిపతి మట్టితో పుట్టిన వాడు. భూమిని, ప్రకృతి సంపదను కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందనేది వినాయక చవితి సందేశం. గణపతిని 21 రకాల పత్రితో పూజించాలంటారు. ఎందుకంటే పంచేద్రియాలు, జ్ఞానేంద్రియాలు పది. వీటికి ప్రవృత్తి, నివృత్తి, మనసు కలిపితే 21. అవన్నీ సిద్ధి, బుద్ధి చేకూర్చాలని కోరుకోవడమే దాని అంతరార్థం. అంతేకాదు పూజించే ప్రతి పత్రిలోనూ ఔషధ గుణాలుంటాయి. అవి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి, ఆనందానికి దోహదం చేస్తాయి.

వినాయక చవితి నాడు వివిధ రకాల పండ్ల వాడకం ఎంతో ప్రతీతి. పాలవెల్లికి కట్టడానికి, భక్తితో గణపతికి నివేదన చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. వాటిల్లో చాలామటుకు మహిళల ఆరోగ్యానికి దోహదం చేసేవే. మొక్కజొన్న పొత్తుల్లో పీచు అధికం. దీనివల్ల అనవసరపు కొవ్వు చేరుకోదు. వాటిల్లోని ఫొలేట్కణాలు గర్భధారణ సమయంలో కొత్త కణాల ఉత్పత్తికి సహకరిస్తాయి. సీతాఫలంలో క్యాన్సర్రాకుండా చూసే యాంటీ ఆక్సిడెంట్లు అధికం. బత్తాయిలు, నారింజల్లో విటమిన్‌ ‘సిఉంటుంది. గర్భిణులకు అవసరమైన ఫోలికామ్లం, పీచు, పొటాషియం పెద్దమొత్తంలో వీటి నుంచి అందుతాయి. చింతకాయలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

సామాజిక జీవనానికి వినాయక చవితి ప్రతీక. పత్రి సేకరణలో, పాలవెల్లి అలంకరణలో, పూజా ద్రవ్యాలను సమకూర్చడంలో, పుస్తకాలు పక్కన ఉంచి పూజ చేయడంలో పిల్లల భాగస్వామ్యం అధికం. తెలుగునాట, పల్లెపట్టుల్లో చూస్తే.. పర్వదినానికి ముందురోజు తరగతులు త్వరగా ముగించి, విద్యార్థులను పత్రి సేకరణ చేయమనేవారు. కొందరు పూజకు పుష్పాలు తెస్తే, శారీరక దార్ఢ్యం ఉన్నవారు చెట్లెక్కి వెలగపండ్లు కోసి తెచ్చేవారు. భయం లేని చిన్నారులు పొదల్లోకి వెల్లి ఉమ్మెత్త వంటివి పట్టుకొచ్చేవారు. ఇలా వారి వ్యక్తిత్వాలు వెల్లడయ్యేవి. సేకరించిన వాటిని అందరూ పంచుకునే వారు. ప్రక్రియ వల్ల అరిటాకుల్ని పిలకల వద్ద కోస్తే మళ్లీ పెరుగుతాయనే వ్యవసాయ జ్ఞానం వారికి అబ్బేది.

మట్టికి కుమ్మరి, పాలవెల్లికి వడ్రంగి, ఫల పుష్పాదులకు వ్యవసాయదారుడు, వెదురు బుట్టలకు మేదరి.. గ్రామీణ వృత్తుల ప్రాధాన్యం తెలపడం పండగ ప్రత్యేకం. కాలం మారినా, ప్రాంతంలో ఉన్నా ప్రతి వృత్తి మీదా గౌరవం చూపాలనేదే సంకేతం. అలాగే వినాయకుడి ప్రతిమ మట్టితో తయారు చేయడమే సంప్రదాయం. బంకమట్టి తెచ్చి పిల్లలు వినాయకుడిని తయారు చేస్తారు. ఒకరు ఒక రకంగా, ఇంకొకరు మరోరకంగా.. చూస్తుండగానే అవతలి వారిది బాగా రూపుదిద్దుకొంటుంది.. బాగా రానివారికి వేరొకరు సాయం చేస్తారు. మనసుల్లో పోటీ, వచ్చే ఏడు మరింత బాగా చేయాలన్న తపన.. కళాత్మక జిజ్ఞాస వికాసానికి ఉపయోగపడుతుంది.

సూక్ష్మదృష్టితో కార్యసాధనకు ఉపక్రమించాలని.. తల్లిదండ్రుల్ని మించిన పుణ్యతీర్థాలు లేవని వినాయక వృత్తాంతం తెలుపుతుంది. పాలవెల్లి సృష్టికి, పాల సముద్రానికి ప్రతీక. ఆరంభంలో హాలాహలం ఎదురయినా.. ఓపిక, పట్టుదలతో ముందంజ వేస్తే ఆనందాలు, అన్ని సంపదలూ సమకూరుతాయన్న అంతరార్థం దానిలో ఉంది. పర్వదినాన వినాయకుణ్ని భక్తితో పూజిస్తే జయం కలుగుతుంది. విద్య లభిస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ అందుతుంది. సర్వార్థ సిద్ధి ఒనగూరుతుంది.

విగ్రహం ఎంపికలోనూ చక్కటి భావాన్ని విడమరిచి చెప్పిన వైనం స్కాందపురాణం, మంత్రశాస్త్రంలో గోచరిస్తుంది. గణేశుని తొండం లోపలికి ఉంటే యోగ సాధన. బయటికి ఉంటే ఇహలోక కోరికలు. ఎడమ పక్కకు తిరిగి ఉంటే పదిమందికీ ఉపయోగపడే తత్వం. కుడిపక్కకు తిరిగి ఉంటే నేను, నా కుటుంబం, బంధుమిత్రుల సంక్షేమం అని అర్థం. అయితే భాద్రపద చవితినాడు, రూపంలో ఉన్న గణపతికి పూజ చేసినా సకల శుభాలు కలగడం తథ్యం.


 గం గణపతియే నమః!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)