అంతర్జాతీయ మహిళా దినోత్సవం


వివిధ రంగాల్లో మహిళలు చేసిన కృషిని.. వారి అందించిన సేవలను గౌరవిస్తూ ఏటా మార్చి 8వ తేదీని వివిధ రంగాల్లో మహిళలు చేసిన కృషిని.. వారి అందించిన సేవలను గౌరవిస్తూ ఏటా మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తారు. మొదట్లో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరుపుకునేవారు.

20వ శతాబ్దం ప్రారంభంలో పాశ్చాత్య దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సమయమది. మహిళలూ.. పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి కనబరిచేవారు. కానీ వారంటేచులకనభావం.. లింగవివక్షతో చిన్నచూపు చూసేవారు. ఈ పరిస్థితిని ప్రతిఘటించిన మహిళలు తమ హక్కులసాధన కోసం పోరాటం ప్రారంభించారు. అదే.. మున్ముందు రోజుల్లో మహిళా దినోత్సవానికి పునాది వేసింది.

అమెరికాలో 1909లో ఫిబ్రవరి 28(చివరి ఆదివారం)న మొదటిసారి జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పట్నుంచి 1913 వరకు ఏటా ఫిబ్రవరి నెల చివరి ఆదివారం మహిళా దినోత్సవంగా జరుపుకునేవారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని.. 1910 ఆగష్టులో డెన్మార్క్‌లోని కోపెన్‌హెగెన్‌లో జరిగిన ‘అంతర్జాతీయ మహిళా సదస్సు’లో జర్మన్‌ సోషలిస్ట్‌ లూయిస్‌ జియట్జ్‌ ప్రతిపాదించగా మరో సోషలిస్టు క్లారా జెట్కిన్‌ సహా 17 దేశాలకు చెందిన పలువురు మహిళలు బలపరిచారు. ఈ క్రమంలోనే 1911 మార్చి 19న అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఆస్ట్రియా.. డెన్మార్క్‌.. జర్మనీ.. స్విట్జర్లాండ్‌కి చెందిన పదిలక్షల మందికి పైగా ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని ర్యాలీలు.. ప్రదర్శనలు నిర్వహించారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించిన తీరును చూసి రష్యన్‌ మహిళలు తొలిసారిగా 1913లో నిర్వహించుకున్నారు. తర్వాత 1914 నుంచి మార్చి 8న మహిళా దినోత్సవం జరపడం మొదలు పెట్టారు. తర్వాత కాలంలో ఈ ఉద్యమం యూరప్‌లోని ఇతర దేశాలకూ వ్యాపించింది. ఉద్యమంలో భాగంగా 1914లో జర్మనీలో మహిళలకు ఓటుహక్కు కోసం పోరాటం చేసి 1918 నాటికి సాధించారు.

రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో 1917లో నిర్వహించిన మహిళా దినోత్సవం ఉద్యమంగా మారింది. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసి.. ఆహార కొరత తీరాలంటూ ‘బ్రెడ్‌ అండ్‌ పీస్‌’ పేరుతో నాలుగురోజుల పాటు ఉద్యమం కొనసాగింది. శ్రామికమహిళలు ఫ్యాక్టరీల్లో తమ పనులను వదులుకొని.. అధికారులను ఎదిరించి మరీ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమస్ఫూర్తి తర్వాత కాలంలో మరిన్నిదేశాలకు వ్యాపించింది.

1975 మార్చి 8న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!