మట్టికుండ

మట్టికుండ

వేదాలు నాలుగు కదా! ఆయుర్వేదం ఏమిటి?

by 11:00:00 PM 0 comments
వేద నిర్వచనం:
హిందూమతం లో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శృతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.
ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా, (ఇష్టప్రాప్తి,అనిష్టపరిహారం )కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకూండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం
  • ఋగ్వేదం
  • యజుర్వేదం
  • సామవేదం
  • అధర్వణవేదం 

ఈ నాలుగు వేదాలు. కృతయుగంలో దేవతలు రాక్షసులు ఒకటిగా చేరి క్షీరసాగర మధనం. ఆ సాగరమధనం నుండి శ్రీమహాలక్ష్మీకౌస్తుభామణిఐరావతంకల్పవృక్షంకామధేనువుచంద్రుడుదివ్యరత్నరాశులు. ఉచ్చైశ్శ్రవముఅమృతము పుట్టాయి. అన్నికంటే ముందుగా పుట్టింది హాలాహలం. అమృతంతో తరువాత ‘ధన్వంతరి’ జన్మించాడు. ఈయనను మహావిష్ణువు అవతారంగా భావిస్తారు. ధన్వంతరి జన్మిస్తూనే ఒక చేతిలో అమృతభాండాన్ని మరొక చేత ఆయుర్వేదాన్నిపట్టుకొని ప్రత్యక్షమై వచ్చారు. ఈ ఆయుర్వేదమే సకల మానవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే జీవనవేదం. ఈ ఆయుర్వేదాన్ని అధర్వణవేదానికి ఉపవేదంగా చెబుతారు.
శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన ధర్వంతిరియే రోగ మరణభయంలేని అమృతాన్ని దేవతలకు యిచ్చి అజరామరులుగా చేసాడు. పంచమవేదంగా ఆయుర్వేద భండారాన్ని బ్రహ్మదేవునికి ఇచ్చాడు శ్రీధన్వంతరి.
ఈ ఆయుర్వేదం బ్రహ్మదేవుని నుండి దక్షప్రజాపతికి లభించింది. దక్ష ప్రజాపతినుండి సురలోక వైద్యులైన అశ్వినీ కుమారులకు సంక్రమించింది.
ఈ ఆయుర్వేదం భూలోకానికి ఎలా వచ్చిందంటే:
ఒకసారి వసిష్ఠభరద్వాజఅంగీరసఅత్రిదుర్వాసభృగువిశ్వామిత్రాది మహర్షులందరూ హిమవత్పర్వతంమీద సమావేశమైనపుడుమానవాళి రోగాల బారినపడి నిశ్శేషమైపోతున్న విషయం చర్చకు వచ్చింది. దేవలోకంనుండి ఆయుర్వేదాన్ని భూలోకానికి రప్పించాలని అందరూ నిశ్చయించుకొన్నారు. భరద్వాజ మహర్షి దేవలోకం వెళ్ళి ఆయుర్వేదాన్ని అభ్యసించి వచ్చి ‘ఆత్రేయుడు’ అనే మహర్షికి బోధించాడు. ఈ మహర్షి తదనంతరం అగ్నివేశ మహర్షికి ఉపదేశం చేసాడు. ఆత్రేయునివద్ద నేర్చుకొన్న ఆయుర్వేద రహస్యాలను మహా శాస్త్రంగా రచించాడు అగ్నివేశుడు. దీనినే “అగ్నివేశతంత్రం” అంటారు. ఈ అగ్నివేశతంత్రం క్రీపు.2000-1000 “చరకసంహిత” గా రూపుదిద్దుకొంది. ఈ చరకుదినే మన ఆయుర్వేదానికి ఆదిగురువుగా ఇపుడు పూజిస్తున్నాం.
శ్లో|| నమామి ధన్వంతిరి మాదిదేవంసురాసురైర్వందిత పాదపద్మం
      లోకేజరారుగ్భయ మృత్యునాశంధాతారమీశం వివిధౌషదీనాం

--------------------------------------------- 

Bheemesh Chowdary Kacharagadla

సంపాదకులు

భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) గారు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం మరియు కాచరగడ్ల మీడియా కార్పొరేషన్ వ్యవస్థాపకులు. వీటి ద్వారా మరుగును పడిపోతున్న దేవాలయాలు, తెలుగు కవుల చరిత్రను అధ్యయనం చేసి గ్రంధస్తం చేస్తున్నారు వీరు స్వతహాగా రచయిత కూడా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి