మట్టికుండ

మట్టికుండ

భక్తి అంటే ఏమిటి?

by 10:17:00 PM 0 comments
భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తులు అనగా తొమ్మిది రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది. ఆ శ్లోకం:

శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం

పై శ్లోకాన్ని పోతన తెనిగించిన విధం
తను హృద్భాషలసఖ్యమున్శ్రవణమున్దాసత్వమున్వందనా

ర్చనముల్సేవయునాత్మలో నెఱుకయున్సంకీర్తనల్చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి 
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా!


అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.

శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలుసంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.

కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకినారదుడుతుంబురుడుప్రహ్లాదుడుఆళ్వారులునయనార్లురామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.

స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణంరూపస్మరణంస్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులుప్రహ్లాదుడుధ్రువుడుతులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.

పాదసేవన భక్తి : భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. భరతుడుగుహుడు మొదలైన వారు  పాదసేవ ద్వారా ముక్తులైనారు.

అర్చన భక్తి : ప్రతిరోజు తులసి పుష్పాదులుఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది. 

వందన భక్తి : వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమనినమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినాశాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు  ఫలితాన్ని పొందలేడు.

దాస్య భక్తి : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడైదాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడులక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.

సఖ్య భక్తి : సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడుసుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.

ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి : ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం.  మార్గాన ద్రౌపతిగజేంద్రాదులు ముక్తులైనారు.

శంకర భగవత్పాదులు ఇలా అంటారు. 
మోక్షకారణ సామగ్ర్యాం భక్తిరేవ గరీయసీ స్వస్వరూపానుసంధానం భక్తి రిత్యభిదీయతే” 
(మోక్ష కారణలైన సామాగ్రులలో “భక్తి” గొప్పది. “స్వస్వరూప అనుసంధానమే” భక్తి అనబడుతుంది)

తన నిజ స్వరూపంతో విడదీయలేనట్లుగా కలిసి పోవడమే భక్తి. పై శ్లోకంలో ఇదే భావాన్ని శంకరులు శివానందలహరిలో చక్కగా ఉదాహరణలతో గొప్ప యోగరహస్యాన్ని చొప్పించి మరీ చెప్పారు.

1. 
అంకొల వృక్షము యొక్క బీజములు చెట్టుచే ఆకర్షింపబడి నట్లుగా
2. 
అయస్కాంతము చేత సూది (అయస్కాంత క్షేత్రములోకి వచ్చిన వెంటనే చటుక్కున అతుక్కుపోయినట్లుగా)
3. 
సాధ్వి ఎల్లప్పుడూ తన విభుని చేరునట్లుగా (సాధ్వి అలోచనలు ఎల్లప్పుడూ తన విభునియందే ఉండునట్లుగా)
4. 
లత (పూలతీగ) చెట్టుని పెనవేసుకున్నట్లుగా
5. 
నదులు తమ వల్లభుడైన సముద్రములో లీనమైనట్లుగా (నామ రూపాలను వదలి)
చిత్త వృత్తులు పరమేశ్వరుని పాదారవింద ద్వయమునందు చేరి ఎల్లప్పుడూ ఉంటవో దానినే భక్తి అందురు.

ప్రమాణవిపర్యయవికల్పనిద్రాస్మృతి అనే ఐదూ చిత్తవృత్తులనీ,   చిత్త వృత్తుల నిరోధమే “యోగ” మనబడుతుందనీ పతంజలి మహర్షి యోగ సూత్రం. అదే భక్తి అనబడుతుందని శంకరుల వివరణ. ఇలాంటి భక్తి వలననే మానవుడు తరిస్తాడు.

Bheemesh Chowdary Kacharagadla

సంపాదకులు

భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) గారు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం మరియు కాచరగడ్ల మీడియా కార్పొరేషన్ వ్యవస్థాపకులు. వీటి ద్వారా మరుగును పడిపోతున్న దేవాలయాలు, తెలుగు కవుల చరిత్రను అధ్యయనం చేసి గ్రంధస్తం చేస్తున్నారు వీరు స్వతహాగా రచయిత కూడా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి