మట్టికుండ

మట్టికుండ

వేసవి వచ్చేసింది... కనీసం ఈ చిట్కాలు పాటించాల్సిందే...

by 4:24:00 AM 0 comments
వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెల్లా ఆస్వాదించొచ్చు.

వేసవి చిట్కాలు:
1) ఆహారపదార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.
2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
6) శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.
7) కాఫీ, టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
11) వేసవిలో బయట జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్‌లు చేసుకుని తాగాలి.
12. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్ పంచదార కలిపి ఒ.ఆర్.ఎస్ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది.
13. తాటి ముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పిటల్, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.
14. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాగే నీటిని ఎక్కువగా తాగాలి.
15. వేసవిలో బయటకి వెళ్ళేటపుడు కళ్ళకు సన్ గ్లాస్ మరియు టోపీ వంటిని ధరించండి 
16. వయస్సు 50 దాటన వారు తమ ప్రయాణాలలో తప్పక ORS  పాకెట్స్ వెంట తీసుకెళ్ళాలి.
17.ఒకవేళ మీరు వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటే మాత్రం, ఎక్కువగా సూర్యరశ్మికి బహిర్గతం అవకండి. గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారు సూర్యరశ్మికి బహిర్గతం అవటం వలన త్వరగా డీ-హైడ్రేషన్'కు గురి అయి వ్యాధి తీవ్రతలు అధికం అవుతాయి.
18.వేసవికాలంలో శరీరానికి అతుక్కొని, బిగుతుగా ఉండే దుస్తువులను ధరించకండి. వదులుగా, కాటన్'తో తయారుచేసిన బట్టలను ధరించండి. దీనివలన మీ శరీరానికి గాలి తగిలి డీ-హైడ్రేషన్ జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది.
19.ఆల్కహాల్, సిగరెట్ మరియు కార్బోనేటేడ్ వంటి ద్రావణాలకు దూరంగా ఉండండి. వీటి వలన శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
20. వేసవికాలంలో భయటకి వెళ్ళేటపుడు మీతో వాటర్ బాటిల్'ను తీసుకెళ్ళండి....
  
మండే ఎండల్లో చల్లదనం ఇచ్చే ఆహార పదార్థాలేంటి?
ఈ యేడాది వేసవికాలం ప్రవేశించక ముందే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో అపుడే ఉష్ణోగ్రతలు సెంచరీల మేరకు నమోదవుతున్నాయి. ఇంకొన్ని ప్రాంతాలు భానుడు ప్రతాపానికి అగ్నిగుండంలా మారిపోతున్నాయి. అయితే, ఇలాంటి సమయాల్లో కాస్తంత సేద తీరేందుకు చూసినా చల్లని పండ్ల రసాలు, శీతల పానీయాలు, చెరుకు రసాలు సేవిస్తుంటారు. ఇవేకాకుండా, ఎండాకాలంలో మనల్ని మనమే సంరక్షించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యల బారి నుంచి తప్పించుకోవచ్చు అనే విషయాన్ని ఓ సారి పరిశీలిద్ధాం. 

చల్లని మజ్జిగ లేదా పెరుగు, లేదా వాటితో తయారుచేసిన లస్సీలు తాగాలి. వీటికి వివిధ రకాల పండ్లను కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. వేసవి తాపం నుంచి బయటపడేందుకు ఇవి బాగా పనిచేస్తాయి. 

ఎండా కాలంలో ఎక్కువగా లభించే పుచ్చకాయలు శరీరాన్ని చల్లపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు, పోషకాలను పుచ్చకాయలు అందిస్తాయి. 

మండే ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే కీరదోసలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో పీచు పదార్థంతో పాటు.. నీరు ఎక్కువగా ఉంటుంది. ఇవి డీహైడ్రేషన్ నుంచి రక్షించడమేకాకుండా, శరీరాన్ని బాగా చల్లబరుస్తాయి. 

వేసవి కాలంలో ఆకుపచ్చని కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం ఎంతో మంచిది. వీటిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అయితే వీటిని వేసవికాలంలో అధికంగా ఉడికించకుండా తింటేనే మంచి ఫలితం కనిపిస్తుంది. 

రూపంలో, రుచిలో దోసకాయలను పోలి ఉండే తర్బూజా పండ్లలో 90 శాతం నీరే ఉంటుంది. వీటిని వేసవిలో ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా, ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. 

వేసవిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను పొందవచ్చు. అంతేకాదు ఎండ దెబ్బ నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. కొద్దిగా చక్కెర, ఉప్పు, నిమ్మరసం కలిపి తయారు చేసిన చల్లని షర్బత్‌ను తాగితే శరీరానికి చాలా మంచిది. 

వీటితో పాటు ఐస్‌క్రీంలు. ప్రధానంగా ఎండా కాలంలోనే వీటిని అందరూ ఎక్కువగా తింటారు. వీటి వల్ల శరీరానికి చల్లదనం చేకూరుతుంది. అయితే కొవ్వు, చక్కెరల దృష్ట్యా ఐస్ క్రీంను కొద్ది మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. 
  
వేసవిలో మజ్జిగలో నిమ్మరసం కలుపుకుని తాగితే..?
కొబ్బరి నీళ్లను కూడా వేసవిలో ఎక్కువగా తాగాలి. ఇందులోని ఖనిజ లవణాలు వేసవి నుంచి శరీరాన్ని చల్లబరుస్తాయి. దీంతో పాటు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. వేసవి తాపం నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సాధ్యమైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలి. అలాగే చెరకు రసాన్ని కూడా తీసుకోవాలి. ఈ రసంలో కార్బోహైడ్రేట్లు అపారంగా ఉంటాయి. దీంతో తక్షణ ఉపశమనం లభిస్తుంది. మూత్ర సంబంధ వ్యాధులతో బాధపడేవారు చెరకు రసం తీసుకుంటే చాలా మంచిది. వేసవిలో ఎప్పటికప్పుడు మజ్జిగలో నిమ్మరసం కలుపుకుని తాగితే చాలా మంచిది.

మండు వేసవిలో పరిశుభ్రమైన శాకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు, మాంసాహారానికి దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం ఉత్తమం. అలాగే శరీరానికి చల్లదనం ఇచ్చే అన్నిరకాల పండ్లను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఐస్ తక్కువగా వేసుకుని పండ్ల రసాలను కూడా ఎక్కువగా సేవించవచ్చు. సహజ సిద్ధమైన పోషక విలువలు ఉండే పండ్లను తిన్నట్లయితే.. శరీరాన్ని సమస్థితిలో ఉంచటమేగాక దాహార్తిని తీర్చి శరీరానికి స్వాంతననిస్తాయి.

పండ్లలో పుచ్చకాయను తినటంవల్ల శరీరానికి ఎంతగానో మేలు జరుగుతుంది. రుచితోపాటు బీ విటమిన్ అధికంగా ఉండే పుచ్చకాయ శరీరానికి శక్తినివ్వటమేగాక.. అందులో ఉండే పొటాషియం గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. వడదెబ్బ బారినుంచి కాపాడుతుంది. ఎండ తీవ్రతకు కమిలిపోయిన చర్మానికి స్వాంతననిస్తుంది. రక్తపోటును అరికడుతుంది. అలాగే పోషకవిలువలు ఎక్కువగా ఉండే కీర దోసను కూడా ఎక్కువగా తీసుకోవాలి.

వేసవి కాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఏవి?
మనకు ప్రకృతిలో సహజంగా లభించే పండ్లు అన్ని కాలాల్లోనూ ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ముఖ్యంగా వేసవిలో అయితే భానుడి తాపాన్ని చల్లార్చేందుకు పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే పండ్లు కేవలం వేసవి తాపాన్ని తీర్చేందుకు మాత్రమే కాదు "దంతాల"ను మిలమిలా మెరిసిపోయేలా చేస్తాయి. ఇలాంటి వాటిలో సిట్రస్ గ్రూపుకు చెందిన నిమ్మ, నారింజ, బత్తాయి, కమలా ఫలం, ఉసిరి, ఫైనాఫిల్, నల్ల నేరేడు, ద్రాక్ష, జామలతోపాటు మామిడి, బొప్పాయి, పనస, సపోటా, ఖర్జురం, ఆపిల్, అరటి, సీతాఫలం, పుచ్చకాయలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు.

సిట్రిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉండే పండ్లలో విటమిన్‌-సి సమృద్ధిగా లభించటంవల్ల చిగుళ్లు, పళ్ల ఆరోగ్యానికి మంచిది. ఈ సిట్రిక్‌ ఆమ్లం పళ్లపై పేరుకున్న జిగురుపొరను తొలగించి పళ్లు మిలమిలా మెరిసిపోయేలా చేస్తుంది. సిట్రిక్ ఆమ్లం ఒక డిటర్జెంట్‌లా కూడా పనిచేస్తుంది. కొన్ని రకాల పండ్లను కొరకడం వల్ల ముందరి పళ్లకు, బాగా నమలడం వల్ల పక్క దంతాలకు మంచి వ్యాయామం అందుతుంది. ఇలా నమిలేటపుడు పండు చిగుళ్లకు రాపిడి ఇవ్వడం వల్ల అవి కూడా గట్టిపడతాయి. ఇలాంటి వ్యాయామం వల్ల చిగుళ్ల వ్యాధులు, దంతక్షయాలను నివారించవచ్చు. 

ఆపిల్ పండును ముక్కలుగా కోయకుండా అలాగే కడిగి తినటంవల్ల పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. అంతేగాకుండా ఆపిల్ పండు కొరికి తింటున్నప్పుడు పళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలవల్ల పళ్లపై ఏర్పడిన జిగురు పొరను శుభ్రం చేస్తుంది. అలాగే ఆపిల్‌ను కొరికి తినటంవల్ల నోట్లో ఎక్కువగా లాలాజలం ఊరుతుంది. ఇలాగ కూడా పళ్లచుట్టూ ఉన్న పాచి శుభ్రమవుతుంది. కాబట్టి ప్రతిరోజు భోంచేసిన తర్వాత ఆపిల్ లేదా ఏదైనా పండు తినటం ఆరోగ్యానికి మంచిది.వేసవితాపానికి చెక్ పెట్టే పచ్చి మామిడికాయ.. ఎలాగో తెలుసుకోండి!
వేసవితాపానికి వడదెబ్బకు గురయ్యేవారు పచ్చి మామిడికాయను తరిగి ఒక గ్లాసు నీటిలో వేసి.. దీనిలో చక్కెర వేసి బాగా కలపాలి. ఇలా తయారుచేసుకున్నదానిని తాగితే వడదెబ్బ బారినుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే పచ్చి మామిడి ముక్కలపై కాస్త ఉప్పు వేసి తినటంవల్ల అధిక దాహాన్ని అరికట్టడమేగాకుండా.. చెమట ద్వారా శరీరంలోని లవణాలు, రక్తంలోని ఐరన్ తదితరాలు బయటకు పోకుండా ఆపుతుంది.

వేసవిలో సంభవించే డయేరియా, రక్త విరేచనాలు, పైల్స్, వికారం, అజీర్తి, మలబద్ధకం లాంటి సమస్యలకు మామిడి పిందెల్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి వాటికి ఉప్పు, తేనెను కలిపి తింటే అద్భుతమైన ఔషధంలాగా పనిచేస్తుంది. 

ఇంకా.. పచ్చిమామిడితో మిరియాలు, తేనె కలిపి తిన్నట్లయితే...పచ్చ కామెర్లు వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుంది. పచ్చి మామిడికాయలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. గుండె కండరాలను బిగుతుగా చేసే శక్తి మామిడికి ఉంది. అలాగే చర్మాన్ని మిలమిలా మెరిసేలా చేసే శక్తి కూడా మామిడిలో అధికంగా ఉంది. 


Bheemesh Chowdary Kacharagadla

సంపాదకులు

భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) గారు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం మరియు కాచరగడ్ల మీడియా కార్పొరేషన్ వ్యవస్థాపకులు. వీటి ద్వారా మరుగును పడిపోతున్న దేవాలయాలు, తెలుగు కవుల చరిత్రను అధ్యయనం చేసి గ్రంధస్తం చేస్తున్నారు వీరు స్వతహాగా రచయిత కూడా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి