అక్షింతల పరమార్థం ఏమిటి?

   వివాహ శుభకార్యంలో జీలకర్రబెల్లం పెట్టె వేళమాంగల్యధారణ వేళవధూవరులపై ఆహుతులు అక్షింతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం. వివాహ శుభకార్యాల్లోనే కాదుప్రతీ శుభకార్యం లోనూ పెద్దలుపిన్నలను అక్షింతలు వేసి “దీర్ఘాయుష్మాన్ భవచిరంజీవి భవసంతాన ప్రాప్తిరస్తుఆరోగ్య ప్రాప్తిరస్తు సుఖజీవన ప్రాప్తిరస్తు” అంటూ ఆశీర్వదిస్తారు. ఇక దైవసన్నిధిలో సరే సరి. పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు.
అక్షతలు’ అనే మాట నుంచి వచ్చిందే ‘అక్షింతలు’.
   క్షతం కానివి అక్షతలు. అంటే రోకటిపోటుకు విరగనిశ్రేష్టమైన బియ్యం అన్నమాట. అటువంటి బియ్యాని పసుపు లేక కుంకుమతో నేతితో కలిపి అక్షింతలు తయారు చేస్తారు. నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతికరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.
   మనిషి మనసుబుద్ధిగుణముతల్లివ్యసనము ఇత్యాదులన్నీ చంద్రకారాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.
   శాస్త్రీయంగా చూస్తేమనిషి దేహం విద్యుత్ కేంద్రం. విద్యుత్ సరఫరాల్లో హెచ్చుతెగ్గులు సాధారణం. వ్యత్యాసాలు మనిషి మనస్సు మీదఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమోరజోసాత్త్వికాలనే త్రిగుణాలకూ కారకము.
పెద్దలు వధూవరులపై అక్షింతలు చల్లి ఆశీర్వదించే సమయంలోదేహంలో విద్యుత్తులో కొంతభాగం అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ళ నుంచిపుచ్చుకునే వాళ్ళ కోంత విద్యుత్ బదిలీ అవుతుంది. కారణంగా అక్షింతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనే మన నమ్మకం. 
పెద్దలువిద్వాంసులుగురువులుతల్లిదండ్రులుఅత్తమామలువివాహ సమయంలోశుభకార్యాలలో మనకు అక్షింతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలో ఆంతర్యంపరమార్థం ఇదే!
   మరో సిద్ధాంతం ప్రకారంగా చూస్తేనే – మనిషి దేహంలో విద్యుత్ కేంద్రాలు ఇరవైనాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్ ప్రసారకేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు.
అది సరి కాని! అక్షింతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపుకుంకుమలు కలపడం ఎందుకుఆయుర్వేదం ప్రకారంచర్మసంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ శక్తి ఉంది. అక్షితలు వేసే వారికి ఎలాంటి రోగసమస్యలున్నాపుచ్చుకునేవాళ్ళకి అవి సోకకుండా పసుపుకుంకుమలు నివారిస్తాయిట. అంతేకాకుండా పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.
భగవద్గీతలో....
అన్నాద్భవంతి భూతాని” అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈఅన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటేజీవుడు అన్నంలో పుట్టీతిరిగి జీవుడిని భగవంతుడిలో చేర్చడమే. అక్షింతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.

తెలుగులో అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.
తలను = తలయందు పోయబడే
ప్రాలు = బియ్యం అని అర్థం
    పూర్వం వధువు దాన్యలక్ష్మిగా చెప్పబడింది. తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. “ వధువా! నీవు మా ఇంటికి వచ్చాకమన ఇంటధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉందిమన జీవనానికి ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదగలవాళ్ళమై తులతూగుతూ ఉండాలి” అనే భావానికి అనుగుణంగా తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది.
    వరుడువధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకునే దానికి ముందువరుడు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచిదోసిలిలో రెండు మార్లుగా బియ్యాని వేసి మీదట పాలను కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెప్తుంది. కాలములో పురోహితులే చేయించి పోయిస్తున్నారు.
    “ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతిపుష్టిసంతోషంఅభివృద్ధివిఘ్నాలు లేకపోవడంఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక!” అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.



అక్షింతలలోతలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు వివాహ శుభకార్యాలలోఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లోఆచారాల్లో ఇంట గూడార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలసి జీవించి ఉండాలనీఆదర్శ దంపతులుగా మెలగాలనీవధూవరులపై ఆహుతులు అక్షింతలు చల్లి ఆశీర్వదించడమే అక్షింతల కార్యక్రమంలోని అర్థంపరమార్థం.
-------------------

చంద్రుడికి ప్రీతిపాత్రం: 
నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతి కరమైన దానవస్తువు బియ్యం. జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు.
మనిషి మనసు, బుద్ధి, గుణము, తల్లి, వ్యసనము ఇత్యాదులన్నీ చంద్ర కారకాలే అని అన్నారు పెద్దలు. అందుకే మనిషిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనిషి మనస్సుపై ప్రభావం చూపుతుంది. మనోధర్మాన్ని నియంత్రిస్తాయి.

దీవెన పరమార్థం: 
శాస్త్రీయంగా చూస్తే, మనిషి దేహం ఓ విద్యుత్‌ కేంద్రం. విద్యుత్‌ సరఫరాల్లో హెచ్చుతగ్గులు సాధారణం. ఈ వ్యత్యాసాలు మనిషి మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనుషుల్లో తమో, రజో, సాత్తి్యకాలనే త్రిగుణాలకూ కారకము. పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లి ఆశీర్వదించే సమయంలో, దేహం లోని విద్యుత్తులో కొంత బాగం ఈ అక్షతలను తాకుతాయి. ఆశీస్సులు ఇచ్చే వాళ్ల నుంచి, పుచ్చుకొనే వాళ్ల కొంత విద్యుత్‌ బదిలీ అవుతుంది. ఈ కారణంగా అక్షతల ద్వారా పెద్దలలో ఉండే సాత్విక గుణం పిన్నలకు లభిస్తుందనేది మన నమ్మకం. పెద్దలు, విద్వాంసులు, గురువులు, తల్లి దండ్రులు, అత్తమామలు వివాహ సమయంలో, శుభకార్యాలలో మనకు అక్షతలు వేసి శిరస్సును తాకి ఆశీర్వదించడంలోని ఆంతర్యం, పర మార్థం ఇదే!

జీవుడికి సంకేతం:
మరో సిద్ధాంతం ప్రకారం చూస్తే మనిషి దేహంలో విద్యుత్‌ కేంద్రాలు ఇరవై నాలుగు ఉంటాయట. వాటిలో ప్రధానమైనది శిరస్సు. ఇది విద్యుదుత్పత్తి కేంద్రమే కాదు. విద్యుత్‌ ప్రసార కేంద్రం కూడా. తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్‌ను గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది శిరస్సు.అది సరే కాని! అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు కుంకుమలు కలపడం ఎందుకు? ఆయుర్వేదం ప్రకారం, చర్మ సంబంధ రోగాల్ని అడ్డుకునే శక్తి పసుపుకు ఉంది. పసుపు నుంచి తయారయ్యే కుంకుమకూ ఈ శక్తి ఉంది. అక్షతలు వేసే వారికి ఎలాంటి రోగ సమస్యలున్నా, పుచ్చు కొనే వాళ్ళకి అవి సోకకుండా ఈ పసుపు కుంకుమలు నివారిస్తాయట. అంతేకాక పసుపు కుంకుమలు శుభానికి సంకేతాలు కూడా. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే జీవుడికి సంకేతం బియ్యం.

భగవద్గీతలో ప్రస్తావన:
అన్నాద్భవన్తి భూతాని అని మూడవ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు. జీవులు అన్నం చేత పుడతారట. ఈ అన్నం తయారీకి మనం ఉపయోగించే ధాన్యం బియ్యం. భగవంతునిపై అక్షతలు వేసి నమస్కరించడం అంటే, జీవుడు ఈ అన్నంలో పుట్టీ, తిరిగి ఈ జీవుడిని భగవంతుడిలోకి చేర్చడమే. అక్షతలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది.తెలుగులో ఈ అక్షతలని తలంబ్రాలు లేదా తలబ్రాలు అని కూడా అంటారు.తలను = తల యందు పోయబడే, ప్రాలు = బియ్యం అని అర్థం.

ధాన్యలక్ష్మికి ఆహ్వానం:
పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది. ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓ వధువా! నీవు మా ఇంటికి వచ్చాక, మన ఇంట ధాన్యం ఇలా కుప్పతెప్పలుగా విరివిగా ఉండి, మన జీవనానికి ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదల వాళ్ళమై తులతూగుతూ ఉండాలి అనే భావానికి అనుగుణంగా ఈ తలంబ్రాల కార్యక్రమం సాగుతుంది.

వివాహకర్మ పరమార్థం
వరుడు, వధువు శిరస్సులపై తలంబ్రాలు పోసుకొనే దానికి ముందు, వరుడు ముందుగా వధువు చేతిని దర్భతో తుడిచి, దోసిలిలో రెండు మార్లుగా బియ్యాన్ని వేసి, ఆ మీదట పాలని కొద్దిగా చల్లి తలంబ్రాలకి సిద్ధం చేస్తాడు. తలంబ్రాలు వేసాక వధువు ఇలా చెయ్యాలని ఒక పద్ధతి చెబుతుంది. ఈ కాలంలో పురోహితులే చేయించి పోయిస్తున్నారు.ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక పుణ్యం వృద్ధి చెందుగాక. శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కల్గుగాక! అని చదువుతూ అక్షతారోపణం (తలంబ్రాలు పోయించడం) చేయిస్తారు. ఈ చేసిన వివాహకర్మ మొత్తం అక్షతము (నాశనము లేనిది) అగుగాక! అని దీని భావం.

అక్షతలలో, తలంబ్రాలలో ఇంతటి పరమార్థం గోచరిస్తుంది. మన పూర్వీకులు ఈ వివాహ శుభకార్యాలలో, ఇతర శుభకార్యాలలో ఏర్పాటు చేసిన సంప్రదాయాల్లో, ఆచారాల్లో ఇంత గూఢార్థం ఉంది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలనీ, ఆదర్శ దంపతులుగా మెలగాలనీ, వధూవరులపై ఆహుతులు అక్షంతలు చల్లి ఆశీర్వదిం చడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం, పరమార్థం. దాన్ని తెలుసుకుని అందుకు అనుగుణంగా మెలగాలి.

ఆలయాలు ఆచారాలు
ఇక్కడి అమ్మవారిని భక్తులు 'నయనాదేవి' గా కొలుస్తుంటారు. 52 శక్తిపీఠాల్లో ఒకటిగా నైనితాల్‌ చెప్పబడుతోంది. సతీదేవి ఎడమ కన్ను ఈ ప్రదేశంలోపడి సరస్సుగా మారిపోయిన కారణంగా ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చిందని అంటారు. సాధారణంగా అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్న భక్తులు, తాము అనుకున్నది నెరవేరగానే కృతజ్ఞతా పూర్వకంగా ఆ తల్లికి వెండి .. బంగారు నేత్రాలను సమర్పిస్తుంటారు.
ఇక చాలామంది భక్తులు తమ మనసులోని కోరికను అమ్మవారికి చెప్పుకుని అది నెరవేరడం కోసం, అమ్మవారి మందిరానికి ఎదురుగా గల చెట్టుకి 'ఎరన్రి వస్త్రం' కడుతుంటారు. తరతరాలుగా ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతోంది. ఇలా అమ్మవారికి ఎదురుగా గల ఈ చెట్టుకి ఎరన్రి వసా్తన్న్రి కట్టడం వలన మనోభీష్టం తప్పక నెరవేరుతుందని అంటారు.

అమ్మవారి సన్నిధిలో గల చెట్టుకి ఎరన్రి వసా్తన్న్రి సమర్పించే భక్తుల సంఖ్యను చూస్తే, అమ్మవారి పట్ల ... ఆచారం పట్ల వారికి గల విశ్వాసం ఎంత బలమైనదనే విషయం స్పష్టమవుతుంది.ఆలయానికి వెళుతూ స్వామివారికి ... అమ్మవారికి పూలు - పండ్లు తీసుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రత్యేకమైన ఉత్సవాలు ... జాతరల సమయంలో కానుకలు ... మొక్కుబడులు చెల్లించుకోవడం చేస్తుంటారు. అలా ఒక క్షేత్రంలో అమ్మవారి సమేతంగా ఆవిర్భవించిన స్వామికి ప్రతియేటా 'మకర సంక్రాంతి' రోజున పసుపు కుంకుమలు ... నూతన వసా్తల్రు ... ఆహారధాన్యాలు భక్తులు సమర్పిస్తుంటారు.


హేమాచల క్షేత్రం:
తరతరాలుగా వస్తోన్న ఈ ఆచారం మనకి 'హేమాచల లక్ష్మీనరసింహస్వామి' క్షేత్రంలో కనిపిస్తుంది. వరంగల్‌ జిల్లా 'మల్లూరు' సమీపంలో గల ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనదిగా ... మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధిచెందిది. ఇక్కడి గిరిజనులు ఈ ఆచారాన్ని పాటించడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి కొండకోనల్లో తిరుగాడుతూ ఈ ప్రదేశానికి చేరుకున్నాడట. లక్ష్మీదేవి అంశతో జన్మించిన 'చెంచులక్ష్మి' ని ఇక్కడ మకర సంక్రాంతి రోజున వివాహామాడాడని విశ్వసిస్తుంటారు. అందువలన ఈ రోజున ఇక్కడ గిరిజనులంతా కలిసి వరపూజా మహోత్సవాన్ని జరిపిస్తారు.

ఈ ఉత్సవంలో స్వామివారి పట్ల ... అమ్మవారి పట్ల ఇక్కడివారికి భక్తిశ్రద్ధలే కాదు అంతకుమించిన ప్రేమానురాగాలు కనిపిస్తుంటాయి. తమని కరుణిస్తున్నదీ ... కాపాడుతున్నది ఆ లక్ష్మీనరసింహుడేననే అపారమైన విశ్వాసం వారి మాటల్లో వినిపిస్తూ ఉంటుంది. సాధారణంగా సిద్ధులు ... యోగుల వంటి వారు కొన్ని ప్రత్యేక ప్రదేశాలను ఎంచుకుని అక్కడ ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతుంటారు. అక్కడి ప్రజలకి వాళ్లపట్ల అపారమైన విశ్వాసం కలుగుతుంది. దాంతో వాళ్లని దైవస్వరూపంగా భావించి ఆరాధిస్తూ వుంటారు. ఆ యోగులు సజీవసమాధి చెందిన తరువాత ఆ ప్రదేశాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా అలరారుతుంటాయి.

ఆ పవిత్ర క్షేత్రాలను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు తమ మనసులోని కోరికలు చెప్పుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో మొక్కులకు సంబంధించి ఒక్కోచోట ఒక్కో ఆచారం కనిపిస్తూ వుంటుంది. సాధారణంగా దైవ క్షేత్రాల్లో తమ మొక్కు చెల్లించమంటూ కొబ్బరికాయలు కట్టడం ... గంటలు కట్టడం వంటివి చేస్తుంటారు. ఇక ఈ తరహా క్షేత్రాల విషయానికి వచ్చే సరికి, మొక్కుకునేవారు ఆచరించే పద్ధతి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంటుంది.

అలా ఆశ్చర్యానికి గురిచేసే క్షేత్రం మనకి 'రంగుండ్ల'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా అనుముల మండలం పరిధిలో ఈ గ్రామం కనిపిస్తుంది. చాలాకాలం క్రిందట ఇక్కడి గుట్టపై నివసించిన 'బుడియా బాపు' అనే అసాధారణ వ్యక్తి జీవసమాధి ఇక్కడ కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కల వారంతా ఆయనని దైవస్వరూపంగా భావించి పూజిస్తూ వుంటారు. ఆయనకి నమస్కరించుకుని తమ మనసులోని కోరికలు చెప్పుకుంటారు.
తమ కోరికను చెప్పుకుని ఈ ప్రదేశంలో ఒక రంగుజెండా కరన్రు పాతడం ఆచారంగా వస్తోంది. ఈ జెండా స్వామికి తమ కోరికను గుర్తుచేస్తూ ఉంటుందనీ, దాంతో ఆయన తప్పక తమ కోరికను నెరవేరుస్తాడని విశ్వసిస్తుంటారు. ఇక్కడి వచ్చే భక్తుల సంఖ్యకు ... వారిలో గల బలమైన విశ్వాసానికి వేలాదిగా కనిపించే ఈ జెండాలు అద్దంపడుతూ వుంటాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)