మట్టికుండ

మట్టికుండ

శరీరమూ ఒక గ్రహమే

by 11:59:00 PM 0 comments
మీశరీరం కేవలం మీరు తిన్న ఆహారమే. అంటే ఈ భూమే. మీరు ఈ భూమిలో నుంచి బయటపడి తిరుగాడుతున్నారు. ఈ గ్రహం సౌరమండలం అనే పెద్ద వ్యవస్థలో ఉంది. ఆ వ్యవస్థకు ఏది జరిగితే.. ఈ గ్రహానికీ అది జరుగుతుంది. ఈ సౌరమండలం ఇంకా పెద్ద వ్యవస్థ అయిన విశ్వంలో ఉంది. ఈ విశ్వంలో ఏ భాగానికి ఏది జరిగినా.. ఒక రకంగా ఈ గ్రహానికీ జరుగుతుంది. అలాగే ఈ గ్రహానికి ఏది జరిగినా అది మీకూ జరుగుతుంది. ఎందుకంటే భౌతికంగా చూస్తే మీరూ ఈ గ్రహమే.

మీ శరీరాన్ని ఒక నిర్దిష్ట విధానంలో పెడితే, ఈ భూమి మీద జరిగే ప్రతి చిన్న, సున్నితమైన మార్పు మీ అవగాహనలోకి వస్తుంది. ఈ విశ్వంలో జరిగేదాన్ని కూడా కొంతవరకు తెలుసుకోవచ్చు. మీరు కాస్త ఎక్కువ కాలం ధ్యాస పెట్టి భూమిని, భూమి విధానాన్ని గమనిస్తే మీ సూక్ష్మగ్రాహ్యత ఆశ్చర్యకరంగా పెరుగుతుంది.

నేను కొన్నేళ్ల కిందట ఒక వ్యవసాయ క్షేత్రంలో నివసించాను. స్థానికంగా వినికిడి లోపం ఉన్న ఒక వ్యక్తి ఉండేవాడు. ఏం అడిగినా వినిపించక సమాధానం ఇచ్చేవాడు కాదు. దీంతో గ్రామస్తులంతా అతడిని ఏడిపించేవారు. నేను అతడ్ని నా తోటలో పనికి పెట్టుకున్నా. కొంతకాలానికి అతడు నాకు మంచి సహచరుడయ్యాడు. ఎందుకంటే నేను మాట్లాడటానికి ఇష్టపడే వాడిని కాదు. అతనికి వినిపించదు కనుక అతడూ మాట్లాడలేదు. అప్పుడిక సమస్యే లేదు కదా!

ఒకరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు అతడు నాగలి సిద్ధం చేస్తుండటం చూశాను. నేను ఏమిటి విషయం..?’ అని అడిగాను. అతడు దున్నడానికి సిద్ధమవుతున్నానని అన్నాడు. వర్షం లేకుండా ఏం దున్నుతావని అన్నాను. దానికతను ఈరోజు వర్షం పడుతుందిఅన్నాడు. నేను ఆకాశానికేసి చూశాను. మేఘాల జాడ లేదు. ఏమిటీ పిచ్చి మాటలు? వర్షం కురిసే ఛాయలే లేవే?’ అన్నాను. అతడు లేదు.. ఇవాళ తప్పకుండా వాన పడుతుందిఅన్నాడు. అతడన్నట్టే ఆరోజు నిజంగానే వర్షం కురిసింది.

అప్పుడు అతడికి తెలిసింది.. నాకెందుకు తెలియలేదని రాత్రింబవళ్లు ఆలోచించాను. నేను నా చేతిని విభిన్న భంగిమల్లో పెట్టి చూశాను. గాలిలోని తేమను, ఉష్ణోగ్రతను, ఆకాశాన్ని పరిశీలించి చూశాను. వాతావరణానికి సంబంధించిన రకరకాల పుస్తకాలు చదివాను. అయినా ఏం అర్థం కాలేదు.

అప్పుడు నా శరీరాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. అందరూ చేస్తున్న తప్పేమిటో అర్థమైంది. మన శరీరం భూమి, గాలి, ఆహారం, ఇంధనం.. వంటి వాటితో నిర్మితమైంది. వీటిని కేవలం వస్తువులుగా చూస్తున్నామే కాని, మన జీవప్రక్రియకు అనివార్యమైన భాగంగా చూడటం లేదని పద్దెనమిది నెలల కృషి తర్వాత అవగతమైంది. నేను వర్షం పడుతుంది అంటే.. 95 శాతం పడుతుంది. ఇదేదో మాయ కాదు. మన చుట్టూ ఉన్న వ్యవస్థను, భూమిని, పీల్చుకునే గాలిని క్షుణ్ణంగా గమనిస్తే ఎవరైనా చెప్పవచ్చు. వర్షం కురవాల్సిన రోజున ముందుగానే శరీరంలో కొంత మార్పు జరుగుతుంది. గ్రామాల్లో ఉండే పెద్దవారికి ఇది తెలుస్తుంది.

పశుపక్షాదులకూ ఇది తెలుస్తుంది.
ఈ గ్రహ కూటమిలో జరిగే చిన్న చిన్న మార్పులను గుర్తించి పూర్వీకులు తమ ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించుకున్నారు. భూమి అయస్కాంత భూమధ్యరేఖ (మాగ్నెటిక్‌ ఈక్వేటర్‌) భారతదేశం మీదుగా వెళ్తుంది. వేల ఏళ్ల కిందట మన పూర్వీకులు వీటి కచ్చితమైన స్థానాలను కనిపెట్టి ఈ రేఖ వెంబడి చాలా దేవాలయాలు నిర్మించారు. వీటిలో చిదంబరం దేవాలయం ఒకటి. ఈ దేవాలయంలో శూన్యానికి లేదా సున్నాకు ఒక గుడి ప్రతిష్ట చేయబడింది. ‘‘ఇది ఈ గ్రహం మీద సున్నా డిగ్రీల శూన్య ఆకర్షణ శక్తిని, చుట్టూ ఉండే జీవులపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలియపరుస్తుంది.’’

ఇది ఒక విధమైన ఆధ్యాత్మిక విధానం. ధ్యానపరమైనది మరొక విధానం. సృష్టిలో జరిగే చిన్న చిన్న మార్పులను అసలు పట్టించుకోకుండా తమ జీవాన్ని పూర్తిగా ఈ సృష్టి మూలంలోకి తీసుకువెళ్లేట్లుగా దృష్టి పెడుతుంది.

భూమితో స్పర్శలో ఉంటే తక్షణమే మీ శరీరం దాన్ని గుర్తుపడుతుంది. అందువల్లనే భారతదేశంలోని ఆధ్యాత్మిక సాధకులు పాదరక్షలు లేకుండా నడిచేవారు. ఎప్పుడూ నేల మీద ఎక్కువ శరీరం తగులుతూ ఉండేలా కూర్చునేవారు. అనుభవపూర్వకంగా శరీరం ఈ భూమిలో భాగమనేనని శరీరానికి గుర్తుచేసేవారు. అప్పుడే ఈ శరీరానికి సరైన స్థానం తెలుస్తుంది. లేకపోతే అది ఏదేదో అడుగుతుంది.


నేలపై పడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నేలపై లేదా నేలకు మీకు మధ్య పలుచనిది ఉండేలా చూసుకోండి. అలానే భూమికి దగ్గరగా కూర్చోండి. ప్రతి రోజూ అరగంట మీ ఇంటి తోటలో నేలపై కూర్చోవడం వల్ల మీ ఆరోగ్యం ఆశ్చర్యకరంగా మెరుగవ్వడం గమనిస్తారు. 
- సద్గురుఇషా ఫౌండేషన్‌

Bheemesh Chowdary Kacharagadla

సంపాదకులు

భీమేష్ చౌదరి కాచరగడ్ల (రఘు) గారు శ్రీ వేములవాడ భీమలింగేశ్వరస్వామి అధ్యయన కేంద్రం మరియు కాచరగడ్ల మీడియా కార్పొరేషన్ వ్యవస్థాపకులు. వీటి ద్వారా మరుగును పడిపోతున్న దేవాలయాలు, తెలుగు కవుల చరిత్రను అధ్యయనం చేసి గ్రంధస్తం చేస్తున్నారు వీరు స్వతహాగా రచయిత కూడా.

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి