లేపాక్షి పూర్వపు చరిత్ర

లేపాక్షి శ్రీకృష్ణ దేవరాయల కాలమున మిక్కిలి ప్రశస్తి గన్నది. విరుపణ్ణ నాయకవీరణ్ణ నాయకులను ఇరువరు గొప్ప వ్యక్తులు ఆ రాయల ప్రతినిధులుగ ఈఊరిలో ఉండి ఈ వైపు ప్రాంతమును ఏలినారు. ఈ ఊరి పక్కన ఒక గుట్ట కలదు. దాని పేరు కూర్మశైలము. ఇక్కడ పాపనాశేశ్వరుడను శివుడు ప్రతిష్టితుడైయున్నాడు. అగస్త్యుడు ఇతనిని ప్రతిష్టించెను. మొదట ఇది గర్భగుడి మాత్రము ఉండెడిది.మన ఋషులు అరణ్యములలో తపమునకై వచ్చి ఇట్టి పట్టుల ప్రశాంతముగ డేవుని కొలిచెడివారు. దండకారణ్యమును తాపసోత్తమ శరణ్యమని కృష్ణ దేవరాయల కాలమునకు ముందు వాడగు పోతనామాత్యుడు వర్ణించి యున్నాడు. ఈ లేపాక్షి దండకారణ్యము లోనిది.

 ఇచ్చట జటాయువు పడియుండెననీశ్రీరాముడు ఆతనిని "లే పక్షీ" అని సంబోధించిరనిఅందుచేతనే దీనికి లేపాక్షి అని పేరు కలిగినని కొందరు అందురు. ఇది నమ్మదగినది కాదు. శ్రీరాముడు కిష్కింధకు రాకముందు జటాయువు సంస్కారము జరిగినది. శ్రీరాముడు ఉత్తరమునుండి దక్షిణమునకు వచ్చినాడు.లే+పక్షి= లేపాక్షి" అని దీర్ఘమగుటయు అంత సంభవము కాదు. లేపాక్షి అను పేరీ గ్రామమున కొకవేళ ఇచ్చట పూసిన చిత్రలేఖన సృష్టిలో కంటితీర్పునకు పేరెక్కిన స్థానము. కావున దీనిని లేపాక్షియని అందురు. "లేప+అక్షి" అని అపుడు పదవిభాగము చేయవచ్చును. ఇచ్చట కూర్మశైలము మీద దేవాలయమును విరుపణ్ణవీరణ్ణ సోదరులుకృష్ణదేవరాయలు ఆతనితరువాతి వాడైన అచ్యుత దేవరాయల కాలమున అభివృద్ధి చెందినది.

ఇచ్చటి వీరభద్రుని ఆలయాన్ని క్రి. శ 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయలకాలములో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించాడని ప్రతీతి. ఈ ఆలయ నిర్మాణం జరుగత ముందు ఈ స్థలం కూర్మ శైలము అనె పెరుగల ఒక కోండగా ఉండేది. ఈ కొండపైన విరూపణ్ణ పెనుకొండ ప్రభువుల ధనముతో ఏడు ప్రాకారములగల ఆలయము కట్టించగా ఇప్పుడు మిగిలియున్న మూడు ప్రాకారములు మాత్రమే మనము చూడగలము. మిగిలిన నాలుగు ప్రాకారములు కాలగర్భమున కలసిపోయనవని అందురు. ప్రాకారం గోడులు ఎత్తేనవిగా ఉన్నాయ. గోడలపైనాబండలపైనా కన్నడ భాషలో శాసనములు మలచినారు. ఈ శాసనముల ద్వారా ఈ దేవాలయ పోషణకు ఆనాడు భూదానము చేసిన దాతల గురిచిన వివరాలు తెలుస్తాయి.

ఇతిహాసము
రావణాసురుడు మహాసాధ్వియగు సీతను అపహరించుకోని యా ప్రంతములో వేళ్ళుతూ వుంటే ఈ కూర్మ పర్వతము పైన జటాయువు అడ్డగిస్తుంది. రావణుడు ఆ పక్షి యెక్క రెక్కలు నరికివేయగ ఈ స్థలములో ఆ పక్షి పడిపోయినది. ఆ పిమ్మట సీతాన్వేషణలో ఈ స్థలమునకు వచ్చిన శ్రీరాముడు జటాయువును తిలకించి జరిగిన విషయమును పక్షి నుండి తెలుసుకోని తర్వాత ఆ జటాయువు పక్షికి మోక్షమిచ్చి లే-పక్షిఅని ఉచ్చరిస్తాడు. లే-పక్షి అను కుదమే క్రమ క్రమముగా లేపాక్షి అయనట్లు ఇక్కడి ప్రజలు అంటున్నారు.

మరో కథ ప్రకారం చూస్తే... అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)