మతం ఏదైనా ఉన్నతమైన విలువలు ఉన్నప్పుడే ఉన్నతమైన జీవనం సాధ్యం అవుతుంది.

మతాన్ని నిలబెట్టేది, సంప్రదాయాన్ని కాపాడేది నమ్మకమే. మతాచారాలపై ఉన్న విశ్వాసమే స్వధర్మాన్ని పాటించేందుకు దోహదం చేస్తుంది. అయితే మతం కోణంలో మనిషిని చూడటం సర్వసాధారణమే. అయితే సామాన్య మానవుడు తను ఆచరిస్తున్న మతాన్ని చూసే కోణం మరింత ముఖ్యమైనది. ఇదే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది డిస్కవరీ ఛానల్‌. నమ్మకం (బిలిఫ్) పేరుతో హిందూ, ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, జైనం, జుడాయిజం, నాస్తికత్వం మరిన్ని విశ్వాసాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రముఖ మీడియా వ్యాఖ్యాత ఓప్రా విన్‌ఫ్రే ఈ కార్యక్రమాన్ని హోస్ట్‌ చేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రతి సోమవారం రాత్రి 9 గంటలకు డిస్కవరీ ఛానల్‌లో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఏడు భాగాలుగా ప్రసారమయ్యే ఈ సిరీ్‌సను రూపొందించడానికి నాలుగున్నరేళ్ల కాలం పట్టింది.
  
ఉన్నతమైన జీవితం
మతం ఏదైనా ఉన్నతమైన విలువలు ఉన్నప్పుడే ఉన్నతమైన జీవనం సాధ్యం అవుతుంది. బౌద్ధ మతం విశిష్టతను తెలుపుతూ సాగే ఒక ఎపిసోడ్‌లో బౌద్ధసన్యాసుల జీవితాన్ని విభిన్న కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వారి దినచర్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, జీవన్మరణాలకు వారిచ్చే నిర్వచనం ఇలా సాగిపోతుంది. 

పుస్తక పఠనంతో..
పారంపర్యంగా వచ్చిన మతాన్ని ఆచరించడమే అందరికీ తెలిసింది. అయితే ఆ మతవిశ్వాసాల లోతులను తెలుసుకోవాలని చాలా మంది భావిస్తున్నారు. అందుకోసం విజ్ఞులతో మాట్లాడుతున్నారు. పుస్తకాలు చదువుతున్నారు. మతవిశ్వాసాలపై వారికున్న అభిప్రాయాలు ఇందులో తెలుసుకోవచ్చు. 

దైవం కాపాడుతుందని..

మతాన్ని విశ్వసించినంత వారంతా దైవాన్ని నమ్ముతారని కాదు. మతం మనం ఆచరించేది. భక్తి మనసుకు సంబంధించింది. ఏ మతమైనా జీవనమార్గాన్ని సూచిస్తుంది, జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. ఆధ్యాత్మికతను మతం నేర్పదు. ఆ భావన మనలో కలగాలి. భక్తి అనేది ఎప్పుడైనా పుట్టొచ్చు. కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని కొందరు దేవుడ్ని ఆరాధిస్తారు. వారికి దేవుడు చేసిన సాయాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఇలా దేవుడిపై ఆకస్మికంగా భక్తి కలిగిన సందర్భాలను నమ్మకం (బిలిఫ్) కార్యక్రమంలో చూడొచ్చు.

Belief

Belief

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)