కఠినం.. ఉపవాసం

ఉపవాసం అన్ని సంప్రదాయాల్లోనూ ఉంది. కొన్ని ఆచారాల్లో ఉపవాస నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. జైన సంప్రదాయంలో ఉపవాసాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో దీక్షను ఆచరిస్తుంటారు. శ్వేతాంబర, దిగంబర సంప్రదయాల్లోనూ ఉపవాస ఆచరణ కనిపిస్తుంటుంది. జీవితంలో ఏదైనా తప్పు చేసిన భావన కలిగినవారు అందుకు ప్రాయశ్చిత్తంగా కొన్ని రోజుల పాటు ఉపవాసం చేస్తుంటారు. శరీరాన్ని, మనసును పవిత్రంగా మలుచుకునే మార్గంగా ఉపవాస దీక్ష చేపడుతుంటారు. జైన ఆచారాల్లో రకరకాలైన ఉపవాస దీక్షలు ఉన్నాయి. వాటిలో కొన్ని..

ఉపవాస్‌: ఎలాంటి ఘనాహారం తీసుకోకుండా ఒక రోజంతా ఉపవాస దీక్ష. (సూర్యాస్తమయం నుంచి ఒకరోజు విడిచి సూర్యోదయం వరకు అంటే దాదాపు 36 గంటలు.) 
చౌవిహార్ఉపవాస్‌: రోజంతా ఘనాహారంతో పాటు నీటిని కూడా తీసుకోకుండా ఉంటారు.

దిగంబర్ఉపవాస్‌: కఠినమైన ఉపవాసమిది. సూర్యాస్తమయానికి ముందు ఒక్కసారి మాత్రమే నీళ్లు తీసుకుంటారు.
శ్వేతాంబర్ఉపవాస్‌: పోర్సీ (రోజులో పావు వంతు) తర్వాత కాచి, చల్లార్చిన నీరు తాగుతారు. ఎలాంటి ఆహారం తీసుకోరు.
తివిహార్ఉపవాస్‌: సూర్యోదయ, అస్తమయాలకు మధ్య వేడి చేసిన నీటిని ఒక్కసారి తీసుకుంటారు.
ఏకాసనఒక పూట భోజనం చేస్తారు. సూర్యోదయం, అస్తయమం మధ్య వేడి నీటిని తాగుతారు.
బేలా/ఛత: అన్నపానీయాలకు లేదా ఘనాహారానికి దూరంగా రెండు రోజులు ఉండటం.
తేలా/అత్థమ్‌: వరుసగా మూడు రోజుల పాటు అన్నపానీయాలకు లేదా ఘనాహారానికి దూరంగా ఉండటం.
అష్ఠాయ్‌: వరుసగా ఎనిమిది రోజుల పాటు అన్నపానీయాలకు లేదా ఘనాహారానికి దూరంగా ఉండటం. తొమ్మిది రోజుల పాటు ఉంటే నవాయ్అంటారు. ఇలాంటివి మరెన్నో ఉపవాస దీక్షలు ఉన్నాయి.
సల్లేఖనజైన సంప్రదాయంలోని ఉపవాసాల్లో అంత్యంత కఠినమైనది, చివరిదిగా పేర్కొనే దీక్ష సల్లేఖన. ఇది ఆమరణ నిరాహార దీక్ష వంటింది. ఆహారం, నీటిని క్రమక్రమంగా తగ్గిస్తూ చివరకు పూర్తిగా వదిలేస్తారు. ప్రాణాలు పోయేంత వరకు దీక్షలోనే కొనసాగుతారు. కొన్ని నెలల పాటు దీక్షలో ఉండి శరీరాన్ని వదిలేస్తారు
.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)