సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, మన పూర్వీకుల స్థితి గతుల గురించి భవిష్య తరాలకు తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. జ్ఞానదర్శిని బ్లాగు ద్వారా నాకు తెలిసిన విషయాలను నలుగురితో పంచుకుందామన్న సదుద్దేశంతో బ్లాగును ప్రారంబించడం జరిగింది.
ఆపిల్ సైడర్ వెనిగర్
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
బరువు తగ్గించే దివ్యౌషధం
ప్రాచీన సంప్రదాయ
పద్ధతులు పాటిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే నమ్మకం. ఈ మధ్య ఎక్కువవుతోంది. తేనె
,దాల్చిన చెక్క అలోవెరా తృణ ధాన్యాలు మొలకలు పుదీనా రసం ఇలాంటి ఔషధ గుణాలున్న అనేక
పదార్ధాలు మూలికా ద్రవ్యాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆ క్రమంలో ఆపిల్ సైడర్ వెనిగర్
ముందు నిలబడింది. మేలు జాతి సైడర్ ఆపిల్స్ రసాన్ని పులిసేలా చేసి ఆపిల్ సైడర్ వెనిగర్
తయారు చేస్తారు. ఈ వెనిగర్ లో బీటా కెరోటిన్ ,విటమిన్స్ , మినరల్ ఎంజైమ్స్ కావలిసినన్ని
పోషకాలు దొరుకుతాయి. దీన్ని అనేక కాంబినేషన్స్ లో తీసుకోవచ్చు. తేనె నిమ్మరసం ,వెల్లులిరసం
, అల్లం రసం ,సలాడ్స్ ,కూరలు ,ఫ్రైలు ,మాంసాహార వంటకాల్లో వాడుతుంటారు. ఈ ఆపిల్ సైడర్
వెనిగర్ సర్వరోగ నివారిణి అంటుంటారు. ఎన్నో ఔషధ విలువలున్న ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని
ఈ వెనిగర్ గురించి మీ డాక్టర్ గారితో మాట్లాడండి. ఎందుకంటే బరువు తగ్గేందుకు ఈ వెనిగర్
బ్రహ్మాండంగా పని చేస్తుందని ఇటీవల పరిశోధనలు చెప్తున్నాయి.
బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే శరీరంలో
జరిగే అద్భుత మార్పులు!
యాపిల్ పండుతో తయారయ్యే పదార్ధమే యాపిల్ సైడర్
వినేగర్. ఈ వినేగర్ వలన ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి. వాస్తవానికి ఈ యాపిల్ సైడర్
వినేగర్ వాడకం ఆశ్చర్యకర ఫలితాలనిస్తూ మీలోని అదనపు కొవ్వును కరిగించేస్తుంది. అయితే,
యాపిల్ సైడర్ వినేగర్ అనేది ఒక యాసిడ్ అని అధికంగా వాడితే హాని కలిగిస్తుందని కూడా
మీరు గుర్తుంచుకోవాలి. రోజు మొత్తంలో ఏ భోజనానికి ముందైనా సరే ఒకటి లేదా రెండు స్పూన్ల
యాపిల్ సైడర్ వినేగర్ తీసుకుంటే చాలు. దానిని నీటితో కలిపికూడా తీసుకోవచ్చు. దీని వ్యయం
అధికం కాదు ప్రతివారికి ఇది అందుబాటులోనే ఉంటుంది.
వివిధ రకాల వ్యాధుల చికిత్స కోసం కొన్ని వేల సంవత్సరాల నుండి ఆపిల్ సైడర్ వెనిగార్
ను వాడుతున్నారు. హిప్ప్రోకేటీస్(Hipprocates), ఆధునిక వైద్యంకు తండ్రి, 400BCకాలం
నుండినే జులుబు మరియు ఫ్లూ వంటి జబ్బుల నివారణకు ఆపిల్ సైడర్ వెనిగార్ ను తేనెతో కల్పి
ఇవ్వవొచ్చని సిఫారస్ చేశారు. అప్పటి నుండి, వివిధ రకాల వ్యాధులను నివారించడం కోసం ఈ
యాపిల్ సైడర్ వెనిగార్ ను ఉపయోగించడం కొనసాగించారు. ఇంకా రొమన్స్ మరియు జపనీస్ సమురాయ్
యోధులు కూడా ఆరోగ్యం, బలం మరియు శక్తి కోసం ఆపిల్ సైడర్ వెనిగార్ ను ఉపయోగించారు .
ఆపిల్ సైడర్ వెనిగర్ లో హీలింగ్ ప్రొపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. అందుకోసం దీన్ని నేరుగా
తీసుకోకూడదని, నీటీతో మిక్స్ చేసి తీసుకోవడం లేదా ఆహార పదార్థాలకు డ్రెస్సింగ్ గా అలంకరించి
తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది . ఆపిల్ సైడర్ వెనిగర్ ను రెగ్యులర్ గా ఉదయం బ్రేక్ ఫాస్ట్
కు ముందు తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...
ముక్కు దిబ్బడ నివారిస్తుంది:
వర్షకాలంలో జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలను
నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్
మిక్స్ చేసి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు నివారించబడుతాయి.
జీర్ణ సమస్యలుండవు:
ఆరోగ్య సమస్యల్లో అజీర్తి ఒకటి. ఆపిల్ సైడర్ వినెగార్
లో ఉన్న ఎసిటిక్ యాసిడ్, పిండిపదార్థాల జీర్ణాక్రియ వేగాన్ని తగ్గిస్తుంది, ఫలితంగా
రక్తప్రవాహంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడానికి సహాయపడుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
ఆపిల్ సైడర్ వినెగార్ లో ఉన్న పెక్టిన్ , శరీరంలో
చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. కొందరు వ్యక్తుల్లో ఆపిల్ సైడర్
వెనిగర్ లో ఉండే పెక్టిన్ అలెర్జీని కలిగించవచ్చు. అటువంటి వారు దీనికి దూరంగా ఉండటమే
మంచిది.
హార్ట్ హెల్త్ మెరుగుపరుస్తుంది:
పొటాషియం, మెగ్నీషియం మరియు ఇతర ఖనిజాలు ఆపిల్
వినెగార్ పుష్కలంగా ఉన్నాయి. పొటాషియం శరీరంలోని నీటిని సంతులనం చేస్తుంది. మరియు ఒక
ఆరోగ్యకరమైన గుండె లయ నిర్వహిస్తుంది. మెగ్నీషియం, ఎంజైమ్ ల కార్యకలాపాలకు ఉత్ప్రేరంగా
ఉండి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. మరియు శరీరంలో ఎముకలకు కావల్సిన కాల్షియంను చేరవేయడానికి
సహాయపడుతుంది.
ఆస్టియో ఆర్థరైటిస్:
ఆస్టియో ఆర్థరైటిస్ శరీరం లో యాసిడ్ క్రిస్టల్
పెరగడానికి కారణంఅవుతుంది, మరియు ఆపిల్ సైడర్ వెనిగర్ దీన్ని కనబడనీయకుండా చేసి శరీరం
యొక్క pH బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఇటువంటి కేసులకు ఇప్పటికి వరకూ ఎటువంటి గణనీయమైన
శాస్త్రీయ ఆధారం లేదు. కానీ డాక్టర్ జార్విస్ జాబితాలో అతని సంరక్షణలో కొందరు పేషంట్స్
ఆస్టియో ఆర్థరైటిస్ నుండి విజయవంతంగా కోలుకోవడం జరిగింది.
ఇమ్యూనిటి పెంచుతుంది
ఆపిల్ సైడర్ వినెగార్ బీటాకెరోటిన్ కలిగి ఉండి,
ఇది మాయో క్లినిక్ ప్రకారం యాంటిఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ నుండి డ్యామేజ్ కాకుండా
ప్రతిపక్షకారినిగా ఉంటుంది. మరియు మీ నిరోధక వ్యవస్థ పెంచడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గుట
యాపిల్ సైడర్ వినేగర్ మీ శరీరంలోని అధిక కొవ్వు
కరిగించి బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. అదనపు కొవ్వును ఖర్చు చేయడంతోపాటు ఆకలి తగ్గిస్తుంది.
దీనిలో ఉండే పెక్టిన్ అనే పదార్ధం కొవ్వును తొలగిస్తుంది. అధికంగా తీసుకుంటే తప్ప ఇది
హానిలేనిది. మీకు కనుక దీని వాసన పడకపోతే, టాబ్లెట్ ల రూపంలో కూడా దీనిని వాడవచ్చు.
జీర్ణం అవటం కూడా తేలిక అవుతుంది.
డయాబెటీస్
రక్తంలో షుగర్ స్ధాయిలను కూడా తగ్గిస్తుందని రీసెర్చిలో
రుజువు చేయబడింది. గ్లూకోజ్ స్ధాయిలను తగ్గిస్తుంది కనుక దీనిని డయాబెటీక్ రోగులు తప్పక
వాడవచ్చు. రాత్రి వేళ డిన్నర్ తీసుకునే ముందుగా ఒకటి లేదా రెండు స్పూన్లు యాపిల్ సైడర్
వినేగర్ తీసుకుంటే, మరుసటి రోజు ఉదయానికి రక్తంలో షుగర్ స్ధాయిలు తక్కువ ఉండటం గమనించవచ్చు.
కనుక డయాబెటీస్ కు ఇది ఒక సహజ నివారణ. అయితే, అధికంగా తీసుకుంటే, గొంతులో మంటను కలిగిస్తుంది.
బ్లడ్ ప్రెజర్ మరియు కొలెస్టరాల్
యాపిల్ సైడర్ వినేగర్ ఆహారం బ్లడ్ ప్రెజర్ మరియు
కొల్లెస్టరాల్ నివారణకు ఔషధంగా వాడవచ్చు. వారంలో 4 లేదా 5 రోజులపాటు ఈ ఆహారం తింటే,
గుండె జబ్బులు కూడా రావని చెప్పవచ్చు. దీనిని కనుక మీరు అలాగే తీసుకోలేకపోతే, మీరు
తినే ఇతర సలాడ్లలో కలిపి తినేయండి. అధికంగా తీసుకుంటే, అది మీ పంటి ఎనామిల్ ను నష్టపరచే
అవకాశం కూడా ఉంది. ఈ ఆహార చిట్కాలు పాటించి కొవ్వు రహిత ఆరోగ్యకర శరీరాన్ని పొందండి.
అది ఒక యాసిడ్ అని గుర్తించండి. అతి తక్కువ మొత్తాలలో మాత్రమే ఔషధంగా దానిని వాడండి.
మొటిమలను నివారిస్తుంది :
ఆపిల్ సైడర్ వినెగార్ యొక్క యాంటీఇంఫ్లమేటరీ(శోథ
నిరోధక) లక్షణాలు అధిక వేడిమి, సూర్యరశ్మి వల్ల కమిలిన చర్మానికి ఉపశమనం కలిగించడం
కోసం దీన్ని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. దీన్ని సలాడ్స్ తో కలిపి తీసుకొన్నా లేదా
అలాగే తాగినా కూడా అంతర్గతంగా జీర్ణవాహికలోని ఇన్ల్ఫమేషన్ కూడా తగ్గిస్తుంది.
చుండ్రు నివారిస్తుంది:
ఆపిల్ సైడర్ వెనగర్ హెయిర్ గ్రోత్ కు అద్భుతంగా
సహాయపడుతుంది. ఇది పిహెచ్ లెవల్స్ పెంచుతుంది. తలలో ఈస్ట్ పెరగకుండా నివారిస్తుంది.
వెనిగర్ లో ఉండే కెమికల్ లక్షణాలు చుండ్రు నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
ఆపిల్
సైడర్ వెనిగర్ ద్వారా కాలేయాన్ని ఎలా శుభ్రపరచుకోవటం?
·నయం చేసే గుణాలను కలిగి ఉండే ఆపిల్ సైడర్ వెనిగర్ విరివిగా
వాడతారు.
·డిటాక్సిఫికేషణ్ గుణాలను కలిగి ఉండే ఇది శుభ్రపరిచే
మంచి ఔషదం.
·కాలేయం నుండి మలినాలను తొలగించటం ద్వారా సరిగా పని
చేస్తుంది.
·డీ హైడ్రేషన్ ను నివారించుటకు ఎక్కువగా నీటిని తాగండి.
నయం చేసే (హీలింగ్) గుణాలను కలిగి
ఉండే ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మానికి ఉపయోగపడుతుందని అందరికి తెలిసినా, డిటాక్సిఫికేషణ్
ద్వారా కాలేయాన్ని కూడా శుభ్రపరుస్తుందని చాలా మందికి తెలియదు. శరీరంలో ఉండే మలినాలు
మరియు హానికర పదార్థాలను భయటకు పంపుటను డిటాక్సిఫికేషణ్ గా పేర్కొంటారు. ఆపిల్ సైడర్
వెనిగర్ డిటాక్సిఫికేషణ్ గుణాలను కలిగి ఉందని తెలిపే శాస్త్రీయ ఆధారాలు లేవు అయినప్పటికీ,
ఇది శరీరాన్ని డిటాక్సిఫికేషణ్ కు గురి చేసి హానికర కారకాలను భయటకు పంపుతుందని నిపుణులు
నమ్ముతున్నారు.
ఆపిల్ సైడర్ వెనిగర్ తో కాలేయాన్ని ఎలా శుభ్రపరుచుకోవాలో దశల
వారిగా ఇక్కడ తెలుపబడింది:
మొదటి దశ
2 చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకొని, దాదాపు 9 మిల్లీ లీటర్ల నీటిలో
కలపండి. ఉదయాన ఈ మిశ్రమాన్ని తాగండి. దీని రుచి మీకు నచ్చకపొతే, తేనెను కలుపుకొండి.
రెండవ దశ
నీటిలో కలిపిన వెనిగర్ ని తాగిన తరువాత, ఒక గంట సమయం పాటూ వేచి ఉండండి.
విష పదార్థాలు లేని, పండ్లు లేదా కూరగాయలను తినండి. ఇలా పండ్లు మరియు కూరగాయలను తినటం
వలన డిటాక్సిఫికేషణ్ పెరగటమేకాకుండా, కావలసిన మినరల్ మరియు పోషకాలు అందించబడతాయి.
మూడవ దశ
ఇపుడు ఒకటి లేదా రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ ను 9 మిల్లి లీటర్ల
నీటికి కలిపి, మధ్యాన్న భోజనానికి ఒక గంట ముందు తాగండి.
నాలుగవ దశ
మధ్యాన్న భోజనంలో తప్పకకుండా కూరగాయలు మరియు పండ్లు ఉండేలా జాగ్రత్త పడండి.
సలాడ్, పాలకూర, క్యారెట్, టమోటా మరియు కీరదోస వంటివి ఉండేలా చూసుకోండి.
ఐదవ దశ
మళ్ళి ఒకటి లేదా రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ ను 9 మిల్లిలీటర్ల
నీటిలో కలిపి రాత్రి భోజనానికి ముందు తాగండి.
ఆరవ దశ
తాజా పండ్లు మరియు కూరగాయలతో పాటూ, హోల్ గ్రైన్ పాస్తా లేదా బ్రెడ్ మరియు
చీస్ వంటివి రాత్రి భోజనంలో ఉండేలా చూసుకోండి. ఇలా కొన్ని రోజుల పాటూ ఈ ప్రక్రియను
కొనసాగించండి.
ముఖ్యమైన చిట్కా
ఇలా డిటాక్సిఫికేషణ్ ప్రక్రియ కోసం కొనసాగించేపుడు, డీ హైడ్రేషన్ కు గురవకుండా
అధిక మొత్తంలో నీటిని తాగండి.
·ఎక్కువ సమయం పాటు ఎండలో నిలబడటం వలన చర్మం కందిపోతుంది.
·తక్కువగా మెలనిన్ ఉత్పత్తి వలన కూడా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
·అవసరం లేని సమయాలలో ఎండలో దూరంగా ఉండండి.
·ఎల్లపుడు SPF ఎక్కువగా ఉన్న లోషన్ లను వాడండి.
సూర్యకాంతి వలన కలిగే చర్మ సమస్యలు ముఖ్యంగా
వేసివికాలంలో చర్మ కణాలను ప్రమాదానికి గురి చేసి, చికాకులకు మరియు సమస్యలకు గురి చేస్తాయి.
బీచ్ లేదా సముద్ర తీరంలో స్నానం, స్విమ్మింగ్ లేదా తరచుగా, ఎక్కువ సమయం ఎండల ఉండటం
వలన చర్మం కంది పోతుంది. ఈ రకమైన సమస్యల నుండి ఉపశమనం పొందుటకు రసాయనిక క్రీములతో చికిత్స
చర్మాన్ని ఆలర్జీలకు గురిచేసి, ముఖ్యంగా సున్నితమైన చర్మాన్ని కలిగి ఉన్నవారిలో తీవ్ర
సమస్యలకు గురి చేస్తుంది. అందువలన, ఇలాంటి ఖరీదు గల చికిత్సలకు బదులుగా ఆపిల్ సైడర్
వెనిగర్ వాడకం ద్వారా సూర్యరశ్మి వలన కందిన చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
సూర్యరశ్మిలో చర్మం ఎలా కందుతుంది?
సూర్యరశ్మికి బహిర్గతమైన సమయంలో, అతినీలలోహిత కిరణాల వలన చర్మం
కణాలు ప్రమాదానికి గురవకుండా ఉండటానికి మెలనిన్ ఉత్పత్తి అధికం అవుతుంది. మెలనిన్ అనేది
ఒక వర్ణద్రవ్యం, ఇది చర్మ, వెంట్రుకల మరియు కంటి రంగు నిలిపి ఉంచేలా చేస్తుంది. ఒక
నిర్దిష్ట సమయంలో, మెలనిన్ సరిపోయేంత స్థాయిలో, వేగంగా ఉత్పత్తి చేయబడదు. ఫలితంగా,
చర్మంలోని జన్యుపదార్థం దెబ్బతింటుంది.
ఫలితంగా ఆరోగ్యంగా ఉండే చర్మ కణాలు, అతినీలలోహిత కిరణాల వలన కలిగే ప్రమాదం నుండి ఉపశమనం
పొందుటకు ఇన్ఫ్లమేషన్ లకు గురవుతాయి. మరోవైపు, శరీరం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.
కొన్ని సార్లు ఈ రెండు పద్దతుల మధ్య సమతుల్యత లేని ఎడల చర్మ క్యాన్సర్ కలిగే ప్రమాదం
కూడా ఉంది. సూర్యకాంతిలో గడిపే సమయం మరియు మీ చర్మ ధోరణిపై ఆధారపడి చర్మం మంటకు గురవుతుంది.
ఒకవేళ మీ చర్మ ధోరణి తెలుపుగా ఉంటే, మధ్యాన్న సమయంలో కేవలం 15 నిమిషాల పాటు భయట ఉండటం
వలన చర్మం కందిపోతుంది. దీర్ఘకాలిక సమయం పాటు సూర్యకాంతికి బహిర్గతమవటం వలన చర్మంలో
ఉండే రక్తనాళాలు వెడల్పుగా మారి, చర్మంపై ఎరుపుదనాన్ని ఏర్పరుస్తాయి. ఎలా జరిగిన తరువాత
అదే రోజున చర్మం కందిన లక్షణాలు బహిర్గతమవవు. చర్మం కందిన24 గంటల తరువాత లక్షణాలు బహిర్గతమవుతాయి
మరియు 3 నుండి 5 రోజులలో ఈ స్థితిని మెరుగుపరచవచ్చు.
సూర్యరశ్మి వలన కందిన చర్మానికి వెనిగర్ వాడకం
సూర్యకాంతి వలన కందిన చర్మాన్ని ఆపిల్ సైడర్
వెనిగర్ వాడకం ద్వారా సరి చేయవచ్చు మరియు దీని వలన చర్మ కణాలలో కలిగిన ప్రమాదాన్ని
కూడా తగ్గించవచ్చు. వెనిగర్ వాడకం గురించి కింద తెలుపబడింది.
·స్ప్రే బాటిల్ లో కొద్దిగా వెనిగర్ ను తీసుకొని, నీటిని కలపండి. ఈ ద్రావణాన్ని
ప్రభావిత ప్రాంతాలలో స్ప్రే చేయండి.
·శుభ్రమైన గుడ్డను వెనిగర్ లో ముంచండి, ఈ గుడ్డతో చర్మంపై తుడవండి.
·డైల్యూటేడ్ ఆపిల్ సైడర్ వెనిగర్ తో స్నానం చేయండి.
ఇలా చేయటం వలన సూర్యకాంతి వలన ప్రమాదానికి గురైన చర్మం కొద్ది
సమయంలోనే తిరిగి తన సహజ కాంతిని పొందటం మీరు గమనిస్తారు.
కావున, సుర్యకాంతి వలన మారిన చర్మ రంగును తొలగించుటకు గానూ
రసాయనిక క్రీములకు బదులుగా ఇంట్లో ఉండే ఔషదాలను వాడండి. వీటితో పాటుగా రోజులో ఎక్కువ
సమయం పాటూ సూర్యకాంతిలో తిరగకండి మరియు SPF ఎక్కువగా ఉన్న లోషన్ లను వాడండి.
శివకేశవులకు భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే విష్ణువును పూజించినట్టే.శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరినీ ద్వేషించినట్టే.ఈ పరమార్థాన్ని చెప్పేవే పంచారామాలు. శివరాత్రి నేపథ్యంలో మనరాష్ట్రంలోని ఈ అయిదు పవిత్ర క్షేత్రాల గురించీ.. మనుషులు సులభంగా మోక్షాన్ని పొందే మార్గం చెప్పమని ఓ సారి పార్వతీదేవి పరమ శివుణ్ణి అడిగిందట. అప్పుడు ముక్కంటి... ‘‘ శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ’ అని చెబుతూ.. ‘రామ నామాన్ని మించినది మరొకటి లేదు. ఈ ఒక్క శ్లోకాన్నీ చదివితే సహస్ర నామాలు చదివిన ఫలితం వస్తుంది’ అని సెలవిచ్చాడట.శివ, కేశవులు వేరు కాదనే సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికే పరమేష్ఠి అలా చెప్పాడట.ఇదొక్కటే కాదు..మన పురాణేతి హాసాలు ఎన్నో సందర్భాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. శివకేశవులకుభేదం లేదనీ స్కందపురాణంలోనూ ఉంది. ‘ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః’ అంటే ... శివుని రూపమే విష్ణువు , విష్ణువు రూపమే శివుడు అన్నమాట. అలాంటి శివకేశవుల ఏకత్వానికి ప్రతీకలు పంచారామాలు. నేను సంహరించలేను: తారకసురుడు పర...
భారతీయ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. మన అవగాహన ఎక్కువగా రూపానికి పరిమితమైంది కాబట్టి మన సంస్కృతిలో , సంప్రదాయాల్లో ఈ ‘ శివ ’ త్వానికి ఎన్నో అద్భుతమైన స్వరూపాలను సృష్టించుకున్నాం. నిగూఢమూ , అగోచరమూ అయిన ‘ ఈశ్వరుని ’ గా , మంగళకరుడైన ‘ శంభుని ’ గా , లౌక్యం తెలియని ‘ భోళా శంకరునిగా ’ సకల వేదాలూ , శాస్త్రాలూ , తంత్రాలూ బోధించిన గొప్ప గురువు ‘ దక్షిణామూర్తి ’ గా , ఎవరినైనా ఇట్టే క్షమించేసే ‘ అశుతోషుని ’ గా , ఆసృష్టికర్త రక్తాన్నే శరీరానికి అలుముకున్న ‘ కాలభైరవునిగా ’, ప్రశాంతతకు ప్రతిరూపమైన ‘ అచలేశ్వరునిగా ’ బ్రహ్మాండ నృత్యకారుడైన ‘ నటరాజు ’ గా ఇలా జీవితానికి ఎన్నెన్ని పార్శ్వాలుండగలవో అవన్నీ కూడా ఆయనకి ఆపాదించబడ్డాయి. వీటిలో ప్రతీ ఒక్కటీ మనిషి అంతర్గత పరిణితికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని సూచిస్తుంది. ఈ రూపాల వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుందాం. మనం శివుడ్ని ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా చూస్తాము. అదే సమయంలో ఆయనను ప్రాపంచిక లౌక్యం తెలియని వానిగా కూడా అనుకుంటాము. అందుకే శివుడి రూపాల్లో ఒకదాన్ని భోళా శంకరుడు అంటారు. భోళా శంకరుడు అంటే అమాయకుడు అని అర్థం లేదా లౌక్యం తె...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి