తిరుమల శ్రీనివాసుని అభిషేకం ఇలా చేస్తారు

స్వామి అభిషేకానికి తిరుమల నంబి వారసులు ఆకాశగంగ నుంచి తీసుకొచ్చిన తీర్థం, దేశీయ ఆవుపాలు, పరిమళం (పసుపు,చందనం, కుంకుమపువ్వు,కస్తూరి,జవ్వాది) తదితరాలను అర్చకులు సిద్ధం చేసుకుంటారు. టీటీడీ ఈవో పరిమళాన్ని తీసుకురాగా అర్చకులు, జియ్యంగార్లు స్వామిసన్నిధికి చేరుకుంటారు. వస్త్రం, అభిషేకం టిక్కెట్లు పొందిన భక్తులు వీరివెనుకనే స్వామి సన్నిధికి చేరుకుంటారు. తొలుత మూలవర్లకు పునుగుతైలంతో ప్రోక్షణం చేస్తారు. అభిషేకానికి వాడే వస్తువులను తొలుత ఏకాంగి జియ్యంగార్లకు అందిస్తారు. ఆయన అర్చకులకు అందిస్తుండగా అభిషేకం కొనసాగుతుంది. శంఖంతో తీర్థాన్ని పోసిన అనంతరం పాలతో అభిషేకం జరుగుతుంది. తరువాత తీర్థం, పరిమళ తీర్థంతో తిరుమంజనం చేస్తారు. శ్రీదేవి, భూదేవిలను పసుపుతో అభిషేకిస్తారు. భక్తులపై స్వామివారి అభిషేక తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేక దర్శనం ముగుస్తుంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!