కుక్కె సుబ్రమణ్య : నాగుల రక్షకుడు ‘సుబ్రమణ్య’
జగన్మాత పార్వతీదేవి , లయకారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రమణ్యస్వామి . నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్ దేవతాసైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు . తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి అనేక శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు . షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా వున్నాయి . వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కెలో వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం . ప్రకృతి ఒడిలో ... పశ్చిమ కనుమల్లోని సుందర దక్షిణ కన్నడ జిల్లాలోని సులియా తాలుకాలోని కుక్కె గ్రామంలో స్వామివారు నాగులకు రక్షణగావెలిసినిత్యపూజలందుకుంటున్నారు . చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు అభయమివ్వడంతో పాటు అశేష భక్తజనులకు అభయమిస్తున్నారు . పురాణచరిత్ర సుబ్రమణ్వస్వామి , వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు . ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది . అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రంచేస్తారు . దీంతో ఈ నదిని కుమా...