పూర్ణ వినియోగం
ప్రపంచంలో ఎవరికైనా ఉండేది ఇరవై నాలుగు గంటలే . సమయాన్ని సద్వినియోగం చేసుకున్నా , దుర్వినియోగం చేసినా , ఎవరు ఎలా వినియోగించుకున్నా , సాధకుల వినియోగం వేరుగా ఉంటుంది . ఉండాలి . పెద్ద పనులకు , ప్రధానమైన పనులకు , గొప్ప పనులకు సమయం ఎక్కువ కావాల్సి ఉంటుంది . అలా అని , ఉన్న ఇరవై నాలుగు గంటల్ని ఎవరూ నలభై ఎనిమిది గంటలు చేయలేరు . ఇరవై నాలుగు గంటల్లోనే నలభై ఎనిమిది గంటల పనినీ పూర్తిచేసుకునే వీలు కల్పించుకోవాలి . చేయగల నైపుణ్యాన్ని పెంచుకోవాలి . సాధన రెండు రకాలుగా చేసుకోవచ్చు . తక్కువ సమయంలో ఎక్కువ పని సాధించుకునే ప్రయత్నం ఒకటి . ఉన్న సమయాన్ని క్షణం వృథా చేయకుండా పూర్తిగా వినియోగించుకోవడం మరొకటి . ఆధునిక కాలంలో రోజునంతా సాధనకు వినియోగించుకునే అవకాశమే లేదు ... ఎవరైనా కేవలం సాధనకే అంకితమై , దాని కోసమే జీవిస్తే తప్ప ! ఏ హిమాలయ ప్రాంత గుహల్లోనో , కీకారణ్యం మధ్యలోనో తప్ప అందుకు అవకాశం లేదు . మరి సాధారణ మానవుడు , అందునా సంసార సాగరంలో చిక్కి ఉక్కిరిబిక్కిరవుతున్న వ్యక్తి ఏం చేయాలి ? ఆ సాగరంలో తాను ఉంటూనే , ల...