పోస్ట్‌లు

సంస్కారం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నమస్కారం మన సంస్కారం

చిత్రం
మనకు తెలిసిన మనుషులు ఎదురుపడ్డా , కొత్తవారిని పరిచయం చేసుకోవాలన్నా ముందుగా నమస్కారం చేయడం మన సంప్రదాయం . రెండు చేతులను జోడించి , హృదయానికి దగ్గరగా ఉంచి నమస్కరించడం అనేది ఎదుటివారిని మనం మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నామని ప్రకటిస్తుంది . మనలోని అహాన్ని పక్కనపెట్టే శక్తి నమస్కారానికి ఉంది . వయసులో చిన్నవారైనా , పెద్దవారైనా ఎవరు తారసపడినా వారికి నమస్కరించడం ద్వారా మనలోని సంస్కారాన్ని తెలియజేయవచ్చు . తద్వారా ప్రేమ , సమానత్వం , స్నేహం తదితర గుణాలను అభివ్యక్తీకరించవచ్చు . దైవసన్నిధిలో నమస్కరించేటప్పుడు రెండు కళ్లు మూసుకుంటూ ఉంటాం . అంతర్లీనంగా భగవంతుడి సన్నిధిలో ఉన్నామనే అనుభూతికి లోనవ్వడమే ఇందులోని పరమార్థం . గురువులు , వయసులో పెద్దవారికి , పండితులకు పూర్తిగా వంగి నమస్కారం చేస్తాం . ఇది వారిలోని గొప్పదనానికి చేసే వందనం . అయితే , ఎవరైనా చూస్తున్నారనో , మరొకరి మెప్పు కోసమో కాకుండా .. అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడనే భావనతో చేసేదే నిజమైన నమస్కారం .

తల్లిదండ్రులదే బాధ్యత

చిత్రం
చదువు , సంస్కారం ఈ పదాలను మనం కలిపి వాడుతుంటాం. చదువు సంస్కారాన్ని ఇస్తుందని అర్థం. సంస్కారం అంటే మంచి నడవడిక అనే అర్థంలో వాడుతాం. నిజానికి సంస్కారం అనేది ఒక తటస్థ ( neutra) పదం. సంస్కారం మంచిది కావచ్చు , చెడ్డదీ కావచ్చు.   జీవితంలోని ప్రతి అనుభవం మనసులో ఒక్కో ముద్ర వేస్తుంది. పత్రికలో ఒక వ్యాసం చదివినపుడు , టీవీలో ఒక కార్యక్రమం చూసినపుడు లేదా ఒక వ్యక్తితో సంభాషించినపుడు ఆ విషయంపై లేదా ఆ వ్యక్తి గురించి ఒకానొక అభిప్రాయం మనసులో ముద్రపడుతుంది. మళ్లీ అలాంటిదే చదివినపుడు లేదా అలాంటి వ్యక్తితో మాట్లాడినపుడు దాని గురించి మరింత బలమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఏ సంఘటన , అనుభవం అయినా మనసులో ఒక అభిప్రాయాన్ని మిగిలిస్తుంది. మనసులో ఏర్పడిన ఆ ముద్రనే సంస్కారం అంటారు. రామాయణంలో అరణ్యకాండలో ఓ చిన్న ఘట్టం. రాముడు తండ్రి మాట పాటించడానికై అడవికి వచ్చాడు కదా.. మరి రాక్షసులతో అనవసరమైన తగాదా ఎందుకు , ఎప్పుడూ ఆయుధాలు పట్టుకుని తిరగడం ఎందుకు , అలా ఆయుధాలు ఉంచుకోవడం వల్ల చెడు సంస్కారాలు ఏర్పడతాయంటూ సీత.. రాముడికి ఒక కథ చెబుతుంది. ఒకానొక ముని తీవ్రంగా తపస్సు చేస్తుండగా ఇంద్రుడు అతడ్ని పరిక్షించేంద...