పోస్ట్‌లు

వేసవి చిట్కాలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

వేసవి వచ్చేసింది... కనీసం ఈ చిట్కాలు పాటించాల్సిందే...

చిత్రం
వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు , దాహం , నీరసం , అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం.   రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ , రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెల్లా ఆస్వాదించొచ్చు. వేసవి చిట్కాలు: 1) ఆహారపదార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి. 2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. 3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా , ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి. 4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి. 5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి. 6) శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్ళు చాలా మంచివి. 7) కాఫీ , టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి. 8) కిటికీలకు , గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే , వేడిని ఇంట్లోకి రానీకుండా , చల్లదనాన్ని ఇస్తుంది. 9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో , ఎండలోకి వెళ్ళి , ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా , ఇండోర్ గేమ్స్ ఆడించాలి. 10) పలుచని మజ్జిగలో , కాసింత నిమ్మ వేసి ఉప్పు వేసుకుని...