కాణిపాకం-వినాయకుడు
సత్య ప్రమాణాలకు నెలవుగా .. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం - శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది . కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది . సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు . ఈ స్వామికి హిందువులే కాదు . ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు . ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం . దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది . స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు . క్షేత్రచరిత్ర / స్థలపురాణం : సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ ...