పోస్ట్‌లు

రక్షాబంధనం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

రక్షాబంధనం

చిత్రం
వర్షరుతువు రాకతో అంతటా హర్షం వర్ధిల్లే తరుణంలో శ్రావణ మాసం విచ్చేస్తుంది . పర్వదినాల సమాహారంగా విలసిల్లే ఈ మాసంలో , పౌర్ణమినాడు చేసుకొనే ఆత్మీయానురాగాల పండుగే - రాఖీ పౌర్ణమి . ఒకే చెట్టుకు విరబూసిన అనురాగ కుసుమాలు , ప్రేమభావనల పరిమళభరిత పుష్పాలు - సోదర సోదరీమణులు . మహోదాత్తమైన వారసత్వానికి చిహ్నమై నిలిచే ‘ రాఖీ ’ సకల శ్రేయస్సుల్నీ ఆకాంక్షించే పండుగ . ఈ వేడుకను రక్షా మంగళం , రాఖీ పూనవ్ ‌, సలోని , రఖౌనీ అని ఉత్తర భారతాన పిలుస్తారు . తమిళనాట దీన్ని పునాల్ ‌ పున్నమి అని , గుజరాతీయులు మాళవ్ ‌ పున్నమి అని వ్యవహరిస్తారు . రక్షాబంధనం అపురూపమైన సంబరమని పురాణాలు వర్ణించాయి . రాక్షసులు , దేవతల సంగ్రామంలో పరాజయం పాలవకుండా - ఇంద్రుడికి శచీదేవితో రక్షధారణను దేవగురువు బృహస్పతి చేయించాడంటారు . తమకు విజయం లభించేలా , కృష్ణుడి సలహా మేరకు ధర్మరాజు తన సోదరులతో కలిసి రక్షాబంధన ఉత్సవం నిర్వహించాడని ‘ మహాభారతం ’ చెబుతుంది . దేవతల కోరిక మేరకు దానశీలుడు , మహా బలశాలి , రాక్షసరాజైన బలి చక్రవర్తిని విష్ణువు తన శక్తితో బంధించా...