అసలు బీబీ నాంచారమ్మ ఏవ్వరు. ...?
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వారుండరు. అలాగే చాలామందికి బీబీ నాంచారమ్మ గురించి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఈ బీబీ నాంచారమ్మ ఎవరు ? ఆమె నిజంగానే ముస్లిం వనితయా ? ఆమె దైవస్వరూపం ఎలా అయ్యారు ? ఆమె కధ ఏమిటో చూద్దాం. బీబీ నాంచారమ్మ! ` నాచియార్ ` అనే తమిళ పదం నుంచి నాంచారమ్మ అన్న పేరు వచ్చిందని చెబుతారు. అంటే భక్తురాలు అని అర్థమట. ఇక ` బీబీ ` అంటే భార్య అని అర్థం. బీబీ నాంచారమ్మ గాథ ఈనాటిది కాదు. కనీసం ఏడు వందల సంవత్సరాల నుంచి ఈమె కథ జనపదంలో నిలిచి ఉంది. పురాతన కధ ప్రకారం బీబీ నాంచారమ్మ , మాలిక్ కాఫిర్ అనే సేనాని కుమార్తె. ఆమె అసలు పేరు సురతాని. స్వతహాగా హిందువైన మాలిక్ కాఫిర్ , అల్లాఉద్దీన్ ఖిల్జీకి సేనానిగా మారి తాను కూడా ముస్లిం మతాన్ని స్వీకరించాడు. తన రాజ్యాన్ని విస్తరించే బాధ్యతను ఖిల్జీ , మాలిక్ కాఫిర్ మీద ఉంచాడు. దాంతో మాలిక్ కాఫిర్ దక్షిణ భారతదేశం మీదకి విరుచుకుపడ్డాడు. తమ దండయాత్రలో భాగంగా మాలిక్ , శ్రీరంగాన్ని చేరుకున్నాడు. అతను...