పోస్ట్‌లు

నెట్టికంటి ఆంజనేయస్వామి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

నెట్టికంటి ఆంజనేయస్వామి

చిత్రం
శ్రీ ఆంజనేయస్వామి భవిష్యత్ ‌ బ్రహ్మ . ధర్మాన్ని , సత్యాన్ని ఆచరించడంలో ఆయన నిష్టాగరిష్టుడు . శ్రీరామనాప జపం విన్నంత మాత్రానే ఆయన ప్రసన్నుడవుతాడు . అనంతపురం జిల్లా కసాపురంలో వెలిసిన హనుమంతుడు భక్తుల కోరికలను తీర్చుతూ వారిపై చల్లనిచూపును ప్రసరిస్తున్నాడు . దేశం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తమను కష్టాల నుంచి గట్టెక్కించమని , తమను , తమ కుటుంబాల్లోని వారిని ఎల్లవేళలా చల్లగా ఉండేలా దీవించమని ఆ దేవుడిని వేడుకుంటారు . ఆ స్వామిని దర్శిస్తే సకల పాపాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం . మనసులో అనుకున్న కోర్కెలు నెరవేరుతాయని , ఏ పనులు ప్రారంభించినా విఘ్నం లేకుండా ముందుకు సాగుతాయని , సర్వరోగాలు నయమవుతాయని స్వామిని దర్శించటం మహాభాగ్యంగా తలుస్తారు భక్తులు . అలాంటి సర్వమంగళ స్వరూపుడు , అనాథ రక్షకుడు , ఆపద్బాంధవుడే కసాపురంలో వెలిసిన నెట్టికంటి ఆంజనేయస్వామి . అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని కసాపురంలో ఆంజనేయస్వామి దేవస్థానంఉంది . ఉగాది పండుగ సందర్భంగా ఆలయంలో మూడు రోజుల పాటు ఉగాది మహోత్సవా...