పోస్ట్‌లు

దివ్యశక్తి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సదవగాహన

చిత్రం
వనంలోకి వసంతం ప్రవేశించింది. అంతా పచ్చగా మారింది. అప్పుడే ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కురిసింది. నిన్నటి విత్తనం నేడు మొలకగా మారి , ఆ తరవాత ఆకులతో విచ్చుకుంది. ఆ గాలి తాకుతూ , శ్వాస నిరంతరం సాగుతూ , మనిషి ప్రాణం నిలబెడుతోంది. ‘ ఇదంతా ఎవరు చేస్తున్నారు ’ అని ప్రశ్నించే ముందు , ప్రకృతి పనిచేసే తీరును మనిషి తెలుసుకోవాలి. అంతకన్నా ముందు , ఆ ప్రకృతి- విశ్వశక్తి అధీనంలో ఉందని గ్రహించాలి. మనసు , బుద్ధి , అహంకారం , ఆకాశం , గాలి , నిప్పు , నీరు , భూమి అని ఎనిమిది విధాలుగా ప్రకృతి ఉంటుంది. అది ‘ అష్టావిధ ప్రకృతి ’ అని భగవద్గీతలో కృష్ణపరమాత్మ స్పష్టీకరించాడు. అదంతా తన అధీనంలోనే ఉందని వెల్లడించాడు. మట్టిముద్ద గురించి తెలిస్తే , ఆ నేల సారమంతా అవగతమవుతుంది. అదేవిధంగా సత్యం అనేది మరెక్కడో కాదు- మనిషిలోనే ఉంది. ఇవన్నీ అతడు స్పష్టంగా గ్రహించాలి. అందువల్ల జీవనయానం సుఖవంతంగా మారుతుందని శాస్త్రాలు విశదీకరిస్తున్నాయి. అనేకులు అనేక రకాలుగా చెబుతారు. పలు విధాలుగా వాదించేవారూ ఉంటారు. వివిధ రూపాల్లో చర్చలు సాగుతూనే ఉంటాయి. ఏవి ఎలా ఉన్నా , ఏనాటికీ సత్యం మారదు. దాని రూపాన్ని అసలే మార్చుకోదు. సత్యం...