పోస్ట్‌లు

జీవితం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

జీవిత సత్యం

చిత్రం
‘ జీవిత లక్ష్యం ఏమిటి ’ అని ఎప్పుడైనా ఓ ప్రశ్న వేసుకుంటే , మనలో చాలామందికి ఒకటే సమాధానం వస్తుంది- ‘ జీవించడం ’ అని. కాని- జీవించడం కంటే ముఖ్యమైనది , విలువైనది ఏమైనా ఉందా అని ఎంతమందికి అనిపిస్తుంది ? తినడం , తిరగడం , నిద్రపోవడం , చేసిన పనులే చెయ్యడం- ఇంతకు మించి జీవితంలో ఇంకేమీ కనిపించడం లేదు. అలాంటప్పుడు ‘ ఈ జీవితంలో గొప్పతనం ఏముంది ’ అని చాలా అరుదుగా , అతి తక్కువమంది వ్యక్తులకు అనిపిస్తుంటుంది. జీవించక తప్పదు. జీవిస్తూనే మనిషి తన జీవితం గురించి తెలుసుకోవాలి. మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు. ఏ ఆశయం కోసమో జీవించాలనుకుంటున్నాం. జీవించడమే మన పరమావధిగా ఉంది. దాన్నే ఓ లక్ష్యంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం. ఆశయాల కోసం తీస్తున్న పరుగులే అంతటినీ విషపూరితం చేస్తున్నాయి. అనేక ఆశయాల సాధనకు పెడుతున్న ఉరకలు పరుగులు చివరికి మానవ జీవిత సంగీతాన్ని ధ్వంసం చేస్తున్నాయి. ఓ ఆశయం పెట్టుకుంటే , జీవితంతో మనం ‘ యుద్ధం ’ చెయ్యాలి. ఘర్షణ పడాలి. అవసరమైతే సుఖశాంతులు వదులుకోవాలి. ఒక బరువు మోసినంతగా జీవితయాత్ర సాగించాలి. జీవితంలో అనేక సంఘటనలు , మార్పులు సంభవిస్తుంటాయి. మనిషి వాటిని గ...

తల్లిదండ్రులదే బాధ్యత

చిత్రం
చదువు , సంస్కారం ఈ పదాలను మనం కలిపి వాడుతుంటాం. చదువు సంస్కారాన్ని ఇస్తుందని అర్థం. సంస్కారం అంటే మంచి నడవడిక అనే అర్థంలో వాడుతాం. నిజానికి సంస్కారం అనేది ఒక తటస్థ ( neutra) పదం. సంస్కారం మంచిది కావచ్చు , చెడ్డదీ కావచ్చు.   జీవితంలోని ప్రతి అనుభవం మనసులో ఒక్కో ముద్ర వేస్తుంది. పత్రికలో ఒక వ్యాసం చదివినపుడు , టీవీలో ఒక కార్యక్రమం చూసినపుడు లేదా ఒక వ్యక్తితో సంభాషించినపుడు ఆ విషయంపై లేదా ఆ వ్యక్తి గురించి ఒకానొక అభిప్రాయం మనసులో ముద్రపడుతుంది. మళ్లీ అలాంటిదే చదివినపుడు లేదా అలాంటి వ్యక్తితో మాట్లాడినపుడు దాని గురించి మరింత బలమైన అభిప్రాయం ఏర్పడుతుంది. ఏ సంఘటన , అనుభవం అయినా మనసులో ఒక అభిప్రాయాన్ని మిగిలిస్తుంది. మనసులో ఏర్పడిన ఆ ముద్రనే సంస్కారం అంటారు. రామాయణంలో అరణ్యకాండలో ఓ చిన్న ఘట్టం. రాముడు తండ్రి మాట పాటించడానికై అడవికి వచ్చాడు కదా.. మరి రాక్షసులతో అనవసరమైన తగాదా ఎందుకు , ఎప్పుడూ ఆయుధాలు పట్టుకుని తిరగడం ఎందుకు , అలా ఆయుధాలు ఉంచుకోవడం వల్ల చెడు సంస్కారాలు ఏర్పడతాయంటూ సీత.. రాముడికి ఒక కథ చెబుతుంది. ఒకానొక ముని తీవ్రంగా తపస్సు చేస్తుండగా ఇంద్రుడు అతడ్ని పరిక్షించేంద...