సమస్యలు మనిషిలోని పోరాటశక్తిని పదునెక్కిస్తాయి
ఒక రైతు తన పొలంలో బంగారు తీగెల రకం ధాన్యం పండించదలచి , పెట్టుబడి ఎక్కువ పెట్టాలి కనుక ఎందుకైనా మంచిదని జ్యోతిష్యం తెలిసిన పండితుణ్ని సంప్రతించాడు . ఆయన వేళ్ల మీద లెక్కలు వేసి , ఆకాశంకేసి చూస్తూ ‘ ఉహూ ... లాభం లేదు . ఈ ఏడాది వానలు సరిగ్గా పడవు . పంట వెయ్యకు ’ అన్నాడు . రైతు నిరాశగా తిరిగి వచ్చేశాడు . ఆశ్చర్యంగా పక్క పొలం రైతు అదే పంట వేశాడు ! రైతు తాను విన్న భవిష్యవాణి గురించి అతడికి చెప్పాడు . ఆ రైతు నవ్వి ‘ నేను అలాంటివి నమ్మను . నా రెక్కల కష్టాన్నే నమ్ముతాను ’ అన్నాడు . అన్నట్లుగానే తన కృషి మీద పూర్తి నమ్మకంతో ఆ రైతు పంటను శ్రద్ధగా చూసుకున్నాడు . భవిష్యవాణికి విరుద్ధంగా చేను విరగపండింది . వానలు సరిగ్గా పడవనే భవిష్యవాణిని నమ్మిన రైతు మామూలు ధాన్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది . స్వయంకృషి వల్ల శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది . గట్టి సంకల్పం ఉంటే అసాధ్యమనేదే ఉండదు . విద్యార్థులు శ్రద్ధ , కృషి జోడిస్తే తప్పటమనే ప్రశ్నే తలెత్తదు . ‘ నేను మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుణ్ని కావాలి ’ అనే పట్టు...