పోస్ట్‌లు

ఆదియోగి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

శివుని రూపాల వెనకున్న అంతరార్థం ఇదే!

చిత్రం
భారతీయ సంప్రదాయంలో శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. మన అవగాహన ఎక్కువగా రూపానికి పరిమితమైంది కాబట్టి మన సంస్కృతిలో , సంప్రదాయాల్లో ఈ ‘ శివ ’ త్వానికి ఎన్నో అద్భుతమైన స్వరూపాలను సృష్టించుకున్నాం. నిగూఢమూ , అగోచరమూ అయిన ‘ ఈశ్వరుని ’ గా , మంగళకరుడైన ‘ శంభుని ’ గా , లౌక్యం తెలియని ‘ భోళా శంకరునిగా ’ సకల వేదాలూ , శాస్త్రాలూ , తంత్రాలూ బోధించిన గొప్ప గురువు ‘ దక్షిణామూర్తి ’ గా , ఎవరినైనా ఇట్టే క్షమించేసే ‘ అశుతోషుని ’ గా , ఆసృష్టికర్త రక్తాన్నే శరీరానికి అలుముకున్న ‘ కాలభైరవునిగా ’, ప్రశాంతతకు ప్రతిరూపమైన ‘ అచలేశ్వరునిగా ’ బ్రహ్మాండ నృత్యకారుడైన ‘ నటరాజు ’ గా ఇలా జీవితానికి ఎన్నెన్ని పార్శ్వాలుండగలవో అవన్నీ కూడా ఆయనకి ఆపాదించబడ్డాయి. వీటిలో ప్రతీ ఒక్కటీ మనిషి అంతర్గత పరిణితికి ఒక శక్తివంతమైన అవకాశాన్ని సూచిస్తుంది. ఈ రూపాల వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుందాం.  మనం శివుడ్ని ఎంతో శక్తివంతమైన వ్యక్తిగా చూస్తాము. అదే సమయంలో ఆయనను ప్రాపంచిక లౌక్యం తెలియని వానిగా కూడా అనుకుంటాము. అందుకే శివుడి రూపాల్లో ఒకదాన్ని భోళా శంకరుడు అంటారు. భోళా శంకరుడు అంటే అమాయకుడు అని అర్థం లేదా లౌక్యం తె...