శివ మహిమ
శి వుడి గురించి ఎంత చెప్పినా తక్కువే! శివ మహిమ వర్ణించడం దేవతలకే సాధ్యం కాలేదంటే, ఇక మానవుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇదే విషయాన్ని అకుంఠిత శివభక్తుడు పుష్పదంతుడు ఎంతో అందంగా వర్ణించి చెప్పాడు- ‘ఓ ఈశ్వరా! సాక్షాత్తు విద్యాదేవత అయిన సరస్వతీ దేవి నీ మహిమ వర్ణించడానికి ప్రయత్నించింది. కల్పవృక్షపు కొమ్మను లేఖినిగా చేసుకొంది. సముద్రాన్ని సిరా పాత్రగా ఉంచింది. అందులో ఒక నల్లటి కాటుక కొండను నిలిపింది. భూమినే పెద్ద కాగితంగా మార్చుకొంది. సర్వకాలాల్లోనూ రాస్తూనే ఉన్నా, అంతటి సరస్వతికి సైతం నీ గుణగణాల అంతు చిక్కలేదు’ అనడంలో- శివమహిమ ఘనత తెలుస్తుంది. శివుడి తేజస్సు అన్ని వర్ణనలకూ అతీతం. అది ఎవరి మేధకూ అంతుచిక్కనంత అనంతం! శివుడి ఒక్కొక్క నామం ఒక్కొక్క గుణాన్ని చెబుతుంది. ‘భవుడు’ అనే పేరు విశ్వసృష్టికి అవసరమైన రజోగుణాన్ని తెలుపుతోంది. సృష్టి జరగాలంటే ఆ గుణం అవసరం. ‘హరుడు’ అనే పేరు విశ్వప్రళయ కారణమైన తమోగుణాన్ని బోధిస్తోంది. విశ్వసౌఖ్యానికి సత్వ గుణం కావాలి. ‘మృడుడు’ అనే పేరులోనే శివుడి సాత్వికత నిండి ఉంది. ఏ విధమైన గుణం అధికంగా ఉంటుందో, ఆ విధమైన నామరూపాలే ఆయనలో కనపడుతుంటాయి. ఇదీ శివుడిలోని...