పోస్ట్‌లు

అతిథి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అతిథి

చిత్రం
తి థి , వార , నక్షత్రాలతో ప్రమేయం లేకుండా గృహస్థుల ఇంటికి వచ్చే వ్యక్తిని అతిథి అంటారు. ఆ అతిథి దైవంతో సమానమని ‘ తైత్తిరీయ ఉపనిషత్తు ’ చెబుతోంది. ఇంటికి వచ్చిన వ్యక్తి కులం , విద్య , ఉద్యోగం వంటి ఇతర విషయాలపై దృష్టి సారించరాదని ; విష్ణుమూర్తి అవతారంగా భావించి సంతోషంతో సేవచేయాలని మారన రాసిన ‘ మార్కండేయ పురాణం ’ విశదీకరించింది. అతిథికి గృహస్థులు చేయాల్సిన సత్కారం గురించి ‘ కఠోపనిషత్తు ’ చెబుతోంది. ఒకరోజు యమధర్మరాజు మందిరానికి నచికేతుడు అనే బ్రహ్మచారి వెళ్లాడు. అప్పుడు అక్కడ యముడు లేడు. ఆయన కోసం నచికేతుడు మూడు రోజులపాటు ఆహారం లేకుండా వేచిచూశాడు. ఆ తరవాత వచ్చిన యముడు అతడి వివరాలు తెలుసుకొని అతిథి సత్కారం చేశాడు. ‘ స్వామీ! మీరు మా అతిథి. నేను గృహంలో లేకపోవడం వల్ల , అతిథి సత్కారాలు చేయలేకపోయాను. మీరు ఇక్కడే మూడురోజులు ఉండిపోవాల్సి వచ్చింది. దోష నివారణగా మీకు మూడు వరాలిస్తాను. రోజుకు ఒకటి వంతున కోరుకోండి ’ అంటాడు వినయంగా. అంతేకాదు- అతిథిగా వచ్చిన వ్యక్తి ఎవరి ఇంటి వద్ద వేచి చూస్తుంటాడో , భోజనమైనా చేయకుండా అక్కడే ఉండిపోతాడో ఆ ఇంట అనర్థాలు తప్పవంటాడు యమధర్మరాజు. మనుషులు దానగుణం...