పోస్ట్‌లు

అక్షింతలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అక్షింతల పరమార్థం ఏమిటి?

చిత్రం
    వివాహ శుభకార్యంలో జీలకర్ర ,  బెల్లం పెట్టె వేళ ,  మాంగల్యధారణ వేళ ,  వధూవరులపై ఆహుతులు అక్షింతలు చల్లి ఆశీర్వదించడం మన హిందూ సంప్రదాయం . వివాహ శుభకార్యాల్లోనే కాదు ,  ప్రతీ శుభకార్యం లోనూ పెద్దలు ,  పిన్నలను అక్షింతలు వేసి  “ దీర్ఘాయుష్మాన్ భవ ,  చిరంజీవి భవ ,  సంతాన ప్రాప్తిరస్తు ,  ఆరోగ్య ప్రాప్తిరస్తు సుఖజీవన ప్రాప్తిరస్తు ”  అంటూ ఆశీర్వదిస్తారు . ఇక దైవసన్నిధిలో సరే సరి . పూజారైతే మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు . ‘ అక్షతలు ’  అనే మాట నుంచి వచ్చిందే  ‘ అక్షింతలు ’.     క్షతం కానివి అక్షతలు . అంటే రోకటిపోటుకు విరగని ,  శ్రేష్టమైన బియ్యం అన్నమాట . అటువంటి బియ్యాని పసుపు లేక కుంకుమతో నేతితో కలిపి అక్షింతలు తయారు చేస్తారు . నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ధాన్యాన్ని దానవస్తువుగా పేర్కొంటారు . ఆ రకంగా నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతికరమైన దానవస్తువు బియ్యం . జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధినాయకుడు .  ...