పోస్ట్‌లు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

చిత్రం
వివిధ రంగాల్లో మహిళలు చేసిన కృషిని.. వారి అందించిన సేవలను గౌరవిస్తూ ఏటా మార్చి 8వ తేదీని వివిధ రంగాల్లో మహిళలు చేసిన కృషిని.. వారి అందించిన సేవలను గౌరవిస్తూ ఏటా మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తారు. మొదట్లో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరుపుకునేవారు. 20వ శతాబ్దం ప్రారంభంలో పాశ్చాత్య దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న సమయమది. మహిళలూ.. పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేసేందుకు ఆసక్తి కనబరిచేవారు. కానీ వారంటేచులకనభావం.. లింగవివక్షతో చిన్నచూపు చూసేవారు. ఈ పరిస్థితిని ప్రతిఘటించిన మహిళలు తమ హక్కులసాధన కోసం పోరాటం ప్రారంభించారు. అదే.. మున్ముందు రోజుల్లో మహిళా దినోత్సవానికి పునాది వేసింది. అమెరికాలో 1909లో ఫిబ్రవరి 28(చివరి ఆదివారం)న మొదటిసారి జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పట్నుంచి 1913 వరకు ఏటా ఫిబ్రవరి నెల చివరి ఆదివారం మహిళా దినోత్సవంగా జరుపుకునేవారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని.. 1910 ఆగష్టులో డెన్మార్క్‌లోని కోపెన్‌హెగెన్‌లో జరిగిన ‘అంతర్జాతీయ మహిళా సదస్సు’లో జర్మన్‌ సోషలిస్ట్‌ లూయిస్‌ జియట్జ్‌ ప...