నమస్కారం మన సంస్కారం

మనకు తెలిసిన మనుషులు ఎదురుపడ్డా, కొత్తవారిని పరిచయం చేసుకోవాలన్నా ముందుగా నమస్కారం చేయడం మన సంప్రదాయం. రెండు చేతులను జోడించి, హృదయానికి దగ్గరగా ఉంచి నమస్కరించడం అనేది ఎదుటివారిని మనం మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నామని ప్రకటిస్తుంది. మనలోని అహాన్ని పక్కనపెట్టే శక్తి నమస్కారానికి ఉంది. వయసులో చిన్నవారైనా, పెద్దవారైనా ఎవరు తారసపడినా వారికి నమస్కరించడం ద్వారా మనలోని సంస్కారాన్ని తెలియజేయవచ్చు. తద్వారా ప్రేమ, సమానత్వం, స్నేహం తదితర గుణాలను అభివ్యక్తీకరించవచ్చు. దైవసన్నిధిలో నమస్కరించేటప్పుడు రెండు కళ్లు మూసుకుంటూ ఉంటాం. అంతర్లీనంగా భగవంతుడి సన్నిధిలో ఉన్నామనే అనుభూతికి లోనవ్వడమే ఇందులోని పరమార్థం. గురువులు, వయసులో పెద్దవారికి, పండితులకు పూర్తిగా వంగి నమస్కారం చేస్తాం. ఇది వారిలోని గొప్పదనానికి చేసే వందనం. అయితే, ఎవరైనా చూస్తున్నారనో, మరొకరి మెప్పు కోసమో కాకుండా.. అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడనే భావనతో చేసేదే నిజమైన నమస్కారం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శివాయ విష్ణు రూపాయ..

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

డ్రైఫ్రూట్స్(ఎండిన ఫలాలు)